లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు | IPL 2026 Match 5: Lucknow super giants vs Delhi capitals Updates | Sakshi
Sakshi News home page

లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు

Apr 1 2026 7:01 PM | Updated on Apr 1 2026 11:05 PM

IPL 2026 Match 5: Lucknow super giants vs Delhi capitals Updates

లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్‌పై సమీర్‌ రిజ్వి (70 నాటౌట్‌) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. 

అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (39 నాటౌట్‌) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్‌ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. 

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్‌
4.3వ ఓవర్‌- ప్రిన్స్‌ యాదవ్‌ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్‌ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్‌ పటేల్‌ను (0) కూడా పెవిలియన్‌కు పంపాడు. 

మూడో వికెట్‌ డౌన్‌
4.2వ ఓవర్‌-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
3.3వ ఓవర్‌- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది.మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రాణా (15) ఔటయ్యాడు.

తొలి బంతికే వికెట్‌ తీసిన షమీ
142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్‌ తీశాడు. 

చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో
టాస​్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్‌ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-31-2), అక్షర్‌ పటేల్‌ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) పర్వాలేదనిపించారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన లక్నో
13.1వ ఓవర్‌- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్‌ కోల్పోయింది. ముకుల్‌ ఛౌదరిని (14) కుల్దీప్‌ యాదవ్‌ క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు.

పీకల్లోతు కష్టాల్లో లక్నో
9.3వ ఓవర్‌- టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ట్రస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (35) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన లక్నో.. పూరన్‌ (8) ఔట్‌
8.5వ ఓవర్‌- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో పూరన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్‌
6.3వ ఓవర్‌- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. నటరాజన్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ బదోని డకౌటయ్యాడు.

రెండో వికెట్‌ డౌన్‌.. మార్క్రమ్‌ (11) ఔట్‌
5.5వ ఓవర్‌- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో.. పంత్‌ (7) ఔట్‌
2.6వ ఓవర్‌- ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్‌ మిచెల్‌ మార్ష్‌ కొట్టిన బంతి బౌలర్‌ చేతికి తాకి నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్‌ ఔటయ్యాడు.

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..

లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీ

ఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ సబ్‌లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement