
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు
గ్రామీణ విద్యకు విఘాతం
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు
కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది.
తాజాగా 82 యూపీఎస్‌లను రద్దు చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా
పాఠశాలల్లోని విద్యార్థులను సమీప హైస్కూళ్లకు
తరలించనున్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధి
కంగా 52 స్కూళ్లను మూసివేయనుండటంతో,
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హైస్కూల్‌చదువులు
దూరం కానున్నాయి. ఈ చర్యల వల్ల గ్రామాల్లో
డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని విద్యావర్గాలు
ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జిల్లా
లోనూ డ్రాపౌట్లుపెరిగే అవకాశం ఉంది.
విశాఖ విద్య: జిల్లాలో పద్మనాభం మండలం కొత్తకొవ్వాడ ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేయడంతో ఇక్కడ 6, 7, 8 తరగతులు చదువుతున్న 14 మంది విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతవరం జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భీమునిపట్నం మండలం రెండో వార్డు మున్సిపల్ యూపీఎస్‌ను రద్దు చేసి 17వ వార్డులోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌కు మ్యాప్ చేశారు. ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలను రద్దు చేయడం గమనార్హం. జిల్లాలో ఇలా మూడు యూపీఎస్‌లను రద్దు చేశారు. ఈ నిర్ణయాల వల్ల విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం
మిగతా IIవ పేజీలో