వాల్తేర్ డిపో కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
ఎంవీపీకాలనీ: బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును బస్సులో మర్చిపోయిన ఓ ప్రయాణికురాలికి ఆర్టీసీ సిబ్బంది తిరిగి అప్పగించారు. గురువారం రాత్రి 999 నంబర్ గల బస్సులో ప్రయాణించిన ఓ మహిళ ఐదు తులాల బంగారంతో పాటు దుస్తులున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయి దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగును గమనించిన ఆ బస్సు కండక్టర్ జి.గిరిబాబు, డ్రైవర్ డి.ఎ.బాబు దానిని వాల్తేరు డిపో సూపరింటెండెంట్‌కు సెక్యూరిటీ సమక్షంలో అప్ప గించారు. తమ బ్యాగు పోగొట్టుకున్నట్లు గుర్తించిన ప్రయా ణికురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం డిపోను సంప్రదించగా.. అధికారులు ఆ బ్యాగును వారికి అందజేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. కండక్టర్, డ్రైవర్ల వివరాలు తెలుసుకుని వారు విధుల్లో ఉన్న బస్సు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బంది చేతులమీదుగా తమ ఆభరణాలను తిరిగి తీసుకుని సంతోషించారు. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన కండక్టర్, డ్రైవర్‌ను డిపో యాజమాన్యంతో పాటు ఉద్యోగులు అభినందించారు.


