
అనాథ బాలలకుఆధార్ కార్డులు
● జడ్జి సన్యాసినాయుడు
విశాఖ లీగల్ : అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆధార్ కార్డులు అందించాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో అంగన్‌వాడీ, ఐసీడీఎస్ తదితర సంస్థలతో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వీరికి తక్షణమే ఆధార్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా బాలల అభివృద్ధి ప్రాజెక్టు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి అర్హులకు వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేయాలని న్యాయమూర్తి వివరించారు.