చమిందా వాస్ (PC: DC/SLC)
ఐపీఎల్-2027 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సిబ్బందిలో కీలక నియామకాలు చేపట్టింది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హెడ్‌కోచ్‌గా నియమించిన యాజమాన్యం.. అతడి అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేసింది.
ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం
తాజాగా మరో నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం చమిందా వాస్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. వినూత్నమైన వీడియోతో చమిందా వాస్ ఎంపికను ధ్రువీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
కాగా 52 ఏళ్ల చమిందా వాస్.. శ్రీలంక తరఫున 1994- 2009 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా 322 వన్డేలు, 162 టెస్టులు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్.. వన్డేల్లో 400, టెస్టుల్లో 355, టీ20లలో ఆరు వికెట్లు కూల్చాడు. వన్డే ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులోనూ అతడు సభ్యుడు.
కోచ్‌గానూ అనుభవం
ఇక గతంలో శ్రీలంక పురుషుల జట్టు కోచ్‌గా వ్యవహరించిన చమిందా వాస్.. న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లకు కన్సల్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాదు వివిధ లీగ్‌లలోనూ కోచ్‌గా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. మరోవైపు.. భారత బౌలర్ అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఢిల్లీ శిబిరంలో చేరే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2027 ఆరంభానికి ముందే ఢిల్లీ యాజమాన్యం ఆటగాళ్ల విషయంలోనూ ఓ కీలక మార్పు చేసింది. తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ చేసుకుని.. అతడికి బదులు కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ఇచ్చేసింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఢిల్లీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: Kavya Maran - Anirudh Marriage: ఏజ్ గ్యాప్, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?
One legendary C.V. 📝🔥 Welcoming our Fast Bowling Coach Chaminda Vaas to Dilli 💙❤️ https://t.co/m5Qrg1EXJ4
— Delhi Capitals (@DelhiCapitals) October 17, 2026


