మధ్యతరగతి వారి కోసం..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ఎంఐజీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రస్తుతం నివాస ప్రాంతాలుగా మంచి డిమాండ్ ఉన్న మధురవాడ, వేపగుంటలో ఉన్న వీఎంఆర్‌డీఏ స్థలాల్లోనే ఈ అపార్ట్‌మెంట్లను నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. ప్రజల సూచనలు, సలహాలతోపాటు వారి అభిరుచులకు తగ్గట్లుగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం. మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లను అందించాలన్న సంకల్పంతో ఉన్నాం.
– కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్
●


