డకెట్‌ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పందన! | Delhi Capitals 1st Reaction After Ben Duckket Opting Out IPL 2026 | Sakshi
Sakshi News home page

డకెట్‌ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పందన!

Mar 25 2026 1:10 PM | Updated on Mar 25 2026 2:46 PM

Delhi Capitals 1st Reaction After Ben Duckket Opting Out IPL 2026

ఇంగ్లండ్ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ ఐపీఎల్‌ 2026 సీజన్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బెన్‌ డకెట్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ డకెట్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. 

అయితే టెస్టు కెరీర్‌పై దృష్టి సారించ‌డంతో పాటు కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపేందుకు ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు డకెట్‌ పేర్కొన్నాడు. తాజాగా డకెట్‌ వైదొలగడంపై  ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం బుధవారం తొలిసారి స్పందించింది. 

‘బెడ్‌ డకెట్‌ తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని మాకు ముందే చెప్పాడు.  బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. డకెట్ స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే పేర్కొంటాం.’ అని చెప్పుకొచ్చింది.  అయితే డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఎందుకంటే లీగ్ నిబంధనల ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్‌నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డ‌కెట్ విష‌యంలో ఫిట్‌నెస్‌, గాయం లాంటి అంశాలు లేవు. టెస్టు కెరీర్‌పై ఫోక‌స్ పెట్ట‌డంతో పాటు ఫ్యామిలీతో స‌మ‌యం గ‌డ‌పాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నాడు.  

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్ జ‌ట్టుతో పాటే ఉన్న‌ప్ప‌టికీ డ‌కెట్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌ని డ‌కెట్ అది ముగిసిన త‌ర్వాత అక్క‌డి నుంచి నేరుగా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అంత‌క‌ముందు ఆస్ట్రేలియాతో జ‌రిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

ఐదు టెస్టులు క‌లిపి కేవ‌లం 202 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న బెన్ డ‌కెట్ తాజాగా ఐపీఎల్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు  పేర్కొన్నాడు. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డంతో టెస్టులపై దృష్టి సారించేందుకు​ డకెట్‌ కౌంటీల్లో నాటింగ్‌హ‌మ్‌షైర్ త‌ర‌ఫున మ్యాచ్‌లు ఆడ‌నున్నాడు.

చదవండి: కివీస్‌ కెప్టెన్‌ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement