ఒడిశా దాసుల సేవల్లో కొన్ని.. | - | Sakshi
Sakshi News home page

ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..

May 12 2025 12:43 AM | Updated on May 12 2025 12:43 AM

ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..

ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..

● ఒడిశాలోని తమ స్వగృహంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సింహాచల క్షేత్రంలో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలన్నీ ఆచరిస్తుంటారు.

● సింహాచలం క్షేత్రంలో లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌ ఉన్న మూడు నెలల్లో స్వామికి ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఏటా నృసింహ హోమాన్ని నిర్వహిస్తుంటారు.

● దాసుడి దగ్గర తమకున్న మానసిక, ఆరోగ్య రుగ్మతలు చెప్పుకుంటే అవి కచ్చితంగా నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. దానికనుగుణంగానే సింహగిరిపై ఉన్న దాస సదనంలో తమను ఆశ్రయించేవారికి దాసుడు వైద్య సేవలందిస్తారు.

● స్వామికి అంతరాలయంలో ప్రతి రోజు పూజ అనంతరం దాసుడు భక్తులకు తులసి ప్రసాదాన్ని, గంగమ్మతల్లి సన్నిధిలో దీపం వెలగించిన నూనెను ఇస్తారు. ఆ తులసి ప్రసాదం తిన్నా, నూనెను శరీరానికి, తలకు పట్టించుకున్నా రోగాలు నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం.

● 2008లో సింహగిరి దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా దాస సత్రాన్ని దేవస్థానం తొలగించింది. ప్రత్యామ్నాయంగా జఠల్‌సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇవ్వడంతో అక్కడే లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌ సత్రాన్ని నిర్మించారు. ఆ సత్రంలోనే ఈ మూడు మాసాలు ఆయన బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement