ఆర్సీబీతో మ్యాచ్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు గుడ్ న్యూస్‌ | IPL 2025: Huge Boost For Delhi Capitals, Faf du Plessis Fit And All Set To Play Against RCB, See More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు గుడ్ న్యూస్‌

Apr 26 2025 9:13 PM | Updated on Apr 27 2025 4:06 PM

IPL 2025: Huge boost for Delhi Capitals, Faf du Plessis Fit

ఐపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానానికి దూసుకు వెళ్లాల‌ని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ గుడ్ న్యూస్ అందింది. 

ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్, ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కార‌ణంగా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించ‌డంతో ఆర్సీబీతో మ్యాచ్‌లో డుప్లెసిస్ ఆడ‌నున్నాడు.

ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జాక్ ఫ్రెజ‌ర్ మెక్‌గ‌ర్క్ ధ్రువీక‌రించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండ‌నున్నాడు. నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ని మెక్‌గ‌ర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. శ‌నివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్‌లో డుప్లెసిస్ తీవ్రంగా శ్ర‌మించాడు. దీంతో అత‌డు తిరిగి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశముంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌(అంచ‌నా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్,  కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement