Jyoti Malhotra
-
ఐఎస్ఐ ఏజెంట్లను కలిశా
చండీగఢ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసు కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్‌లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్లను కలిశానని ఆమె ఒప్పుకున్నారు. మే 13న దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డ్యానిష్తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపానని ఆమె వెల్లడించారు. పాక్‌కు వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు 2023 నవంబర్‌లో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగి డ్యానిష్ అలియాస్ ఎహ్సార్ ఉర్ రహీమ్‌తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లడంతోపాటు చైనా, బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సిందూర వేళ భారత్, పాక్ సైనిక చర్యల సమయంలోనూ డ్యానిష్తో జ్యోతి సంప్రతింపులు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె నాలుగు బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది. -
యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ‘ట్రావెల్ విత్ జో’(Travel with Jo) పేరిట ట్రావెల్ వ్లాగ్ నిర్వహిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను మే 17 పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో పలువురు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజిన్‌ను ఆశ్రయిస్తున్నారు.జ్యోతి మల్హోత్రా అరెస్టు ఆన్లైన్ కమ్యూనిటీ(Online community)ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేంది. మల్హోత్రా.. భారత్‌తోపాటు విదేశాలలో తన ప్రయాణిస్తూ, వాటిని డాక్యుమెంట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు. యూట్యూబ్‌లో ఆమెకు 3.77 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో1.33 లక్షల మంది అనుచరులు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ వ్యూవర్ షిప్ విషయానికొస్తే ఆమె రూపొందించిన ఒక్కో వీడియోకు 50 వేల వీక్షణలు దక్కుతుంటాయి. ఆమె సాధారణంగా నెలకు 10 వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.వీక్షకుల సంఖ్య ఆధారంగా ఆమెకు యూట్యూబ్ నుంచి నెలవారీ ఆదాయం రూ.40,000 నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండవచ్చనే అంచనాలున్నాయి. మల్హోత్రా స్పాన్సర్‌షిప్‌ల నుండి కూడా సంపాదిస్తుంటారు. ట్రావెల్ గేర్ బ్రాండ్లు, హోటళ్లు, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ యాప్‌లు అమెకు ఆదాయాన్ని అందిస్తుంటాయి. ఆమె స్థాయి క్రియేటర్లు సాధారణంగా స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు రూ. 20,000 నుండి రూ.50,000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. మల్హోత్రా గత మూడు సంవత్సరాలుగా వ్లాగింగ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?