Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Grants Bail To Former Ias Trainee Pooja Khedkar1
పూజా ఖేడ్కర్‌ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు బెయిల్‌ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ వ్యాఖ్యానించింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజా ఖేడ్కర్‌ను యూపీఎస్సీ శిక్షణ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

KSR Comments On CBN And Yellow Media2
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!

పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్‌ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్‌ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్‌ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్‌ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్‌ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్‌ కారణంగా జిందాల్‌ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్‌ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్‌టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్‌ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్‌ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Telangana Weather: Hyderabad Rain Updates May 21 20253
హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు బిగ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌, సాక్షి: మండు వేసవిలో నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్‌పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొద్ది గంటల్లో జంట నగరల వాప్తంగా పూర్తి స్థాయి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

ED raids Karnataka Home Minister medical college linked to Ranya Rao case4
నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

సాక్షి, బెంగళూరు: నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నటి గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యాసంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. ఈడీ అధికారులు దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.Watch: The Enforcement Directorate (ED) is conducting raids and inspections at Siddhartha Institute of Technology and Siddhartha Medical College in Tumakuru, owned by Karnataka's Home Minister G. Parameshwara. The operation began around 9:30 AM today, with five teams involved in… https://t.co/xggph2I2Dh pic.twitter.com/QJ3AMuEcWc— IANS (@ians_india) May 21, 2025రన్యారావు పెళ్లికి సీఎం,హోమంత్రిమార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు తర్వాత,కర్ణాటక మంత్రులు,మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి.రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,హోమంత్రి పరమేశ్వరలు పెళ్లికి హాజరైన ఫొటోలో వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రాజకీయ రంగుపులుముకుంది. స్మగ్లింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది.రన్యారావుతో సంబంధాలు.. ఖండించిన డిప్యూటీ సీఎం డీకేఆ ఆరోపణల్ని కాంగ్రెస్‌ ఖండించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రన్యారావుకు బెయిల్‌బంగారం స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావు బెయిల్‌పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు.

KTR Reacts On Kaleshwaram Commission Notices to KCR5
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్‌ రియాక్షన్‌

హైదరాబాద్‌, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్‌ సర్కార్‌(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్‌ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ చట్టానికేమైనా అతీతుడా?

ED Sensational Allegations On Sonia, Rahul Gandhi In National Herald Case6
నేషనల్ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ

సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్‌ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది.

Congress MP Mallu Ravi Sensational Comments7
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్‌ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.

UPSC IFS Dixit secured 30th rank in the All India Open category8
పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ

మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్‌, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు. అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్‌ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్‌ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్‌ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్‌ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్‌ ఆ తర్వాత ఇంటర్‌ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్‌ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్‌ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్‌ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్‌ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో ...ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్‌ అయ్యి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్‌ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్‌ ఏకంగా ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్‌చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!

This Would Be My Advice Dont Take: MS Dhoni On Vaibhav Suryavanshi9
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్‌ సూర్యవంశీపై ధోని కామెంట్స్‌

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్‌, ఆయుశ్‌లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్‌ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్‌ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్‌ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్‌ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్‌ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్‌ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్‌ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత వైభవ్‌ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ చేతిలో ఓటమి తర్వాత సీఎస్‌కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్‌, ఆయుశ్‌ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్‌ రేటు మెయింటెన్‌ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్‌ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్‌ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్‌ విఫలమైతే ఆ ప్రభావం లోయర్‌ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్‌-2025: చెన్నై వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్‌ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్‌ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్‌ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025

Big Encounter In Chhattisgarh10
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నంబాల మృతి?

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్‌ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతుల్లో నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు బసవరాజుపై కోటిన్నర రివార్డు ఉంది. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌ చదివిన వ్యక్తి. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు ఉన్నారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి బసవరాజు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement