
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అక్కిరెడ్డిపాలెం: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసి ఏడేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాజువాక గణపతినగర్‌లో నివాసం ఉంటున్న కె. భాస్కర్ (35)కు అదే ప్రాంతానికి చెందిన సత్తెమ్మతో 2015 నుంచి వివాహేతర సంబంధం కొనసాగించాడు. మనస్పర్థలు కారణంగా భాస్కర్ 2017లో సత్తెమ్మను హత్య చేసి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌కు పారిపోయాడు. నిందితుడి కోసం అప్పటి సీపీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మంగళవారం నిందితుడిని కల్వకుర్తిలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.