ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌! | IPL 2026 Huge Hardik Pandya Setback Forces MI Make 3 Changes vs DC | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!.. తుదిజట్టులో మూడు మార్పులు

Apr 4 2026 3:16 PM | Updated on Apr 4 2026 4:00 PM

IPL 2026 Huge Hardik Pandya Setback Forces MI Make 3 Changes vs DC

ముంబై ఇండియన్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్‌-2026 సీజన్‌లో శనివారం తొలి డబుల్‌ హెడర్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌- ముంబై ఇండియన్స్‌.. సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టాస్‌ సమయంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌ మైదానంలోకి వచ్చాడు. దీంతో హార్దిక్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసింది.

ఈ విషయం గురించి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. స్వల్ప అనారోగ్యం కారణంగా హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోయాడని తెలిపాడు. అదే విధంగా... తమ తుదిజట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. హార్దిక్‌ పాండ్యా స్థానంలో దీపక్‌ చహర్‌ వచ్చినట్లు సూర్య తెలిపాడు.

ఇక ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో దీపక్‌ చహర్‌, అల్లా ఘజన్‌ఫర్‌ స్థానంలో మిచెల్‌ సాంట్నర్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడుతున్నట్లు సూర్య వెల్లడించాడు. మరోవైపు.. తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ తుదిజట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌
కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, నితీశ్‌ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్‌ యాదవ్, టి. నటరాజన్, ముకేశ్‌ కుమార్.

ముంబై ఇండియన్స్‌
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్‌ప్రీత్‌ బుమ్రా.

చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’

Advertisement
 
Advertisement
Advertisement