
వైఎస్సార్‌సీపీ తూర్పు సమన్వయకర్తగా మొల్లి
ఆరిలోవ: విఽశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి అప్పారావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ పరిధి మద్దిలపాలేనికి చెందిన ఆయన పార్టీలో ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య మొల్లి లక్ష్మి 16వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన్ని సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత జగన్‌కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.