
వేలి ముద్రలే పట్టించాయి..
విశాల విశాఖపట్నం.. పేరుకు తగినట్లుగానే సుందర దృశ్యాల సమాహారం. ఒకవైపు అనంతమైన సాగరతీరం.. మరో వైపు గంభీరమైన పర్వత శ్రేణులు. వీటి నడుమ సువిశాలంగా విస్తరించిన మహా నగరం విశాఖ. ప్రపంచంలోనే ఇలాంటి అపురూప భౌగోళిక స్వరూపం కలిగిన నగరాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ జీవించడానికి ఎంతో మంది మక్కువ చూపుతారు. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ.. నేడు బహుముఖాభివృద్ధి సాధించి మహా నగరంగా రూపాంతరం చెందింది. వివిధ రంగాల్లో దూసుకుపోతూ నగరం తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. పర్యాటకులకు ఇది స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి విశాఖ నగరాన్ని ఆకాశం నుంచి వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. మబ్బుల పొరల మాటు నుంచి నగరాన్ని చూస్తే దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. యారాడ కొండలు, పోర్టు ప్రాంతం, పాత నగరాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
ఎంవీపీకాలనీ: ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్‌లో ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ (26)ను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం క్రైం ఏడీసీపీ మోహనరావు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ ఉదయం రాధా మాధవ్ టవర్స్ ఫ్లాట్ నంబర్ 2లో నివాసం ఉంటున్న మరకాని రామకృష్ణ తన అమ్మమ్మ వర్ధంతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శ్రావణి అతనికి ఫోన్ చేసి.. మీ ఇంటి తాళం పగలగొట్టి ఉంది అని సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఆయన విశాఖ వచ్చి ఇంటిని పరిశీలించగా.. 23 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాను దొంగ బెడ్‌పై పడుకోబెట్టి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం చోరీ చేశాడు. వెంటనే రామకృష్ణ ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావు బృందం ఘటన ప్రాంతాన్ని పరిశీలించింది. ఫింగర్ ప్రింట్స్ విభాగం ద్వారా వేలిముద్రలను సేకరించి పరిశీలనకు పంపించగా.. తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ వేలిముద్రలతో సరిపోయినట్లు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా క్రైం ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ కిశోర్‌బాబు ఇతర సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అతని నివాస ప్రాంతాల్లో దర్యాప్తు చేసి రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించారు. దీంతో నిందితుడు విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు. ద్వారకా క్రైం పోలీసులు, ఆరిలోవ క్రైం ఎస్‌ఐ రామకృష్ణ బృందం నిందితుడు రామకృష్ణను మద్దిలపాలెం వద్ద మంగళవారం అరెస్ట్ చేసింది.
విశాఖలో తొలిసారి దొంగతనం
కాగా.. రామకృష్ణ మేనల్లుడు అశోక్, అక్క భాగ్యమ్మలను హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఈ నెల 6న వేరే కేసులో అరెస్ట్ చేసి వారి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.3,40,000, 77 గ్రాముల బంగారు వస్తువులు లభించాయి. అశోక్‌ను విచారించగాా.. తన మేనమామ రామకృష్ణ విశాఖలో చేసిన దొంగతనానికి సంబంధించినవిగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా మరికొన్ని బంగారు నగలను పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు ద్వారకా క్రైం పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. రామకృష్ణను పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి రూ.10 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.40 లక్షలు, 77 గ్రాముల బంగారంతో పాటు రామకృష్ణ వద్ద దొరికిన రూ.10 వేలను కలిపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదు, బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని ఏడీసీపీ తెలిపారు. రామకృష్ణపై 90 వరకు పాత కేసులు ఉన్నా యి. అందులో 77 దొంగతనం కేసులున్నట్లు ఏడీసీపీ వివరించారు. విశాఖలో తొలిసారి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ద్వారకా క్రైం ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ డి.కిశోర్‌బాబు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, రాజు, అప్పలరాజు, అగస్టీన్, జగత్ కిరణ్‌లను ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్‌రావు అభినందించారు.
గ‘ఘన’ విశాఖ
ఘరానా దొంగ అరెస్ట్
నిందితుడు తెలంగాణకు చెందిన
పాత నేరస్తుడు
90 వరకు కేసుల నమోదు
అందులో 77 దొంగతనం కేసులే..
ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్ కేసును ఛేదించిన పోలీసులు

వేలి ముద్రలే పట్టించాయి..

వేలి ముద్రలే పట్టించాయి..