
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ‘ట్రావెల్ విత్ జో’(Travel with Jo) పేరిట ట్రావెల్ వ్లాగ్ నిర్వహిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను మే 17 పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో పలువురు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజిన్‌ను ఆశ్రయిస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా అరెస్టు ఆన్‌లైన్ కమ్యూనిటీ(Online community)ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేంది. మల్హోత్రా.. భారత్‌తోపాటు విదేశాలలో తన ప్రయాణిస్తూ, వాటిని డాక్యుమెంట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు. యూట్యూబ్‌లో ఆమెకు 3.77 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో1.33 లక్షల మంది అనుచరులు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ వ్యూవర్ షిప్ విషయానికొస్తే ఆమె రూపొందించిన ఒక్కో వీడియోకు 50 వేల వీక్షణలు దక్కుతుంటాయి. ఆమె సాధారణంగా నెలకు 10 వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
వీక్షకుల సంఖ్య ఆధారంగా ఆమెకు యూట్యూబ్ నుంచి నెలవారీ ఆదాయం రూ.40,000 నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండవచ్చనే అంచనాలున్నాయి. మల్హోత్రా స్పాన్సర్‌షిప్‌ల నుండి కూడా సంపాదిస్తుంటారు. ట్రావెల్ గేర్ బ్రాండ్‌లు, హోటళ్లు, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ యాప్‌లు అమెకు ఆదాయాన్ని అందిస్తుంటాయి. ఆమె స్థాయి క్రియేటర్లు సాధారణంగా స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు రూ. 20,000 నుండి రూ.50,000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. మల్హోత్రా గత మూడు సంవత్సరాలుగా వ్లాగింగ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?