ముంబైను చిత్తు చేసిన ఢిల్లీ
అరుణ్ జైట్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అతడితో పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది.
రిజ్వీ ఔట్
సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు.
సెంచరీకి చేరువలో సమీర్
👉సమీర్ రిజ్వీ దుమ్ములేపుతున్నాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.
సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీ
సమీర్ రిజ్వీ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి సత్తాచాటాడు. కేవలం 31 బంతుల్లోనే తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 58 పరుగులతో సమీర్ క్రీజ్‌లో ఉన్నాడు.
నిస్సాంక ఔట్
👉నిస్సాంక(44) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.
దూకుడుగా ఆడుతున్న నిస్సాంక
9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాథుమ్ నిస్సాంక(43) దూకుడుగా ఆడుతుండగా.. సమీర్ రిజ్వీ(19) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ విజయానికి 66 బంతుల్లో 97 పరుగులు కావాలి.
ఢిల్లీ రెండో వికెట్ డౌన్
7 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
కేఎల్ రాహుల్ ఔట్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. ముంబై స్కోరెంతంటే?
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది.
ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్, నటరాజన్, లుంగి ఎంగిడి, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ ధీర్(28) రాణించాడు. తిలక్ వర్మ(0),ర్యాన్ రికెల్టన్(9), రూథర్ ఫర్డ్(5) విఫలమయ్యారు.
👉ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన నమన్ ధీర్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐదో వికెట్ డౌన్
15.3: లుంగి ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51). ముంబై స్కోరు: 122-5(15.3). నమన్ ధిర్ 18 పరుగులతో ఉన్నాడు. సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.
ముంబై నాలుగో వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 92-4
రోహిత్ ఔట్
71 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ వచ్చాడు.
👉9 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), రోహిత్ శర్మ(34) ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
2.5: రికెల్టన్‌ను అవుట్ చేసిన ముకేశ్ కుమార్ తిలక్ వర్మ (2 బంతుల్లో 0)ను డకౌట్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి రాగా.. రోహిత్ 9 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 22-2(3)
తొలి వికెట్ డౌన్
2.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11 బంతుల్లో 9). ముంబై స్కోరు: 18-1(2.4). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నాడు.
హార్దిక్ పాండ్యాకు అనారోగ్యం
ఢిల్లీతో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై మొత్తంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కార్బిన్ బాష్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చారు. ట్రెంట్ బౌల్ట్, ఘజన్‌ఫర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఢిల్లీ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్
చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు


