
విపత్తు వేళ ఎలా స్పందించాలంటే..
జాలరిపేటలో సివిల్ మాక్ డ్రిల్
ఎంవీపీకాలనీ: విపత్తుల వేళ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ పనితీరును ట్రాఫిక్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, వైద్య, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. జాలరిపేటలో జరిగిన మాక్ డ్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం, ఉగ్రదాడుల వంటి ఘటనల్లో ప్రజలు, యంత్రాంగం ఎలా స్పందించాలో చూపించారు. పొగ బాంబులు పేలినప్పుడు మంటలార్పడం, క్షతగాత్రులను తరలించడం, పోలీసుల సూచనలు పాటించడం, విద్యుత్ నిలిపివేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

విపత్తు వేళ ఎలా స్పందించాలంటే..