Delhi Capitals
-
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే గాక రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో రిజ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. అయితే 2025 సీజన్‌కు ముందు రిజ్వీని విడుదల చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీని కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్కే అభిమానులు ఆ జట్టు యాజమాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. ‘చెన్నై జట్టులో ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడేమో ఢిల్లీ తరఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్లగొడుతున్నాడు’.. ‘సమీర్ రిజ్వీని వదిలేసి సీఎస్కే దిద్దుకోలేని తప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమీర్ రిజ్వీ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించడం విశేషం.Sameer Rizvi's last 3 knocks for Delhi Capitals:vs PBKS - 58(25)vs LSG - 70(47)vs MI - 90(51)& u know what? CSK let him go to DC for just 95 lakhs when he showed glimpses of his unlimited potential in very 1st game. CSK is worse team for youngsters!pic.twitter.com/zmDEOe9SMB— Rajiv (@Rajiv1841) April 4, 2026🚨 BIG BLUNDER FROM CSK> CSK bought Sameer Rizvi in 2024 for 8.40 CR> Played him mostly at No.6> Didn't give him chances> Released him in 2025> Delhi Capitals bought him for just ₹95 lakh> Backed him at No. 4 and now he’s winning matches for thempic.twitter.com/bjZBi0KipG— Tejash (@Tejashyyyyy) April 4, 2026చదవండి: కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! -
రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మైండ్ బ్లాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చేసిన ఒక తుంటరి పనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ మైండ్ బ్లాక్ అయింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. కాగా కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సయ్యి రోహిత్ పక్కనుంచి వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది. అయితే కుల్దీప్ రోహిత్ చేతిని తాకి కీపర్ చేతుల్లోకి పడిందన్న అనుమానం కలిగి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇక్కడే రోహిత్ తనలోని తుంటరి చేష్టలను బయటకు తీశాడు. తాను ఔటయ్యానంటూ రోహిత్ డగౌట్ వెళుతున్నట్లు అంపైర్‌కు సైగలు చేశాడు. కానీ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ వేలు పైకి ఎత్తలేదు. అయితే రోహిత్ తాను ఔట్ అంటూ పెవిలియన్ వైపు నడవడం చూసి కుల్దీప్, రాహుల్ డీఆర్ ఎస్ రివ్యూ కోరారు. దీంతో థర్డ్ అంపైర్ రివ్యూను పరిశీలిస్తున్న సమయంలోనే రోహిత్ పగలబడి నవ్వాడు. ఎందుకంటే బంతి తనకు చాలా దూరంగా వెళ్లిందన్న విషయం రోహిత్‌కు తెలుసు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన రివ్యూను వృథా చేసుకున్నట్లయింది. ఆ తర్వాత రోహిత్ కుల్దీప్, రాహుల్ వైపు చూడగా వారు చిరునవ్వుతో కనిపించారు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రోహిత్ మట్లాడుతూ.. ‘కుల్దీప్ రివ్యూకు వెళతాడని ముందే ఊహించాను. బంతి నాకు తగల్లేదని నేను క్లియర్‌గా ఉన్నప్పటికీ.. కుల్దీప్ 50-50 చాన్స్‌తో రివ్యూకు వెళ్లొచ్చని ఊహించాను. నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అలా చేశాను. అందుకే పెవిలియన్‌కు వెనుదిరుగుతున్నట్లు నటించాను. నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. మరుసటి ఓవర్లోనే నా ఇన్నింగ్స్‌కు తెరపడింది. కానీ కుల్దీప్, రాహుల్‌తో జరిగిన ఫన్నీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను మంచి ఈజ్‌తోనే ప్రారంభించాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (51) అర్థసెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సమీర్ రిజ్వీ (90) సంచలన ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.Mind games, ft. Rohit Sharma and Kuldeep Yadav 😉🎥 Hear Rohit's take on the eventful DRS call involving the duo 😄#TATAIPL | #KhelBindaas | #DCvMI | @ImRo45 | @imkuldeep18 | @DelhiCapitals | @mipaltan pic.twitter.com/vUw7eAZhwX— IndianPremierLeague (@IPL) April 4, 2026చదవండి: మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు! -
'సూపర్' సమీర్
గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్... శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా...రోహిత్ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 2025 సీజన్ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడం విశేషం. నాలుగే సిక్స్‌లు... గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (0) పెవిలియన్ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ వెనుదిరగగా... షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్ ధీర్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), సాంట్నర్ (18 నాటౌట్; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్... గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.సమీర్ సెంచరీ మిస్... గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సమీర్ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. సాంట్నర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్ ఠాకూర్ ఓవర్లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్... మయాంక్ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్ చాహర్ ఓవర్లో 4, 6... శార్దుల్ ఓవర్లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బాష్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్ (21 నాటౌట్; 4 ఫోర్లు), స్టబ్స్ (3 నాటౌట్) మిగిలిన పనిపూర్తి చేశారు. 17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (18) అగ్రస్థానంలో ఉంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 9; రోహిత్ (సి) నితీశ్ రాణా (బి) అక్షర్ 35; తిలక్ (సి అండ్ బి) ముకేశ్ 0; సూర్యకుమార్ (ఎల్బీ) ఎన్గిడి 51; రూథర్‌ఫోర్డ్ (సి) ముకేశ్ (బి) విప్రాజ్ 5; నమన్ (సి) స్టబ్స్ (బి) నటరాజన్ 28; సాంట్నర్ (నాటౌట్) 18; బాష్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్: ముకేశ్ 3–0–26–2; ఎన్గిడి 4–0–34–1; అక్షర్ 4–0–22–1; విప్రాజ్ 3–0–24–1; కుల్దీప్ 3–0–31–0; నటరాజన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రికెల్టన్ (బి) దీపక్ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్ 44; నితీశ్ రాణా (రనౌట్) 0; సమీర్ రిజ్వీ (సి) తిలక్ (బి) బాష్ 90; మిల్లర్ (నాటౌట్) 21; స్టబ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్: దీపక్ చాహర్ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్ 3–0–22–1; శార్దుల్ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్ బాష్ 3.1–0–39–1. -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) మధ్యాహ్నం (3:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడగా.. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే (18.1 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమీర్ రిజ్వి (90) వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు.అంతకుముందు లక్నోపై కూడా రిజ్వి (70 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ముంబైపై తాజా హాఫ్ సెంచరీ రిజ్వికి ఐపీఎల్లో వరుసగా మూడవది. గత ఎడిషన్ చివరి మ్యాచ్‌లోనూ (పంజాబ్) అతను అజేయ హాఫ్ సెంచరీ (58) సాధించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో (16.4వ ఓవర్) స్ట్రయికర్ (మిల్లర్), నాన్ స్ట్రయికర్ (ట్రిస్టన్ స్టబ్స్), బౌలర్ (కార్బిన్ బాష్), వికెట్‌కీపర్ (ర్యాన్ రికెల్టన్, ముంబై) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.గతంలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఇలా వేర్వేరు పోజిషన్లలో ఆడిన దాఖలాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఒకవేళ ఇలాంటి ఘట్టాలు ఎక్కడైనా నమోదైనా, సౌతాఫ్రికన్లు ఆ నాలుగు పోజిషన్లలో ఉండి ఉండే అవకాశం మాత్రం లేదు. ఫ్రాంచైజీ లీగ్ పుణ్యమా అని ఇలాంటి సిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. -
సమీర్ రిజ్వీ సంచలనం.. ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఓ దశలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసేలా కన్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ధీర్(28) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్, నిగమ్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో -
రాహుల్ మరోసారి..!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన ఇతను.. ముంబై ఇండియన్స్‌తో ఇవాల్టి (ఏప్రిల్ 4) మ్యాచ్‌లో ఖాతా తెరిచిన వెంటనే ఇన్నింగ్స్‌ను ముగించాడు.రాహుల్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆ జట్టు ఫ్యాన్స్ రాహుల్‌ను బహిరంగంగా టార్గెట్ చేస్తున్నారు. జట్టులో అందరి కంటే సీనియర్వి.. మిగతా ఆటగాళ్లను ఆదర్శంగా ఉండాలంటూ చురకలంటిస్తున్నారు. మరోపక్క టీమిండియా సీనియర్లతో కంపేర్ చేస్తూ నిందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ రాణించారు. రాహుల్ మాత్రమే ఎందుకు విఫలమవుతున్నాడని ఫీలవుతున్నారు.ఇదిలా ఉంటే, రాహుల్ విఫలమైన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గట్టెక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాహుల్ సహా నిస్సంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్ విఫలమైనా, సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు.ముంబై ఇండియన్స్‌తో నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతుంది. 7 పరుగులకే రాహుల్, నితీశ్ రాణా (0) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. నిస్సంక (39), సమీర్ రిజ్వి (7) ఢిల్లీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. -
IPL 2026: ధోనిని అధిగమించిన రోహిత్
ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్, ధోని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ సీఎస్కేపై 48 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్‌లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.ఢిల్లీ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు.ఐపీఎల్-2026 సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్.. సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చాడు. దీంతో హార్దిక్ జట్టుకు దూరమైన విషయం తెలిసింది.ఈ విషయం గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్వల్ప అనారోగ్యం కారణంగా హార్దిక్ పాండ్యా మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోయాడని తెలిపాడు. అదే విధంగా... తమ తుదిజట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చహర్ వచ్చినట్లు సూర్య తెలిపాడు.ఇక ట్రెంట్ బౌల్ట్ స్థానంలో దీపక్ చహర్, అల్లా ఘజన్ఫర్ స్థానంలో మిచెల్ సాంట్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నట్లు సూర్య వెల్లడించాడు. మరోవైపు.. తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముకేశ్ కుమార్.ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’ -
సమీర్ రిజ్వీ విధ్వంసం.. ముంబైను చిత్తు చేసిన ఢిల్లీ
ముంబైను చిత్తు చేసిన ఢిల్లీఅరుణ్ జైట్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అతడితో పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది.రిజ్వీ ఔట్సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో సమీర్👉సమీర్ రిజ్వీ దుమ్ములేపుతున్నాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీసమీర్ రిజ్వీ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి సత్తాచాటాడు. కేవలం 31 బంతుల్లోనే తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 58 పరుగులతో సమీర్ క్రీజ్‌లో ఉన్నాడు.నిస్సాంక ఔట్👉నిస్సాంక(44) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.దూకుడుగా ఆడుతున్న నిస్సాంక9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాథుమ్ నిస్సాంక(43) దూకుడుగా ఆడుతుండగా.. సమీర్ రిజ్వీ(19) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ విజయానికి 66 బంతుల్లో 97 పరుగులు కావాలి.ఢిల్లీ రెండో వికెట్ డౌన్7 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. ముంబై స్కోరెంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది.ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్, నటరాజన్, లుంగి ఎంగిడి, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ ధీర్(28) రాణించాడు. తిలక్ వర్మ(0),ర్యాన్ రికెల్టన్(9), రూథర్ ఫర్డ్(5) విఫలమయ్యారు.👉ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన నమన్ ధీర్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఐదో వికెట్ డౌన్15.3: లుంగి ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51). ముంబై స్కోరు: 122-5(15.3). నమన్ ధిర్ 18 పరుగులతో ఉన్నాడు. సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.ముంబై నాలుగో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 92-4రోహిత్ ఔట్71 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ వచ్చాడు.👉9 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), రోహిత్ శర్మ(34) ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై 2.5: రికెల్టన్ను అవుట్ చేసిన ముకేశ్ కుమార్ తిలక్ వర్మ (2 బంతుల్లో 0)ను డకౌట్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి రాగా.. రోహిత్ 9 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 22-2(3)తొలి వికెట్ డౌన్2.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11 బంతుల్లో 9). ముంబై స్కోరు: 18-1(2.4). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నాడు.హార్దిక్ పాండ్యాకు అనారోగ్యంఢిల్లీతో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో ముంబై మొత్తంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కార్బిన్ బాష్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చారు. ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఢిల్లీ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రాఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్‌ను రోహిత్ శర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గుజరాత్ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అడుగు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నిఖిల్ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. నిఖిల్ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్.. టాస్మానియా తరఫున క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.నిఖిల్ తాజాగా ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున రాణించాడు. ఈ సీజన్లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే నిఖిల్ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. -
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త
ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ ఆరంభ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది.ఓ శుభవార్త ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి ఈ మ్యాచ్‌కు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త అందింది.న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ గురువారం ముంబై జట్టుతో చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సాంట్నర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాతో ఫైనల్లో కివీస్ ఓడిపోవడంతో అతడు రన్నరప్ జట్టు కెప్టెన్‌గా మిగిలిపోయాడు.ఐదు సీజన్ల పాటుఇదిలా ఉంటే.. 2019లో ఐపీఎల్లో అడుగుపెట్టిన మిచెల్ సాంట్నర్.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. అయితే, 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక తుదిజట్టులో సాంట్నర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మంచి బ్యాకప్ ఆప్షన్‌గా పనిచేస్తాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో సాంట్నర్ 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్‌జాక్స్ ఒక్కడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ జట్టుఅల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్‌బవా, తిలక్ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ , మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్, మొహమ్మద్ ఇజ్హార్ , డానిశ్ మాలేవర్.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?
'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు.. అందుకు నేను బిగ్ ఫ్యాన్ కాదు'.. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే యాదృచ్చికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఢిల్లీకి తొలి విజయాన్ని అందించింది. ఐపీఎల్-19వ సీజన్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ విజయంలో యువ ఆటగాడు సమీర్ రిజ్వీది కీలక పాత్ర. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.సమీర్ సంచలనం..ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లుంగీ ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, టి. నటరాజన్ తమ బౌలింగ్‌తో లక్నో పతనాన్ని శాసించారు. అయితే 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ లక్నో తరపున అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత బరిలోకి దిగిన మొహ్సిన్ ఖాన్.. తన మొదటి ఓవర్లోనే నితీష్ రాణాను ఔట్ చేసి ఢిల్లీని బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క పరుగు కూడా అతడు ఇవ్వలేదు. అనంతరం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో పాతుమ్ నిస్సంకను, అక్షర్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ మేనెజ్మెంట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపింది. వాస్తవానికి ఆరంభంలో వికెట్లు పడకపోయింటే గత సీజన్లో రాణించిన అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేవాడు. కానీ త్వరగా వికెట్లు పడిపోవడంతో రిజ్వీని ఇంపాక్ట్ సబ్‌గా పంపాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపి ఢిల్లీ తప్పు చేసిందా? అన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి నోకియా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సమీర్ రిజ్వీ.. ఆ తర్వాత మరి ఆగలేదు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన సమీర్ రిజ్వీ.. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్‌లో 6,4 బాది 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ సమీర్ రిజ్వీ?ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్ కోసం సీఎస్కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం అప్పటిలో సంచలనంగా మారింది. ఐపీఎల్లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన రిజ్వీ.. తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రిజ్వీ కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 95 లక్షలకే సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 121 పరుగులు చేశాడు. అయినప్పటికి అతడిపై నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం తిరిగి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మేనెజ్మెంట్ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు.22 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. యూపీ టీ20 లీగ్ అరంగేట్ర సీజన్(2024)లో రిజ్వీ దుమ్ములేపాడు. కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరపున ఆడిన రిజ్వీ.. కేవలం 49 బంతుల్లోనే 104 అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతడిని సీఎస్కే అంత భారీ ధరకు సొంతం చేసుకుంది. అతడిని అందరూ "రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా" అని పిలుస్తారు.రైనా లాగే మిడిల్ ఓవర్లలో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం, భారీ షాట్లు ఆడడం సమీర్ స్పెషాలిటీ. రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రిజ్వీ కూడా నడుస్తున్నాడు. సమీర్ రిజ్వీ ఫస్ట్ క్రికెట్లో యూపీ తరపున ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.చదవండి: KKR vs SRH: సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్? -
ఢిల్లీ గెలుపు సమీరం
ఐపీఎల్లో మరో మ్యాచ్ స్వల్ప స్కోర్లతో ఉత్కంఠభరితంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకదశలో 26/4తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరకు గట్టెక్కింది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ముందుండి నడిపించగా, ట్రిస్టన్ స్టబ్స్ అతనికి అండగా నిలిచాడు. అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేక టాప్–5లో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో లక్నో ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఒక టీమ్‌కు ‘హోం గ్రౌండ్’లో ఓటమి ఎదురైంది. లక్నో: అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఎన్గిడి, నటరాజన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 76 బంతుల్లో అభేద్యంగా 119 పరుగులు జోడించారు. టపటపా... మార్ష్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినా... రిషభ్ పంత్ (7), మార్క్రమ్ (11) విఫలం కావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48/2కు చేరింది. ఆ తర్వాత బదోని (0), పూరన్ (8) కూడా విఫలమయ్యారు. కుల్దీప్ చక్కటి బంతితో మార్ష్ ను బోల్తా కొట్టించడంతో సగం ఓవర్ల లోపే లక్నో సగం వికెట్లు చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకుంది. ముకుల్ (14) ప్రభావం చూపలేకపోగా, ఈ స్థితిలో సమద్ ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడి కొన్ని పరుగులు సాధించాడు. అయితే నటరాజన్ ఒకే ఓవర్లో సమద్, షమీ (1)లను అవుట్ చేయగా, ఎన్గిడి తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ తడబడింది. మొదటి బంతికే కేఎల్ రాహుల్ (0) వెనుదిరగ్గా... ఐదు పరుగుల వ్యవధిలో నితీశ్ రాణా (15), నిసాంక (1), అక్షర్ పటేల్ (0) అవుటయ్యారు. 4.3 ఓవర్లకే స్కోరు 26/4 కావడంతో క్యాపిటల్స్ కష్టాలు పెరిగాయి. అయితే రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా నిలబడి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. లక్నో ఏకంగా 16 వైడ్లు సహా 20 అదనపు పరుగులిచ్చి ప్రత్యర్థికి ఇతోధిక సహకారం అందించింది. రెండు సిక్సర్లతో మొదలు పెట్టి... 2024 ఐపీఎల్లో రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.8.40 కోట్లకు ఎంచుకుంది. ఈ యూపీ ఆటగాడు దూకుడైన బ్యాటింగ్‌తో ‘కుడిచేతి వాటం సురేశ్ రైనా’గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో తాను ఆడిన తొలి 4 బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించినా... ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 51 పరుగులే చేయగలిగాడు. దాంతో చెన్నై వదులుకోగా, గత సీజన్లో ఢిల్లీ రూ.95 లక్షలకు తీసుకుంది. చివరి మ్యాచ్‌లో 25 బంతుల్లో 58 పరుగులతో జట్టును గెలిపించగా... ఈసారి అదే మొత్తానికి ఫ్రాంచైజీ అతడిని తమతో కొనసాగించింది. ఎట్టకేలకు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోలా కీలకమైన హాఫ్ సెంచరీతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను కూడా రిజ్వీ తడబడుతూనే ప్రారంభించాడు. తొలి 8 బంతుల్లో అతను సింగిల్ కూడా తీయలేకపోయాడు. తొలి 13 బంతుల్లో చేసినవి 5 పరుగులే! అయితే నోర్జే బౌలింగ్‌లో డీప్ థర్డ్‌మాన్ దిశగా కొట్టిన సిక్స్‌తో అతని జోరు మొదలైంది. షహబాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన తర్వాత పరిస్థితికి తగినట్లుగా ఆటను మార్చుకున్నాడు. మార్క్రమ్ ఓవర్లో 6, 4 కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. షమీ తొలి బంతికే... ఐపీఎల్లో తొలిసారి లక్నో జట్టు తరఫున బరిలోకి దిగిన సీనియర్ పేసర్ షమీ వచ్చీ రాగానే ప్రభావం చూపించాడు. మొదటి బంతికే రాహుల్‌ను అతను అవుట్ చేశాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే షమీ వికెట్ తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గతంలో ఏ బౌలర్ మూడుసార్లకు మించి ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 35; పంత్ (రనౌట్) 7; మార్క్రమ్ (బి) అక్షర్ 11; బదోని (సి) రాహుల్ (బి) నటరాజన్ 0; పూరన్ (బి) ఎన్గిడి 8; సమద్ (సి) మిల్లర్ (బి) నటరాజన్ 36; ముకుల్ (సి అండ్ బి) కుల్దీప్ 14; షహబాజ్ (నాటౌట్) 15; షమీ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 1; నోర్జే (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 0; మొహసిన్ (సి) ముకేశ్ (బి) ఎన్గిడి 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–19, 2–48, 3–49, 4–65, 5–71, 6–105, 7–138, 8–140, 9–141, 10–141. బౌలింగ్: ముకేశ్ కుమార్ 3–0–17–0, ఎన్గిడి 3.4–0–27–3, అక్షర్ 3–0–17–1, నటరాజన్ 4–0–29–3, కుల్దీప్ 4–0–31–1, విప్రాజ్ 1–0–8–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మొహసిన్ (బి) షమీ 0; నిసాంక (సి) పంత్ (బి) ప్రిన్స్ 1; నితీశ్ (సి) సమద్ (బి) మొహసిన్ 15; రిజ్వీ (నాటౌట్) 70; అక్షర్ (బి) ప్రిన్స్ 0; స్టబ్స్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–25, 4–26. బౌలింగ్: షమీ 4–0–28–1, ప్రిన్స్ 3–0–20–2, మొహసిన్ 4–1–19–1, నోర్జే 4–0–39–0, షహబాజ్ 1–0–16–0, మార్క్రమ్ 1–0–13–0, సమద్ 0.1–0–6–0. -
లక్నో బౌలర్ల పోరాటం వృథా.. ఢిల్లీని గెలిపించిన రిజ్వి, స్టబ్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ (4-0-28-1), మొహిసిన్ ఖాన్ (4-1-19-1), ప్రిన్స్ యాదవ్ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్‌కే పరిమితం చేశారు. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. -
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్4.3వ ఓవర్- ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్ పటేల్‌ను (0) కూడా పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ డౌన్4.2వ ఓవర్-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ3.3వ ఓవర్- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది.మొహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (15) ఔటయ్యాడు.తొలి బంతికే వికెట్ తీసిన షమీ142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్ తీశాడు. చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నోటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో13.1వ ఓవర్- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ముకుల్ ఛౌదరిని (14) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ట్రస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్‌లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్‌లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్ -
LSG vs DC: స్పిన్ X పేస్
లక్నో: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన ఈ రెండు జట్లు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో పేపర్‌పై భీకరంగా కనిపిస్తోంది. మార్‡్ష, మార్క్రమ్ ఓపెనింగ్ చేయనుండగా... పంత్, పూరన్, బదోనీ, షహబాజ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు.గత సీజన్లో ఆకట్టుకున్న స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి కీలకం కానుండగా... పేస్ బౌలింగ్‌లో షమీ, నోర్జే, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ రూపంలో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కూర్పును సరిచేసుకునే పనిలో ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేదెవరో చూడాలి.మిల్లర్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మతో బ్యాటింగ్ బలంగానే ఉండగా... ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న అఖీబ్ నబీపై అందరి దృష్టి నిలవనుంది. అక్షర్, కుల్దీప్ స్పిన్ భారం మోయనున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా... అందులో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు నెగ్గగా... లక్నో మూడింట విజయం సాధించింది. -
బెన్ డకెట్‌కు శిక్ష
ఐపీఎల్ 2026 నుంచి అకారణంగా తప్పుకొని చిక్కుల్లో పడిన ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్, తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి కోర్టు భారీ జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టులో స్టోక్ సమీపంలోని A50 రహదారిపై డకెట్ 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. స్టాఫోర్డ్‌షైర్ పోలీసులు స్పీడ్ గన్‌తో దాన్ని గుర్తించారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టుకు వెళ్లింది. కానాక్ మేజిస్ట్రేట్స్ కోర్డులో డకెట్ నేరాన్ని అంగీకరించడంతో 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్ విధించారు. మొత్తం ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,100 పౌండ్లకు చేరింది. కొత్తేమీ కాదు..!డకెట్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. 2017లో యాషెస్ సిరీస్‌లో సహచరుడు జేమ్స్ ఆండర్సన్ పట్ల దురుసగా ప్రవర్తించి జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవలి యాషెస్ సిరీస్ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సి ఉంది. ఈ సీజన్ వేలంలో ఆ ఫ్రాంచైజీ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరి నిమిషంలో కౌంటీలు, జాతీయ జట్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ నియమాల ప్రకారం, చివరి నిమిషంలో తప్పుకున్న ఆటగాళ్లకు 2–3 సంవత్సరాల నిషేధం విధించే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్ కాంట్రాక్ట్ డబ్బును కూడా కోల్పోతారు. మరోవైపు ఢిల్లీ ఇంకా డకెట్‌కి ప్రత్యామ్నాయం ప్రకటించలేదు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ డకెట్ స్థానంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఏప్రిల్ 1న ఎల్ఎస్జీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్ మాట
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్ పేరు ఆకిబ్ నబీ. జమ్మూ అండ్ కశ్మీర్‌కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్ కశ్మీర్ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ సాధారణ క్రికెటర్ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.దేశవాలీ క్రికెట్లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ డీల్‌తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్‌ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది. -
'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డకెట్పై గవాస్కర్ ఫైర్
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ ఐపీఎల్-2026 సీజన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో రూ. 2 కోట్లకు డకెట్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ ఇన్నింగ్స్ రాహుల్‌తో కలిసి డకెట్ ప్రారంభిస్తాడని అంతా భావించారు. కానీ డకెట్ మాత్రం అనుహ్యంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ తెలిపాడు.ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఐపీఎల్‌కు బదులుగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడనున్నాడు. కాగా బీసీసీఐ గతేడాది తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఏ విదేశీ ఆటగాడైనా, సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. దీంతో డకెట్ రెండేళ్ల ఐపీఎల్ బ్యాన్‌ను ఎదుర్కోనున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. చివరి నిమిషంలో వైదొలగే విదేశీ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం పెద్దగా ప్రభావం చూపడం లేదని గవాస్కర్ అన్నారు."బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ది హండ్రెడ్ లీగ్ వేలంలో అతడికి మంచి ధర దక్కడంతో ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను వదులుకోవడానికి సిద్దమయ్యాడు. ఒకవేళ అతడికి నామమాత్రపు ధర దక్కి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. వేలంలో ఒక ఆటగాడిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, సదరు ఆటగాడు ఆకస్మికంగా తప్పుకుంటే జట్టు ప్రణాళికలపై కచ్చితంగా ప్రభావం చూపుతోంది. అందుకే ఆటగాళ్లకు భయం కలిగేలా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బీసీసీఐ విధిస్తున్న రెండేళ్ల బ్యాన్ సరిపోదు. అది పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ మరోసారి ఆలోచించాలి" అని గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్ -
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
-
IPL 2026: భారత మీడియాపై ధ్వజమెత్తిన స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మీడియాపై చిందులేశాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.అసలేం జరిగిందంటే.. స్టార్క్ ఐపీఎల్ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరుకాలేదు. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్‌లోడ్ కారణంగా ఐపీఎల్ ఆడకూడదన్న కండీషన్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే, స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలకు తెరదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం మరియు మోచేతి గాయాలు ఉన్నాయని, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని వెల్లడించాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు. నిజానికి నేను ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నాను. ఈ గాయం ఢిల్లీ జట్టుకు, అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చాడు. మేనేజ్మెంట్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, వీలైనంత త్వరగా జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది. కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్ లేని లోటు భర్తీ చేయలేనిదని మేనేజ్మెంట్ భావిస్తుంది. -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
'ఐపీఎల్ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్'
జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ ధార్ ఐపీఎల్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.కేవలం రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు."నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్‌లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ నా కెరీర్‌ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్ బాల్ క్రికెట్లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్ -
డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బెన్ డకెట్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే టెస్టు కెరీర్‌పై దృష్టి సారించడంతో పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు డకెట్ పేర్కొన్నాడు. తాజాగా డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బుధవారం తొలిసారి స్పందించింది. ‘బెడ్ డకెట్ తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని మాకు ముందే చెప్పాడు. బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. డకెట్ స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే పేర్కొంటాం.’ అని చెప్పుకొచ్చింది. అయితే డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే లీగ్ నిబంధనల ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డకెట్ విషయంలో ఫిట్నెస్, గాయం లాంటి అంశాలు లేవు. టెస్టు కెరీర్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు ఫ్యామిలీతో సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నప్పటికీ డకెట్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని డకెట్ అది ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు కలిపి కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బెన్ డకెట్ తాజాగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో టెస్టులపై దృష్టి సారించేందుకు డకెట్ కౌంటీల్లో నాటింగ్హమ్షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడనున్నాడు.చదవండి: కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన ప్రకటన.. వేటు తప్పదు!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.రూ. 2 కోట్లుకాగా గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ ఆప్షన్‌గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్‌తో కలిసి డకెట్ ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.ఢిల్లీ క్యాపిటల్స్ నెత్తిన పిడుగుఅయితే, తాజాగా బెన్ డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.క్షమించండిఅందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.నా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్‌కే అంకితంనా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్‌కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సమ్మర్ షెడ్యూల్ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా డకెట్ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. రెండేళ్ల నిషేధంఅలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్ ప్లేయర్ డకెట్ ఈ జాబితాలో చేరనున్నాడు.కాగా డకెట్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్ షెడ్యూల్లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్ ఇటీవల పేర్కొన్నాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్ -
మరో 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా భారత్‌కు రాని స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్ మాత్రం జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) నుంచి లీగ్‌లో ఆడేందుకు స్టార్ సీమర్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదని తెలిసింది.ఈ శనివారం లీగ్ ప్రారంభమవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగనుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.సోమవారం మీడియా సమావేశంలో క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "ఆసీస్ బోర్డు నుంచి ఎన్వోసీ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అది వస్తే స్టార్క్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది చెప్పగలం. ఈ మేరకు సీఏతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని అన్నాడు. ఫిట్నెస్ సమస్యలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, నెట్స్‌లో అతను బౌలింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారముందని చెప్పాడు. క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ అతను వస్తున్నాడని, ఎన్ఓసీ ఆలస్యమే అసలు సమస్యని పేర్కొన్నాడు.ఎన్ఓసీ జారీ చేస్తే తొలి మ్యాచ్ నుంచే స్టార్క్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. పేసర్ నటరాజన్ వందశాతం ఫిట్నెస్తో ఉన్నాడని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గత సీజన్లో భుజం గాయం వల్ల నట్టు కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే -
‘ఆ రూల్‌కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
ఐపీఎల్లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్‌రౌండర్‌గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్‌రౌండర్‌ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్‌ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్‌రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్‌ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు. అక్షర్‌పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది. -
Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్లు ముగిసినప్పటికీ టైటిల్ గెలవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆకలి మాత్రం తీరడం లేదు. జట్టు పేరు మార్చినా, ఆటగాళ్లను మార్చినా, దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించినా ఢిల్లీ తలరాత మాత్రం మారలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలో సెమీఫైనల్ చేరింది. తర్వాతి సీజన్లో కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక మధ్యలో 2012లో మరోసారి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా ఆరు సీజన్ల పాటు లీగ్ దశకే పరిమితమైంది. అయితే 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. పేరు మార్చిన తర్వాత వరుసగా మూడు సీజన్లు (2019, 2020, 2021) అదరగొట్టింది. పుష్కర కాలానికి..ఐపీఎల్ ప్రారంభమైన పుష్కరకాలం తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. 2021లో మరోసారి ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ కథ 2022 నుంచి మళ్లీ మొదటికే వచ్చింది. గత సీజన్లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.బ్యాటింగే బలం..ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్‌పైన బలంగానే కనిపిస్తుంది. పేపర్‌పై ఉన్న బలాన్ని మైదానంలోనూ ప్రదర్శిస్తుందా లేక గత సీజన్ల మాదిరే చతికిలపడుతుందా అన్నది చూడాలి. జట్టుకు కేఎల్ రాహుల్ పెద్ద బలం అని చెప్పొచ్చు. గత సీజన్లో కేఎల్ రాహుల్ 539 పరుగులతో జట్టు టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోసారి రాహులే జట్టుకు కీలకమవ్వనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు బెన్ డకెట్, పాతుమ్ నిసాంక, పృథ్వీ షా, అభిషేక్ పొరేల్, నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించగల సమర్థుడు.మిచెల్ స్టార్క్ఆడేనా?బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడతాడా లేదా అన్న సంశయం ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. నటరాజన్, ముకేశ్ కుమార్‌కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న కశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై కూడా జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్, విప్రజ్ నిగమ్‌లతో బలంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి తయారైంది. ఐపీఎల్ 19వ సీజన్లోనైనా మెరిసి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కల నెరవేరాలని ఆశిద్దాం.ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: అక్షర్‌పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిసాంక, నితీశ్ రానా, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వీ/కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, కుల్దీప్యాదవ్, అకిబ్ నబీ, స్టార్క్, ముకేశ్ కుమార్/నటరాజన్.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్: 2020 (రన్నరప్); 2019, 2021 (ప్లే ఆఫ్స్); 2008, 2009 (సెమీఫైనల్స్)చదవండి: భారత స్టార్‌కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే! -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్ ఫస్ట్ హాఫ్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడు సెకెండ్ హాఫ్‌లో ఢిల్లీ జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనుంది.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన పేసర్లను లీగ్ క్రికెట్లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకూడదని భావిస్తుందంట. ఈ కారణంతో అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు స్టార్క్‌ను రూ.11.75 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీసన్, దుష్మంత చమీర వంటి స్టార్ పేసర్లు ఉండడం కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్టును నడిపించనున్నాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జోష్ హాజిల్‌వుడ్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: IPL 2026: 'సెహ్వాగ్‌ను చూసి నేర్చుకో'.. అభిషేక్‌కు కుంబ్లే వార్నింగ్ -
తొలి టైటిల్ వేటలో...
పేర్లు మారినా... ప్లేయర్లు మారినా.. ఆ రెండు జట్ల రాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీ పడుతున్నా... ఇప్పటి వరకు ఆ రెండు జట్లకు ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అందులో ఒకటి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్... మరొకటి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్లో జట్లను ప్రక్షాళన చేసుకొని కొత్తగా దర్శనమిచ్చిన ఈ రెండు టీమ్‌లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తడబడిన పంజాబ్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పరిమితమైంది. చరిత్రను పక్కనపెట్టి ఇరు జట్లు ఈసారి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి!సాక్షి, క్రీడావిభాగం : ఏళ్లకు ఏళ్లుగా తొలి టైటిల్ సాధించాలనే తపనతో సాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు గత ఏడాది మెరుగైన ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి సహచరుల సహకారం తోడవడంతో... పంజాబ్ తొలి టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారథి విఫలమవడం ఫలితంపై ప్రభావం చూపింది. గత సీజన్లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు చేయని పంజాబ్... ఈసారి ఎలాగైనా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లాగే బలంగా కనిపిస్తున్న కింగ్స్... మైదానంలో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్‌కు ప్రధాన బలం కాగా... జట్టు ఆల్‌రౌండర్లతో కిక్కిరిసి ఉంది. ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తేనున్నాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో... స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. సీజన్ మొత్తం ఈ నలుగురినే కొనసాగించే అవకాశాలున్నాయి. నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ రూపంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడగల భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండటం పంజాబ్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్ సింగ్ జట్టు ప్రధాన బలం కాగా... యుజ్వేంద్ర చహల్, స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా మిగతా భారం మోయనున్నారు. ఆంధ్ర ఆటగాడు పైలా అవినాశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైల అవినాశ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్, యాన్సెన్, అజ్మతుల్లా, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్, ఓవెన్, కొనొల్లీ, డ్వార్షుయ్, అర్ష్ దీప్, చహల్, వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఫెర్గూసన్.అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2014, 2025)‘మద్యం మానేశా’ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. సీనియర్ ఆటగాడిగా చహల్‌ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవాలి. మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150 శాతం శ్రమించాలని పట్టుదలగా ఉన్నా. అందుకే నా శరీరంపై మరింత దృష్టి పెట్టా. గత ఆరు నెలలుగా మద్యం మానేశాననే శుభవార్త మీతో పంచుకుంటున్నా. – చహల్, పంజాబ్ఢిల్లీ రాత మారేనా! ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2020 సీజన్లో) ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... గతేడాది టీమ్‌లో సమూల మార్పులు చేసింది. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సారథ్యానికి మొగ్గు చూపకపోవడంతో... అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లే అక్షర్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్రత్యర్థులను భయపెట్టిన ఢిల్లీ... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షా వంటి ప్లేయర్లతో టాపార్డర్ బలంగా ఉండగా... మిడిలార్డర్లో అశుతోష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ కీలకం కానున్నారు. పేరున్న స్టార్లకన్నా... సమయానుకూలంగా రెచ్చిపోగల ప్లేయర్లు ఉండటం క్యాపిటల్స్‌కు అదనపు బలం కానుంది. ఆంధ్ర ప్లేయర్ త్రిపురాన విజయ్ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. విదేశీ ప్లేయర్ల కోటాలో మిచెల్ స్టార్క్, మిల్లర్, స్టబ్స్, డకెట్, ఎంగిడి, జెమీసన్ అందుబాటులో ఉన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కాస్త లోటే. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. దేశవాళీ సెన్సేషన్ పేసర్ ఆఖిబ్ నబీ ఈ సారి అదనపు బలం కానున్నాడు. గత సీజన్ మాదిరిగానే సమష్టి ప్రదర్శనను నమ్ముకుంటే ఈ సారి క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు. హేమాంగ్ బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ జట్టును ఎలా నడిపిస్తాయనేది కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిల్లర్, డకెట్, నిశాంక, సాహిల్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ రాణా, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆఖిబ్ నబీ, నితీశ్ రాణా, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర, ఎంగిడి. జెమీసన్, కుల్దీప్ యాదవ్. అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2020) -
ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాహుల్‌కు విభేదాలు?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్‌ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్‌కు ఢిల్లీ మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ స్ధానాన్ని పదే పదే మార్చడంపై కేఎల్ రాహుల్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు.కాగా గత సీజన్లో రాహుల్ కొన్ని మ్యాచ్‌లలో మిడిలార్డర్లోనూ, మరి కొన్ని మ్యాచ్‌లలో టాపార్డర్‌లోనూ బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ అతడి స్ధానం మరిపోయేది. అయినప్పటికి ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ములేపాడు. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.'ప్రతీ సంవత్సరం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలనొప్పిగా మారింది. అతడిని ఏ స్ధానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోంది. రాహుల్ ఓపెనింగ్ చేయడం ఇష్టం. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోంది. ఈ విషయంలో టీమ్ మెనెజ్‌మెంట్, రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్పిస్తోంది. కచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో, లేదో స్పష్టత లేదు' అని తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడా? అంటే అవునానే సమాధానమిస్తోంది. రాహుల్ గత సీజన్లలో చాలా మ్యాచ్‌లలో మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్లు అందుబాటులో ఉండటంతో రాహుల్‌కు ఓపెనర్‌గా పెద్దగా అవకాశం దక్కలేదు.అయితే జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఓపెనర్‌గా విఫలం కావడంతో ఆఖరి మ్యాచ్‌లలో రాహుల్‌కు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం దక్కింది. కేఎల్ ఓపెనర్‌గా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు.దీంతో ఈ ఏడాది సీజన్లో రాహుల్‌ను ఫుల్ టైమ్ ఓపెనర్‌గా ఢిల్లీ టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రాహుల్ పార్టనర్ ఎవరు?అయితే రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత ఢిల్లీ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోపం నలుగురు పోటీలో ఉన్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్, శ్రీలంక స్టార్ పాథుమ్ నిస్సాంక ఉన్నారు. వీరిద్దరూ తమ తమ జట్ల ఇన్నింగ్స్‌లను ప్రారంభిస్తుంటారు. మరోవైపు భారత ఆటగాళ్లు పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ కూడా ఉన్నారు. వీరిద్దరికి ఢిల్లీ తరపున ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. కాగా అభిషేక్‌కు ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉంది. కాబట్టి ప్రధానంగా డకెట్, నిస్సాంక, పృథ్వీషా మధ్యనే పోటీ నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: 'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే' -
సన్‌రైజర్స్, సీఎస్కే, ముంబై కాదు.. ఆ జట్టే ఐపీఎల్ విజేత!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయో, టైటిల్ విజేత ఎవరన్నదానిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. ఆకాష్ చోప్రా ఇటీవల క్రిక్స్ యాప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పలు ప్రశ్నలు చోప్రాకు ఎదురయ్యాయి.హోస్ట్: ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) ఎవరు గెలుస్తారు?ఆకాష్ చోప్రా: సంజూ శాంసన్. (ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సీఎస్కే తరపున ఆడనున్నాడు.)హోస్ట్: పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుస్తారు?చోప్రా: జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)హోస్ట్: ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కుతుంది?చోప్రా: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం).హోస్ట్: ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి?చోప్రా: ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుతాయి.హోస్ట్: ఐపీఎల్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారు?చోప్రా: ఈసారి మనం సరికొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాము. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్కాగా చోప్రా ప్లే ఆఫ్స్‌కు చేరే జట్ల జాబితాలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. -
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా. అయితే ఈ సీజన్లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్) కామెంట్రీ బాక్స్‌లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్లో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్కల్లమ్ కోచ్‌గా వచ్చిన కొత్తలో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. కానీ క్రమంగా బజ్‌బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్‌కల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: రోహిత్ బాటలో రిషబ్ పంత్! -
IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’
ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు ముంబై క్రికెటర్ పృథ్వీ షా. చిన్న వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకర్షించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ ట్రోఫీ అందించాడు.ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన పృథ్వీ షా (Prithvi Shaw) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ముంబై జట్టులోనూ అతడి స్థానం గల్లంతైంది. దీంతో పొరపాట్లు సరిచేసుకున్న పృథ్వీ షా.. తిరిగి గాడిలో పడ్డాడు.రూ. 75 లక్షల కనీస ధరదేశీ క్రికెట్లో మరోసారి బ్యాట్‌తో మెరిసి తనను తాను నిరూపించుకున్నాడు. ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరి సత్తా చాటాడు పృథ్వీ షా. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.ఒకప్పుడు ఐపీఎల్లో కోట్లు పలికిన పృథ్వీని.. అదే జట్టు ఇలా బేస్ ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం. నిజానికి ముందు రౌండ్లలో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా ఆఖర్లో ఢిల్లీ కనికరించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఈసారి‘‘పృథ్వీ షాకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఇప్పుడతడు మునుపటి ఆటగాడే. కఠిన శ్రమతో తనను తాను సరిదిద్దుకుని పరుగులు రాబడుతున్నాడు.అందుకే ఇక్కడిదాకా చేరుకోగలిగాడు. ఒకవేళ తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా పృథ్వీకి సూచించాడు. కాగా పృథ్వీ షా ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మోడల్, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మార్చి 28 నుంచి మొదలుకానుంది. కాగా అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!? -
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌కు మరో కీలక పదవి
ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హేమంగ్ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్ లీగ్‌లోని సదరన్ బ్రేవ్ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్ కోచ్) ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్‌ను ఎంపిక చేసింది.GMR గ్రూప్‌కు ఐపీఎల్ హండ్రెడ్ లీగ్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (Seattle Orcas), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.సదరన్ బ్రేవ్ గత ప్రదర్శనలుసదరన్ బ్రేవ్ ఫ్రాంచైజీ హండ్రెడ్ లీగ్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లో మాత్రం సగం మ్యాచ్‌లు ఓడి, నాకౌట్స్‌కు కూడా చేరలేకపోయింది.కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ వెల్ష్ ఫైర్‌తో తలపడుతుంది.తొలిసారి వేలంహండ్రెడ్ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి. -
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)
-
బెంగళూరుకే పట్టం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే ‘ప్లేఆఫ్స్’ చేరి నేరుగా ఫైనల్‌కూ అర్హత పొందింది. ఫైనల్లో ఢిల్లీని ఓడించి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. వడోదర: అయ్యో... ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది. ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్‌ను అప్పగించింది. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయభేరి మోగించింది. విజేత ఆర్సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), లౌరా వోల్వార్ట్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు రాణించారు. ఆఖర్లో షినెల్ హెన్రీ (15 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు. రెండు ఓవర్లలో 39 పరుగులు...ఢిల్లీ టాప్–4 బ్యాటర్లు లిజెల్లీ లీ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోల్వార్ట్, జెమీమా సమష్టిగా పరుగులు సాధించారు. దీంతో 18 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. డిక్లెర్క్ వేసిన 19వ ఓవర్లో షినెల్ హెన్రీ 4, వైడ్, 4, 4, 4, 6, 1 ఇలా బంతిని పదేపదే బౌండరీ లైన్ దాటించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఆఖరి ఓవర్ వేసిన సయాలీ 6, 4తో కలిసి 15 పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు ఓవర్లలోనే 39 పరుగులతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. శుభారంభం దక్కకున్నా... ఆరంభంలోనే హిట్టర్ గ్రేస్ హారిస్ (9) వికెట్‌ను కోల్పోయినా... స్మృతి, వోల్ల ధనాధన్ షో ఢిల్లీ ఆశల సౌధాన్ని కూల్చేసింది. 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో కెపె్టన్ స్మృతి పూర్తి చేసుకున్న ఫిఫ్టీలు బెంగళూరును సాఫీగా లక్ష్యంవైపు నడిపించాయి. ఆఖర్లో వీళ్లిద్దరితో పాటు రిచా (6) అవుటైనా... ఎలాంటి డ్రామా లేకుండా, రాధ యాదవ్ (12 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీలతో ముగించింది. 243 పరుగులు సాధించిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ (సి) హ్యారిస్ (బి) డిక్లెర్క్ 37; షఫాలీ (సి) రిచా ఘోష్ (బి) అరుంధతి 20; వోల్వార్ట్ (రనౌట్) 44; జెమీమా (సి) డిక్లెర్క్ (బి) సయాలీ 57; షినెల్ హెన్రీ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–49, 2–72, 3–148, 4–203. బౌలింగ్: బెల్ 4–0–19–0, సయాలీ 4–0–46–1, అరుంధతి 4–0–40–1, శ్రేయాంక 2–0–32–0, డిక్లెర్క్ 4–0–48–1, రాధ 2–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) హెన్రీ 9; స్మృతి (బి) హెన్రీ 87; జార్జియా వోల్ (సి) షఫాలీ (బి) మిన్ను మణి 79; రిచా ఘోష్ (సి) మిన్ను మణి (బి) నందిని 6; డిక్లెర్క్ (నాటౌట్) 7; రాధ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–9, 2–174, 3–181, 4–191. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–38–0, షినెల్ హెన్రీ 4–0–34–2, నందిని 4–0–41–1, శ్రీచరణి 3.4–0–46–0, షఫాలీ 1–0–9–0, మిన్ను మణి 2–0–19–1, స్నేహ్ రాణా 1–0–15–0. -
డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్డ్(25 బంతుల్లో 44 పరుగులు), చినెల్ హెన్రీ(15 బంతుల్లోనే 35) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు.మంధాన మెరుపులు, వోల్ విధ్వంసంఅనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా ఔటైనప్పటికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్ (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు.వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి-వాల్ జోడీ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్, రిచా ఘోష్, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.కానీ 19 ఓవర్లో రాదా యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవ్వగా రాదా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్‌గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. -
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
-
ఢిల్లీ... ఈసారైనా?
వడోదర: ఒకటి కాదు రెండు కాదు...వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు... గత మూడు ప్రయత్నాల్లోనూ తుది మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారైనా తమ తొలి కప్ కలను నెరవేర్చుకోవాలని ఒకవైపు పట్టుదలగా ఉంది. మరోవైపు అద్భుత ఫామ్‌తో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు నేరుగా అర్హత సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే టైటిల్ పోరులో 2024 చాంపియన్ ఆర్సీబీతో ఢిల్లీ తలపడనుంది. జోరు మీదున్న స్మృతి బృందం అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ లీగ్ చరిత్రలో వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన 290, గ్రేస్ హారిస్ 228 పరుగులు నమోదు చేశారు. రిచా ఘోష్ 150కి పైగా స్ట్రయిక్ రేట్‌తో దూకుడును ప్రదర్శించింది. ఆల్‌రౌండర్‌గా డిక్లెర్క్ అంచనాలకు మించి రాణించింది. 15 వికెట్లు తీసిన డిక్లెర్క్ బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ప్రత్యర్థిని ఆరంభంలోనే కట్టిపడేస్తోంది. ఈ సీజన్లో ఆమె ఏకంగా 116 డాట్ బాల్స్ వేయడం విశేషం. స్పిన్నర్ శ్రేయాంక కూడా 11 వికెట్లతో రాణించగా, ఎలైస్ పెరీ స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచి్చన సయాలీ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే జోరును అందరూ కొనసాగిస్తే బెంగళూరుకు మరో విజయం దక్కవచ్చు. బ్యాటర్లదే బాధ్యత... ఢిల్లీ ఈ సీజన్లో సాధించిన ఐదు విజయాలు కూడా ఛేదనలోనే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కంటే టీమ్ ఛేదనకే ఆసక్తి చూపిస్తోంది. అయితే ఫైనల్ ఒత్తిడిని ఏమేరకు అధిగమిస్తుందనేది ఆసక్తికరం. గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ ఛేదనలోనే ఓడిపోయింది. తాజా సీజన్లో కొత్త కెపె్టన్ జెమీమా రోడ్రిగ్స్ నేతృత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జెమీమా నాయకురాలిగా తొలి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. ఓపెనర్లు షఫాలీ, లిజెల్ లీ తొలి వికెట్‌కు కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఢిల్లీ గెలిచింది. మూడో స్థానంలో వోల్వార్ట్ నిలకడగా ఆడుతుండగా, జెమీమా కూడా ఎలిమినేటర్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో మరోసారి శ్రీచరణి (14 వికెట్లు), నందిని శర్మ (16 వికెట్లు), స్నేహ్ రాణాలపై జట్టు ఆధారపడుతోంది. పేసర్ షినెల్ హెన్రీ కూడా ప్రభావం చూపించగలదు. -
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్‌గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్ కోచ్‌ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కు మొదటి ఐపీఎల్ కోచ్‌ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్ ఢిల్లీ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్.. అభిషేక్ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్‌స్టార్.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్ కోచ్ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్ మీదుగా స్ట్రెయిట్‌గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్‌స్టార్ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్ కోసం ట్రేడ్ చేసిన ఢిల్లీకాగా శిఖర్ ధావన్ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్ శర్మను సన్‌రైజర్స్‌కు ట్రేడ్ చేసింది. ఇక సన్‌రైజర్స్‌కు మారిన తర్వాత అభిషేక్ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్‌లో 162కు పైగా స్ట్రైక్‌రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడి 1297 రన్స్ రాబట్టిన అభిషేక్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా -
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
-
చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్
మహిళల ఐపీఎల్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్ర తిరగరాసింది. లీగ్ చరిత్రలో (సింగిల్ ఎడిషన్‌లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇషాఖీ 2023 ఎడిషన్‌లో 15 వికెట్లు తీయగా.. ప్రస్తుత ఎడిషన్‌లో (2026) నందిని 16 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 3) గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 2 వికెట్లు తీసింది.డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్-4)నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)- 16 వికెట్లు (2026)సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్)- 15 (2023)శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్)- 14 (2026)శ్రేయాంక పాటిల్ (ఆర్సీబీ)- 13 (2024)హ్యాట్రిక్ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినా నందిని హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటింది. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన విజయాల్లో నందినిది కీలకపాత్ర. 24 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను ఢిల్లీ ఈ సీజన్ వేలంలో 20 లక్షలకు సొంతం చేసుకుంది.నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. బెత్ మూనీ (62 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి ఓ వికెట్ తీశారు.అనంతరం 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. లిజెల్ లీ (43), జెమీమా రోడ్రిగ్స్ (41) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది. -
ఎవరిదో ‘ఫైనల్’ బెర్త్?
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లూ ఫైనల్‌కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్‌లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. స్పిన్నర్లు కీలకం... గత మూడు సీజన్లలో గ్రూప్ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్ కోసం ఎలిమినేటర్‌లో ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు లిజెల్ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్వార్ట్, కెప్టెన్ జెమీమా, మరిజాన్ కాప్ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు సమష్టి ప్రదర్శనపై భారం... విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్లో గుజరాత్ జెయింట్స్ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్ యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, జార్జియా వేర్హామ్ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్ సీనియర్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్నందుకోవడం విశేషం. -
‘ఎలిమినేటర్’కు ఢిల్లీ క్యాపిటల్స్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఎలిమినేటర్’ పోరుకు అర్హత పొందింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీప్తి శర్మ (24; 4 ఫోర్లు, 1సిక్స్), సిమ్రన్ షేక్ (22; 3 ఫోర్లు), శిఖా పాండే (23; 3 ఫోర్లు) రెండు పదులు స్కోర్లు చేశారు. మరిజాన్ కాప్ 3, హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. వోల్వార్డ్ (47; 7 ఫోర్లు) రాణించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం జరిగే గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే బెంగళూరు నేరుగా ఫైనల్ చేరింది. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం -
ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్’కు అర్హత
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్‌కే ‘ఎలిమినేటర్’ చాన్స్ ఉంది. నేడు యూపీ వారియర్స్‌తో జరిగే చివరి లీగ్ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ ఆడే అర్హత సాధిస్తుంది. అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. రన్‌రేట్ మైనస్‌లో ఉంది. అయితే నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే ఢిల్లీ ముందుకెళుతుంది. షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్‌లతో కూడిన టాపార్డర్ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్‌లు కూడా ధనాధన్ ఆట ఆడేయగలరు. బౌలింగ్‌లో షినెల్ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. -
ఫైనల్లో ఆర్సీబీ.. మరి ఆ రెండు బెర్తులు దక్కేదెవరికి?
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(6), ఢిల్లీ క్యాపిటల్స్(6), యూపీ వారియర్స్(4) ఉన్నాయి.గుజరాత్ జెయింట్స్గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది.ముంబై ఇండియన్స్గుజరాత్తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పరంగా గుజరాత్‌తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్(-0.271) కంటే ముంబై(+0.146) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్‌రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్‌రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.యూపీ వారియర్స్ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్లో అడుగుపెడుతోంది -
గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్
వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్నర్ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్ (బి) కాప్ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) మిన్నుమణి 2; వేర్హమ్ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్: కాప్ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్నర్ (బి) సోఫీ 11; వోల్వార్డ్ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్ (బి) గార్డ్నర్ 0; చినెల్లి (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్ (సి) గార్డ్నర్ (బి) డివైన్ 47; స్నేహ్ రాణా (సి) వేర్హమ్ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్నర్ 4–0–37–1, వేర్హమ్ 1–0–12–0. -
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
ఢిల్లీని గెలిపించిన జెమీమా
వడోదర: జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టేన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్’ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన హర్మన్ బృందం కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్ (బి) మరిజాన్ కాప్ 12; నాట్ సీవర్ (నాటౌట్) 65; హర్మన్‌ప్రీత్ (సి) హామిల్టన్ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీచరణి 12; అమన్‌జోత్ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.బౌలింగ్: మరిజాన్ 4–0–8–1, హామిల్టన్ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్) రహిలా (బి) అమన్‌జోత్ 46; వోల్వార్డ్ (రనౌట్) 17; జెమీమా (నాటౌట్) 51; మరిజాన్ కాప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.బౌలింగ్: షబి్నమ్ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్ సీవర్ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్‌జోత్ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0. -
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ మారిజాన్ కాప్ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్ (4-0-36-0), స్నేహ్ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది. -
స్మృతి చేజారిన సెంచరీ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. 10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్నేహ్ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల్ని జోడించింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) రావత్ (బి) బెల్ 62; లిజెల్లీ (బి) బెల్ 4; వోల్వార్ట్ (బి) బెల్ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్ 5; స్నేహ్ రాణా (బి) రావత్ 22; హామిల్టన్ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్ 11; నందిని రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166. బౌలింగ్: బెల్ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్ 4–0–31–1, ప్రేమ రావత్ 3–0–16–2, రాధా యాదవ్ 3–0–21–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) షఫాలీ (బి) మరిజాన్ 1; స్మృతి (సి) హామిల్టన్ (బి) నందిని 96; జార్జియా వోల్ నాటౌట్ 54; రిచా ఘోష్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–14, 2–156. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–21–1, లూసీ హామిల్టన్ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0. -
ఢిల్లీ తొలి గెలుపు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు బోణీ కొట్టింది. బుధవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట యూపీ వారియర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెపె్టన్ మెగ్‌లానింగ్ (38 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో సత్తా చాటగా... హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 47; 7 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ (20 బంతుల్లో 27; 5 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షఫాలీ వర్మ, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (32 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలో 93 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేయగా... వోల్వార్ట్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా (21; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వోల్వార్ట్ ఫోర్ కొట్టి గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: కిరణ్ నవగిరె (సి) షఫాలీ (బి) కాప్ 0; లానింగ్ (సి) హెన్రీ (బి) నందిని 54; లిచ్‌ఫీల్డ్ (స్టంప్డ్) లిజెల్లి (బి)స్నేహ్ రాణా 27; హర్లీన్ (రిటైర్డ్ అవుట్) 47; శ్వేత (సి) శ్రీచరణి (బి) షఫాలీ 11; ట్రియాన్ (సి) నికీ (బి) శ్రీచరణి 1; ఎకిల్‌స్టోన్ (ఎల్బీ) (బి) కాప్ 3; శోభన (నాటౌట్) 1; దీప్తి (సి) స్నేహ్ రాణా (బి) షఫాలీ 2; శిఖా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–0, 2–47, 3–132, 4–141, 5–143, 6–148, 7–150, 8–152. బౌలింగ్: కాప్ 4–1–24–2; మిన్ను మణి 1–0–16–0; చినెల్లి 2–0–20–0; నందిని 3–0–29–1; స్నేహ్ రాణా 2–0–20–1; శ్రీచరణి 4–0–29–1; షఫాలీ 4–0–16–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) దీప్తి (బి) శోభన 36; లిజెల్లీ (సి) కిరణ్ (బి) దీప్తి 67; వోల్వార్ట్ (నాటౌట్) 25; జెమీమా (సి) హర్లీన్ (బి) దీప్తి 21; కాప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–94, 2–114, 3–148. బౌలింగ్: క్రాంతి 2–0–10–0; శిఖ 4–0–22–0; ఎకిల్‌స్టోన్ 4–0– 44–0; ట్రియాన్ 3–0–35–0; శోభన 4–0–20–1; దీప్తి 3–0–26–2. -
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
-
సూపర్ సోఫీ
ముంబై: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను విజయం వరించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన పోరులో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ ఆష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ (5/33) ‘హ్యాట్రిక్’తో సహా 5 వికెట్లుపడగొట్టగా... తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/42), చినెల్లి హెన్రీ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లిజెల్లి లీ (54 బంతుల్లో 86; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో లిజెల్లి చెలరేగిపోగా... విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో వోల్వార్ట్ కదంతొక్కింది. వోల్వార్ట్ 17వ ఓవర్లో 2 ఫోర్లు... 18వ ఓవర్లో 4, 4, 4, 6 కొట్టింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 29కి చేరింది. 19వ ఓవర్లో వోల్వార్ట్ 6, 4, జెమీమా ఫోర్‌తో 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... 2 పరుగులే ఇచి్చన సోఫీ డివైన్ 2 వికెట్లు తీసి గుజరాత్‌కు వరుసగా రెండో విజయం కట్టబెట్టింది. ఒకే ఓవర్లో 4,4,6,6,6,6 గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సోఫీ డివైన్ విజృంభించింది. స్నేహ్ రాణా వేసిన ఆ ఓవర్ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన డివైన్... ఆ తర్వాత వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టింది. దీంతో ఒక్క ఓవర్లోనే 32 పరుగులు వచ్చాయి. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో లభించిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డివైన్... శ్రీచరణి ఓవర్లో సైతం మూడు సిక్స్‌లు బాదింది. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైంది. నందిని ‘హ్యాట్రిక్’ ఫుల్‌ఫామ్‌లో ఉన్న డివైన్‌ను అవుట్ చేసిన నందిని శర్మ... ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. రెండో బంతికి కాశ్వీ గౌతమ్ (14) అవుట్ కాగా... నాలుగో బంతికి కనిక (4) స్టంపౌటైంది. చివరి రెండు బంతులకు రాజేశ్వరి (0), రేణుక (0) క్లీన్»ౌల్డ్ అయ్యారు. తద్వారా ఇసీ వాంగ్(2023), దీప్తి శర్మ (2024), గ్రేస్ హారిస్ (2025) తర్వాత డబ్ల్యూపీఎల్‌లో ‘హ్యాట్రిక్’ తీసిన నాలుగో బౌలర్‌గా నందిని నిలిచింది. -
డబ్ల్యూపీఎల్‌లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం
ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది. -
హర్మన్ ప్రీత్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్‌కీపర్), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జెమీమా
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది. డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్‌లాడి 139.67 స్ట్రయిక్ రేట్‌తో 507 పరుగులు చేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్‌లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.గత ఐపీఎల్ సీజన్లో డీసీ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్లోనే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్మెంట్ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్ పటేల్ నేతృత్వంలో డీసీ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్లో ఎలాగైనా ప్లే ఆఫ్స్‌కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్ మార్పు జరిగినట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. గత సీజన్లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్‌కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్ కెప్టెన్‌గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ మెగ్ లాన్నింగ్‌ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో జెమీమా చేసిన సూపర్ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. -
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్ స్పందన ఇదేసోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్... టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025 -
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్.. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో కోటీశ్వరుడుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్ల తన శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో రూ. 8.40 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి టీమ్‌లోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్, యుద్వీర్ సింగ్ చారక్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన మూడవ కాశ్మీర్ పేసర్‌గా నబీ నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ఆకిబ్ నబీ ధార్ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ఆకిబ్ నబీ..?29 ఏళ్ల ఆకిబ్ నబీ.. బారముల్లా జిల్లాలోని క్రేరీ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. దీంతో నబీని డాక్టర్ చేయాలని తన తండ్రి కలలు కన్నాడు. ఆకిబ్ మాత్రం తన తన తండ్రి ఆశయానికి భిన్నంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణ సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చిన నబీ.. తన కఠోర సాధన, పట్టుదలతోనే ఈ స్ధాయికి చేరుకున్నాడు.జమ్మూ కాశ్మీర్లో చలికాలంలో క్రికెట్ ఆడటం చాలా కష్టం. అయినప్పటికి సిమెంట్ వికెట్లపై ప్రాక్టీస్ చేస్తూనే తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకున్నాడు. నబీకి అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు.రంజీల్లో అదుర్స్..నబీ 2020-21 రంజీ సీజన్లో జమ్ము కాశ్మీర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సీజన్లో నబీ పెద్దగా రాణించికపోయినప్పటికి.. గత రెండేళ్లగా మాత్రం దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. 2024 రంజీ సీజన్లో 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. రంజీ సీజన్ 2025-26లో ఆకిబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా దార్ కొనసాగుతున్నాడు.నబీకి బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నబీ రికార్డులెక్కాడు.దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆకిబ్ సత్తాచాటుతున్నాడు. 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. మిచెల్ స్టార్క్, నోర్జే వంటి స్పీడ్ స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను ఆకిబ్ షేర్ చేసుకోనున్నాడు. -
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా తిరిగి తన సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనర్ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ.75 లక్షలకే సొంతం చేసుకుంది. వేలం తొలి సెట్లో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత సెకెండ్ యాక్సిలరేటెడ్ రౌండ్లో కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రెండు రౌండ్లలో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా నిరాశచెందాడు. వెంటనే పృథ్వీ షా..తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. కానీ ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనికరించింది. చివరి రౌండ్లో అతడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. యాక్సిలరేటెడ్ ప్రాసెస్‌లో ఎంపికైన 11 మంది ఆటగాళ్లలో షా కూడా ఉన్నాడు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ముందు పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసి.. కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ అతడు రాసుకొచ్చాడు.కాగా 2018లో కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన పృథ్వీ షాను.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా మారాడు. పృథ్వీ డీసీకి ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఐపీఎల్-2021 వరకు కేవలం రూ. 1.20 అందుకున్న పృథ్వీ షా జీతం ఒక్కసారిగా 525 శాతం పెరిగింది. ఐపీఎల్-2022 సీజన్లో అతడిని రూ.7.50 కోట్లకు ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అనంతరం ఐపీఎల్-2023, 2024 సీజన్లలో ఈ మహరాష్ట్ర ఆటగాడు రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల వల్ల అతడిని ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. వేలంలోకి వచ్చిన పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఆ ఫామ్‌ను ఐపీఎల్లో కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు -
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్ ఏంటి?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో వీరితో పాటు అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్శిఖా పాండే (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 20 లక్షలు- రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్సోఫీ డివైన్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్ జెయింట్స్‌మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)👉బ్యాటర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్ బెల్ (ఇంగ్లండ్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర? -
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ తప్పఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL 2025) మెల్బోర్న్ స్టార్స్ ఓపెనర్, మహిళల ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్ లాన్నింగ్ (Meg Lanning) చెలరేగిపోయింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. WBBL HUNDRED FOR THE GOAT, MEG LANNING....!!!! 🐐 pic.twitter.com/0mc50pUij9— Johns. (@CricCrazyJohns) November 20, 2025ఆమెకు తోడు మరో ఓపెనర్ మెక్కెన్నా (34 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.స్టార్స్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, మెక్కెన్నా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 12, మారిజన్ కాప్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. డానియెలా గిబ్సన్ 7, యామీ జోన్స్ 0 పరుగులతో అజేయంగా నిలిచారు. సిక్సర్స్ బౌలర్లలో లారెన్ చీటిల్, ఆష్లే గార్డ్నర్, మ్యాడీ విలియర్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో స్టార్స్ చేసిన 219 పరుగుల స్కోర్ మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. ఈ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సిడ్నీ సిక్సర్స్ (242) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో బ్రిస్బేన్ హీట్ (229) ఉంది.ఈ మ్యాచ్‌లో లాన్నింగ్ చేసిన స్కోర్ (135) కూడా లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. మొదటి రెండు స్థానాల్లో లిజెల్ లీ (150 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (136 నాటౌట్) ఉన్నారు. ఈ సెంచరీతో లాన్నింగ్ WBBLలో అత్యధి ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో ఎల్లిస్ పెర్రీని (34) వెనక్కు నెట్టి రెండో స్థానానికి (35) ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో బెత్ మూనీ (48) ఉంది. ఈ సెంచరీ లాన్నింగ్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో రెండవది. చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు
ఐపీఎల్లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్‌గా భావించి, నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి పలు మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. చదవండి: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్‌లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్‌కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్‌కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్‌తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్‌డేవిల్స్) తరపునే చేశాడు. -
అక్షర్ పటేల్‌పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్!?
ఐపీఎల్-2026కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్‌పై వేటు వేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు సమాచారం. న్యూస్ 24 నివేదిక ప్రకారం.. అక్షర్ స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తుందంట.వచ్చే ఏడాది సీజన్లో అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడని సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్-2026కు ముందు ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి.అందులో ఇది ఒకటి. కాగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లడంతో ఐపీఎల్-2025లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అందరూ కేఎల్ రాహుల్ డీసీ కెప్టెన్ అవుతాడని భావించినప్పటికి అనూహ్యంగా అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ అప్పగించింది.అయితే రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపకపోవడంతోనే అక్షర్‌ను సారథిగా నియమించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కెప్టెన్‌గా జట్టును నడిపించేందుకు రాహుల్ ఆసక్తిగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌లలో ఐదింట విజయంతో 5వ స్దానంతో ఢిల్లీ సరిపెట్టుకుంది. రాహుల్ కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించాడు -
చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వి (21) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కాన్పూర్ సూపర్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. వరుస విధ్వంసాలతో హోరెత్తిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 93 పరుగులు చేసిన రిజ్వి.. ఇవాళ మీరట్ మెవెరిక్స్పై అజేయమైన మెరుపు అర్ద శతకంతో (48 బంతుల్లో 78) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో రిజ్వి మెరుపు ఇన్నింగ్స్‌కు లక్ కూడా తోడవ్వడంతో కాన్పూర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాన్పూర్.. మీరట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాన్పూర్ ఇన్నింగ్స్‌లో రిజ్వి ఒక్కడే రాణించాడు.సహచరులు ఒక్కో పరుగు సాధించేందుకు ఇబ్బంది పడుతుండగా.. రిజ్వి భారీ షాట్లతో చెలరేగాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్‌లో రిజ్వి ఒక్కడే సగానికి పైగా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మీరట్‌ను వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు స్కోర్ 41/2 వద్ద (8 ఓవర్ల తర్వాత) ఉండగా భారీ వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా డక్ వర్త్ లూయిస్ పద్దతిన కాన్పూర్ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి మీరట్ గెలుపుకు 14 పరుగుల దూరంలో (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఉండింది. ఆర్సీబీ యువ ఆటగాడు స్వస్తిక్ చికారా (29), మాధవ్ కౌశిక్ (4) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, సమీర్ రిజ్వి గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడు పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో ఒత్తిడిలో అజేయమైన అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. యూపీ లీగ్‌లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి డీసీ మేనేజ్మెంట్ దృష్టిలో పడి ఉంటాడు. ఈ ప్రదర్శనలు అతడికి మరిన్ని ఐపీఎల్ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. -
ఉత్కంఠ పోరులో వికెట్ తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ
పురుషుల హండ్రెడ్ కాంపిటీషన్ 2025లో నిన్న ఓ ఉత్కంఠ పోరు జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ వికెట్ తేడాతో గెలుపొందింది. 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు. అప్పటికే బ్రేవ్ 9 వికెట్లు కోల్పోయి ఉండింది. ఏమాత్రం అటు ఇటైనా బ్రేవ్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చేది. టాప్లే సాహసోపేతంగా భారీ షాట్ ఆడి బౌండరీ బాదడంతో మ్యాచ్ బ్రేవ్ వశమైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ (కెప్టెన్) ఫిల్ సాల్ట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18 బంతుల్లో 22, క్లాసెన్ 16 బంతుల్లో 15, చాప్మన్ 12 బంతుల్లో అజేయమైన 22 పరుగులు చేశారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. క్రెయిగ్ ఓవర్టన్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బ్రేవ్ ఆది నుంచి తడబడుతూ వచ్చింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే ఆఖర్లో ఓవర్టన్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా బ్యాట్ ఝులిపించి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్లో (5 బంతులు) బ్రేవ్ మరోసారి తడబడింది. గ్రెగరీ తొలి రెండు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చి మూడో బంతికి వికెట్ తీశాడు. తద్వారా బ్రేవ్ 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు.కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపొందిన సథరన్ బ్రేవ్‌ను ఈ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తున్నాడు. -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇవే..!
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు. ప్రస్తుతం వరల్డ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల హవా నడుస్తుంది.తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లోనూ కాలు మోపారు. ఈ లీగ్‌లో వారు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) హండ్రెడ్ లీగ్ ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఏ ఫ్రాంచైజీలను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు కొనుగోలు చేశారో ఓ లుక్కేద్దాం.ఓవల్ ఇన్విన్సిబుల్స్: ఈ ఫ్రాంచైజీని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇన్విన్సిబుల్స్లోని 49 శాతం వాటాను ముకేశ్ అంబానీ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. మిగతా 51 శాతం వాటాను సర్రే కౌంటీ క్లబ్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇన్విన్సిబుల్స్‌కు సామ్ కర్రన్ నాయకత్వం వహించనున్నాడు.సథరన్ బ్రేవ్: ఈ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తాడు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్: ఈ ఫ్రాంచైజీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను కావ్యా మారన్ సంస్థ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.మాంచెస్టర్ ఒరిజినల్స్: ఈ ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కొనుగోలు చేశాడు. అతని నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్లోని 70 శాతం వాటాను దక్కించుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన భారత యువ కెరటం
ఇటీవలికాలంలో భారత అండర్-19 క్రికెట్ హీరోలు చెలరేగిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే లాంటి వారు ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగగా.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో భారత అండర్-19 జట్టు మాజీ సారధి యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. డీపీఎల్ 2025 రెండో మ్యాచ్‌లో ధుల్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ఆడుతూ నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా సెంట్రల్ ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత డీపీఎల్ సీజన్లో ధుల్ సెంచరీనే మొదటిది. గత సీజన్ మొత్తంలో 93 పరుగులే చేసిన ధుల్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. రెడ్ బాల్ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్ ఈ ఇన్నింగ్స్‌తో ఆ ముద్రను చెరిపేసి ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. అండర్-19 క్రికెట్ ప్రదర్శనల ఆధారంగా 2023 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. ఆ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేశాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్‌ను మరోసారి దక్కించుకనే ప్రయత్నం చేయవచ్చు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర ఢిల్లీ.. సర్తక్ రంజన్ (82), అర్నవ్ బుగ్గా (67) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో గవిన్ష్ ఖురానా, మనీ గ్రేవాల్ తలో 2 వికెట్లు తీయగా.. సిమర్జీత్ సింగ్, తేజస్ బరోకా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్ ఢిల్లీ.. ఓపెనర్ యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (2 వికెట్లు కోల్పోయి). సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో ధుల్‌కు యుగల్ సైనీ (36), జాంటి సిద్దూ (23 నాటౌట్) సహకరించారు. ఉత్తర ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. -
గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్‌పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్‌ను తీసుకుంటే కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్‌కోచ్‌కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! అక్కడ 11 సిక్స్‌లతో విధ్వంసం
మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ పేసర్లు బార్ట్లెట్, హ్యారీస్ రౌఫ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బ తీశారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(53), మాథ్యూ ట్రంప్(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మెక్‌గుర్క్ తుపాన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యునికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన మెక్‌గర్క్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్‌గర్క్ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(52)హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్ రెండు, రస్సెల్, నరైన్ తలా వికెట్ సాధించారు.ఐపీఎల్లో ఫెయిల్..కాగా జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఐపీఎల్-2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.Jake Fraser-McGurk's 88 runs earned him the title of Stake Player of the Match today in Oakland. 🔥@stakenewsindia x @StakeIND pic.twitter.com/jP44Of6wrH— Cognizant Major League Cricket (@MLCricket) June 15, 2025 -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. కేవలం 23 బంతుల్లోనే..!
ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ ఆటగాడు పృథ్వీ షా ఇరగదీశాడు. లీగ్‌లో భాగంగా ట్రయంప్ నైట్స్‌తో నిన్న (జూన్ 8) జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షా సునామీ హాఫ్ సెంచరీతో పాటు హర్షల్ జాదవ్ (30 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గౌరవ్ జాథర్ (10 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, సిక్స్), రాహుల్ సావంత్ (9 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్ బౌలర్లలో శ్రేయస్ గౌరవ్ 2, మినాద్ మంజ్రేకర్, పరిక్షిత్, సుర్యాంశ్ షేడ్గే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్.. ప్రతిక్ మిశ్రా (3.5-0-30-4) రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. పాంథర్స్ బౌలర్లలో రాహుల్ సావంత్ 2, ముజమ్మిల్ ఖాద్రి, గౌరవ్ జాథర్ తలో వికెట్ తీశారు. నైట్స్ ఇన్నింగ్స్‌లో సిద్దాంత్ ఆధత్రావ్ (76) ఒంటరిపోరాటం చేసి 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), పరిక్షిత్ (20), శిఖర్ ఠాకూర్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పాంథర్స్, నైట్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, పృథ్వీ షా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించలేదు. ఈ సీజన్ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత కొంతకాలంగా షా ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానం కోల్పోయాడు. తాజా ప్రదర్శన తర్వాత షా తిరిగి ముంబై జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 2024-25 సీజన్లో షా రెండు సార్లు ముంబై జట్టులో స్థానం కోల్పోయాడు. రంజీ జట్టుతో పాటు విజయ్ హజారే టీమ్ నుంచి డ్రాప్ అయ్యాడు. 2018లో టీమిండియా తరఫున ఘనంగా (తొలి టెస్ట్‌లోనే సెంచరీ) అరంగేట్రం చేసిన షా.. అతి కొద్ది కాలంలోనే ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కనుమరుగయ్యాడు. షా చివరిగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు. -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్, భారత్-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్ 158/2గా ఉంది. కరుణ్ 66, సర్ఫరాజ్ 48 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.కాగా, కరుణ్ నాయర్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్.. 21 ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.2024 అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కరుణ్ స్కోర్లు.. 66* (ప్రస్తుత మ్యాచ్), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే కరుణ్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. ఈ మ్యాచ్ మినహా కరుణ్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్లో ట్రాక్ రికార్డు కారణంగా కరుణ్‌కు ఇంగ్లండ్ టూర్‌కు పిలుపు అందింది. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు కరుణ్ ఎంపికయ్యాడు.గతేడాది కాలంగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో కరుణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్‌ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
విజయంతో ముగించిన ఢిల్లీ
జైపూర్: ఈ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్’పై గురిపెట్టిన పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో స్టొయినిస్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెరిపిస్తే... సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలిచేదాకా నిలిచాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6; ప్రభ్‌సిమ్రన్ (బి) విప్రాజ్ 28; ఇన్‌గ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రాజ్ 32; శ్రేయస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53; నేహల్ (సి) డుప్లెసిస్ (బి) ముకేశ్ 16; శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11; స్టొయినిస్ నాటౌట్ 44; అజ్మతుల్లా (సి) సమీర్ (బి) కుల్దీప్ 1; యాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0; హర్‌ప్రీత్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్: ముకేశ్ 4–0–49–1, ముస్తాఫిజుర్ 4–0–33–3, మోహిత్ శర్మ 4–0–47–0, విప్రాజ్ నిగమ్ 4–0–38–2, కుల్దీప్ 4–0–39–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) శశాంక్ (బి) యాన్సెన్ 35; డుప్లెసిస్ (సి) ప్రియాన్ష్(బి) హర్‌ప్రీత్ 23; కరుణ్ (బి) హర్‌ప్రీత్ 44; సాదికుల్లా (సి) అర్‡్షదీప్ (బి) ప్రవీణ్ 22; రిజ్వీ నాటౌట్ 58; స్టబ్స్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్‌ప్రీత్ 4–0–41–2, యాన్సెన్ 4–0–41–1, ప్రవీణ్ 2–0–20–1, స్టొయినిస్ 1.3–0–21–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నైవేదిక: అహ్మదాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: ఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: పంజాబ్‌ను ఓడించిన ఢిల్లీ
Punjab Kings vs Delhi Capitals- Jaipur Updates: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ సేనను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో పని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (35), ఫాఫ్ డుప్లెసిస్ (23)లు మెరుగ్గా ఆడగా.. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) దంచికొట్టాడు. సమీర్ రిజ్వీ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 58) సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) అతడికి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ18.2: ఐపీఎల్లో తొలి అర్ధ శతకం బాదిన సమీర్ రిజ్వీ . 22 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.రిజ్వీ ధనాధన్18 ఓవర్లలో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయానికి ఇంకో రెండు ఓవర్లలో 22 పరుగులు కావాలి.16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 159/4కరుణ్ నాయర్ అవుట్ధనాధన్ ఇన్నింగ్స్‌తో దూకుడు మీదున్న కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44)ను హర్‌ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రాగా.. సమీర్ రిజ్వీ 24 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ స్కోరు: 155/4 (15)14 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 146/3 యాభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ. కరుణ్ 38, సమీర్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 61 పరుగులు కావాలి.ఫోర్ల వర్షంప్రవీణ్ దూబే బౌలింగ్‌లో కరుణ్ నాయర్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 110-3. కరుణ్ 27, సమీర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్10:1: సెదీకుల్లా (22) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. సమీర్ రిజ్వీ క్రీజులలోకి రాగా.. కరుణ్ 15 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 93/2 (10)సెదీకుల్లా 22, కరుణ్ నాయర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.డుప్లెసిస్ అవుట్6.4: హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (23)రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సెదీకుల్లా అటల్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 66-2. కరుణ్ నాయర్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ5.3: కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 50-0శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగైన స్కోరు చేసింది.. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్19.3: ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన యాన్సెన్(0). పంజాబ్ స్కోరు: 197-8ఏడో వికెట్ డౌన్17.6: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (1) పెవిలియన్ చేరాడు. పంజాబ్ స్కోరు: 174-7. మార్కో యాన్సెన్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 20 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్17.1: కుల్దీప్ బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (53) అవుటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం17 ఓవర్లలో పంజాబ్ స్కోరు 171/5 (17). శ్రేయస్ అయ్యర్ 53, స్టొయినిస్ 18 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్15.4: శశాంక్ సింగ్ (11) రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి శశాంక్ పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ 48 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 146-5(16)హాఫ్ సెంచరీకి చేరువలో శ్రేయస్15 ఓవర్లు ముగిసే సరికి శ్రేయస్ 46 పరుగులతో ఉండగా.. శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్ స్కోరు: 142/4 (15)12.3: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నేహాల్ వధేరా(16). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 118-412 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 116/3 (12)శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, నేహాల్ వధేరా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 97/3 (10)శ్రేయస్ అయ్యర్ 18 పరుగులతో, నేహాల్ వధేరా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్7.5: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌల్డ్ (28). మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్. శ్రేయస్ 8 పరుగులతో ఉండగ.. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు.ఏడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 71/2 (7)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23, శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్(32) షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 60-2ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 44/1 (5)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 15, జోష్ ఇంగ్లిస్ 22 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్‌కు భారీ షాక్.. ఆర్య ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ జట్టులోకి జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిష్ తిరిగి రాగా.. సెడిఖుల్లా అటల్ ఢిల్లీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టాప్-2 స్ధానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే.. ఢిల్లీ మాత్రం కింగ్స్‌ను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది,తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ -
జోరు కొనసాగించాలని...
జైపూర్: సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంపై దృష్టి పెట్టింది. 2014లో చివరిసారి ‘ప్లే ఆఫ్స్’కు చేరి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ‘టాప్–4’లో చోటు దక్కించుకుంది. ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్షణలో తొలి టైటిల్ వేట దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్... ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో... పాకిస్తాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్నే తాజాగా తటస్థ వేదిక జైపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్ 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో... 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ నెగ్గితే... పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలవడం ద్వారా ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం పొందనుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి పంజాబ్ జోరు కొనసాగిస్తుందా... లేక ఢిల్లీ సత్తా చాటుతుందా చూడాలి! టాపార్డర్ ఫుల్ జోష్‌లో... ఇప్పటి వరకు రెండు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌పై పంజాబ్ కింగ్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 2019, 20లో ఢిల్లీ జట్టును ‘ప్లే ఆఫ్స్’ చేర్చిన శ్రేయస్... 2024లో కోల్‌కతాకు మూడోసారి కప్పు అందించాడు. తాజా సీజన్లో అతడు 174.69 స్ట్రయిక్‌రేట్‌తో 435 పరుగులు చేశాడు. గతేడాదితో పోల్చుకుంటే అతడి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఈ సీజన్లో పవర్‌ప్లే ముగిసిన తర్వాత అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయస్ అయ్యరే. నికోలస్ పూరన్ 211.51 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబడితే... శ్రేయస్ 182.19 స్ట్రయిక్‌రేట్‌తో దంచి కొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు వరంగా మారారు. నిలకడ కొనసాగిస్తున్న ఈ జోడీ... ఢిల్లీతో ఈ నెలారంభంలో జరిగిన పోరులోనూ అదిరిపోయే ఆరంభం అందించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 122 పరుగులు జోడించారు. ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ 38.17 సగటుతో 458 పరుగులు చేయగా... ప్రియాన్‡్ష ఆర్య 356 పరుగులు సాధించాడు.ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెస్ రూపంలో కింగ్స్‌కు మెరుగైన బ్యాటింగ్ దళం ఉంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్, యుజువేంద్ర చాహల్, యాన్సెన్, జేమీసన్ కీలకం కానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... లీగ్ నుంచి తిరుగుపయనమైన విదేశీ ఆటగాళ్లంతా తిరిగి అందుబాటులోకి రావడంతో పంజాబ్ కింగ్స్ మరింత బలంగా తయారైంది. అక్షర్ పటేల్ అనుమానమే! సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో ఒకదశలో సునాయాసంగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుందనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ముంబై చేతిలో ఓటమితో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఏకైక మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చి గౌరవంగా సీజన్‌కు గుడబై చెప్పాలని చూస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 56.00 సగటు, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 504 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉండగా... అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేశాడు. జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి. అతడు అందుబాటులో లేకపోతే మరోసారి డు ప్లెసిస్ ఢిల్లీ జట్టును నడిపించనున్నాడు. డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్‌తో జట్టుకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.అయితే ఢిల్లీ అసలు సమస్య మాత్రం నిలకడగా వికెట్లు తీయగల ప్రధాన బౌలర్ లేకపోవడమే. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవడంతో ఢిల్లీ బౌలింగ్ డీలా పడింది. ముకేశ్ కుమార్, ముస్తఫిజుర్, చమీరా, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్, జేమీసన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజుర్, ముకేశ్ కుమార్. -
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్కమ్రించింది.181 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ సేన ఛేదించిలేక చతికల పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్పందించాడు. ఆఖరి రెండు ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అతడు అభిప్రాయడ్డాడు."ఈ మ్యాచ్‌లో మేము 18 ఓవర్ల వరకు అద్బుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఆఖరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. చివరిలో మా ప్రణాళికలను సరిగ్గా ఆమలు చేయలేకపోయాము. 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు ఇచ్చాము. ఆఖరి రెండు ఓవర్లలో పిచ్ కండీషన్స్ తగ్గట్టు మా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా ఉన్నందున కట్టర్లు కానీ వైడ్ యార్కర్లు గానీ ప్రయత్నించుంటే బాగుండేది.కానీ మా బౌలర్లు అది చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఆటగాడో మనందరికి తెలుసు. అటువంటి బ్యాటర్‌కు స్లాట్‌లో బంతులు వేస్తే శిక్షించుకుండా ఎలా వదులుతాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బదానీ పేర్కొన్నాడు.అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది సీజన్‌ను నేను ఒక మారథన్గా భావించాము. మొదటిలో మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాము.అయితే కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఓడిపోయాము. ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని మ్యాచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఆ మ్యాచ్‌లలో గెలవకపోతే తప్పు మనదే అవుతుంది. అందుకు ఎవరిని బాధ్యులు చేయలేము. ఏదేమైనప్పటికి ఒక జట్టుగా మేము బాగా రాణించాము" అని బదానీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు, మరో ఆరింట ఓటములను చవిచూసింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025 -
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్మెంట్ను డ్యామేజ్ చేయడం) ప్రకారం ముకేశ్ కుమార్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్ కుమార్ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై
-
‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.కుల్దీప్ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. -
IPL 2025: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 59 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.5వ ఓవర్- ఢిల్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో అశుతోష్ శర్మ (18) స్టంపౌటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2వ ఓవర్- 103 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వి (39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 9.2వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (2) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ7.6వ ఓవర్- 55 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విప్రాజ్ (20) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 27 పరుగలకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ4.2వ ఓవర్- 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో అభిషేక్ పోరెల్ (6) ఔటయ్యాడు. టార్గెట్ 181.. 20 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.4వ ఓవర్- 20 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు. టార్గెట్ 181.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4వ ఓవర్- 181 పరుగల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ (6) ఔటయ్యాడు. స్కై, నమన్ ధిర్ కొసమెరుపు.. ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేసిన ముంబైటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదిల్చింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి రెండు ఓవర్లలో నమన్ ధిర్, సై 48 పరుగులు పిండుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ముంబై16.3వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో ముకేశ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (3) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వికి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (27) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 95/312 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 95/3గా ఉంది. తిలక్ వర్మ (23), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 58 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాధవ్ తివారి క్యాచ్ పట్టడంతో రికెల్టన్ (25) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై5.3వ ఓవర్- 48 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (21) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 46/15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 46/1గా ఉంది. విల్ జాక్స్ 20, రికెల్టన్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (5) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని భావించిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ముంబై విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మిగిలిన ఏకైక ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సీజన్లో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), అభిషేక్ పోరెల్(w), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: KL రాహుల్, సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్ -
MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.వర్షం ముప్పు.. ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.అయితే, పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
MI vs DC: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్ బెర్త్’ను ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను అభిమానులు క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు.తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య గత నెలలో జరిగిన పోరులో ముంబైనే విజయం వరించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి పోరాటం కనబరుస్తుందో చూడాలి! అన్ని రంగాల్లో పటిష్టంగా... సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రాకెట్లా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఆల్‌రౌండర్లతో దట్టంగా ఉంది. సీజన్లో 63.75 సగటుతో 510 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు తరఫున టాప్ స్కోరర్ కాగా... రికెల్టన్ 336, రోహిత్ శర్మ 300, తిలక్ వర్మ 246 పరుగులు చేశారు.గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై... తిరిగి పుంజుకుని సమష్టిగా సత్తాచాటాలని చూస్తోంది. రోహిత్ శర్మతో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. వీరిద్దరూ కలిసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీ బౌలర్లకు చిక్కులు ఖాయమే. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. లీగ్ దశ ముగియగానే రికెల్టన్, జాక్స్, బాష్ జట్టును వీడనున్నారు. బౌలింగ్‌లోనూ ముంబైకి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా పేస్ భారం మోయనుండగా... కరణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా... ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. స్టార్క్ లోటుతో! అక్షర్ పటేల్ సారథ్యంలో ఈ సీజన్ ఆరంభంలో ఆశలు రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గిన క్యాపిటల్స్... ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 61.63 సగటుతో 493 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అభిషేక్ పొరెల్ 295, ట్రిస్టన్ స్టబ్స్ 280, అక్షర్ పటేల్ 263 పరుగులు చేశారు. ఆరంభంలో మెరిపించిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ప్రభావం చూపలేకపోతుండగా... బౌలింగ్‌లో ఆ జట్టు స్టార్క్‌పై అతిగా ఆధారపడుతోంది. చావో రేవో మ్యాచ్‌లో అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. గత మ్యాచ్‌లో చూసుకుంటే వికెట్లు చేతిలో ఉన్నా... ఆశించిన వేగంతో ఆడలేకపోయిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో 199 పరుగులు చేసింది.అయితే బౌలింగ్‌లో ఢిల్లీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, విప్రాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే దానిపైనే ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ భవితవ్యం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్వని కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్, చమీరా. -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!?
ఐపీఎల్-2025లో బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆశలను పదిలం చేసుకుంటుంది. నాలుగో స్ధానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి.ఇక ఈ కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడే అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీకి.. రాహుల్ కూడా దూరమైతే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్లో రాహుల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో మెరిశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్, దుష్మంత చమీరా, సెడికుల్లా అటల్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్ కుమార్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్ -
IPL 2025: కేఎల్ రాహుల్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులు సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్ సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో పంజాబ్ తరఫున 2, లక్నో తరఫున 2, ఇప్పుడు ఢిల్లీ తరఫున ఓ సెంచరీ (మొత్తం 5) చేసి ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. తాజా సెంచరీతో తన టీ20 సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు:8 - విరాట్ కోహ్లీ7 - జోస్ బట్లర్6 - క్రిస్ గేల్5 - కేఎల్ రాహుల్*4 - శుభ్‌మన్ గిల్4 - షేన్ వాట్సన్4 - డేవిడ్ వార్నర్పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు:విరాట్ కోహ్లీ - 9రోహిత్ శర్మ - 8అభిషేక్ శర్మ - 7కేఎల్ రాహుల్ - 7*ఫాస్టెస్ట్ ఇండియన్‌గా..ఈ మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లికి ఈ మార్కు తాకేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్ తన 224వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్ (224), కోహ్లి (243), పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రికార్డు సెంచరీ చేసినా ఓడిన ఢిల్లీఈ మ్యాచ్‌లో రాహుల్ రికార్డు సెంచరీతో కదంతొక్కినా ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ఢిల్లీపై విజయంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0. -
IPL 2025: ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో తమ ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను గుజరాత్ టీమ్ ఖారారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్(18 పాయింట్లు) అగ్రస్ధానంలో కొనసాగుతోంది. గుజరాత్ విజయంతో ఆర్సీబీ(17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) సైతం ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. మరో స్ధానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.ఓపెనర్ల విధ్వంసం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలోనే ఊదిపడేసింది. గుజరాత్ ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సాయిసుదర్శన్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఒక్కరూ కనీసం వికెట్ సాధించలేకపోయారు.రాహుల్ సెంచరీ వృథా..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు. -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్ -
ఓపెనర్లే కొట్టేశారు.. ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
IPL 2025 DC vs GT Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.ప్లే ఆఫ్స్‌కు గుజరాత్..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61 బంతుల్లో 108) సూపర్ సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(87), శుబ్‌మన్ గిల్(74) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..200 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ అద్బుతంగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(59), సాయిసుదర్శన్(72) హాఫ్ సెంచరీలతో తమ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 63/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(46), శుబ్‌మన్ గిల్(17) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(25), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యంఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన పోరెల్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీ..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 పరుగులతో రాహుల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 44/16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(36), అభిషేక్ పోరెల్(1) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డుప్లెసిస్.. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 14పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(9), ఫాఫ్ డుప్లెసిస్(3) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ , అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
ఢిల్లీ క్యాపిటల్స్ కోలుకునేనా!
న్యూఢిల్లీ: ఐపీఎల్–2025ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. తొలి 4 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత జట్టు ఫామ్ ఒక్కసారిగా తిరోగమించింది. తర్వాత 7 మ్యాచ్‌లలో ఢిల్లీ కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. హైదరాబాద్‌లో జరిగిన తమ చివరి పోరులో కూడా క్యాపిటల్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమికి బాటలు వేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వర్షంతో ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌లలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నిలకడకు మారుపేరులా ఆడుతూ ముందంజ వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఆ టీమ్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లోనే దానిని అందుకోవాలని గిల్ బృందం భావిస్తోంది. ముస్తఫిజుర్ దూరం... ఐపీఎల్ కొత్త షెడ్యూల్ కారణంగా ఢిల్లీ ప్రణాళికలు కూడా మారాయి. కీలక సమయంలో జట్టును గెలిపించే సత్తా ఉన్న ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఆ్రస్టేలియాకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢిల్లీ ఎంచుకుంది. అయితే శనివారం షార్జాలో టి20 మ్యాచ్ ఆడిన అతను తిరిగి వచ్చి ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం లేదు. దాంతో తుది జట్టులో ముగ్గురు విదేశీయులే ఉండనున్నారు. డుప్లెసిస్, స్టబ్స్ పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా, పేసర్ చమీరా కూడా ఆడనున్నాడు. అయితే జట్టు విజయావకాశాలు భారత ఆటగాళ్లు పొరేల్, కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ అక్షర్ ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. విప్రాజ్, అశుతోష్ మిడిలార్డ్‌లో చెలరేగాల్సి ఉండగా... కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన పదును చూపిస్తే ప్రత్యర్థిని కట్టిపడేయవచ్చు. మార్పుల్లేకుండా... టోర్నీ వాయిదా తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు అదే ప్రధాన ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేసుకోవడంలో గుజరాత్ సఫలం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే ముందంజ వేసే టీమ్ మరో రెండు కూడా నెగ్గి టాప్ స్థానంపై గురి పెట్టింది. లీగ్ దశ వరకు బట్లర్, రూథర్‌ఫర్డ్, రబడ, కొయెట్జీ అందుబాటులో ఉంటుండటంతో టైటాన్స్ మేనేజ్మెంట్ ధీమాగా ఉంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అందిస్తున్న చక్కటి ఆరంభాలు జట్టును ముందంజలో నిలిపాయి. ఆ తర్వాత బట్లర్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. సీజన్లో 500 పరుగులు దాటిన టాప్–5లో ముగ్గురు టైటాన్స్ సుదర్శన్, గిల్, బట్లర్ ఉండటం విశేషం. షారుఖ్, తెవాటియా చివర్లో అదనపు పరుగులు జోడించగలరు. ముగ్గురు పేసర్లు ప్రసిధ్, సిరాజ్, అర్షద్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా... స్పిన్నర్లు సాయికిషోర్, రషీద్ ఖాన్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బలాబలాలపరంగా చూస్తే టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. -
IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి ప్రారంభానికి సిద్దమైంది. శనివారం(మే 17) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ పునఃప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో అగ్రస్థానానికి ప్రమోట్ చేయాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరాణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని హెడ్ కోచ్ హేమంగ్ బదాని, మెంటార్ కెవిన్ పీటర్సన్ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రాహుల్ ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో రాహుల్ 10 మ్యాచ్‌లలో ఆడాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. రెండు సార్లు మూడో స్ధానంలో, మిగిలిన మ్యాచ్‌లలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభ మ్యాచ్‌లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డుప్లెసిస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రెజర్ మెక్ గర్క్‌ను పేలవ ఫామ్ కారణంగా ఢిల్లీ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్ధానంలో అభిషేక్ పోరెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే డుప్లెసిస్ గాయం బారిన పడడంతో కరుణ్ నాయర్ కూడా ఓపెనర్‌గా వచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీకి ఓపెనర్లు మాత్రం మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇప్పుడు రాహులైనా ఢిల్లీకి మంచి ఆరంభాలను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ రాకకు లైన్ క్లియర్!
ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.ఐపీఎల్ 16వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. -
‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సహనం కోల్పోయాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో భాగంగా ఢిల్లీ స్టార్క్‌ను రూ. 11. 75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.ఈ క్రమంలో ఈ సీజన్లో ఢిల్లీ (Delhi Capitals) తరఫున పదకొండు మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు స్టార్క్. చివరగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు బరిలోకి దిగాడు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ అర్దంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.భార్య అలిసా హేలీతో కలిసిఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి చేర్చింది. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు లోనైన స్టార్క్, అతడి భార్య అలిసా హేలీ ఢిల్లీకి చేరుకుని.. వెంటనే స్వదేశానికి పయనమయ్యారు.ఇక్కడి నుంచి పో..ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి స్టార్క్ దగ్గరగా వెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు పక్కకు వెళ్లిపో అంటూ సైగ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత సదరు వ్యక్తి మరోసారి స్టార్క్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆసీస్ బౌలర్.. ‘‘పో.. పో.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో’’ అన్నట్లుగా విసుక్కున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలే భయపడిన వాడిని మరింత భయపెట్టడం సరికాదంటూ సెటైర్లు వేస్తుండగా... మరికొందరు మాత్రం స్టార్క్ అంతలా విసుక్కోవాల్సిన అవసరం లేదని.. ఏదేమైనా ఒకరి గోప్యతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం ఏమిటని సదరు వ్లాగర్‌కు చివాట్లు పెడుతున్నారు.మే 17 నుంచి తిరిగి ప్రారంభంఇదిలా ఉంటే... మే 17 నుంచి ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఢిల్లీకి ఆడుతున్న ఆసీస్ స్టార్లు స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్ తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇష్టమైతేనే భారత్‌కు తిరిగి వెళ్లవచ్చు అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించగా.. స్వదేశంలోనే ఉండేందుకు వీరిద్దరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీకి లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 13 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న అక్షర్ సేన.. ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టింది. అయితే, స్టార్క్, మెగర్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపనుంది.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్Go away😭pic.twitter.com/hqkyHzCEg4— Ghar Ke Kalesh (@gharkekalesh) May 15, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. హ్యాండ్ ఇచ్చిన స్టార్ ప్లేయర్?
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు డుప్లెసిస్ సైతం ఊహించని షాకిచ్చాడు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డుప్లెసిస్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయిన డుప్లెసిస్ తిరిగి భారత్‌కు వచ్చేందుకు తిరష్కరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది.డుప్లెసిస్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో డుప్లెసిస్ గాయం కారణంగా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మిగితా ఆరు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే డుప్లెసిస్ గత కొన్ని మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరపున ఆడినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్ సాధించకపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫాఫ్ సౌతాఫ్రికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరో సౌతాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెర్రీరా సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యాండ్ ఇచ్చాడు. అతడు కూడా తిరిగి ఐపీఎల్లో పాల్గోనేందుకు రావడం లేదని ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వీరిద్దరి కంటే ముందు మిచెల్ స్టార్క్, జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ సైతం ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగారు.ముగ్గురే ముగ్గురు..దీంతో ప్రస్తుతం ఢిల్లీ జట్టులో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. ట్రిస్టన్ స్టబ్స్, శ్రీలంక పేసర్ దుష్మంత చమీర, బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విదేశీ ప్లేయర్లగా ఉన్నారు. ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి.. అతడికి ఇంకా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్వోసీ మంజారు చేయలేదు. దీంతో అతడు ఇంకా ఢిల్లీ జట్టుతో చేరలేదు.ప్రస్తుతం బంగ్లా క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: IND vs ENG: 'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్' -
IPL Restart: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త.. స్టార్ ఆటగాడు హ్యాండ్ ఇచ్చాడు
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్టార్క్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా అందరూ విదేశీ ఆటగాళ్లతో పాటే స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్క్.. భారత్‌కు తిరిగి రావడం లేదని తేల్చి చెప్పాడు. దీనికి ఢిల్లీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది.ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న స్టార్క్ (11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా) లీగ్ కీలక దశలో హ్యాండ్ ఇవ్వడం ఢిల్లీ విజయావకాశాలను భారీగా దెబ్బ తీస్తుంది. స్టార్క్.. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసమే భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లి, తిరిగి రానని ప్రకటించిన రెండో ఆటగాడు స్టార్క్. స్టార్క్‌కు ముందు అతని దేశానికే (ఆస్ట్రేలియా) చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కూడా లీగ్ తదుపరి లెగ్ కోసం భారత్‌కు రానని స్పష్టం చేశాడు.స్టార్క్ గురించి ముందుగానే సమాచారమున్న ఢిల్లీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ కూడా అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. ముస్తాఫిజుర్‌కు అతని దేశ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 విజయాలతో 13 పాయింట్లు (సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది) సాధించి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఢిల్లీ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌ను ఢీకొట్టనున్న ఈ జట్టు.. మే 21 ముంబైతో.. మే 24న పంజాబ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ.. గుజరాత్, పంజాబ్ చేతుల్లో ఓడి, ముంబై ఇండియన్స్ ఒక్కదానిపై గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి (ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతుల్లో కూడా ఓడాల్సి ఉంటుంది). -
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాత్కాలిక రీప్లేస్మెంట్ల కోసం వెతుకుతున్న వేల, టీమిండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని షా.. "బ్రేక్ కావాలంటూ" ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షా రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.2018లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల షా.. ఐపీఎల్లో డీసెంట్ రికార్డు (79 మ్యాచ్‌ల్లో 147.467 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు) కలిగి ఉన్నాడు. అయితే వ్యక్తిగత అలవాట్లు, ఫిట్నెస్ కోల్పోవడం అతన్ని ఐపీఎల్ పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరం చేశాయి. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన షా.. 8 మ్యాచ్‌ల్లో 163.63 స్ట్రయిక్‌రేట్‌తో 198 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సేవలు కోల్పోవడంతో షా ఆ జట్టులో చోటు ఆశిస్తున్నాడు.ప్రస్తుత తరుణంలో షాకు ఢిల్లీ అవకాశం ఇవ్వకపోయినా ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇవ్వొచ్చన్న టాక్ నడుస్తుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశీయ బ్యాటర్ కోసం చూస్తుందని సమచారం. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తుగా కీర్తించబడ్డ పృథ్వీ షా ఇప్పుడు ఐపీఎల్లో ఛాన్స్ కోసం వెంపర్లాడటం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి గతే పడుతుందని జనాలు అంటున్నారు. పృథ్వీ షాలా కావొద్దని ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యువ ఆటగాళ్లకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. యుద్దం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనలేకపోతున్నారు. కొందరు ఇతరత్రా కారణాల చేత ఐపీఎల్లో కొనసాగేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తిరిగి రాని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే పృథ్వీ షా లాంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. -
IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రత్యేక కారణంగా వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకున్నందుకు ఆ జట్టు భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు డీసీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. తాజాగా జరిగిన యుద్దంలో బంగ్లాదేశ్ పాక్‌కు అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్తాఫిజుర్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్తాఫిజుర్ ఎంపిక సిగ్గుచేటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా #BocottDelhiCapitals ట్రెండింగ్‌లో ఉంది.కాగా, భారత్-పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా) ఐపీఎల్‌కు తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా డీసీ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను ఎంపిక చేసుకుంది. రూ. 6 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకుంది.As a Delhiite, I can no longer support @DelhiCapitals. The franchise's support for players from a country known for its anti-India stance, including backing Pakistan, is unacceptable to me. #BoycottDelhiCapitals pic.twitter.com/M3qMGcshWk— Abhinav (@AbhinavStarx) May 14, 2025ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలు చేస్తుందిపై విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత కీలక దశలో ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలే చేస్తుంది. ఏదైనా కారణం చేత మిచెల్ స్టార్క్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే ఢిల్లీని అతనే ఆదుకునే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్‌కు పరిమత ఓవర్ల ఫార్మాట్లో, ముఖ్యంగా టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పైగా అతను ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్‌కు గతంలో (2022, 2023) డీసీ ఆడిన అనుభవం కూడా ఉంది.పీడ వదిలిందనుకుంటున్న అభిమానులుఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో (ఎస్ఆర్హెచ్) కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది.ఈ సీజన్లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. -
ఐపీఎల్‌కు తిరిగి రానని స్పష్టం చేసిన ఆసీస్ ప్లేయర్.. ప్రత్యామ్నాయ ఆటగాడి ప్రకటన
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. మే 17 నుంచి ఐపీఎల్ తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లు తిరిగి భారత్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండరని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో డీసీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఎంపిక చేసుకుంది. ముస్తాఫిజుర్‌ను డీసీ రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది. ముస్తాఫిజుర్ ఈ సీజన్లో డీసీ అడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న డీసీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది. ఈ సీజన్లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్‌లో ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చినా ఢిల్లీకి వ్యతిరేకంగా ఉండేవి. ఈ రెంటిలో సన్‌రైజర్స్ మ్యాచ్‌కు గానూ ఢిల్లీకి ఓ పాయింట్ లభించగా.. పంజాబ్‌తో మ్యాచ్‌ను తిరిగి మొదటి నుండి ప్రారంభించనున్నారు (మే 24). పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యే సమయానికి ఢిల్లీ ధీన స్థితిలో ఉండింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్మ, ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోయారు. 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 122 పరుగులు చేసింది.పీడ వదిలిందనుకుంటున్న ఢిల్లీ అభిమానులుఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. మెక్‌గుర్క్ స్థానంలో వచ్చిన ముస్తాఫిజుర్ బౌలింగ్ విభాగంలో ఉపయోగపడగలడని డీసీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించాలంటే ఫామ్‌లోనే లేని మెక్‌గుర్క్ కంటే ముస్తాఫిజుర్ నయమవుతాడని డీసీ అభిమానులు అనుకుంటున్నారు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!.. రూ. 11.75 కోట్ల ఆటగాడు దూరం!
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.అలిసా హేలీతో కలిసిఈ క్రమంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇందులో స్టార్క్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య అలిసా హేలీతో కలిసి ఈ పేస్ బౌలర్ సిడడ్నీకి చేరుకున్నాడు. అయితే, అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు.భారత్‌కు తిరిగి వెళ్లడు!ఈ నేపథ్యంలో స్టార్క్ మేనేజర్ స్పందిస్తూ.. ఐపీఎల్-2025 పునః ప్రారంభమైనా స్టార్క్ భారత్‌కు తిరిగి వెళ్లే అవకాశం లేదని ఆస్ట్రేలియా నైన్ న్యూస్‌కు తెలిపాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్క్ సేవలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది.వారు కూడా దూరమే..!ఇక మెల్బోర్న్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ కథనం ప్రకారం.. ఒకవేళ తమ ఆటగాళ్లు తిరిగి ఇండియాకు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వారికి పూర్తి మద్దతుగా ఉండనుంది. కాగా స్టార్క్‌తో పాటు ఆసీస్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్ కూడా తిరిగి భారత్ రాకపోవచ్చు.ఫైనల్ ఆడాలిఇప్పటికే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. మే 16 నుంచి ఐపీఎల్-2025 తిరిగి మొదలైనా.. మే 30న ముగుస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, జూన్ 11 నుంచే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ ఆడాల్సి ఉంది.ఇంగ్లండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్‌కు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు వెళ్లి వచ్చి.. వెంటనే మళ్లీ ఈ మ్యాచ్‌కు సిద్ధం కావడం కాస్త కష్టంగా మారుతంది. ఈ నేపథ్యంలో కమిన్స్, హెడ్లతో పాటు స్టార్క్ కూడా స్వదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.మరోవైపు.. న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మే 25 వరకు నిరభ్యంతర పత్రాల గడువు ఉంది.. కాబట్టి ఆ తర్వాతే ఆటగాళ్లను తిరిగి రమ్మని ఆదేశించే అవకాశం ఉంది.రూ. 11.75 కోట్ల భారీ ధరకుకాగా.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్‌ను రూ. 11.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పటికి అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ తరఫున ఈ సీజన్లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మరోవైపు.. ఢిల్లీ పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కాగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి ఢిల్లీ మ్యాచ్ ఉద్రిక్తతల కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్‌కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్‌లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్‌లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 PBKS vs DC Live Updates: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దుధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఆర్య.. టి. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీపంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్య 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. క్రీజులో ఆర్యతో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్(45) ఉన్నారు.6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(42), ప్రభ్సిమ్రాన్ సింగ్(26) ఉన్నారు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 20/02 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(12), ప్రభ్సిమ్రాన్ సింగ్(3) ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరి కాసేపట్లో టాస్అభిమానులు గుడ్ న్యూస్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ 8:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 8:00 గంటలకు టాస్ పడనుంది.టాస్ మరింత ఆలస్యం..ధర్మశాలలో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికి, మైదానాన్ని మాత్రం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. -
‘అరంగేట్రం’లోనే అదుర్స్.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్ కీపర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను వదిలివేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ. 11.25 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. ఇందుకు తగ్గట్లుగానే ఈ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ ఇరగదీశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.కానీ తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ వరుసగా విఫలమయ్యాడు. ఒకానొక దశలో తుదిజట్టు నుంచి తప్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో తొలిసారిగా అతడికి యాజమాన్యం వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించింది.హెన్రిచ్ క్లాసెన్ స్థానంలోహెన్రిచ్ క్లాసెన్‌ను బ్యాటర్‌గా రంగంలోకి దింపి.. అతడి స్థానంలో ఇషాన్‌ను తమ జట్టు వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించింది. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఓపెనర్ కరుణ్ నాయర్‌ను డకౌట్ చేసిన రైజర్స్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్.. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (3) వికెట్ తీశాడు.అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ ముగ్గురూ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి దాదాపుగా ఒకే రీతిలో అవుటయ్యాడు.టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమైఆ తర్వాత జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ ఢిల్లీ స్టార్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఇషాన్ ఒడిసిపట్టాడు. తద్వారా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమై.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఇలా ఓ వికెట్ కీపర్ ప్రత్యర్థి జట్టుకు చెందిన నలుగురు టాప్ బ్యాటర్ల క్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి.ఇక ఓవరాల్‌గా ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు అందకున్న 27వ ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఇందులోని వికెట్ కీపర్ల జాబితాలో అతడిది పదమూడో స్థానం కావడం గమనార్హం.ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (10), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) కూడా నిరాశపరిచారు. అయితే ఆరు, ఎనిమిదో స్థానాల్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడింది. అవుట్‌ఫీల్డ్ మొత్తం తడిగా మారడంతో మ్యాచ్ కొనసాగే వీలు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. ఢిల్లీ ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.చదవండి: ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో? -
మతిపోయిందా?.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తప్పు: షేన్ వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ విమర్శించాడు.ప్లే ఆఫ్స్ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ తరఫున జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ వేర్వేరు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్‌తో కలిసి కరుణ్ నాయర్ (Karun Nair) ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు.బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలుఅయితే, బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. మొదటి బంతికే కరుణ్ నాయర్ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్ (3), అభిషేక్ పొరెల్ (8)లు కూడా వికెట్లను పారేసుకున్నారు. దీంతో క్యాపిటల్స్ 15 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఖాతాలోనే పడ్డాయి. క్యాచ్‌లన్నీ కీపర్ ఇషాన్ కిషన్ చేతికే అందాయి.ఇక ఢిల్లీ ఈ షాక్ నుంచి తేరుకోకముందే హర్షల్ పటేల్ మరోదెబ్బ తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (6)ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన స్లో డెలివరీని షాట్ ఆడే ప్రయత్నం చేయగా అదికాస్తా కమిన్స్ చేతికి చిక్కింది. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్యాపిటల్స్ స్కోరు 26/4. ఆ తర్వాత కూడా క్యాపిటల్స్ పరిస్థితిలో ఏమార్పు లేదు. ఇక ఢిల్లీ అండదండా కేఎల్ రాహులే అనుకునేలోపే ఈ స్టార్ మురిపెం కూడా అంతలోనే ముగిసింది.జయదేవ్ ఉనాద్కట్ తెలివైన బంతితో ఈ విలువైన వికెట్ తీసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవల దూసుకొచ్చిన బంతి రాహుల్ (10) బ్యాట్‌ను తాకుతూ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటివరకు పెవిలియన్ చేరిన ఐదుగురిలో అతనొక్కడిదే రెండంకెల స్కోరు కాగా... కనీసం మూడు పదుల స్కోరైన కాకముందే (29 పరుగులకే 5) ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది. వికెట్ల జోరులో మెరుపుల్లేని మ్యాచ్‌లో ఎట్టకేలకు పదో ఓవర్లో ఒక సిక్స్ నమోదైంది. స్పిన్నర్ జిషాన్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ భారీ సిక్సర్ బాదాడు. సగం ఓవర్లు ముగిశాక గానీ 11వ ఓవర్లో జట్టు స్కోరు కష్టంగా 50 పరుగులకు చేరింది. అశుతోశ్ వచ్చాకే... స్టబ్స్, విప్రాజ్ కుదురుకునే అవకాశాన్ని కూడా సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఇవ్వలేదు. కొద్దిసేపటికే విప్రాజ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ కాగా... అశుతోష్ రాకతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అవతలి ఎండ్‌లో ఉన్నది హిట్టర్ స్టబ్సే అయినా జోరు పెంచింది మాత్రం అశుతోష్ మొదట్లో సింగిల్స్‌తో పరుగు... పరుగు పేర్చిన ఈ జోడీ తర్వాత ధాటిని ఆడింది. జీషాన్ 15వ ఓవర్లో అశుతోష్ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. తర్వాత హర్షల్ 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. స్టబ్స్ కూడా ఫోర్లతో వేగం అందుకోగా, డెత్ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అశుతోష్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు. ఇద్దరు కలిసి ఏడో ఓవర్‌కు 66 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆడటం వల్లే ఢిల్లీ ఆలౌట్ నుంచి తప్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికప్పుడు ఏ కారణం లేకుండా.. నచ్చినట్లుగా ఓపెనింగ్ జోడీని మార్చడం సరికాదు. నిజంగా ఢిల్లీ వ్యూహం చూసి నేను ఆశ్చర్యపోయా.కరుణ్ నాయర్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు రావడం చూసి నాకు మతిపోయినంత పనైంది. ఇదొక చెత్త నిర్ణయం. ఢిల్లీ శిబిరం ఏం ఆలోచించి ఇలా చేసిందో గానీ.. ఇదైతే తప్పుడు నిర్ణయం.ఇలా చేయడం వల్ల జట్టులో ఎవరి పాత్ర ఏమిటన్నది ఆటగాళ్లకే తెలియకుండా పోతుంది. ఇలాంటి చర్యల వల్ల వాళ్లు కూడా అభద్రతాభావంలో కూరుకుపోతారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయంం పంచుకున్నాడు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం వల్ల మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఢిల్లీకి అదృష్టం కలిసి రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కావడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025 -
SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో సోమవారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) పవర్ ప్లేలో అద్భుతమే చేశాడు.ఐపీఎల్ చరిత్రలోనేఉప్పల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రమాదకర ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డుప్లెసిస్ (3)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వచ్చీరాగానే పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు.Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025 స్టబ్స్ దంచేశాడుఇక మిగతా వాళ్లలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (10) వికెట్‌ను జయదేవ్ ఉనాద్కట్ దక్కించుకోగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (6) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. విప్రాజ్ నిగమ్ అతడికి సహకరించాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ సంధించిన బంతిని ఆడిన స్టబ్స్.. విప్రాజ్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు.అయితే, మరో పరుగుకు కూడా ఆస్కారం ఉందని భావించి అందుకు ఉపక్రమించగా... విప్రాజ్ మాత్రం బ్యాటర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. ఇంతలో స్టబ్స్ అతడి వైపుగా పరుగు తీయగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ అనికేత్ వర్మ జీషన్ వైపు విసిరాడు.హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్దీంతో వేగంగా స్పందించిన జీషన్ బౌలర్ ఎండ్ నుంచి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి స్టబ్స్ బ్యాటర్ ఎండ్ వైపు వెళ్లగా.. విప్రాజ్ మాత్రం మరో ఎండ్‌కు చేరలేకపోయాడు. ఈ క్రమంలో ఎవరు పరుగు పూర్తి చేశారని థర్డ్ అంపైర్ పరిశీలించగా స్టబ్స్ విప్రాజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో విప్రాజ్ మూల్యం చెల్లించకతప్పలేదు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు.ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. విప్రాజ్ రనౌట్ కాగానే.. లేచి నిలబడిన ఆమె.. ‘‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంతేకాదు చప్పట్లతో తమ ఆటగాళ్లను అభినందించారు.Stubbs செஞ்ச Mistake-க்கு Vipraj Wicket போய்டுச்சு😫 📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | SRH vs DC | JioHotstar & Star Sports தமிழில் #IPLOnJioStar #IPL2025 #TATAIPL #SRHvDC pic.twitter.com/YUmHK0745k— Star Sports Tamil (@StarSportsTamil) May 5, 2025ఆశలు ఆవిరికానీ ఢిల్లీని నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకే పరిమితం చేశామన్న సన్‌రైజర్స్ ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే మొదలైన వాన.. ఉధృతం కావడంతో రైజర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. కమిన్స్ బృందానికి ఇంకా ఆశలు సజీవంగా ఉండేవి. ఇక ఈ మ్యాచ్‌లో స్టబ్స్ (41 నాటౌట్)తో పాటు అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41) రాణించడంతో ఢిల్లీ ఏడు వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2025 Playoffs Scenarios: లెక్క తేల్చిన వరుణుడు!.. సన్‌రైజర్స్ అవుట్.. మరి ఢిల్లీ రేసులోనే ఉందా? -
SRH Vs DC: ఎస్ఆర్హెచ్ కొంపముంచిన వరుణుడు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది. -
SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)
-
IPL 2025: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 SRH vs DC Live Updates: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది. వర్షం ఆటంకం..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అనంతరం వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకా మొదలు కాలేదు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 105/617 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అశుతోష్ శర్మ(30), స్టబ్స్(26) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్..62 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో స్టబ్స్(15), ఆశుతోష్(0) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ప్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా అక్షర్, ఐదో వికెట్‌గా కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. కమ్మిన్స్ మూడు, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఢిల్లీఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. అతడి బౌలింగ్ దాటికి ఢిల్లీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో వికెట్‌గా అభిషేక్ పోరెల్ ఔటయ్యాడు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన డుప్లెసిస్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(8), రాహుల్(3) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిలోనే భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ తుది జట్టులోకి అభినవ్ మనోహర్, సచిన్ బేబి వచ్చారు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి నటరాజన్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ -
'పెద్ది' షాట్‌ను రిక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
రామ్‌చరణ్ (Ram Charan) 'పెద్ది' సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం ఒక గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తరెకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సిగ్నేచర్ షాట్ ఒకటి బాగా వైరల్ అయింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్తగా ఆలోచించింది. రామ్ చరణ్ పెద్ది షాట్‌ను రీక్రియేట్ చేసి ఒక వీడియోను సోషల్‌మీడియాలో అభిమానుల కోసం విడుదల చేసింది. అయితే, దానిని రామ్‌చరణ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై భారీగా ప్రశంసలు అందుతున్నాయి.నేడు హైదరాబాద్ వేదికగా (SRH vs DC) మ్యాచ్ జరగనుంది. 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడిన సన్‌రైజర్స్ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న పోరు చాలా రసవత్తరంగా ఉండనుంది. ఇలాంటి సమయంలో తెలుగు వారిని మెప్పించేలా పెద్ది సినిమా సీన్‌ను రీక్రియేట్ చేస్తూ ఢిల్లీ ఒక వీడియోను విడుదల చేసింది. రామ్ చరణ్ స్టైల్లో క్రికెటర్ సమీర్ రజ్వీ సిక్సర్ కొట్టాడు. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఢిల్లీ జట్టును అభినందిస్తున్నారు. ఇలాంటి ప్లాన్ సన్‌రైజర్స్ ఎందుకు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు.బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.Bas ek hi kaam hai - fight for Dilli 🔥👊 pic.twitter.com/KwwpumhE5y— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025 -
కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్‌లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025 -
ఉప్పల్‌లో జోరుగా SRH, DC ప్లేయర్ల ప్రాక్టీస్.. పరుగుల సునామీ ఖాయం (ఫొటోలు)
-
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో ఢిల్లీ కీలక పోరు
-
సన్‌రైజర్స్‌కు ఆఖరి చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఆఖరి దశకు చేరింది. సీజన్లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఖాతాలో 3 విజయాలతో 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నాలుగూ గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లకు జట్టు చేరుకుంటుంది. దీని వల్ల ‘ప్లే ఆఫ్స్’ స్థానం ఖాయమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ.అయితే సాంకేతికంగా, ఇతర జట్ల సమీకరణాలను బట్టి ఆశలు పెట్టుకోవచ్చు. కానీ నేటి మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి మాజీ చాంపియన్ ని్రష్కమిస్తుంది. మరోవైపు ఢిల్లీ ప్రయాణం కూడా తడబడుతూ సాగుతోంది. తొలి 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి ఘనంగా ప్రారంభించిన టీమ్ ఆ తర్వాతి 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. అయితే పరిస్థితి ఇంకా చేయిదాటిపోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఢిల్లీ మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది. బ్యాటర్లు చెలరేగితేనే... గుజరాత్ చేతిలో ఓడిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలహీనత మరోసారి కనిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా అంతా విఫలమయ్యారు. మిగతా ప్రధాన బ్యాటర్లు విఫలం కావడం మాత్రమే కాదు వారి షాట్లలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకున్న హెడ్, క్లాసెన్ పేలవంగా ఆడి నిష్క్రమించగా... ఇషాన్ కిషన్ ప్రతీ పరుగు కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. టాప్–4 ఇలా ఆడితే ఏ జట్టయినా విజయాన్ని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆరంభ మ్యాచ్‌లలో కనిపించిన పట్టుదలను అనికేత్ కొనసాగించలేకపోయాడు.నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా అప్పటికే మ్యాచ్ చేయిదాటిపోయాక అతని ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది. హోం గ్రౌండ్‌లోనైనా వీరంతా తమ బ్యాటింగ్‌కు పదును పెడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. అయితే బ్యాటింగ్‌కంటే చెత్త బౌలింగ్ రైజర్స్‌ను వెనకబడేలా చేసింది. ప్రధాన బౌలర్లు మొహమ్మద్ షమీ 11.23, కెపె్టన్ ప్యాట్ కమిన్స్ 9.64, హర్షల్ పటేల్ 9.50, అన్సారీ 9.74 ఎకానమీతో బౌలింగ్ చేస్తుంటే ఏ జట్టయినా ఏమీ చేయలేదు. వీరిలో ఒక్కరి ప్రదర్శన మెరుగుకావడం లేదు. తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లోనైనా బౌలర్ల ఆటతీరు మారితే రైజర్స్ విజయంపై నమ్మకం ఉంచవచ్చు. సమష్టి ఆటపై ఆశలు... సీజన్లో జోరుగా దూసుకొచి్చన ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసులో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా కోల్‌కతాతో జరిగిన గత పోరులో మంచి విజయావకాశాలు ఉన్న స్థితి నుంచి మ్యాచ్‌ను చేజార్చుకుంది. అంతకు ముందు బెంగళూరుతో మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ విఫలమైంది. బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే కనీసం ఎనిమిదో స్థానం వరకు కూడా ధాటిగా ఆడగల రెగ్యులర్ బ్యాటర్లు కనిపిస్తున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌లలో ఈ లైనప్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తమ లోపాలను అధిగమించి మరోసారి బ్యాటర్లు చెలరేగాలని ఢిల్లీ కోరుకుంటోంది.పొరేల్ ధాటిగా ఆడుతున్న ఎక్కువసేపు నిలబడటం ముఖ్యం. డుప్లెసిస్ దూకుడు సానుకూలాంశం కాగా... కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఆరంభంలో చూపించిన ఫామ్ ఇప్పుడు కనిపించడం లేదు. వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో గాయపడిన కెపె్టన్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మారడం ముఖ్యం. లేదంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు దెబ్బ పడుతుంది. స్టబ్స్, విప్రాజ్, అశుతోష్ చివరి ఓవర్లలో చెలరేగితే క్యాపిటల్స్ పైచేయి సాధించవచ్చు. కేవలం 6.74 ఎకానమీతో 12 వికెట్లు తీసిన కుల్దీప్ బౌలింగ్‌లో జట్టు ప్రధాన అస్త్రం. స్టార్క్ వికెట్లు తీస్తున్నా పరుగులను నిలువరించడం ముఖ్యం. ముకేశ్, చమీరా, మోహిత్ ప్రభావం చూపలేకపోవడం ఢిల్లీ బౌలింగ్‌ను కాస్త బలహీనంగా మార్చింది. 13 ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు తలపడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందగా... 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టుకు విజయం దక్కింది. ఢిల్లీపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 266 పరుగులుకాగా... అత్యల్ప స్కోరు 116. హైదరాబాద్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులుకాగా... అత్యల్ప స్కోరు 80. -
ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్‌కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్‌తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్‌స్టైల్ మరియు స్పోర్ట్‌వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్‌ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్‌రేట్‌తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్‌లో జరుగనుంది. -
చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్: కేకేఆర్
ఐపీఎల్-2025లో మంగళవారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టడం వివాదస్పదమైంది. అప్పటివరకూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకూ.. కుల్దీప్ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుల్దీప్ ప్రవర్తనను చాలా మంది తప్పుబట్టారు. కుల్దీప్పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ వివాదానికి కోల్‌కతా ఫ్రాంచైజీ ఫుల్స్టాప్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్తలను కేకేఆర్ ఖండించింది. యూపీకి చెందిన వీరిద్దరూ మంచి స్నేహితులంటూ.. గతంలో కుల్దీప్, రింకూ కలిసి ఉన్న ఫోటోలను వీడియో రూపంలో కేకేఆర్ షేర్ చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ వివాదంపై స్పందించింది. కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ ఇద్దరూ హార్ట్ సింబల్స్‌తో ఫోజ్ ఇస్తున్న వారి వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోకు ‘ఓన్లీ ప్యార్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ చెంప వివాదానికి తెరపడినట్లే. కాగా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కుల్దీప్ మాత్రం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.Only pyaar 🫰🫂 pic.twitter.com/bePBy6Y54E— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2025 -
క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) రూపంలో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.కాగా 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair).. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు. విదర్భ తరఫున రంజీల్లో, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.రూ. 30 లక్షల కనీస ధరతోఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కరుణ్‌కు మద్దతు పలికారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. రూ. 30 లక్షల కనీస ధరతో కరుణ్ నాయర్ ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.ఈ క్రమంలో రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కరుణ్ నాయర్ కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 87. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ కరుణ్ విఫలమయ్యాడు.వన్‌డౌన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. లక్ష్య ఛేదనలో భాగంగా కరుణ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా పదమూడు బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కరుణ్ నాయర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది.. కానీ‘‘క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది. కానీ దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్కే మంచి ఇన్నింగ్స్ ఆడావు. రెండు, మూడు రనౌట్లలో భాగమయ్యావు.కానీ నీ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాపార్డర్‌లో అదీ వన్‌డౌన్‌లో ఆడుతున్నా బ్యాట్ ఝులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 82 మ్యాచ్‌లు ఆడి 1650 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతంలో అతడు పంజాబ్ కింగ్స్ (రూ. 5.6 కోట్లు), రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ తదితర ఫ్రాంఛైజీలకు ఆడాడు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉కోల్‌కతా స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: పద్నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (3/29).చదవండి: అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా చెన్నైని వదిలేయాలి: గిల్‌క్రిస్ట్ -
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై నిషేధం విధించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఐపీఎల్-2025 (IPL 2025)లో కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అతడు 12 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా ఫర్వాలేదనిపిస్తున్నా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.204 పరుగులుఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రహానే సేన నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగుల స్కోరు సాధించింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి వరకు పోరాడి పద్నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం ఇరుజట్ల ఆటగాళ్ల కరచాలనం చేసుకున్న తర్వాత.. కొంత మంది విడివిడిగా మాట్లాడుకున్నారు.రింకూ చెంపపై కొట్టిన కుల్దీప్ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ)- రింకూ సింగ్ (కేకేఆర్)తో సరదాగా సంభాషించాడు. ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వులు చిందించారు. కానీ అంతలోనే కుల్దీప్ రింకూ చెంపపై కొట్టాడు. దీంతో రింకూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాడు.అయితే, మరోసారి కుల్దీప్ అదే పని చేయడంతో రింకూ ముఖంలో రంగులు మారిపోయాయి. కుల్దీప్ చర్య అతడికి ఎంతమాత్రం నచ్చలేదని అతడి ఎక్స్ప్రెషన్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Yo kuldeep watch it pic.twitter.com/z2gp4PK3OY— irate lobster🦞 (@rajadityax) April 29, 2025అతడి నిబ్యాన్ చేయండిఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చొరవ ఉన్నప్పటికీ లైవ్‌లో ఉన్నప్పుడు సహచర ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని.. ఒకటీ, రెండు మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధం విధిస్తేనే దారిలోకి వస్తారంటూ బీసీసీఐని ట్యాగ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు ఇచ్చి.. వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. మరోవైపు రింకూ కేకేఆర్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కేకేఆర్👉కేకేఆర్ స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచిన కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (16 బంతుల్లో 27 రన్స్, 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్The @KKRiders pulled back things in a fitting way 🥳And it was all fueled by the brilliance of Sunil Narine 😎Scorecard ▶ https://t.co/saNudbWaXT #TATAIPL | #DCvKKR pic.twitter.com/zp5CDNEJsw— IndianPremierLeague (@IPL) April 29, 2025 -
KKR Vs DC: కీలక విజయం సాధించిన కోలకతా నైట్ రైడర్స్, మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు పూర్తిగా తెర పడిపోకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గత మూడు మ్యాచ్ లలో రెండు పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టి బ్యాటింగ్‌తో 200 పరుగుల స్కోరు దాటిన టీమ్... ఢిల్లీని వారి వేదికపై కట్టడి చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా మ్యాచ్ చేజారుతున్న దశలో నరైన్ 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు. న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్లో కీలక విజయం దక్కింది. గెలిస్తేనే నిలిచే స్థితిలో మంగళవారం బరిలోకి దిగిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్కృష్ రఘువంశీ (32 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. ఫాఫ్ డుప్లెసిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విప్రాజ్ నిగమ్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునీల్ నరైన్ (3/29) మూడు ప్రధాన వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. చమీరా ఓవర్లో సునీల్ నరైన్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా...స్టార్క్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన రహ్మనుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26; 5 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో అవుటయ్యాడు. తొలి 6 ఓవర్లలో మొత్తం 79 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో నరైన్, అజింక్య రహానే (14 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఈ స్థితిలో రఘువంశీ, రింకూ ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో కోల్‌కతా కట్టడి చేయడంలో ఢిల్లీ సఫలమైంది. 3 పరుగుల వ్యవధిలో రఘు, రింకూ వెనుదిరగ్గా... స్టార్క్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు పడ్డాయి. రాణించిన డుప్లెసిస్ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. పొరేల్ (4), కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్, అక్షర్ భాగస్వామ్యంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేగాయి. నాలుగో వికెట్‌కు డుప్లెసిస్, అక్షర్ 42 బంతుల్లోనే 76 పరుగులు జత చేశారు. 41 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ను నరైన్ అవుట్ చేయడంతో ఆట మలుపు తిరిగింది. అదే ఓవర్లో స్టబ్స్ (1) కూడా వెనుదిరగ్గా... నరైన్ తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ను కూడా వెనక్కి పంపించాడు. 10 పరుగుల వ్యవధిలో ఈ 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పొరేల్ (బి) స్టార్క్ 26; నరైన్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 27; రహానే (ఎల్బీ) (బి) అక్షర్ 26; రఘువంశీ (సి) నాయర్ (బి) చమీరా 44; వెంకటేశ్ (సి) విప్రాజ్ (బి) అక్షర్ 7; రింకూ (సి) స్టార్క్ (బి) విప్రాజ్ 36; రసెల్ (రనౌట్) 17; పావెల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 5; అనుకూల్ (సి) చమీరా (బి) స్టార్క్ 0; హర్షిత్ (నాటౌట్) 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–91, 4–113, 5–174, 6–177, 7–203, 8–203, 9–203. బౌలింగ్: స్టార్క్ 4–0–43–3, చమీరా 3–0–46–1, ముకేశ్ 2–0–17–0, విప్రాజ్ 4–0–41–2, అక్షర్ పటేల్ 4–0–27–2, కుల్దీప్ 3–0–27–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) రసెల్ (బి) అనుకూల్ 4; డుప్లెసిస్ (సి) రింకూ (బి) నరైన్ 62; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) అరోరా 15; రాహుల్ (రనౌట్) 7; అక్షర్ (సి) హర్షిత్ (బి) నరైన్ 43; స్టబ్స్ (బి) నరైన్ 1; విప్రాజ్ (బి) రసెల్ 38; అశుతోష్ (సి) నరైన్ (బి) వరుణ్ 7; స్టార్క్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 0; చమీరా (నాటౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–60, 4–136, 5–138, 6–146, 7–160, 8–160, 9–189.బౌలింగ్: అనుకూల్ రాయ్ 4–0–27–1, వైభవ్ అరోరా 2–0–19–2, హర్షిత్ రాణా 4–0–49–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–2, నరైన్ 4–0–29–3, రసెల్ 2–0–22–1. ఐపీఎల్లో నేడుచెన్నై X పంజాబ్ వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది.ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఢిల్లీకి షాక్.. ఓకే ఓవర్లో రెండు వికెట్లు14 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అక్షర్ పటేల్(43) ఔట్ కాగా.. ఆరో బంతికి స్టబ్స్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(62), విప్రజ్ నిగమ్(5) ఉన్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్..కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో ఫాఫ్ డుప్లెసిస్(32), అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 178) పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(8), కరుణ్ నాయర్(4) ఉన్నారు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్రఘువంశీ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన రఘువంశీ.. చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 142/414 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(35), రింకూ సింగ్(14) ఉన్నారు.రహానే ఔట్..కేకేఆర్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విప్రజ్నిగమ్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(27) ఔట్ కాగా.. 8 ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ రహానే(26) పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(26), రహానే(21) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన గుర్భాజ్..స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20), రహానే(0) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రమణ్‌దీప్ సింగ్ స్ధానంలో అనుకుల్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్ ), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్ -
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రాహుల్.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్.. రాహుల్ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగలరు.అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడం సహా.. వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్ ఫోర్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ సాగే కొద్ది ప్రభ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు మూడు పరాజయాలు ఎదుర్కొని రెండే విజయాలు సాధించింది. ఇందులో ఒకటి సూపర్ ఓవర్లో (రాజస్థాన్ రాయల్స్) గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 27) ఈ జట్టు సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఢిల్లీని వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 పరాజయలతో 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆ జట్టు రన్‌రేట్ 0.482గా ఉంది. గుజరాత్, ముంబై కూడా చెరో 12 పాయింట్లు కలిగినప్పటికీ వారి రన్‌రేట్ ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. ఢిల్లీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదముంది. లీగ్ ప్రారంభంలో అద్భుత విజయాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ ఇకనైనా జాగ్రత్త పడితేనే టైటిల్ వేట కొనసాగించగలదు.నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్‌కు (162) పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేక ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక్కడ క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ (4-0-33-3), హాజిల్‌వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అన్ని విభాగాల్లో సామర్థ్యం మేరకు రాణించలేక ఓటమిపాలైంది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు కారణంగా వికెట్ కాస్త కఠినంగా ఉండింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయానికి వికెట్ సులువుగా మారింది. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని ఈజీ క్యాచ్‌లను మిస్ చేశాము. ఆ క్యాచ్‌లను పట్టి ఉండాల్సింది. మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. ఓ బ్యాటర్ కొంత సమయం క్రీజ్‌లో గడిపి ఉంటే వేగంగా పరుగులు సాధించగలిగేవాడు. అదనంగా 10-15 పరుగులు వచ్చేవి. బ్యాటింగ్ ఆర్డర్లో ఓ స్థానం కిందికి రావడంపై స్పందిస్తూ.. రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని 4వ స్థానంలో పంపాము. మైదానంలో ఓ వైపు చిన్నగా ఉంది. రాహుల్‌ను ముందుగా పంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు. -
కేఎల్ రాహుల్‌పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్‌వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్‌తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్‌తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్‌కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్‌కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025 -
బెంగళూరు ప్రతీకారం
దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్... 163 పరుగులు చేసిన ఆర్సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్ ప్లేయర్’ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్ రాహుల్‌గానే సాగింది. ఈసారి ఆర్సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... అభిషేక్ పొరేల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్ నాయర్ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) వెనుదిరగ్గా... రాహుల్ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (2)లను అవుట్ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్ (12), పడిక్కల్ (0), పాటీదార్ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్లో తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించిన కృనాల్ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజల్‌వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విప్రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–3, యశ్ దయాళ్ 4–0–42–1, హాజల్‌వుడ్ 4–0–36–2, సుయాశ్ శర్మ 4–0–22–0, కృనాల్ పాండ్యా 4–0–28–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–19–2, స్టార్క్ 3–0–31–0, ముకేశ్ కుమార్ 3.3–0–51–0, విప్రాజ్ 1–0–12–0, కుల్దీప్ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X గుజరాత్ వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025 DC vs RCB: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..
IPL 2025 RCB vs DC Live Updates: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి(51) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి.విజయం దిశగా ఆర్సీబీ..16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(49), కృనాల్ పాండ్యా(56) ఉన్నారు.తిరిగి పుంజుకున్న ఆర్సీబీ..ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ తిరిగి పుంజుకుంది. విరాట్ కోహ్లి(28), కృనాల్ పాండ్యా(17) ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.అక్షర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్(12), పడిక్కల్(0) ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(8), పాటిదార్(1) ఉన్నారు.రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్నమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), స్టబ్స్(3) ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన డుప్లెసిస్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(26), అక్షర్ పటేల్(15) ఉన్నారు.9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 69/29 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(21), కేఎల్ రాహుల్(14) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..45 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కరుణ్ నాయర్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన పోరెల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(28), ఫాఫ్ డుప్లెసిస్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ -
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
RCB Vs DC: కోహ్లి X రాహుల్
న్యూఢిల్లీ: భారత ప్రధాన బ్యాటర్లు... ఆ్రస్టేలియా ప్రధాన పేసర్ల మధ్య పోరులా అభివర్ణిస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో రాయల్ చెలంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఈ రెండు జట్లు... తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెపె్టన్లు కాకపోయినా... బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లి మోస్తుండగా... ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేఎల్ రాహుల్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్... ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఇది నా అడ్డా’ అన్న తరహాలో సంబరాలు జరుపుకొని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లి ఆదివారం తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెప్తాడా చూడాలి. ఢిల్లీ స్టేడియంలో విరాట్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లాడిన కోహ్లి అందులో 5 అర్ధ శతకాలు సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్‌లో ఉండగా... బెంగళూరు తరఫున హాజల్‌వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే! డుప్లెసిస్ రాకతో... ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఈ సీజన్లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలో ముందుకు సాగుతున్న క్యాపిటల్స్... 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ మంచి ఫామ్‌లో ఉండగా... కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.స్టార్క్‌తో కలిసి ముకేశ్ కుమార్ పేస్ భారం పంచుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. జోరు సాగేనా..! అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆడుతున్న తొలి ఐపీఎల్లో విరాట్ దంచికొడుతున్నాడు. బరిలోకి దిగితే చివరి వరకు నిలవాలనే కసితో ముందుకు సాగుతున్నాడు. 65.33 సగటుతో అతడు పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు అదే కొనసాగించాలనుకుంటోంది. కోహ్లితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మంచి టచ్‌లో ఉండగా... మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కీలకం కానున్నారు. టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్ల బాధ్యతలు మోస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ సీజన్లో 16 వికెట్లు తీసిన హాజల్‌వుడ్‌పై భారీ అంచనాలున్నాయి. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పొరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. -
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి దూసుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కారణంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించడంతో ఆర్సీబీతో మ్యాచ్‌లో డుప్లెసిస్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ ధ్రువీకరించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండనున్నాడు. నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని మెక్‌గర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్‌లో డుప్లెసిస్ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతడు తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్ -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
ఢిల్లీ మళ్లీ...
దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఆడని రాహుల్... ఈసారి హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు. లక్నో: తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ల శుభారంభం... తొలి వికెట్‌కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్‌ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్ చక్కటి బంతితో పూరన్ (9)ను బౌల్డ్ చేశాడు. అనంతరం ముకేశ్ ఒకే ఓవర్లో సమద్ (2), మార్ష్ లను అవుట్ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్ (14 నాటౌట్), బదోని తర్వాత ఇన్నింగ్స్‌లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్ పంత్ (0) బ్యాటింగ్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్ సమస్యేమీ లేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం... శార్దుల్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్ నాయర్ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్ మూడో వికెట్‌కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టబ్స్ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్ 45; పూరన్ (బి) స్టార్క్ 9; సమద్ (సి) అండ్ (బి) ముకేశ్ 2; మిల్లర్ (నాటౌట్) 14; బదోని (బి) ముకేశ్ 36; పంత్ (బి) ముకేశ్ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్: అక్షర్ 4–0–29–0, స్టార్క్ 4–0–25–1, ముకేశ్ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్రాజ్ 1–0–14–0, కుల్దీప్ 4–0–33–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 51; కరుణ్ నాయర్ (బి) మార్క్రమ్ 15; రాహుల్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–28–0, దిగ్వేశ్ రాఠీ 4–0–24–0, ప్రిన్స్ 2.5–0–23–0, మార్క్రమ్ 3–0–30–2, అవేశ్ ఖాన్ 3–0–19–0, రవి బిష్ణోయ్ 3–0–36–0. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ xముంబై వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 130 ఇన్నింగ్స్‌లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. -
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మార్క్రమ్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు. -
IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్(51) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్‌లో పోరెల్ ఔటయ్యాడు. ఢిల్లీ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(40), అక్షర్ పటేల్(17) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ160 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(50), రాహుల్(28) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/1నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నోఎక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు లక్నో స్కోర్: 130/414వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో తొలి బంతికి అబ్దుల్ సమద్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి మిచెల్ మార్ష్(45) క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిల్లర్(11), బదోని(10) పరుగులతో ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పూరన్.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన దుష్మాంత చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.మార్క్రమ్ ఫిప్టీ..లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(32), మార్క్రమ్(50) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో.. మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో మర్క్రమ్(13), మిచెల్ మార్ష్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సెకెండ్ రౌండ్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మోహిత్ శర్మ స్దానంలో దుష్మాంత చమీరా తుది జట్టులో వచ్చాడు. లక్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్‌ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్‌తో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో లక్నో రాజస్థాన్ రాయల్స్‌ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్‌ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా -
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్‌ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు.ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.పాపం బట్లర్ఈ మ్యాచ్‌లో బట్లర్‌కు సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా 97 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరమైన తరుణంలో బట్లర్ 96 పరుగుల వద్ద ఉన్నాడు. ఎంత పని చేశావయ్యా తెవాతియా..?అయితే 19వ ఓవర్‌ను ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌల్ చేయడంతో ఆ ఓవర్లో బట్లర్ సెంచరీ కోసం రిస్క్ చేయలేకపోయాడు. చివరి ఓవర్లో అయినా మూడంకెల స్కోర్‌ను అందుకుందామా అంటే తెవాతియా అతనికి అడ్డుపడ్డాడు. జట్టు గెలుపుకు 10 పరుగులు అవసరమైన తరుణంలో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో బట్లర్ చేసేదేమీ లేక జట్టు గెలుపును ఆస్వాదించాడు.విరాట్ రికార్డు సమమయ్యేదిఈ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ పూర్తి చేసి ఉంటే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేసేవాడు. విరాట్ ఐపీఎల్లో 8 సెంచరీలు చేయగా.. బట్లర్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. విరాట్ రికార్డును సమం చేసేందుకు బట్లర్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. తెవాతియా కారణంగా బట్లర్ చరిత్రలోనే నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌లో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగానే గుజరాత్ గెలిచింది. సెంచరీ పూర్తి చేసుంటే అతని టాలెంట్‌కు తగ్గ గుర్తింపు దక్కేది.


