
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందన విక్రయాలను మంగళవారం నుంచి ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ రూ.10 చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు
సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్‌ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి కొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు.