పరవాడలో యువకుడి హత్య
పరవాడ: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఆదివారం రాత్రి చీటి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో మైలపల్లి బంగార్రాజు (35) అనే యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న బంగార్రాజు చీటిల వ్యాపారం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన చింతకాయల ఎర్రయ్య అతనికి రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయంపై ఫోన్‌లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న ఎర్రయ్య మేనల్లుడు కొవిరి కామేష్ కత్తితో బంగార్రాజును పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, క్లూస్ టీం ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కామేష్‌తో పాటు మరో ఆరుగురు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంగార్రాజు భార్య బంగారమ్మ, కుటుంబ సభ్యులు సోమవారం పరవాడ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చీటి డబ్బుల వివాదమే కారణం
పరవాడలో యువకుడి హత్య


