అత‌డిని వ‌దిలి సీఎస్‌కే త‌ప్పు చేసిందా? | Fans Troll CSK Releasing Sameer-Rizvi Shine For-Delhi Capitals IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అత‌డిని వ‌దిలి సీఎస్‌కే త‌ప్పు చేసిందా?

Apr 5 2026 12:21 PM | Updated on Apr 5 2026 1:46 PM

Fans Troll CSK Releasing Sameer-Rizvi Shine For-Delhi Capitals IPL 2026

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌మీర్ రిజ్వీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను గెలిపించ‌డ‌మే గాక రెండుసార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌ను ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో ఆడింది. 

ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీల‌క ఇన్నింగ్స్ ఆడి ల‌క్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌పై అదే త‌ర‌హాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన స‌మీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 ప‌రుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి స‌మీర్ రిజ్వీ క్రీజులోకి వ‌చ్చే స‌మ‌యానికి ఢిల్లీ 24 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉంది. 

ఈ స‌మ‌యంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు క‌లిపి 160 ప‌రుగులు చేసిన స‌మీర్ రిజ్వీ ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజ‌న్‌కు ముందు స‌మీర్ రిజ్వీని చెన్నై సూప‌ర్‌కింగ్స్ రూ.8.40 కోట్ల‌కు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో రిజ్వీకి ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. 

అయితే 2025 సీజ‌న్‌కు ముందు రిజ్వీని విడుద‌ల చేయ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిజ్వీని కేవ‌లం రూ. 95 ల‌క్ష‌ల‌కే ద‌క్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్‌కే అభిమానులు ఆ జ‌ట్టు యాజ‌మాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. 

‘చెన్నై జ‌ట్టులో ఉన్న‌ప్పుడు అవ‌కాశాలు ఇవ్వ‌లేదు.. ఇప్పుడేమో ఢిల్లీ త‌ర‌ఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్ల‌గొడుతున్నాడు’.. ‘స‌మీర్ రిజ్వీని వ‌దిలేసి సీఎస్‌కే దిద్దుకోలేని త‌ప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌ లోనూ 27 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను స‌మీర్ రిజ్వీ త‌న విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో గెలిపించ‌డం విశేషం.

చదవండి: కార్ల్‌సన్‌ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement