ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన కేకేఆర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది.
ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు పడగొట్టినప్పటికి, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అతడితో పాటు వైభవ్ ఆరోరా, కార్తీక్ త్యాగి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. కేకేఆర్ బౌలింగ్ ఎటాక్‌లో యువపేసర్ హర్షిత్ రాణా లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. రాణా స్ధానంలో జట్టులోకి వచ్చిన నవ్‌దీప్‌సైనీకి ఇప్పటివరకు ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.
అయితే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్ న్యూస్. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా త్వరలోనే కేకేఆర్‌తో జట్టుతో చేరే అవకాశముంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.18 కోట్ల భారీ ధరకు పతిరానాను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే టీ20 వరల్డ్‌కప్-2026 సమయంలో గాయపడిన పతిరానా.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
దీంతో అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అతడికి మరో వారం రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించే అవకాశముంది. ఇందులో అతడు పాసైతే ఐపీఎల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయినట్లే.
ప్రాక్టీస్ మొదలు పెట్టిన పతిరానా..
కాగా పతిరానా కూడా నెట్స్‌లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. త్వరలోనే వచ్చేస్తున్నా అనే క్యాప్షన్‌తో తన ప్రాక్టీస్ వీడియాను పతిరానా షేర్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన వీడియో కేకేఆర్ శిబిరంలో ఆశలు ఆశలు చిగురింపజేసింది. అయితే అతడు ఇంకా పూర్తి వేగంతో బౌలింగ్ మాత్రం చేయడం లేదు. ఏప్రిల్ మూడో వారంలో అతడు జట్టుతో చేరే ఛాన్స్ ఉంది.
చదవండి: తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు


