ఐపీఎల్ 2026 నుంచి అకారణంగా తప్పుకొని చిక్కుల్లో పడిన ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్, తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి కోర్టు భారీ జరిమానా విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టులో స్టోక్ సమీపంలోని A50 రహదారిపై డకెట్ 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. స్టాఫోర్డ్‌షైర్ పోలీసులు స్పీడ్ గన్‌తో దాన్ని గుర్తించారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టుకు వెళ్లింది.
కానాక్ మేజిస్ట్రేట్స్ కోర్డులో డకెట్ నేరాన్ని అంగీకరించడంతో 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్ విధించారు. మొత్తం ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,100 పౌండ్లకు చేరింది.
కొత్తేమీ కాదు..!
డకెట్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. 2017లో యాషెస్ సిరీస్‌లో సహచరుడు జేమ్స్ ఆండర్సన్ పట్ల దురుసగా ప్రవర్తించి జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవలి యాషెస్ సిరీస్ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేశాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సి ఉంది. ఈ సీజన్ వేలంలో ఆ ఫ్రాంచైజీ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరి నిమిషంలో కౌంటీలు, జాతీయ జట్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ నియమాల ప్రకారం, చివరి నిమిషంలో తప్పుకున్న ఆటగాళ్లకు 2–3 సంవత్సరాల నిషేధం విధించే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్ కాంట్రాక్ట్ డబ్బును కూడా కోల్పోతారు.
మరోవైపు ఢిల్లీ ఇంకా డకెట్‌కి ప్రత్యామ్నాయం ప్రకటించలేదు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ డకెట్ స్థానంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఏప్రిల్ 1న ఎల్‌ఎస్‌జీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.


