SRH Vs DC: ఎస్ఆర్‌హెచ్ కొంప‌ముంచిన వ‌రుణుడు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్‌ | Rain Saves Delhi Capitals, Hyderabad Knocked Out Of Playoff Race, Read Story For More Details | Sakshi
Sakshi News home page

IPL 2025 SRH Vs DC: ఎస్ఆర్‌హెచ్ కొంప‌ముంచిన వ‌రుణుడు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్‌

May 5 2025 11:27 PM | Updated on May 6 2025 12:05 PM

Rain savesDelhi capitals, Hyderabad knocked out of playoff race

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ఎస్ఆర్‌హెచ్ మ‌ధ్య జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి స‌న్‌రైజ‌ర్స్ నిష్క్రమించింది. 

ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ రైజ‌ర్స్ బౌల‌ర్లు దాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 133 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం ఖాయ‌మ‌ని అంతా భావించారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వ‌రుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

 ఢిల్లీ బ్యాటింగ్ అనంత‌రం భారీ వ‌ర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంట‌కుపైగా స‌మ‌యం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పించాయి. దీంతో అంపైర్‌లు మ్యాచ్ ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్లకు చెరో పాయింట్ ల‌భించింది. 

13 పాయింట్ల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌న్న హైద‌రాబాద్ ఆశ‌లు మాత్రం ఆడియాశ‌లు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం మూడింట మాత్ర‌మే విజ‌యం సాధించి ఇంటిముఖం ప‌ట్టింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement