
అండర్–11 చెస్ విజేతలు సౌర్యాజేష్, అఫ్షిన్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–11 చదరంగం జట్ల ఎంపిక పోటీల్లో సౌర్యాజేష్, అఫ్షిన్ విజేతలుగా, శశాంక్, కమలప్రియ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విశాఖ జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో గాజువాక లయన్స్‌క్లబ్‌లో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఓపెన్ కేటగిరీలో ఏడు రౌండ్లలో సాగిన పోరులో 97 మంది, బాలికల కేటగిరీ ఆరు రౌండ్లలో 40 మంది పోటీపడ్డారు. ఓపెన్‌లో ఫిడే రేటింగ్ ఉన్న 9 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారు. ఓపెన్‌లో ఆరున్నర పాయింట్లతో ఎ.సౌరాజేష్(1422) విజేతగా, ఆరు పాయింట్లతో కె.శశాంక్(అన్‌రేటెడ్) ద్వితీయస్థానంలో నిలిచారు. బాలికల్లో ఐదున్నర పాయింట్లతో సమఉజ్జీగా నిలిచిన ప్రోగ్రసివ్‌తో ఎండీ అఫ్షిన్(1480) విజేతగా, బి.కమలప్రియ(1499) ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ఓపెన్, బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు జిల్లా జట్టుగా ఎంపికయ్యారు.