తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు | srh ipl draft telangana players ignored kavya maran | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు

Apr 4 2026 9:11 AM | Updated on Apr 4 2026 11:36 AM

srh ipl draft telangana players ignored kavya maran

సాక్షి,  హైదరాబాద్‌: దేశవాళీ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్‌ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్‌ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతినిధి నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు.  ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. 

ఆరోన్‌ జార్జ్, అమన్‌రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్‌ఆర్‌హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్‌ఆర్‌హెచ్‌ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు.  ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్‌ ప్రశాంత్, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement