
విశాఖ: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఆ చిన్నారిని గాజువాకలో గుర్తించారు పోలీసులు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి, విక్రయించేందుకు జరిగిన యత్నంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారికి లక్ష్మీ, అప్పలస్వామిలుగా గుర్తించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అనకాపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళగా గుర్తించారు.
అనంతరం గాలింపు ముమ్మరం చేయడంతో ఆ చిన్నారి కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని గాజువాకలో విక్రయానికి పెట్టే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు పోలీసులు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు.