Top Stories
ప్రధాన వార్తలు

తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్‌ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్‌లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్‌బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్‌సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్

నంబాల ఎన్కౌంటర్.. 27 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది.

గూఢచర్యం జాడలివిగో!
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్గామ్లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్గామ్లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్బుక్లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం.

అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు.

పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

అందమైన సమాజం!!
హైదరాబాద్‌లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్

నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి.
కాన్స్‌లో విశ్వంభర
ఉన్న బోధకులకే ‘కొత్త’ శిక్షణ
నేడు ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్’ స్టేషన్ల ప్రారంభం
ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
అయోమయం... గందరగోళం
రహదారులు రక్తసిక్తం
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
22 ఏళ్ల తర్వాత...
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
కాన్స్‌లో విశ్వంభర
ఉన్న బోధకులకే ‘కొత్త’ శిక్షణ
నేడు ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్’ స్టేషన్ల ప్రారంభం
ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
అయోమయం... గందరగోళం
రహదారులు రక్తసిక్తం
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
22 ఏళ్ల తర్వాత...
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
సినిమా

లెజెండ్‌కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష మెప్పించింది.అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్‌లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్‌లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్‌వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit. | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025 ThalaAjith pays respect to his Idol #AyrtonSenna 👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025

మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..!
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం.

గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్‌తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్‌బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...
క్రీడలు

‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.కుల్దీప్ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
మే 30 నుంచి ఇండియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టును ఇవాళ (మే 21) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. వోక్స్ కాలి మడమ గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే జింబాబ్వేతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు వోక్స్‌ను ఎంపిక చేయలేదు.ఇండియా ఏతో సిరీస్‌కు ఎంపిక చేసిన లయన్స్ జట్టుకు జేమ్స్ ర్యూ సారథ్యం వహించనున్నాడు. వోక్స్‌తో పాటు రెహాన్ అహ్మద్, డాన్ మౌస్లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటే ఆటగాళ్లకు జాతీయ జట్లలో చోటు దక్కే అవకాశం ఉంది.భారత్-ఏతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు..జేమ్స్ ర్యూ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌కు భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..మే 30-జూన్ 2- తొలి టెస్ట్ (కాంటర్బరీ)జూన్ 6-9- రెండో టెస్ట్ (నార్తంప్టన్)
బిజినెస్

టెలిగ్రామ్ సీఈఓ.. ‘దేశం విడిచి వెళ్లకూడదు’
ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు.

టీవీఎస్ కొత్త ఈవీ త్రీవీలర్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఫీచర్లుబ్యాటరీ: హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్ లిథియం-అయాన్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ.గరిష్ట వేగం: 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!స్మార్ట్ కనెక్టివిటీ: టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్ట్ స్మార్ట్ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది.

ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్డేటెడ్ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది.

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!)

కాన్స్‌లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్‌పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్‌ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్యారిస్‌లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్‌తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్‌ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్‌తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్‌పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్‌గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు.

'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..)

అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్ చైన్ బ్రాండ్ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్ పేరిట నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్ అండర్–19 క్రికెటర్ కూడా అయిన సందీప్ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. ఈ కలెక్షన్లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్‌కేక్ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. (చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?)
ఫొటోలు


కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)


కుమారుడి టాలెంట్ చూసి మురిసిపోతున్నడైరెక్టర్ సుకుమార్ భార్య (ఫొటోలు)


Cannes 2025 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)


'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు )


మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)


ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)


ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)


సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)


గోవాలో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న మను భాకర్ (ఫోటోలు)
అంతర్జాతీయం

ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి
అరిజోనా: అమెరికాకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ మూడేళ్ల కుమారుడు ట్రిగ్ కైసర్ తమ ఇంటి వెనుకవున్న స్విమ్మింగ్ పూల్‌లో స్పృహలేని స్థితిలో కనిపించాడు. ఈ ఘటన అరిజోనాలోని చాండ్లర్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మే 12న సాయంత్రం ఏడు గంటల సమయంలో, చాండ్లర్ పోలీస్ విభాగానికి అష్లే డ్రైవ్‌లోని ఒక ఇంటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ కుమారుడు ట్రిగ్గా గుర్తించారు. వారు వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేశారు. అనంతరం బాలుడిని తొలుత చాండ్లర్ రీజినల్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత, మే 18 ట్రిగ్ మృతి చెందాడు. అనంతరం చాండ్లర్ పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు పూల్‌లో మునిగి ఎలా మృతిచెందాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 26 ఏళ్ల ఎమిలీ కైసర్ టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. ఆమెకు 3.4 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్, వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్త బ్రాడీ కైసర్. వీరి కుటుంబం అరిజోనాలోని చాండ్లర్‌లో 2024 నవంబర్ నుంచి ఉంటోంది.ఎమిలీ తన రోజువారీ జీవితం, భార్యగా, తల్లిగా తన అనుభవాలను, శుభ్రత, జీవనశైలి, బ్యూటీ టిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఘటన తర్వాత, ఎమిలీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మానేయడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు ఆమెకు సానుభూతి సందేశాలు పంపుతున్నారు. కాగా అమెరికాలో పలువురు చిన్నారుల మరణానికి ఈత కొలనులు కారణంగా నిలుస్తున్నాయనిసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(డీసీసీ) తెలిపింది.ఇది కూడా చదవండి: హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి

హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
టెక్సాస్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్–1బీ వీసాదారులను అమెరికా నుంచి పంపించేయాలి’’అంటూ ట్రంప్ సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్–1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కారి్మక్ వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు. అమెరికాను పోటీలో ముందు నిలపడంలో హెచ్–1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్లైన్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్–1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తన వలస నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ‘మీరు సౌకర్యవంతంగా స్థిరపడ్డాక అందుకు దోహదపడ్డ నిచ్చెనను లాగేయాలని అనుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ కుటుంబం ఆ వీసా పథకం ద్వారానే లబ్ధి పొందిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్–1బీ వీసా వీలు కలి్పస్తుంది. 2022లో జారీ అయిన 3.2 లక్షల హెచ్–1బీ వీసాల్లో 77 శాతం భారతీయులే దక్కించుకున్నారు. 2023లో 3.86 లక్షల వీసాల్లోనూ 72.3 శాతం వాటా వారిదే. హెచ్–1బీ వర్క్ వీసా తొలుత మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తరువాత ఆరేళ్ల పొడిగించుకోవచ్చు.

యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.
జాతీయం

పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యాసంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. ఈడీ అధికారులు దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.Watch: The Enforcement Directorate (ED) is conducting raids and inspections at Siddhartha Institute of Technology and Siddhartha Medical College in Tumakuru, owned by Karnataka's Home Minister G. Parameshwara. The operation began around 9:30 AM today, with five teams involved in… https://t.co/xggph2I2Dh pic.twitter.com/QJ3AMuEcWc— IANS (@ians_india) May 21, 2025రన్యారావు పెళ్లికి సీఎం,హోమంత్రిమార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు తర్వాత,కర్ణాటక మంత్రులు,మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి.రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,హోమంత్రి పరమేశ్వరలు పెళ్లికి హాజరైన ఫొటోలో వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాజకీయ రంగుపులుముకుంది. స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది.రన్యారావుతో సంబంధాలు.. ఖండించిన డిప్యూటీ సీఎం డీకేఆ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రన్యారావుకు బెయిల్బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్‌పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు.

యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ‘ట్రావెల్ విత్ జో’(Travel with Jo) పేరిట ట్రావెల్ వ్లాగ్ నిర్వహిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను మే 17 పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో పలువురు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజిన్‌ను ఆశ్రయిస్తున్నారు.జ్యోతి మల్హోత్రా అరెస్టు ఆన్లైన్ కమ్యూనిటీ(Online community)ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేంది. మల్హోత్రా.. భారత్‌తోపాటు విదేశాలలో తన ప్రయాణిస్తూ, వాటిని డాక్యుమెంట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు. యూట్యూబ్‌లో ఆమెకు 3.77 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో1.33 లక్షల మంది అనుచరులు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ వ్యూవర్ షిప్ విషయానికొస్తే ఆమె రూపొందించిన ఒక్కో వీడియోకు 50 వేల వీక్షణలు దక్కుతుంటాయి. ఆమె సాధారణంగా నెలకు 10 వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.వీక్షకుల సంఖ్య ఆధారంగా ఆమెకు యూట్యూబ్ నుంచి నెలవారీ ఆదాయం రూ.40,000 నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండవచ్చనే అంచనాలున్నాయి. మల్హోత్రా స్పాన్సర్‌షిప్‌ల నుండి కూడా సంపాదిస్తుంటారు. ట్రావెల్ గేర్ బ్రాండ్లు, హోటళ్లు, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ యాప్‌లు అమెకు ఆదాయాన్ని అందిస్తుంటాయి. ఆమె స్థాయి క్రియేటర్లు సాధారణంగా స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు రూ. 20,000 నుండి రూ.50,000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. మల్హోత్రా గత మూడు సంవత్సరాలుగా వ్లాగింగ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?

Pakistan: స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్(Pakistan)లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఒక స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో ఒక బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్(Ambulance)లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. అయితే పోలీసులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్ఏనే చేసింది. గత మార్చిలో బలూచిస్తాన్‌లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారిని మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. కాగా బలూచిస్తాన్‌లో చాలా కాలంగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు.

తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం

కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు.

Hyderabad: స్టార్ హోటల్లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు. ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా


పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ


ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు


మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..


కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం


కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్


సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు


Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా


సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు


Major Encounter: భారీ ఎన్కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు