
PC: BCCI/IPL.com
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు డుప్లెసిస్ సైతం ఊహించని షాకిచ్చాడు.
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డుప్లెసిస్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయిన డుప్లెసిస్ తిరిగి భారత్‌కు వచ్చేందుకు తిరష్కరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో తమ కథనంలో పేర్కొంది.
డుప్లెసిస్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో డుప్లెసిస్ గాయం కారణంగా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మిగితా ఆరు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే డుప్లెసిస్ గత కొన్ని మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరపున ఆడినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్ సాధించకపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫాఫ్ సౌతాఫ్రికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరో సౌతాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెర్రీరా సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యాండ్ ఇచ్చాడు. అతడు కూడా తిరిగి ఐపీఎల్‌లో పాల్గోనేందుకు రావడం లేదని ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వీరిద్దరి కంటే ముందు మిచెల్ స్టార్క్, జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ సైతం ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగారు.
ముగ్గురే ముగ్గురు..
దీంతో ప్రస్తుతం ఢిల్లీ జట్టులో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. ట్రిస్టన్ స్టబ్స్, శ్రీలంక పేసర్ దుష్మంత చమీర, బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విదేశీ ప్లేయర్లగా ఉన్నారు. ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి.. అతడికి ఇంకా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ మంజారు చేయలేదు. దీంతో అతడు ఇంకా ఢిల్లీ జట్టుతో చేరలేదు.
ప్రస్తుతం బంగ్లా క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.
చదవండి: IND vs ENG: 'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్'