
గీతం ఆసుపత్రికి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు
కొమ్మాది: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(జిమ్‌సర్)కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్‌ఏబీహెచ్) గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రో వైస్ చాన్సలర్ డా.బి.గీతాంజలి శనివారం ఈ వివరాలు వెల్లడించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి నిర్వ హణ, సామాన్యులకు సైతం వైద్య సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్‌ఏబీహెచ్ ఈ సర్టిఫికెట్‌ను మంజూరు చేసిందని ఆమె వివరించారు. జిమ్‌సర్ అక్రిడిటేషన్ కో–ఆర్డినేటర్ డా. కృష్ణకాంత్ బోగవల్లి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.వి.నరసింహారావు పాల్గొన్నారు.