
రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండో విడత చందనం సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి పూజలు నిర్వహించారు. అనంతరం మూడు మణుగుల పచ్చి చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థానమండపంలో అధిష్టించి అభిషే కం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి చందనం సమర్పణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు.