పూజా ఖేడ్కర్‌ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు | Supreme Court Grants Bail To Former Ias Trainee Pooja Khedkar | Sakshi
Sakshi News home page

పూజా ఖేడ్కర్‌ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు

May 21 2025 2:57 PM | Updated on May 21 2025 3:55 PM

Supreme Court Grants Bail To Former Ias Trainee Pooja Khedkar

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖడ్కర్‌కు బెయిల్‌ మంజూరు

ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు బెయిల్‌ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్‌ రూల్స్‌ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.

పుణెలో ఐఏఎస్‌ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్‌ సమయంలో అధికారిక ఐఏఎస్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్‌ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.

అంతేగాక నిబంధనలకు మించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో  ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement