
ఇద్దరు యువకులను రక్షించిన బీచ్‌గార్డ్స్
బీచ్‌రోడ్డు: ప్రమాదకరమైన అలల్లో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను బీచ్‌గార్డ్స్ అతికష్టం మీద రక్షించారు. వివరాలివి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకులైన సాయి, కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్కేబీచ్‌ను సందర్శించారు. ఆ తర్వాత స్నానం కోసం సముద్రంలోకి వెళ్లిన వారిని ఓ పెద్ద కెరటం ఒక్కసారిగా లోపలకు లాగేసింది. ఈ విషయాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే మైరెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు బీచ్‌గార్డ్స్ రాకేష్, సాగర్‌ను ఘటన స్థలానికి పంపారు. బీచ్‌గార్డ్స్ అతికష్టం మీద సంద్రంలో చిక్కుకుపోయిన వారిద్దరినీ రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని బంధువులకు అప్పగించారు.