
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్‌కు వైఎస్సార్ సీపీ నేతల నివాళి
మహరాణిపేట: పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఇమంది సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామి రెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్‌రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యాడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోవింద్ బోదపు, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రంభ నారాయణమూర్తి పాల్గొన్నారు.