ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన ప్రకటన.. వేటు తప్పదు! | Blow For DC England Star Pulls Out Of IPL 2026 Set To Face Big Punishment | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన ప్రకటన.. వేటు తప్పదు!

Mar 24 2026 8:26 PM | Updated on Mar 24 2026 8:59 PM

Blow For DC England Star Pulls Out Of IPL 2026 Set To Face Big Punishment

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.

రూ. 2 కోట్లు
కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్‌ ఆప్షన్‌గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి డకెట్‌ ఓపెనింగ్‌ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ నెత్తిన పిడుగు
అయితే, తాజాగా బెన్‌ డకెట్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.

క్షమించండి
అందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.

ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్‌ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్‌ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.

నా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే అంకితం
నా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సమ్మర్‌ షెడ్యూల్‌ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

కాగా డకెట్‌ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్‌లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. 

రెండేళ్ల నిషేధం
అలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్‌ ప్లేయర్‌ డకెట్‌ ఈ జాబితాలో చేరనున్నాడు.

కాగా డకెట్‌ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. 

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్‌ షెడ్యూల్‌లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్‌ ఇటీవల పేర్కొన్నాడు.

చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం
ఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement