
జీవీఎంసీ ఆర్పీ ఆత్మహత్య
అల్లిపురం: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 34వ వార్డులో ఆర్పీగా పని చేస్తున్న సాయి(29), గండిబోయిన సతీష్ తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. సతీష్ పూర్ణామార్కెట్‌లో ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. అతను జనసేన కార్యకర్త. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌లో మాట్లాడిన ఆమె గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా?
భర్త జనసేన కార్యకర్త