
నవాచర్ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
అల్లిపురం: ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–టెక్నాలజీ(ఎన్‌ఐఎస్‌టీ) విశ్వవిద్యాలయంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం(ఎఫ్‌డీపీ)ను బీఎస్‌ఎన్‌ఎల్ విశాఖ ట్రైనింగ్ పాయింట్ నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 14న జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ఆదివారం బెర్హంపూర్‌లో పరిశోధన–ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎం.సత్యప్రసాద్ ఇది బీఎస్‌ఎన్‌ఎల్ స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. నిస్ట్ విద్యార్థులు క్యాంపస్‌లో ఆచరణాత్మక ప్రయోగాలు, కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను స్థాపించడానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం పలు అంశాలపై సదస్సులు నిర్వహించారు.