ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్క‌డ వ‌ర‌ల్డ్ రికార్డు | Mustafizur Rahman Creates World Record In Pakistan super league | Sakshi
Sakshi News home page

PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్క‌డ వ‌ర‌ల్డ్ రికార్డు

Apr 4 2026 1:55 PM | Updated on Apr 4 2026 3:19 PM

Mustafizur Rahman Creates World Record In Pakistan super league

ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ముస్తాఫిజుర్ త‌న‌  అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్నాడు. శుక్ర‌వారం ముల్తాన్ సుల్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్..  షాన్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్ వంటి కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి త‌న జ‌ట్టుకు విజయాన్ని అందించాడు.  

తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు టీ20 క్రికెట్‌ (లీగ్‌, అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు)లో 416 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌(415) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అమీర్‌ను ముస్తాఫిజుర్ అధిగ‌మించాడు.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్‌ పేసర్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ - 416  బంగ్లాదేశ్ 
మహమ్మద్ అమీర్ -415  పాకిస్థాన్ 
వహాబ్ రియాజ్- 413 పాకిస్థాన్
సోహైల్ తన్వీర్-389 పాకిస్థాన్
డేవిడ్ విల్లీ -ఇంగ్లాండ్

అయితే వాస్త‌వానికి ముస్తాఫిజుర్ ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ర‌పున ఆడాల్సి ఉండేది. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ రాజకీయ ఉద్రిక్త‌ల కార‌ణంగా అత‌డిని ఐపీఎల్ నుంచి బీసీసీఐ త‌ప్పించింది. దీంతో అత‌డు పీఎస్ఎల్‌లో ఆడేందుకు లాహోర్ ఖలందర్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కేకేఆర్ ముస్తాఫిజుర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. అత‌డి స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన జింబాబ్వే బౌల‌ర్ ముజుర్‌బానీ వికెట్లు ప‌డ‌గొడ‌తున్న‌ప్ప‌టికి, భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్నాడు. మ‌రోవైపు హ‌ర్షిత్ రాణా, ప‌తిరానా కూడా అందుబాటులో లేరు. కీలక బౌలర్లు లేకపోవడంతో కేకేఆర్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొన‌సాగుతోంది.
చదవండి: IPL 2026: ఓటమి బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్‌ న్యూస్‌
 

Advertisement
 
Advertisement
Advertisement