
రామ్‌చరణ్ (Ram Charan) 'పెద్ది' సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం ఒక గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తరెకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సిగ్నేచర్ షాట్ ఒకటి బాగా వైరల్ అయింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్తగా ఆలోచించింది. రామ్ చరణ్ పెద్ది షాట్‌ను రీక్రియేట్ చేసి ఒక వీడియోను సోషల్‌మీడియాలో అభిమానుల కోసం విడుదల చేసింది. అయితే, దానిని రామ్‌చరణ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై భారీగా ప్రశంసలు అందుతున్నాయి.
నేడు హైదరాబాద్ వేదికగా (SRH vs DC) మ్యాచ్ జరగనుంది. 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడిన సన్‌రైజర్స్ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న పోరు చాలా రసవత్తరంగా ఉండనుంది. ఇలాంటి సమయంలో తెలుగు వారిని మెప్పించేలా పెద్ది సినిమా సీన్‌ను రీక్రియేట్ చేస్తూ ఢిల్లీ ఒక వీడియోను విడుదల చేసింది. రామ్ చరణ్ స‍్టైల్లో క్రికెటర్ సమీర్ రజ్వీ సిక్సర్ కొట్టాడు. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఢిల్లీ జట్టును అభినందిస్తున్నారు. ఇలాంటి ప్లాన్ సన్‌రైజర్స్ ఎందుకు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.
Bas ek hi kaam hai - fight for Dilli 🔥👊 pic.twitter.com/KwwpumhE5y
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025