చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌: కేకేఆర్‌ | Delhi Capitals Breaks Silence As Kuldeep Yadav Rinku Singh Slap Row | Sakshi
Sakshi News home page

చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌: కేకేఆర్‌

Apr 30 2025 6:35 PM | Updated on Apr 30 2025 7:34 PM

Delhi Capitals Breaks Silence As Kuldeep Yadav Rinku Singh Slap Row

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో మంగ‌ళ‌వారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంత‌రం ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ స్టార్ బ్యాట‌ర్ రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్ట‌డం వివాద‌స్ప‌ద‌మైంది. 

అప్పటివరకూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకూ.. కుల్దీప్ చ‌ర్య‌తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో కుల్దీప్ ప్ర‌వ‌ర్త‌నను చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. కుల్దీప్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ వివాదానికి కోల్‌క‌తా ఫ్రాంచైజీ ఫుల్‌స్టాప్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్త‌ల‌ను కేకేఆర్ ఖండించింది. యూపీకి చెందిన వీరిద్ద‌రూ మంచి స్నేహితులంటూ.. గ‌తంలో కుల్దీప్‌, రింకూ క‌లిసి ఉన్న ఫోటోల‌ను వీడియో రూపంలో కేకేఆర్ షేర్ చేసింది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ వివాదంపై స్పందించింది. 

కుల్‌దీప్‌ యాదవ్‌, రింకు సింగ్‌ ఇద్దరూ హార్ట్‌ సింబల్స్‌తో ఫోజ్‌ ఇస్తున్న వారి వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోకు ‘ఓన్లీ ప్యార్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఈ చెంప‌ వివాదానికి తెర‌ప‌డిన‌ట్లే. కాగా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 36 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. కుల్దీప్ మాత్రం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement