Family
-
హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.సమయోచిత వేష భాషలుఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకంనేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. వినయగుణ సంపన్నుడుసముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.సమర్థుడైన కార్యసాధకుడుఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. సంభాషణా చతురుడులంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. – డి.వి.ఆర్. -
అందమైన సమాజం!!
హైదరాబాద్‌లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
గ్లోబల్ నర్సింగ్ స్టార్స్
చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’కి చెందిన సుఖ్‌పాల్ కౌర్, అహ్మదాబాద్‌లోని ‘హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్’కి చెందిన విభా సలాలియా 199 దేశాలలోని లక్ష మంది అభ్యర్థుల నుంచి గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ తుది జాబితాకు ఎంపికయ్యారు.నర్సింగ్ గత సంవత్సరాలలో ఎలా మారిందో, గ్లోబల్ నర్సింగ్ స్టాండర్స్‌తో సమానంగా ఉండడానికి మన దేశంలో ఏం చేయవచ్చో... మొదలైన అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది.చాలా మార్పులుపంజాబ్లోని గురుదాస్‌పూర్‌లో పుట్టిన సుఖ్‌పాల్ కౌర్‌కు సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను నర్సింగ్‌లో చేరేలా చేసింది. ‘ఇతరులకు సహాయపడాలనే నా తత్వానికి నేను ఎంచుకున్న వృత్తి బాగా సరిపోయింది’ అంటారు కౌర్. ప్రస్తుతం ఆమె ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్’కి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఆమె బీఎస్సీ, మాస్టర్స్, నర్సింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు.నిజానికి ఆమె ఈ ఇన్స్టిట్యూట్లో క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరారు. క్రమంగా లెక్చరర్, అసోసియేట్ప్రొఫెసర్ అయ్యారు. ప్రిన్సిపల్ కావడానికి ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ప్రమోట్ అయ్యారు. ‘నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం’ అంటున్నారు 58 సంవత్సరాల కౌర్.తలకు గాయాలు అయిన పేషెంట్ల కోసం నర్స్‌ల ఆధ్వర్యంలో క్లినిక్స్నుప్రారంభించారు కౌర్. మన దేశంలో మొట్టమొదటి ఎంఎస్సీ నర్సింగ్ప్రోగ్రామ్ ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్‌ను లీడ్ చేస్తున్నారు కౌర్. ‘మేము మొదట్లో మాన్యువల్‌గా చెక్ చేసేవాళ్లం. ఇప్పుడు ముఖ్య లక్షణాలు నేరుగా చూపించే మానిటర్స్ వచ్చాయి. ఇది టైమ్‌ను సేవ్ చేస్తుంది. ఇక చదువుకు సంబంధించి చాక్, బ్లాక్‌బోర్డ్ నుండి మల్టీమీడియా క్లాస్‌రూమ్‌లు, ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లకు మారాయి. ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అవుతారు’ అంటున్నారు కౌర్.బాల్య జ్ఞాపకమే బాట చూపింది...మెంటల్ హెల్త్ కేర్ని మార్చడానికి తన కెరీర్‌ను అంకితం చేశారు యాభై ఆరు సంవత్సరాల విభా సలాలియా. 33 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని గుజరాత్‌లోని మెంటల్ హెల్త్ కేర్ని మెరుగుపరచడంలో ఉపయోగించారు. మానసిక అనారోగ్యం బారినపడిన వేలాదిమందికి అండగా ఉన్నారు. వారు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు.‘మెంటల్ హెల్త్ కేర్’పై విభా ఆసక్తి చూపడానికి కారణం... బాల్య జ్ఞాపకం.‘మా ఇంటి బయట ఒక మహిళ చింపిరి జుట్టుతో, శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా కూర్చొని ఉండడం నాకు గుర్తుంది. ఊరివాళ్లు ఆమెను అవమానించి పిచ్చిది అని పిలిచేవాళ్లు. ఆమెకు సహాయం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండి బాధపడేదాన్ని’ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు విభా సలాలియ.ఈ జ్ఞాపకమే తనను మెంటల్ హెల్త్ నర్సింగ్‌లో స్పెషలైజ్ చేయడానికి కారణం అయింది. నిజానికి విభా రెగ్యులర్ బీఎస్సీలో చేరారు. అయితే తన బంధువు ఒకరు అడ్మిట్ అయిన హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు నర్సింగ్‌ని ప్రొఫెషనల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.‘మా బంధువును నర్స్‌లు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ దృశ్యాలు చూసిన తరవాత ఎలాగైనా నర్సింగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. బీఎస్సీ కోర్సు వదిలేసి అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్లో నర్సింగ్ లో చేరాను’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు విభా.నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం.– కౌర్ -
స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి
మైనారిటీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్‌ప్రైజ్ మంగళవారం ప్రకటించారు. 50 వేల పౌండ్లు బహుమతి. కర్నాటక రాష్ట్రంలో సామాజిక కార్యకర్తగా, అడ్వకేట్‌గా, రచయిత్రిగా గుర్తింపు పొంది నేడు తొలిసారి దక్షిణాది భాషకు బుకర్ ప్రైజ్ తెచ్చి పెట్టిన బాను ముష్టాక్ పరిచయం.‘మీరు రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘ప్రజలు’ అని సమాధానం చెప్తారు బాను ముష్టాక్. ‘వారిలోని మంచి, చెడు, టక్కరితనం, నిస్సహాయత, ఓర్పు, ప్రతి మనిషికీ ఉండే కథ... ఇవే నన్ను రచయిత్రిని చేశాయి’ అంటారామె.75 ఏళ్ల బాను ముష్టాక్ భారతీయ సాహిత్యం, అందునా దక్షిణాది సాహిత్యం, ప్రత్యేకం కన్నడ సాహిత్యం గర్వపడేలా ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025’ను మంగళవారం రాత్రి గెలుచుకున్నారు. ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ అయిన ఆమె 12 కథల పుస్తకం ‘హార్ట్ ల్యాంప్’ ఈ ప్రతిష్టాత్మక బహుమతి గెలుచుకుంది. దక్షిణాది భాషలకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. జర్నలిస్టుగా, అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన బాను ముష్టాక్ 1990 నుంచి ముస్లిం స్త్రీల జీవన గాథలను కథనం చేస్తూ వచ్చారు. ఆమె రాసిన మొత్తం 50 కథల నుంచి 12 కథలు ఎంచి దీపా బస్తీ అనువాదం చేయగా ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌కు చెందిన ‘అండ్ అదర్ స్టోరీస్’ అనే చిన్న పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.బాను ముష్టాక్ ఎవరు?బాను ముష్టాక్ కర్ణాటక రాష్ట్రం హాసన్‌లో జన్మించారు. తండ్రి సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్. ఆమెను చిన్నప్పుడు ఉర్దూ స్కూల్లో వేయగా, అక్కడి వాతావరణం సరిపడక ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గలోని కన్నడ స్కూల్లో చేరారు. ఆరు నెలల్లో కన్నడ నేర్చుకుంటేనే స్కూల్లో ఉంచుతాం లేకుంటే పంపించేస్తాం అనంటే కొద్ది రోజుల్లోనే కన్నడ భాషను నేర్చుకుని ఆశ్చర్యపరిచారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఆమెను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతికి పంపించారు. ‘నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న తన పిల్లలు డబుల్ డిగ్రీలు చేయాలని పట్టుదలగా ఉండేవాడు’ అంటుంది బాను ముష్టాక్.ఆది నుంచి సవాళ్లేబాను ముష్టాక్‌కు ముందునుంచి తిరగబడే స్వభావం ఉంది. మగపిల్లలతో కలిసి సైకిల్ నేర్చుకుంటున్న ఆమెను ముస్లిం పెద్దలు ఆపి ఇలా సైకిల్ తొక్కకూడదని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే కాలంలో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 1974లో కట్నం ప్రస్తావన లేకుండా ఆమె పెళ్లి జరిగింది. అయితే వాచ్ రిపేరర్ అయిన భర్తకు సరైన సంపాదన లేకపోవడం, అత్తింటివారి నుంచి ఇబ్బందులు, ఉమ్మడి సంసారం కలిగిన ఇంటిలో వారితో కలిసి ఉండటం.. ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించే సమయంలో భర్త ఆపారు. చివరకు ఆమె షరతులకు భర్త ఒప్పుకోవడంతో ఆత్మహత్య, విడాకుల ఆలోచనలు మానుకున్నారు. అప్పటినుంచి ఆమెకు కాస్త స్వేచ్ఛ లభించింది.పత్రికా రచయితగా‘ముస్లిం మహిళలు సినిమాలు చూడటం నేరమా?’ అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక ‘లంకేశ్ పత్రికె’లో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. దాంతో అదే పత్రికలో రిపోర్టరుగా చేరారు. అనంతరం కొన్ని నెలలపాటు బెంగళూరు ఆలిండియా రేడియోలో పని చేశారు. 1978లో తండ్రి ప్రోద్బలంతో మీద ఆమె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థినిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తు ‘కుట్టు మిషన్’. తండ్రితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకు నచ్చలేదు. ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఆమె ఓడిపోయారు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, ఆ తర్వాత రెండుసార్లు హాసన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. బాను ముస్తాక్ రచయితగానే కాక, సామాజిక కార్యకర్తగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరికీ సమానహక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడారు. తొలుత దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం ఆ తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో మొత్తం జిల్లాలో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఆమే.ముస్లింల కథలు‘నేను రాసే వరకు ముస్లింల జీవితం అంతగా కన్నడలో రాలేదు. హిందూ రచయితల కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్ అండ్ వైట్‌గా ఉండేవి. బండాయ సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారు రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలెట్టాను’ అంటారు బాను ముష్టాక్. ఆమె ఇప్పటికి ఆరు కథాసంపుటాలు, ఒక నవల, ఒక వ్యాససంపుటి, కవిత్వ సంపుటి ప్రచురించారు. బాను ముస్తాక్ రాసిన ‘కరి నాగరగళు’ అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి 2005లో ‘హసీనా’ అనే కన్నడ చిత్రం తీశారు. అందులో నటి తార ప్రధాన పాత్ర పోషించారు. అందులోని నటనకుగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. బాను ముస్తాక్ కన్నడతోపాటు హిందీ, దక్కనీ ఉర్దూ, ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ, పంజాబీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇస్లాం ప్రకారం స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం ఉందని, కేవలం మగవారే వారిని ఆపుతున్నారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆమెను, ఆమె కుటుంబాన్ని మూడు నెలలపాటు సామాజికంగా బహిష్కరించారు. కర్ణాటకలో ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్ వేసుకునే హక్కు కోసం పోరాడిన సమయంలో బాను ముస్తాక్ వారికి మద్దతుగా నిలిచారు. 1990లో లా చదివిన బాను ముస్తాక్, లాయర్‌గా స్త్రీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వేలాది కేసులపై ఆమె వాదించారు. బాను ముష్టాక్‌కు బుకర్ప్రైజ్సీనియర్ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్ (75)కు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ను 2025 సంవత్సరానికి గాను ప్రకటించారు. మంగళవారం రాత్రి లండన్‌లో జరిగిన బహుమతి ప్రదాన వేడుకలో ఆమె రాసిన ‘హార్ట్ ల్యాంప్’ అనే కథా సంపుటికి ఈ బహుమతి దక్కింది. కన్నడంలో ఆమె రాసిన కథల నుంచి ఎంచిన 12 కథలను దీపా బస్తీ ఇంగ్లిషులో అనువాదం చేయగా ఈ బహుమతి దక్కింది. 50 వేల పౌండ్లు (57 లక్షల రూపాయలు) నగదు అందించారు. ఈ మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు చెరిసగం పంచుకోవాలి. బ్రిటిష్ రచయిత మేక్స్ పోర్టర్ న్యాయ నిర్ణేతల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ‘హార్ట్ ల్యాంప్లోని కథలు ఇంగ్లిష్ పాఠకులకు కొత్త ప్రపంచాన్ని చూపుతాయి’ అని ఆయన అన్నారు. 12 దేశాలకు చెందిన 13 మంది రచయితలు ఈ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో ఎంపిక కాగా ఆ తర్వాత ఆరుమంది రచయితలతో షార్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. బాను ముష్టాక్ పుస్తకం షార్ట్ లిస్ట్‌లో రావడమే ఘనత అనుకుంటే ఏకంగా బహుమతిని గెలవడంతో భారతీయ సాహిత్యాభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ‘ఇది కన్నడ భాషకు దక్కిన గౌరవం’ అని కొనియాడారు. అలాగే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు అభినందనలు తెలిపారు. భాను ముష్టాక్ స్వస్థలం హాసన్. ఆమె రచయితగానే గాక అడ్వకేట్‌గా, సామాజిక కార్యకర్తగా కూడా కృషి చేస్తున్నారు. కాగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కు అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఇంగ్లాండ్‌లో ప్రచురితం అయి ఉండాలి. 2022లో గీతాంజలి శ్రీ రాసిన ‘రేత్ కీ సమాధి’ ఇంగ్లిష్‌లో ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా అనువాదమై బుకర్‌ప్రైజ్ గెలుచుకోవడం పాఠకులకు విదితమే. -
హృదయ విదారక ఘటన: పాపం నడిరోడ్డుపై ఓ తల్లి ఆక్రందన..
ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకైనా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటనల ఆంధ్రప్రదేశ్ కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్‌గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్‌స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్‌గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్‌లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.స్మార్ట్‌గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు. అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్‌ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్లు, జ్యూస్‌లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు. ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు. ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్‌గా కొబ్బరిబోండాల వ్యాపారి) -
అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : యూఎస్ ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్!
సీనియర్ సిటిజనులను పట్టిపీడిస్తున్న అల్జీమర్స్ (Alzheimer )వ్యాధి నిర్ధారణలో కీలకమైన పురోగతి ఊరటగా నిలుస్తోంది. ఈ వ్యాధిని సహాయపడటానికి రక్తాన్ని పరీక్షించే పరికరం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రక్తపరీక్షను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించింది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే తొలి ఇన్ విట్రో డయాగ్నస్టిక్ పరికరం కావడం విశేషం. ఈ ఏడాది జూన్నుంచి అమెరికాలో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త మెడికల్ టెస్ట్‌కు అమెరికాలోని ఎఫ్‌డీఏ గతవారమే ఆమోదముద్ర వేసింది. తద్వారా పెట్ స్కాన్లు వెన్నెముక ద్రవ విశ్లేషణలు లేకుండానే ఈ పరీక్ష ద్వారా30 నిమిషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు.అల్జీమర్స్ ముందస్తు గుర్తింపు, సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. "అల్జీమర్స్ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుందని, రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండింటి బాధితుకల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని FDA కమిషనర్ మార్టిన్ ఎ మకారీ ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 10 శాతం మందికి అల్జీమర్స్ ఉందని ,2050 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కొత్త వైద్య ఉత్పత్తులు రోగులకు సహాయ పడతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ చర్య రోగులకు ఈ వినాశకరమైన నాడీ సంబంధిత వ్యాధి పురోగతిని నెమ్మదింపజేసేలా, ముందుగానే చికిత్స ప్రారంభించడంలో ఇది సహాయ పడుతుంది. అలాగే ఖరీదైన, ఇన్వాసివ్ PET ఇమేజింగ్ లేదా కటి పంక్చర్ (lumbar punctures)ల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.పరీక్ష ఎలా పనిచేస్తుందిఫుజిరేబియో డయాగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసిన లూమిపల్స్ రక్త పరీక్ష రక్తంలోని రెండు ప్రోటీన్ల నిష్పత్తిని కొలుస్తుంది. అమిలాయిడ్ 1-42 β-అమిలాయిడ్ 1-40 - ఈ రెండింటి నిష్పత్తి మెదడులోని అమిలాయిడ్ ఫలకాలతో పరస్పర సంబంధం కలిగి ఉంది.ప్రస్తుత రోగనిర్ధారణ పద్ధతులతో పోలిస్తే అల్జీమర్స్ రక్త పరీక్ష చాలా వరకు ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 499 మంది రోగులతో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో, ఈ పరీక్ష అధిక రోగనిర్ధారణ విశ్వసనీయతను ప్రదర్శించిందిసానుకూల ఫలితాలు వచ్చిన వారిలో 91.7 శాతం మందికి PET స్కాన్లు లేదా స్పైనల్ టాప్స్ లేకుండా అల్జీమర్స్-సంబంధిత ఫలకాలు నిర్ధారించినారు. ప్రతికూల ఫలితాలు వచ్చిన వారిలో 97.3 శాతం మందికి ఎటువంటి ఫలకాలు (plaques) లేవు. జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం వంటి అభిజ్ఞా క్షీణత లాంటి ప్రారంభ సంకేతాలను చూపిస్తున్న 55 ఏళ్లు ,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం ఈ పరీక్ష ఉద్దేశించబడింది. అమెరికాలోని సర్టిఫైడ్ ప్రయోగశాలలలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుందని ఫుజిరెబియో నిర్ధారించింది. ఇది నేరుగా రోగులకు అందుబాటులో ఉండదు. వైద్యుడి సిఫారసు అవసరం. అయితే ఇది భారతదేశంలో లేదా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పరీక్ష ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, US డేటా ఆధారంగా ఇతర దేశాలలో నియంత్రణ ఆమోదాలు అనుసరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..!
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో లండన్‌లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్‌లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు. అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!. View this post on Instagram A post shared by UB1UB2: Southall, West London (@ub1ub2) (చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..) -
పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..! -
ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..
ఇప్పడంతా ఆన్లైన్ పుణ్యామా అని డోర్డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం, షాపింగ్, కిరాణ సరుకులు వరకు అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవడం..నేరుగా ఇంటికే డెలివరీ అవ్వడం టకటక జరిగిపోతోంది. చెప్పాంలటే..పెద్దపెద్ద బడా కంపెనీలన్నీ ఇంటివద్దకే వచ్చి సేవలందించే బాటలోకి వచ్చేశాయి. ఆ కోవలోకి టైలరింగ్ వంటి సేవలు కూడా వస్తే..ఇక పని మరింత సులవు కదూ..!. అలాంటి వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి..హాయిగా జీవనం సాగిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆంద్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన 58 ఏళ్ల దర్జీ ఎస్.కె. కలీషా. అతడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?. ఈ ఆలోచనతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా అంటే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో నివాసం ఉండే ఎస్.కె. కలీషా తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించారు. అలాగే అక్కడ గ్రామస్థులు కూడా కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అయితే కాలం మారి రెడీమేడ్ ట్రెండ్ కావడం, యువత ఆ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో కలిషాకి బతుకుదెరువు భారంగా మారింది. ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా తనకు తెలిసిన ఈ వృత్తి ద్వారానే అధిక ఆధాయం ఆర్జించాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యారు కలిషా. అలా పుట్టుకొచ్చింది ఇంటివద్దకే టైలరింగ్ సేవలందించాలనే ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం తోపాటు కొన్ని సంస్థలు ఈ తరహాలో లాభాలను ఆర్జిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆ పంథాలోకే తన వృత్తిని పట్టాలెక్కించారు కలీషా. ఇక తాను కూడా ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలనుకున్నారు. అందుకు నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుంది. కానీ అదికొనే స్థోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్‌ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీంతో అతని ఆదాయం కూడా పెరిగింది, కుటుంబ పోషణ కూడా హాయిగా సాగిపోయింది. అయితే రానురాను ఆ రిక్షా తొక్కుకుంటూ వెళ్లడం కష్టమైపోవడంతో..కుటుంబ సన్నిహితులు, స్నేహితుల సాయంతో టీవీఎస్ కస్టమ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి, దానికి మొబైల్ టైలరింగ్ దుకాణంగా సవరించి సేవలందించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు నేరుగా కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారట. అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, ఆదాయం నేరుగా జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. ప్రస్తుతం ఆయన పెనమలూరు, పోరంకి, వనకూరు ప్రాంతాల వరకే తన టైలరింగ్ సేవలు పరిమితం చేశానని అన్నారు. ఎందుకంటే ఈ వయసులో ఈ ప్రాంతాలను దాటి వెళ్లడం తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. చివరగా ఆయన.. ఎవ్వరూ కూడా తాము చేపట్టిన వృత్తిని ఆదరించడం లేదని ఆందోళన చెందకూడదని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే.. సత్ఫలితాలు వస్తాయని యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు కలేషా. అదే బాటలో మరో జంట..తిరువనంతపురంకు చెందిన అనిష్ ఉన్నికృష్ణన్ గాయత్రి కృష్ణ దంపతులు తమ "సీవ్ ఆన్ వీల్జ్" అనే వెంచర్‌తో మొబైల్ టైలరింగ్ సేవలందిస్తున్నారు. ఆ దంపతులు దీన్ని టెంపో ట్రావెలర్ సాయంతో నిర్వహిస్తున్నారు. వాళ్లు పెళ్లికూతురు దుస్తుల నుంచి అల్టరేషన్ వరకు అన్ని రకాల సేవలందిస్తారు. సాధారణంగా టైలర్లు ఆల్టరేషన్ పనులు చేపట్టడానికి ఇష్టపడరు , అయితే ఈ దంపతులు ఆల్టరేషన్ పనే ప్రధానంగా.. సేవలందించి కస్టమర్ల మన్ననలను అందుకుంటున్నారు.ఇదంతా చూస్తుంటే ముందు ముందు..ఇంటి వద్ద టైలరింగ్ సేవలు పొందొచ్చన్నమాట. అటు వారికి ఆదాయం, మనకు సమయం ఆదా అవ్వడమేగాక, నచ్చిన విధానంగా కుట్టించుకునే వెసులబాటు దొరుకుతుందన్న మాట. అంతేగాదు పరిస్థితులు సవాలుగా మారినప్పుడూ.. అవకాశాలను దొరకబుచ్చుకోవటం అంటే ఈ కలీషా, ఉన్ని కృష్ణన్ దంపతుల సక్సెస్‌ని చూస్తుంటో తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
మధిర: మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్ -
ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్
అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో (Cannes Film Fesitval 2025) అరంగేట్రం చేసింది. డెబ్యూలోనే తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. డిజైనర్ డ్రెస్, ముత్యాల దండలు, చక్కటి మేలిముసుగుతో తళుక్కున మెరిసింది. దీంతో 2025 కాన్స్‌లో భారతీయ అందగత్తెలు -ఉత్తమ లుక్ టైటిల్ జాన్వీకి ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్.బాలీవుడ్లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరైన జాన్వీ కపూర్, తన అందమైన లుక్స్ ,నటనా నైపుణ్యాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లష్ పింక్ త్రీ-పీస్ ఎథ్నిక్ డ్రెస్‌లో తనదైన స్టైల్లో అరంగేట్రం చేసింది.జాన్వీ రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా జాన్వీతోపాటు, నీరజ్ ఘయ్వాన్, ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్ , విశాల్ జెత్వా కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు.ఘూంఘాట్లో జాన్వీ కపూర్ కాన్స్ అరంగేట్రం జాన్వీ లుక్‌ను ఆమె కజిన్ , సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేశారు. తరుణ్ తహ్లియాని ప్రత్యేకంగా రూపొందించినగౌనులో జాన్వీ కపూర్ మెరిసింది. 2022లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ధరించిన ఫ్రాక్ అలా అనిపించినా, భిన్నమైన లుక్‌లో ఉంది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, సావ్లీన్ మంచాంద జాన్వి లుక్ కు 90ల నాటి శ్రీ దేవి గ్లామ్ ను జోడించింది,లేత గులాబీ రంగులో , కార్సెట్ బాడీస్ బాటమ్, పొడవాటి ట్రాతో కూడిన స్కర్ట్‌ను ఆమె ఎంచుకుంది. దీనికి అందమైన ఘూంఘాట్ మరో హైలైట్‌గా నిలిచింది. దాన్ని తలపై కప్పుకుని మహారాణిలా జాన్వీ అడుగులు వేయడం స్పెషల్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)డిజైనర్ డ్రెస్‌తో పాటు ముత్యాల ఆభరణాలు ఆమె లుక్‌కి మరింత హుందాతనాన్నిచ్చాయి. జాన్వీ నెక్లెస్‌ల స్టాక్‌తో సహా ముత్యాల నగలు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహంలేదు. చోపార్డ్ హౌస్‌కు చెందిన డైమండ్ పొదిగిన బ్రూచ్, డైమండ్ డ్రాప్ స్టైల్ పెండెంట్, లారియట్ స్టైల్ నెక్లెస్, ఒక సిగ్నేచర్ మల్టీ లేయర్డ్ నెక్లెస్‌తో షో స్టార్ గా నిలిచింది. దీనికి జతగా ప్లవర్ డిజైన్ డైమండ్ చెవిపోగులు, చక్కటి మేకప్ హెయిర్‌డోతో, ఆమె తన లుక్‌ను ఎలివేట్ చేసింది. -
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!) -
కాన్స్‌లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్‌పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్‌ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్యారిస్‌లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్‌తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్‌ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్‌తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్‌పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్‌గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు. -
'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..) -
అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్ చైన్ బ్రాండ్ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్ పేరిట నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్ అండర్–19 క్రికెటర్ కూడా అయిన సందీప్ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. ఈ కలెక్షన్లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్‌కేక్ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. (చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?) -
Ashtavakra అష్టావక్ర సందేశం
మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు. అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్ సెంటర్ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.– రాచమడుగు శ్రీనివాసులు -
చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!
పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్‌గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్‌ను స్పీడ్గాచేయగలరా? అసలు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా?పిల్లలూ.. పజిల్స్ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్‌లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.సుడోకు: ఇది జపాన్ దేశంలో పుట్టిన పజిల్. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.జిగ్సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన పజిల్ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్సా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి. ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.లెక్కల పజిల్స్: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం. (చదవండి: పాడ్‌కాస్ట్ చేద్దామా?) -
Sagubadi : పర్పుల్ వింగ్డ్ బీన్స్
చిక్కుడు పంటలో బోలెడంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. దక్షిణ ఆసియాలోని రైతులు, వినియోగదారులకు ఈ పర్పుల్ వింగ్డ్ బీన్ (Purple Winged Beans) తెలుసు. దీనితో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని, వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారికి గమనిక ఉంది. మొక్క 3–4 మీటర్లు (9.8–13.1 అడుగులు) ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు.. అన్నీ తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నాటిన మూడు నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి. పర్పుల్ బీన్ పువ్వులను సలాడ్‌గా తినొచ్చు. లేత ఆకులను కోసి పాకూర మాదిరిగానే ఆకు కూరగా తయారు చేసుకోవచ్చు. వేర్లను పచ్చివి లేదా దుంపల్లా కాల్చుకొని తినొచ్చు. గింజలను సోయా బీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రొటీన్ ఉంటుంది. ఆకులు, పూలలో 10–15% ప్రొటీన్ ఉంటుంది. వింగ్డ్ బీన్స్ పంటకు చీడపీడల బెడద లేదని, ఒక్కసారి నాటితే మళ్లీ మళ్లీ దానంతట అదే పెరుగుతూ ఉంటుందని కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణప్రసాద్ చెబుతున్నారు.చిక్కుడు పంటలో బోలñ డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. -
'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!
రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు. కెఫిన్ లేని టీ ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ టీ సొమెలియర్గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్‌ను అందిస్తోంది. ‘టీ వ్యాపారం గురించి ప్రొఫెషనల్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్‌ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్‌ను ప్రారంభించాను. వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. దీంతో దృష్టిని ఈ–కామర్స్ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్‌కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్ గ్రీన్ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్ ఉండదు. – స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్ఇమ్యూనిటీలు‘చాయ్ డైరీస్’ పేరుతో తన లైఫ్ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్ కేఫ్‌ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్ లేకుండా చాయ్ డైరీస్ ప్రారంభించాను. కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబడి సహకారమూ లేదు. అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైమ్‌లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్ బాంబే మసాలా టీ లోపాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్టెయిల్, ఐస్డ్ టీ వంటివి సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా ఉపయోగించవచ్చు.’– అమీ భన్సాలీ, చాయ్ డైరీస్ తయారీలో సమయం తెలియదుతండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్ వాసి అనామికా సింగ్. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్‌ని సృష్టించాను. ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం. పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్ నీడిల్, ఫైన్‌వుడ్ స్మోక్డ్ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’– అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీకచ్చితమైన సమయపాలనలండన్లో ఒక గ్లోబల్ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు. ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్‌రేట్‌ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్ ప్రకారం ప్రతి కస్టమర్‌కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది.– మయూర రావు, ఆసమ్ టీ (చదవండి: -
ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..
నేను పోలాండ్ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు. తనకోసం ఇక్కడ వీసా దరఖాస్తు చేస్తుండగా ఇటలీలో పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్ భారతదేశంలో కూడా చెల్లుతుంది అని భారతదేశ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా కోర్టు ఆర్డరు ఏవైనా ఉంటే తేవాలి అని సూచించారు. మేము ఇంకా భారతదేశ పౌరులమే కాబట్టి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అని చె΄్పారు. మా పెళ్లి భారత దేశంలో చెల్లుతుందా? లేక అక్కడికి వచ్చి ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలా? సరైన సలహా ఇవ్వగలరు.– భరద్వాజ్, పోలాండ్ విదేశాలలో ఉంటున్న భారతీయులు పెళ్లి చేసుకుంటే (లేదా పెళ్లి చేసుకోబోతున్న వారిలో కనీసం ఒకరు భారతీయులు అయి ఉంటే) ఆ వివాహం భారతదేశంలో కూడా ‘ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం చట్టబద్ధమే. అయితే మీరు అదే విధమైన పెళ్లి భారతదేశంలో చేసుకుని ఉంటే ఆ పెళ్లికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకు (1) మీకు ఇదివరకే పెళ్లి అయ్యి మీ భార్య/భర్త జీవిస్తూ (విడాకులు లేకుండా) ఉండకూడదు.(2) మీరు ఉంటున్న దేశంలో కూడా మీ పెళ్లి చట్టబద్ధమైనది అయి ఉండాలి (3) మీరు పెళ్లి చేసుకున్న దేశంలోని అధికారులు మీ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అపాస్టిల్ చేయాలి. ఇటలీ దేశం కూడా భారతదేశంతోపాటు హేగ్ కన్వెన్షన్ ఒప్పందం లో సంతకం చేసింది కాబట్టి, మీ వీసా దరఖాస్తుకు – భారత దేశంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా అపాస్టిల్ చేసిన ఆ దేశ వివాహ ధ్రువీకరణ పత్రం చట్టబద్ధమైనదే!అలాంటి వివాహాలను రిజిస్టర్ చేయడానికి మీరు పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి ఇండియన్ ఎంబసీ లో కూడా వివాహాలను రిజిస్టర్ చేయడానికి ఒక ఆఫీసర్ ఉంటారు. ఇటలీలో మీరు పొందిన సర్టిఫికెట్ తీసుకొని ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అవసరమైన అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోండి. మీ దంపతులు – సాక్షులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం మీకు సరిపోతుంది. (శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయండి) (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
పోటీలో మేటీలు
రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు.కెఫిన్ లేని టీ ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ టీ సొమెలియర్గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్‌ను అందిస్తోంది. ‘టీ వ్యాపారం గురించిప్రోఫెషనల్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్‌ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్‌ను ప్రారంభించాను.వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. దీంతో దృష్టిని ఈ–కామర్స్ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్‌కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్ గ్రీన్ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్ ఉండదు. – స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్ఇమ్యూనిటీలు‘చాయ్ డైరీస్’ పేరుతో తన లైఫ్ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్ కేఫ్‌ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్ లేకుండా చాయ్ డైరీస్ ప్రారంభించాను.కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబyì సహకారమూ లేదు. అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైమ్‌లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్ బాంబే మసాలా టీ లో పాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్టెయిల్, ఐస్డ్ టీ వంటివి సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా ఉపయోగించవచ్చు.’ – అమీ భన్సాలీ, చాయ్ డైరీస్తయారీలో సమయం తెలియదుతండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్ వాసి అనామికా సింగ్. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్‌ని సృష్టించాను. ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం.పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్ నీడిల్, ఫైన్‌వుడ్ స్మోక్డ్ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’ – అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీకచ్చితమైన సమయపాలనలండన్లో ఒక గ్లోబల్ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు. ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్‌రేట్‌ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్ ప్రకారం ప్రతి కస్టమర్‌కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది. – మయూర రావు, ఆసమ్ టీ -
ఉగ్రవాదంపై ఉక్కుపాదాలై...
నేడు యాంటీ–టెర్రరిజం డేఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదానికి... ఆమె ధైర్యం... ఉక్కుపాదం. ఆమె సాహసం... రక్తం రుచి మరిగిన నరరూప రాక్షలసుల పాలిట వజ్రాయుధం. ఉగ్రవాదం పీచమణచడంలో వివిధ స్థాయులలో, విభాగాలలో ఎంతోమంది మహిళా సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నారు...‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యంలోని ఉమెన్ ఆఫీసర్లు మేల్ ఆఫీసర్లతో సరిసాటిగా కాల్పులు, మిస్సైల్ ప్రయోగాలలో తమ సత్తా చాటారు. శత్రువులకు దడ పుట్టించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న సిగ్నల్స్ రెజిమెంట్‌కి చెందిన ఒక మహిళా అధికారి (పేరు వెల్లడి చేయలేదు) తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె, ఆమె టీమ్ గ్రౌండ్‌లోనే కాకుండా ఎయిర్‌లో కూడా కమ్యూనికేషన్స్‌ని హ్యాండిల్ చేశారు.‘ఏ యుద్ధంలో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. నేను ఈ ఆపరేషన్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. మా టాస్క్‌లన్నీ అంకితభావంతో పూర్తి చేశాం. గ్రౌండ్ మీద లేదా ఎయిర్‌లో కాన్ఫ్లిక్ట్ని వీడియో గ్రాఫ్ చేయడంలో కమ్యూనికేషన్‌కి సంబంధించిన అన్ని అంశాలనీ చూసుకున్నాం’ అన్నారు. ‘విధి నిర్వహణలో పురుష అధికారులకు, మహిళ ఆఫీసర్లకూ తేడా ఉంటుందా?’ అనే ప్రశ్నకు... ‘ఫ్రంట్లైన్లో స్త్రీలు, పురుషులకు ఒకేరకమైన విధి నిర్వహణ ఉంటుంది. అందరినీ ఒకేరకంగా చూస్తారు. మహిళలుగా మేము ప్రత్యేక సౌకర్యాలని కోరుకోలేదు. ఎందుకంటే మేము దేశం కోసం యుద్ధం చేస్తున్నాం’ అంటారు ఉమన్ ఆఫీసర్.ఆమె భర్త ఆర్మీలో సిగ్నల్స్ ఆఫీసర్‌గా పనిచేసేవారు ‘ఆపరేషన్ రైనో’ సమయంలో ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. ఉల్ఫా ఉగ్రవాదుల ఏరివేతకు అస్సాం–అరుణాచల్‌ద్రేశ్ సరిహద్దులలోని దట్టమైన అడవుల్లో ‘ఆపరేషన్ రైనో’ మెరుపుదాడిలా మొదలైంది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉగ్రవాదులతో పోరాడడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏ మూల నుంచి అయినా మృత్యువు పొంచి ఉండవచ్చు. ‘ఆపరేషన్ రైనో’కి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఉమన్ ఆఫీసర్ మది నిండా ఉన్నాయి. అయితే ఏ జ్ఞాపకమూ ఆమెను వెనక్కి లాగలేదు. ‘సాధారణ జీవితమే మేలు’ అనుకునేలా చేయలేదు.భర్తకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం... యుద్ధరంగంలో ముందడుగు వేయడానికి అవసరమై శక్తిని ఇచ్చాయి. ‘భారత సైన్యంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబుగా ‘నా భర్త ఇండియన్ ఆర్మీలో సిగ్నల్స్ కార్ప్‌లో పనిచేసేవారు. నా భర్త చేసిన త్యాగమే నన్ను ఆర్మీలో చేరేలా చేసింది’ అని చెప్పారు. ఆర్మీలో చేరాలనే ఆకాంక్ష ఆమెతోనే ఆగిపోలేదు. ఆమె కొడుకు కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కనిపించరు. దేశం కనిపిస్తుంది... అలాంటి అరుదైన ఒక కుటుంబ ఈ ఉమెన్ ఆఫీసర్‌ది.ఆల్–ఉమెన్ కమాండో టీమ్కొత్త సెక్యూరిటీ బ్లూప్రింట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)లో తొలిసారిగా ఆల్–ఉమెన్ కమాండో టీమ్ ప్రారంభించారు. 36 మంది ఉమెన్ కమాండోలతో ఈ టీమ్ మొదలైంది. విధానసభ, రాజ్ భవన్, క్రికెట్ స్టేడియం, ముఖ్యమంత్రి నివాసంలాంటి ప్రాంతాల రక్షణకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అన్ని రకాల ఆయుధాలను హ్యాండిల్ చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయెల్ అన్ఆర్మ్డ్ కంబాట్ టెక్నిక్‌లో కూడా తర్ఫీదు ఇచ్చారు. ఆల్–ఉమెన్ కమాండో టీమ్‌కు ఎంపికైన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన బులంద్‌షహర్‌కు చెందిన చంచల్ తెవోటియా యాంటి–టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో అత్యంత పిన్న వయస్కురాలు. తక్కువగా మాట్లాడే ఈ అమ్మాయి మాక్ డ్రిల్‌లో సత్తా చాటింది. గరుడ–యాంటీ టెర్రర్ ఫోర్స్‘గరుడ’ అనేది కర్ణాటక రాష్ట్ర యాంటీ–టెర్రర్ ఫోర్స్. ఈ స్పెషల్ ఆపరేషనల్ టీమ్‌లో కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదహారుమంది యువతులు ఉన్నారు. వీరికి ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో, ఆయుధాలు చేపట్టడంలో శిక్షణ ఇచ్చారు. పోలీసర్ ఆఫీసర్ మధుర వీణ ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ పనిచేస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ప్రధానంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల మాటల్లో చెప్పాలంటే... ఇది సాధారణమైన ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత ఒక ఉమెన్ కమాండో ఆయుధాలతో ఉన్న ముగ్గురు నలుగురితో పోరాడే శక్తిని కలిగి ఉంటారు. -
జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?
జాన్వీకపూర్, సారా అలీఖాన్‌లు, ప్రముఖ సెలబ్రిటీలు IV డ్రిప్ థెరపీలు చేయించుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని పలువురు నిపుణులు చెబుతున్నారు కూడా. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూషన్ థెరపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇదేంటి..?. ఆరోగ్యానికి మంచిదేనా తదితర విశేషాలు గురించి సవివరంగా చూద్దాం. ఇది ఒక కొత్త ఇన్ఫ్యూషన్ థెరఫీ. దీని సాయంతో హీరోయిన్, సెలబ్రిటీలు మిలమిలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతుంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్ చేయించుకుంటారట. తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి..చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక వృద్ధాప్య ప్రభావాలని తగ్గిస్తుందట. ఇందులో ఏముంటాయంటే..ఈ డ్రిప్స్‌లో విటమిన్ సీ, జింక్, మెగ్నీషియంతో పాటు కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు తదితరాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్దిమొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ✨ Revitalize Your Health with Our IV Drip Therapy! ✨Feeling drained or need a boost? Our private clinic offers premium IV drips tailored just for YOU!Why IV Therapy? 🌟 Immediate Absorption 🌟 Enhanced Immunity 🌟 Glowing Skin 🌟 Increased Vitality pic.twitter.com/7ICKp3ouXM— Eskulap Clinic (@polskaklinika) February 11, 2025 ఎలా పనిచేస్తుందంటే..నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీఆక్సిడెంటే. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే గాక, చర్మ రంగుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని మూడు అమైనా ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్ , గ్లైసిన్ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతికణంలో ఇది కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథియోన్‌ను ఉత్పత్తి చేస్తాయట. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందట. అందువల్ల ఇలా IV డ్రిప్ థెరపీ రూపంలో తీసుకుంటారట సెలబ్రిటీలు. ఇవి నేరుగా రక్తప్రవహంలోకి వెళ్లి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుందట. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలలు వరకు ఆ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. సాధారణంగా ఇది ఒక ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట.సురక్షితమేనా?వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైటనింగ్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని యూఎస్ ఆరోగ్య అధికారులు అనుమతించరట. అలాగే కౌమర దశలో ఉన్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ప్రతిష్టగా భావించేవారు..తెరపై కనిపించే కొందరు సెలబ్రిటీలు తప్పసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ వాళ్లంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కాస్త ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతకు ఈ గ్లూటాథియోన్ అనేది సహజసిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ తీసుకోకూడదట. చర్మం కాంతిగా నవయవ్వనంగా ఉండాలనుకునే వారంతా..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం, పుష్కలంగా నీరు త్రాగడం, మంచి నిద్ర తదితరాలను మెయింటైన్ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు!
హైదరాబాద్: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీ ( Inflammatory Bowel Disease (IBD)) చాలామంది నోట ఇది వినిపిస్తుంది. దీర్ఘకాల వ్యాధి కావడంతో ఇది జీవనశైలినే మార్చేస్తుంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది, మన దేశంలోనే 15 లక్షల మంది ఈ వ్యాధి బాధితులున్నారు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సమస్యలతో కలిపి వచ్చే ఐబీడీని వెంటనే గుర్తిస్తున్నా, సామాజిక సమస్యల కారణంగా దీనిపై ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. ఈ నెల 19న ప్రపంచ ఐబీడీ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సరిహద్దులు లేవని, అందరం కలిసి సామాజిక అపోహలను తొలగిద్దామని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష సూచించారు.ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఒక ప్రముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, ఐబీడీకి శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, డైటీషియన్లు, సైకాలజిస్టులు ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కేటాయించిన 20 పడకలు, అత్యాధునిక సదుపాయాలతో అనేకమంది రోగులకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యాధునిక చికిత్సలు అందిస్తోంది. పలు జిల్లాల నుంచి వైద్యులు రోగులను ఇక్కడకు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్యక్రమం ఉండడం, అందరికీ వ్యక్తిగత సంరక్షణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయడం ఇక్కడి ప్రత్యేకతలు.“ఐబీడీ అనేది కేవలం కడుపు సమస్యే కాదు. అది మన మొత్తం శరీరం, మనసునూ ప్రభావితం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, సమస్య తీరు, దాని లక్షణాలైన.. తరచు విరేచనాలు కావడం, కడుపునొప్పి, మలద్వారం నుంచి రక్తం కావడం, నీరసం వల్ల రోగులు దీని గురించి చివరకు కుటుంబసభ్యులకు కూడా చెప్పరు. మౌనంగా బాధను భరిస్తుంటారు. పేగు సంబంధిత సమస్యలంటేనే సమాజంలో ఉన్న చిన్నచూపు వల్ల ఐబీడీ గురించి కూడా మాట్లాడరు. దీని కారణాల గురించి కూడా అనేక అపోహలున్నాయి. ఇలా చెప్పకపోవడంతో వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది, వారు సమాజం నుంచి దూరమవుతారు, ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఐబీడీ అనేది ఆహారం వల్లనో, పరిశుభ్రత లేకపోవడం వల్లనో వస్తుందని.. ఇది కేవలం అరుగుదల సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐబీడీ అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. దానికి దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం” అని డాక్టర్ హర్ష చెప్పారు.ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!“ఐబీడీకి ప్రస్తుతం కచ్చితమైన చికిత్స తెలియదు గానీ, దాన్ని మందులు, ఆహారంలో మార్పులు, మానసిక చికిత్స, నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదించడం ద్వారా దీన్ని చాలావరకు నియంత్రించవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని అధిగమించడం, సహచరుల మద్దతు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రిలేషన్లో ఉన్న యువకులకు ఇది అవసరం. ఆహారంపై అవగాహన కూడా ముఖ్యం. మంట వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే అన్నం, అరటిపండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తినాలి. కారాలు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలు తినకూడదు. ఎవరికి వారికే ఆహారం మారుతుంది కాబట్టి, డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.చదవండి: వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే అంతేగా!అసలు అన్నింటికంటే ముందు మౌనం వీడాలి. బహిరంగంగా చర్చించాలి. అది క్లినిక్‌లో అయినా, తరగతుల్లో అయినా, కార్పొరేట్ ఆఫీసుల్లో అయినా. ఐబీడీ గురించి మాట్లాడితే అపోహలు పోతాయి. సానుభూతి పెరుగుతుంది. రోగులు చికిత్స పొందడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వస్తుంది” అని డాక్టర్ హర్ష వివరించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష -
వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే నుజ్జు.. నుజ్జేగా!
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई। ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు! -
ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్ సర్జన్లు. అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు. కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ ) -
రామేశ్వర్‌కి అమెరికా వర్సిటీ మాస్టర్ డిగ్రీ, తెలుగోడి ప్రతిభకు ప్రశంసలు
సోలాపూర్: పట్టణానికి చెందిన రామేశ్వర్ సంతోష్ ఉదుగిరి అమెరికాలోని బోస్టన్ వద్ద నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ నందు మాస్టర్ డిగ్రీ పొందాడు. ఇటీవల అమెరికాలో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రామేశ్వర్ ప్రముఖుల చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. రామేశ్వర్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఆర్కేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత ఉన్నత డిగ్రీని అభ్యసించడానికి యూఎస్‌లోని బోస్టన్ నందు గల నార్త్ ఈస్టర్న్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఆర్కిడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ దీపక్ సొంగే, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేతన్ తను విద్యాపరంగా ఎదుగుదల సాధించేందుకు ఎంతగానో మార్గదర్శనం చేశారని రామేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో సమర్థ అడ్వర్టైజర్స్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీ అధినేత అయిన తన నాన్న సంతోష్ వెన్ను తట్టి విద్యలో రాణించాలని ప్రోత్సహించినందుకు అంకితభావంతో ఇంతవరకు చేరుకోగలిగానని తెలిపారు. పట్టణానికి చెందిన తెలుగువాడు రామేశ్వర్ విద్యాపరంగా ఉన్నత శిఖరాన్ని అందిపుచ్చుకున్నందుకు సర్వత్రా ఆయనకు అభినందనలు వెల్లు వెత్తు తున్నాయి. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు! -
Ananya Nagalla : అలరించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్‌ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్‌ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!గ్లోబల్ డిజైన్స్.. వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్స్‌ను రూపొందిస్తున్నాం. – దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు -
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్‌ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్‌ని కూడా పంచుకున్నారు.ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్‌మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక్కసారి ఫోన్‌కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్‌ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు. సింపుల్‌గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట. ఎక్కువసేపు పోన్ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.ఎలా నిరోధించాలంటే..సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్‌ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి. సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్‌ల వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. ) -
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. -
ఏక 'తాటి'గా ఫలాలు..రైతులకు ఆదాయ సిరులు..
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన పరిశోధన స్థానం మంచి ఫలితాలు సాధిస్తోంది. తాటి ఉత్పత్తుల తయారీపై జరిపిన విస్తృత పరిశోధనల ఫలితంగా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2024–25కు సంబంధించి ఉత్తమ అవార్డు పొందింది. దీంతో ఇక్కడ 32 ఏళ్లుగా జరిపిన పరిశోధనలకు సార్థకత లభించింది. దేశంలో ఉన్న నాలుగు పరిశోధన స్థానాల్లో మేటిగా నిలుస్తూ గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తోంది.రంపచోడవరం: పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన పరిశోధన స్థానం (హెచ్ఆర్ఎస్)కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. తాటి పరిశోధనల ఫలితంగా ఉత్తమ పరిశోధన స్థానంగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును ఈనెల 7 నుంచి 9 వరకు మధురైలో జరిగిన కార్యక్రమంలో పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. వీసీ వెంగయ్య స్వీకరించారు. 1993లో నిధుల కేటాయింపుతో.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలోని పందరిమామిడిలో 1986లో ఏర్పాటైన ఈ ఉద్యానవన పరిశోధన స్థానానికి 1993లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీ (ఐసీఏఆర్) తాటి పరిశోధనలకు నిధులు కేటాయించింది. అప్పటినుంచి 32 ఏళ్లుగా తాటి చెట్లకు సంబంధించి నిరంతరంగా వివిధ దశల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 272 తాటి రకాలతో.. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి 272 రకాల తాటి చెట్ల టెంకలను సేకరించి ఇక్కడ నాటారు. తరువాత దశలో తాటి చెట్ల నుంచి నీరా సేకరణపై పరిశోధనలు సాగాయి. ఆధునిక పద్ధతులను అవలంభించి నీరాను విజయవంతంగా సేకరిస్తున్నారు. తాటి నుంచి ఆహార ఉత్పత్తుల తయారీపై కూడా ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దీనిలో భాగంగా నీరా నుంచి తాటి బెల్లం, తాటి సిరప్, తాటి తేగల నుంచి నూక,పిండి, తాటి గుజ్జు నుంచి జెల్లీ వంటి 20 రకాల ఆహార పదార్థాలను విజయవంతంగా తయారు చేశారు. గిరిజనులకు తాటి ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశోధనల ఫలితాలను చేరువ చేశారు. తాటి తేగలతో పిండి, నూక (రవ్వ) తయారు చేసిన మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడల్స్, రవ్వ లడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలను వాణిజ్య పరంగా తయారు చేస్తున్నారు. చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ వెంయ్య సహకారంతో మూడు టన్నుల తేగల పిండిని లండన్‌కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. మళ్లీ పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో 32 వన్య పంట విభాగాలు ఉండగా వీటిలో కొబ్బరి పరిశోధన స్థానాలు 20, ఆయిల్‌పామ్ రీసెర్చ్ సెంటర్లు, వక్క రీసెర్చ్ సెంటర్, తాటి పరిశోధన స్థానాలు నాలుగు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏటా ఉత్తమ రీసెర్చ్ సెంటర్లకు అఖిల భారత వన్య పంటల విభాగంలో అవార్డు అందజేస్తారు. దీనిలో భాగంగా 2024–25కు సంబంధించి పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రానికి అవార్డు దక్కింది. ఎంతో సంతోషంగా ఉందితాటి పరిశోధనల్లో అనేక అంశాల్లో ముందడుగు వేయగలిగాం. తమ పరిశోధన స్థానంలో 32 ఏళ్లుగా తాటిపై జరిపిన పరిశోధనలు, వాటి ఫలితాలపై జాతీయ స్థాయిలో మధురైలో జరిగిన కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తమ పరిశోధన స్థానానికి తొలిసారి జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. తాటి ఫరిశోధనల ఫలితంగా కొత్త రకం తాటి రకాలను త్వరలో తీసుకువస్తాం.జాతీయ వేదికపై తాటికి సంబంధించి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం. 2014, 2017, 2023లో వ్యక్తిగతంగా జాతీయ స్ధాయిలో అవార్డులు వచ్చాయి. –డా. వీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యానవన పరిశోధన స్థానం(చదవండి: సోలార్ కంచె.. కొన్ని జాగ్రత్తలు!) -
బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
బీర్ బాటిళ్ల లోడుతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. దీంతో బీర్ బాటిళ్లను దక్కించుకునేందుకు జనాలు ప ఓటీలుపడ్డారు. డ్రైవర్‌ను, క్లీనర్ ట్రక్కులో చిక్కుకుపోయారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి సహాయం చేయడానికి బదులుగా అయితే, బాటసారులు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకుని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీ బీర్ పిచ్చి తగలడ, కాస్త మారండిరా బాబూఅంటూ నెటిజన్లు కమెంట్లతో మండిపడుతున్నారు.మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ ఘటనచోటుచేసుకుంది. కట్ని జిల్లా చాపారా గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సవందలాది మద్యం కార్టన్లతో నిండిన ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కు లోపల చిక్కుకున్న డ్రైవర్ , క్లీనర్‌కు సహాయం చేయడానికి కొంతమంది మొదట ముందుకు వచ్చారు. కానీ బీరు బాటిళ్లను మర్చి మానవత్వాన్ని మర్చిపోయారు. దొరికింది దొరికినట్టు మందు సీసాలను దొరకబుచ్చుకొని కాళ్లకు పనిచెప్పారు.ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన డ్రైవర్గురించి గానీ క్లీనర్ గురించి గానీ ఏ మాత్రం పట్టించుకోకుండా పట్టించుకోలేదు నెటిజన్టు కమెంట్స్ చేశారు.People Rush To Loot Beer Bottles As Loaded Truck Overturns In MP's Jabalpur #people #Jabalpur #BearBottles #loot #MadhyaPradesh pic.twitter.com/EUoJkaEtER— Free Press Madhya Pradesh (@FreePressMP) May 19, 2025 p; కొందరు బీరును సంచులలో మోసుకెళ్లగా, మరికొందరు తమ భుజాలపై డబ్బాలను ఎత్తుకుని పారిపోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు సీసాలను దోచుకుంటున్న సంఘటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారి తీసింది. ఈ ట్రక్కు జబల్పూర్ నుండి భోపాల్‌లోని హజారిబాగ్‌కు వెళుతోంది. ఒక గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువును కాపాడే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో ట్రక్కు బోల్తా పడింది. లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనాపోలీసులకు సమాచారం అందిన వెంటనే, సలీమ్నాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్ , క్లీనర్‌ను చికిత్స కోసం కట్ని జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు మిగిలిన మద్యంను భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు భారీ మొత్తంలో వాటిని ఎత్తుకుపోయారు.ప్రమాదం, జనాల కక్కుర్తి వల్ల నష్టం లక్షల రూపాయలలో ఉందని మద్యం కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన అధికారులు వైరల్ వీడియోల ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలుతీసుకునేందుకు ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్‌కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్‌తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్‌ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్‌కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్‌గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు. అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు. ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్‌ని నిర్థారిస్తారు.చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు. ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్లను మొదటి స్టేజ్‌లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! ) -
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నివ్య ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్, ఇతర నగలతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్...కూల్‌గా గాగుల్స్ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p> -
చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..!
చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన కఫీకి భవిష్యత్ మసక మసకగా కూడా కనిపించలేదు. అంతా అంధకారమే! భయానకమైన నిస్సహాయతలో నుంచి కూడా అప్పుడప్పుడూ అభయమిచ్చే శక్తి ఏదో పుట్టుకువచ్చి....‘అదిగో నీ భవిష్యత్’ అని చూపుతుంది. కఫీ విషయంలోనూ అలాగే జరిగింది. ఛండీఘడ్కు చెందిన కఫీ 2023లో క్లాస్ 10 సీబీఎస్ఈ పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. తాజాగా... క్లాస్ 12 సిబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో 95.6 శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది. తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ... ‘తల్లిదండ్రులు నా బలం. స్ఫూర్తి. వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు. వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మన కష్టమే మన భవిష్యత్తు’ అంటుంది కఫీ.కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, హోలి పండగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్ చల్లారు. వారి రాక్షసానందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది. కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు.‘నా లక్ష్యం ఐఏఎస్’ అని ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతోంది కఫీ. (చదవండి: 'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..) -
నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!
మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారుఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లితెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కైవసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే... డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేరి్పంచారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్íÙప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్‌లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్‌లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్‌ఎంజెల్స్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికైనా, అనివార్య కారణాలతో సైక్లింగ్‌లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్‌లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం.విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
'ఐ' లవ్ యు అండ్ ప్లీజ్ టేక్ కేర్..!
చూసే ప్రక్రియలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ సమస్యలను వైద్యపరిభాషలో ‘విజువల్డిస్టర్బెన్సెస్’ అంటారు. అంటే... చూపులో కలిగే అంతరాయాలని అర్థం. ఇవి చాలా కారణాలతో వస్తాయి. అనేక సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. మరికొన్ని శాశ్వతంగా చూపును పోగొట్టేవి. అయితే తాత్కాలికమైనవే ఎక్కువ. కాకపోతే కొన్ని తాత్కాలికమైన వాటిని నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలూ, చికిత్సలతో అంతా మామూలైపోయే ఈ అంతరాయాల గురించి తెలుసుకుందాం...అన్ని అవయవాల్లోకీ చూపు వల్లనే దాదాపు 80% సమాచారం మనకు తెలుస్తుంది. అందుకే సర్వేంద్రియాణాంనయనం ప్రధానమనీ, కన్నుంటేనే కలికాలమనీ... ఇలాంటి ఎన్నో సామెతలూ,జాతీయాలూ, నుడికారాలూ ఉన్నాయి. అంతటి దృష్టిజ్ఞానానికి కలిగే అవరోధాలనూ, వాటిని పరిష్కరించుకునేమార్గాలను తెలుసుకోవడం అవసరం. ఆ అవరోధాలేమిటో, వాటిని అధిగమించే మార్గాలేమిటో చూద్దాం...అంతరాయాలను గుర్తించే లక్షణాలు చూపునకు కలిగే అంతరాయాలు (దృష్టిదోషాలు) తాత్కాలికమైనవా లేదా దీర్ఘకాలికమైనవా అనేది కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయంటే... ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపించడం (పాలియోపియా), మనం చూసే వస్తువు మసగ్గా కనిపించడం (బ్లర్రింగ్ ఆఫ్ విజన్), కళ్ల ముందు నల్లటి చుక్కలు లేదా మెరుపు తీగలు తేలిపోతున్నట్టు కనిపించడం (ఫ్లాషెస్ అండ్ ఫ్లోటర్స్), మనకు కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘స్కోటోమాస్’ అంటారు. ఫీల్స్ డిఫెక్ట్స్ : మనం చూసే ప్రాంతపు వైశాల్యమంతటా అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. ఇలాంటి సమస్యలను ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదాహరణకు...హెమీ అనోపియా...దృశ్యంలో సగభాగం స్పష్టంగా ఉండి, మరో సగభాగం స్పష్టంగా లేకపోవడం. క్వాడ్రాంటనోపియా : మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడం. కన్‌స్ట్రిక్షన్ : మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను క్రమంగా తగ్గిపోవడం. టన్నెల్ విజన్ : కన్‌స్ట్రిక్షన్ సమస్య వచ్చాక ఒక సొరంగంలోంచి లేదా ట్యూబ్‌లోంచి ఎదుటి వస్తువును చూస్తున్నట్లు ఉండటాన్ని ‘టన్నెల్ విజన్’ అంటారు. కలర్డ్ హ్యాలోస్ : టన్నెల్ విజన్ కాకుండా ఒకవేళ రంగురంగుల వలయాలు ఉన్నట్లు భ్రమ కలగడమే ‘కలర్డ్ హ్యాలోస్’. లాస్ ఆఫ్ కలర్ విజన్ : ఒకవేళ కొందరిలో ఎదుటనున్న దృశ్యం రంగుల్లో గాక నలుపు–తెలుపుల్లో కనిపించడాన్ని ‘లాస్ ఆఫ్ కలర్ విజన్’గా చెబుతారు. పైన పేర్కొన్న ఈ లోపాలన్నీ రకరకాల తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మనకు కనిపించే లక్షణాలుగా చెప్పవచ్చు.తాత్కాలిక అంతరాయాలను కలిగించే కొన్ని కంటి సమస్యలు మైగ్రేన్ : ఇది తీవ్రమైన తలనొప్పితో తాత్కాలికంగా కంటి చూపు కనిపించకుండా చేసే సమస్య. యువతలోనే ఎక్కువ. ఒకవైపు కంటిలోగాని లేదా తలలో ఒక పక్క గాని వచ్చే నొప్పి ఇది. అందుకే మామూలు వ్యక్తులు దీన్ని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి వస్తున్నప్పుడు వికారంగా ఉండటం లేదా కొందరిలో వాంతులు కావడం జరుగుతుంది. కొందరిలో వాంతి తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మరికొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్నే ‘విజువల్ ఆరా’ అంటారు. మరికొందరిలో ‘స్కోటోమాస్’ రూపంలో కనిపించవచ్చు. అంటే ఎదురుగా కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం. ఇక మరికొందరిలో కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే వెలుగు దివ్వెలు, మెరుపులూ కనిపించవచ్చు. చికిత్స : నొప్పిని తక్షణం తగ్గించే మందులతోపాటు... భవిష్యత్తులో ఈ తరహా తలనొప్పి రాకుండా నివారించే మందులు... ఇలా రెండు రకాల మందులను ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి. ట్రామా (గాయాలు): కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, వెలుగు రేకలు తేలుతున్నట్లు ఉండటం, కంటిలోని ద్రవం (విట్రియల్) బయటకు రావడం, దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. చికిత్స : కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా దీర్ఘకాలం ΄ాటు ఫాలో అప్‌లో ఉండాలి. పొగతాగడం వల్ల: దీని వల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా) అన్నది ఆ అలవాటును మానివేయడం వల్ల తగ్గిపోతుంది. రే–చీకటి (నైట్ బ్లైండ్నెస్): ఇది ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే... రెటినైటిస్ పిగ్మెంటోజా వంటి వాటి వల్ల రావచ్చు. కొందరిలో హై మయోపియా (తీవ్రమైన దగ్గరి దృష్టి... అంటే చాలా దగ్గర్నుంచి చూస్తేగానీ స్పష్టంగా కనిపించకపోవడం) వల్ల లేదా గ్లకోమా వల్లగానీ ఈ సమస్య రావచ్చు.లక్షణాలు : ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట సరిగా కనిపించకపోవచ్చు. ఇక విటమిన్–ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. వైద్యపరిభాషలో దీన్నే ‘కెరటోమలేసియా’ అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువ. దీన్ని అత్యవసరమైన పరిస్థితిగా గుర్తించి చికిత్స అందించాలి. చికిత్స : ఆహారంలో తగినంత విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్–ఏ మాత్రలు వాడటం, ముందస్తు నివారణగా (్ర΄÷ఫిలాక్టిక్ చికిత్సగా) విటమిన్–ఏ ఇస్తారు.డ్రగ్స్ : కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని మందుల వల్ల స్కోటోమాస్ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్‌ను సంప్రదించి, వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పక్షవాతం (స్ట్రోక్ ): పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. మెదడులో చూపునకు సంబంధించిన ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గితే తాత్కాలికంగా చూపునకు అంతరాయం కలగవచ్చు. మామూలుగానైతే ఇది తాత్కాలిక సమస్య. అయితే అతి కొద్ది సందర్భాల్లో మాత్రం ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు. చికిత్స : ఇందులో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్‌ను, రక్త΄ోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ముప్పును తప్పించుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ : మెదడులో వచ్చే గడ్డలు... చూపును మెదడుకు చేరవేసే ‘ఆప్టిక్ నర్వ్’ను నొక్కివేయడం వల్ల గానీ లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణనిచ్చే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల గానీ అంతరాయం కలగవచ్చు. దాంతో ఒక్కోసారి ΄ాక్షిక అంధత్వం రావచ్చు. లేదా మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. ఇలాంటప్పుడు తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఒకవేళ గడ్డలుంటే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగింపజేసుకోవాలి. అప్పుడు చూపు చాలావరకు మళ్లీ రావచ్చు.డయాబెటిక్ రెటినోపతి : డయాబెటిస్ ఉన్నవారిలో కంటికి రక్తాన్ని అందించే అత్యంత సూక్ష్షా్మతి సూక్ష్మమైన రక్తనాళాల్లోని లోపలి ΄÷ర ఎండోథీయమ్ కణాలు మృతిచెందడం వల్ల రెటీనాకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. దాంతో రెటీనా దెబ్బతినే అవకాశాలెక్కువ. ఇది చూపు కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. లక్షణాలు : చిన్న అక్షరాలు చదవడం కష్టం కావచ్చు. క్రమంగా లేదా అకస్మాత్తుగా చూపు తగ్గవచ్చు. కళ్ల ముందు ఏవో కాంతిపుంజాలు తేలుతున్నట్లు (ఫ్లోటర్స్) కనిపించవచ్చు. చికిత్స : తక్షణ లేజర్ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారాగాని చూపు మరింత దిగజారకుండా ఆపే అవకాశాలుంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా తమ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం ): వయసు పెరుగుతున్న కొద్దీ కంటిలో ఉండే లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంది. ఫలితంగా దృష్టి మసకబారడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, చూపు సన్నగిల్లడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్‌ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్ అమర్చడం వల్ల మళ్లీ మామూలుగానే చూడటం సాధ్యపడుతుంది. చూపు అంతరాయాల్లో తాత్కాలికం... దీర్ఘకాలికం... వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. అయితే అందులో కొన్ని తాత్కాలికమైనవి. చికిత్స తీసుకుంటే నయమై చూపు మామూలుగా వచ్చేస్తుంది. అయితే కొన్ని అవరోధాలు మాత్రం కాస్తంత దీర్ఘకాలిక చికిత్స అవసరమైనవి. చూపునకు కలిగే కొన్ని రకాల సమస్యలు లేదా అంతరాయాలు క్రమంగా పెరుగుతూ΄ోయి, వాటి కారణంగా దీర్ఘకాలికంగా ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... గ్లకోమా : కంటిలో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలగజేస్తుంటాయి. ఈ ఒత్తిడినే ‘ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్’ అంటారు. అయితే కొందరిలో ఈ ఒత్తిడి క్రమంగా పెరిగిపోతూ ఉండటం వల్ల వారికి కనిపించే దృష్టి వైశాల్యం (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా కుంచించుకుపోతూ / తగ్గిపోతూ ఉంటుంది. ఇలా క్రమంగా తగ్గిపోవడాన్ని / కుంచించుకుపోతూ ఉండటాన్ని ‘కన్‌స్ట్రిక్షన్ ఆఫ్ ఫీల్డ్’ అంటారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చికిత్స తీసుకోకపోతే అతడి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా కంటిలోని ద్రవాల ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధిని గ్లకోమా అంటారు. లక్షణాలు : గ్లకోమా ఉన్నవారిలో చూసే వైశాల్యం (ఫీల్డ్) క్రమంగా కుదించుకుపోతుంది. ఇది ఒక్కోసారి క్రమంగా జరగవచ్చు లేదా కొందరిలో అకస్మాత్తుగానూ జరగవచ్చు. ఇక కంటిముందు నల్లమచ్చలాంటి వెలుగు, దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, లోతైన సొరంగంలోకి చూస్తున్న ఫీలింగ్ (టన్నెల్ విజన్) ఉండవచ్చు. ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులో ఉండేలా చికిత్స తీసుకోకపోతే ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ పోయి చివరకు శాశ్వతంగా దృష్టి కోల్పోయే ముప్పు ఉంటుంది. చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను పెరగకుండా అదుపులో ఉంచడం. రెండోది లేజర్ చికిత్స. దీని తర్వాత కూడా ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. హైపర్టెన్సివ్ రెటినోపతి : మన దేహంలోని అన్ని అవయవాలతో ΄ాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్త΄ోటు ఉన్నవారిలో రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) ఆ ఒత్తిడికి చిట్లి΄ోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే ముప్పు ఉంటుంది. లక్షణాలు : చూపు మసకబారడం, ఒకవైపు సక్రమంగా కనిపించక΄ోవడం లేదా చూసే ఏరియా (వైశాల్యం) తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే మంచి నివారణ చర్య. ఇలాంటి సమస్య ఉన్న కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. ఏఆర్‌ఎమ్‌డీ : ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్’ అనే ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ ‘ఏఆర్‌ఎమ్‌డీ’. కంటి రెటీనాలోని ‘మాక్యులా’ అని పిలిచే మధ్యభాగం తీవ్రంగా ప్రభావితమైపోవడంతో ఈ సమస్య వస్తుంది. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో ‘స్కోటోమాస్’ రావచ్చు. ఇక వస్తువు – రూపం ఉన్నది ఉన్నట్లు గాక తీవ్రంగా మారి (డిస్టార్షన్) కనిపించవచ్చు. ఉన్న వస్తువు కంటే కనిపించేది చిన్నదిగా ఉంటే దాన్ని ‘మైక్రోప్సియా’ అంటారు. ఉన్న వస్తువు పరిమాణం కంటే కనిపించేది పెద్దదిగా ఉంటే దాన్ని ‘మ్యాక్రోప్సియా’ అంటారు. వస్తువు రూపం పూర్తిగా మారిపోతే దాన్ని ‘మెటామార్ఫోప్సియా’ అంటారు. చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి కంటి డాక్టర్లు లేజర్ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్ ఛేంబర్ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను మరింతగా పెరగకుండా నిలువరించేందుకు అవకాశాలెక్కువ. కెరటోకోనస్ వ్యాధి : సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే కండిషన్ ఉన్నవారిలో ఈ ఉబ్బెత్తుగా ఉండేభాగం కోణం (కోన్) ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కండిషన్‌నే ‘కెరటోకోనస్’ అంటారు. లక్షణాలు : ఈ కండిషన్ ఉన్నవారు సౌకర్యంగా చూడలేరు. అంతా మసగ్గా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తాము చూసే దృశ్యం కదిలిపోతున్నట్లు, వణుకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. చికిత్స : కాంటాక్ట్లెన్స్లతో చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్ క్రాస్ లింకింగ్’ ప్రక్రియ అవసరపడవచ్చు.‘కెరటోప్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ (దృష్టిలోపాలు) : సరైన అద్దాలు వాడటం ద్వారా తరహా కంటి సమస్యలను అధిగమించవచ్చు. వీటినే రిఫ్రాక్టివ్ లోపాలు అంటారు. కొందరికి చాలా దగ్గరి నుంచి చూస్తేగాని వస్తువులు స్పష్టంగా కనిపించవు. దీన్నే ‘మయోపియా’ లేదా ‘నియర్‌సైటెడ్‌నెస్’ అంటారు. ఇక కొందరు ఆ వస్తువులను మరింత దూరంగా ఉంటే తప్ప స్పష్టంగా చూడలేరు. ఈ కండిషన్‌ను ‘హైపరోపియా’ లేదా ‘ఫార్సైటెడ్నెస్’ అంటారు. ఇక కొందరిలో గ్రాఫ్‌లో ఉన్న అడ్డు, నిలువు రేఖలు ఒకేసారి కనిపించవు. ఈ సమస్యను ‘ఆస్టిగ్మాటిజమ్’ అంటారు. సరిదిద్దడమిలా : ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్‌ను తగిన అద్దాలను ఉపయోగించి సరిచేయవచ్చు. కేవలం ఈ అద్దాలతోనే వాళ్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. అలాగని చికిత్స తీసుకోకుండా ఉన్నా, తగిన అద్దాలు వాడకపోయినా సమస్య మరింత తీవ్రం కావచ్చు. మెల్లకన్ను : ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్’ అనే ఈ కండిషన్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ కండిషన్లో కుడి, ఎడమ కనుగుడ్లలో ఏదో ఒకటి లోపలివైపునకో, బయటికో చూస్తుంటుంది. సాధారణంగా మెల్లకన్ను ఉన్నవారికి ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మసకగా కనిపించడం, తలనొప్పి, వాంతులు ఉండవచ్చు. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరు దీన్ని అదృష్టంగా కూడా పరిగణిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో చూపు పూర్తిగా పోయే ముప్పు కూడా ఉంటుంది. చికిత్స : మెల్లకన్నుకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఇవే కాకుండా... డబుల్ విజన్, ఫ్లాషెస్, స్కోటోమాస్, హాఫ్ ఫీల్డ్ లాస్, ప్రాప్టోసిస్, రంగుల వలయాల వంటివి కనిపిస్తే వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సిందే. లేకపోతే చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. (చదవండి: -
సోలార్ కంచె.. కొన్ని జాగ్రత్తలు!
అటవీ జంతువులు, పశువుల నుంచి పంటలను కాపాడుకోవటానికి సోలార్ ఫెన్సింగ్ ఉపయోగపడుతుంది. చిన్న కమతాల్లో ఏర్పాటు చేసుకున్న రైతులను క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రైతులు చేస్తున్న కొన్ని పొరపాట్లను గమనించామని వాటర్లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ నిర్వహణలో ఏ పనులు చెయ్యాలి? ఏ పనులు చెయ్యకూడదు? వంటి అంశాలపై కొన్ని సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.సోలార్ కంచె వ్యవస్థలో సోలార్ ప్యానల్, బ్యాటరీ, ఎనర్జైజర్, ఫెన్సింగ్ వైర్లు ఉంటాయి. 8–10 అడుగుల దూరంలో ΄పొలం చుట్టూ కట్టెలు, బొంగులు లేదా సిమెంటు స్థంభాలు పాతి కంచె ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు రకాల యూనిట్లు మార్కెట్లో ఉన్నాయి. 1. సౌర విద్యుత్తును లాక్ చేసే ఎన్‌క్లోజర్ వున్నది. 2. ఎన్‌క్లోజర్ లేనిది. ఎనర్జైజర్, బ్యాటరీని రక్షించుకోవటానికి రైతు ఒక షెల్టర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. సోలార్ బ్యాటరీలోని లోవోల్టేజి పవర్‌ను ఎనర్జైజర్ హైవోల్టేజ్ పవర్‌గా మార్చి కంచె తీగలకు సరఫరా చేస్తుంది. 40 వాట్స్ ప్యానళ్లు 5–8 ఎకరాల చుట్టూ కంచెకు సరిపోతాయి. 12 వోల్టులు, 18 అంప్రె (గంటకు) స్టోరేజ్ గల బ్యాటరీ పెట్టుకోవాలి.ఈ విద్యుత్‌ను ఎనర్జైజర్ 8 వేలు– 10 వేల వోల్టుల హైవోల్టేజి విద్యుత్‌గా మార్చి తీగలకు సరఫరా చేస్తుంది. ఇది పల్సేటింగ్ విద్యుత్తు. అంటే.. నిరంతరం విద్యుత్తు ప్రసరించదు. 1 – 1.2 సెకండ్లకు ఒకసారి మిల్లీ సెకండ్ మాత్రమే విద్యుత్తు ఆగి, ఆగి ప్రసరిస్తుంది. అందువల్లే పశువులకు కూడా గట్టి షాక్ తగులుతుంది. కానీ,ప్రాణాంతకం కాదు. షాక్‌కు షాక్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఒకటి రెండుసార్లు షాక్ తగలగానే పశువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవటానికి వీలుంటుంది. ఎర్త్ విధిగా ఏర్పాటు చేయాలి. సోలార్ కంచెకు సంబంధించి అవగాహన పెంచుకొని, జాగ్రత్తగా నిర్వహించుకుంటే రైతులు దీర్ఘకాలం ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుచేయవలసినవిఎనర్జైజర్పైన కనిపించే బ్యాటరీ వోల్టేజిని గమనించండి. వోల్టేజి 10 వోల్టుల కన్నా తక్కువకు తగ్గిపోతుంటే.. గడ్డి, చెట్లు సోలార్ కంచె వైర్లకు తగులుతున్నందున విద్యుత్తు నష్టం జరుగుతోందని గుర్తించాలి. → కండక్టర్ వైర్‌కు అనుసంధానం చేసిన ఇన్సులేటర్లు పాడయ్యాయేమో అని తరచూ చూసుకోండి. → స్థానికంగా దొరికే వెదురు బొంగులు పాతి సోలార్ కంచె ఏర్పాటు చెయ్యండి. ఇనుప / సిమెంటు స్థంభాల కన్నా ఇవి చవక.→ పది అడుగులకో బొంగు పాతాలి. అంతకన్నా దూరం అయితే గాలి, వానలకు ఇబ్బంది అవుతుంది. → బ్యాటరీకి ఒక చిన్న డిసి బల్బును అమర్చితే పురుగులను నశింపజేసే దీపపు ఎరగా పనికొస్తుంది. → యూనిట్‌ను వాన, ఎండ, దొంగల నుంచి రక్షించుకోవటానికి పక్కా షెల్టర్ నిర్మించాలి. → సోలార్ ప్యానల్పైన దుమ్మును నెలకోసారైనా తుడవండి. → ఎర్త్ సిస్టం బాగుందా లేదా అని నెలకోసారైనా చూడండి. నీరు పోయండి. → రాత్రుళ్లు మనుషులు సోలార్ కంచెను ΄పొరపాటున తాకకుండా ఉండేందుకు రిఫ్లెక్టివ్ రేడియం టేపు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయండి.చేయకూడనివికంచె వైర్లను అడుగుకన్నా ఎత్తులో కట్టండి. పంట మొక్కలు/చెట్లకు కొంచెం దూరంగా ఏర్పాటు చేయండి. లేకపోతే కలుపు మొక్కలు ఫెన్సింగ్‌కు తగిలి, విద్యుత్తు నష్టానికి కారణమవుతాయి. → ఫెన్సింగ్ వైరు కింద కలుపు పెరగనివ్వకండి. ΄్లాస్టిక్ మల్చింగ్ షీట్ లేదా వీడ్ మ్యాట్ వేసుకోవటం మేలు. → చెట్టు, ఇంటి నీడలో సోలార్ ప్యానల్‌ను పెట్టకూడదు. ఇది దక్షిణం వైపు తిరిగి ఉంటే మంచిది. → తుపాను సమయాల్లో, పిడుగుపాటుకు అవకాశం ఉన్నప్పుడు ఎనర్జైజర్ను ఫెన్సింగ్ వైరు నుంచి ముందుజాగ్రత్తగా వేరు చెయ్యండి.→ కంచెకు దగ్గరగా మొక్కలు నాటకండి. చెట్ల కొమ్మలు వైర్లను తాకనివ్వకండి. → మనుషులు సోలార్ కంచెను తాకకుండా జాగ్రత్త తీసుకోండి. తాకితే ఆగి ఆగి షాక్ కొడుతుంది.→ పిల్లలను కంచెకు దూరంగా ఉంచండి. చిన్న వయస్కులు తాకితేప్రాణాపాయం రావచ్చు లేదా గాయాలవ్వవచ్చు. → వైర్లలో హై వోల్టేజ్ పల్స్ కరెంట్ ప్రసరిస్తూ ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయటానికి సాధారణ టెస్టర్లు లేదా వోల్టు మీటర్లు వాడకూడదు. మీటర్లు పాడవుతాయి. వాడితే షాక్ తగులు తుంది. -
కూరగాయలు కొత్త రంగుల్లో!
మన కూరగాయలు సంప్రదాయేతర రంగుల్లోకి రూపొంతరం చెందుతున్నాయి. క్యాలీ ఫ్లవర్ తెల్లగానే ఉండాలనేం లేదు.. వేరే రంగులో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. త్వరలోనే పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగుల్లోనూ క్యాలీ ఫ్లవర్ మార్కెట్లో కనిపించవచ్చు. అలాగే, బ్రకోలి ఆకుపచ్చగానే ఉండాలనేం లేదు.. పసుపు పచ్చగానూ ఉండొచ్చు. క్యారట్ ఎర్రగానే ఉండాలనేం లేదు.. ముల్లంగి, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ ఊదా రంగులోనూ రానున్నాయి. ఇంతకీ రంగుల కూరగాయలు మనకు మంచివేనా? రంగుతో పాటు పోషకాల్లోనూ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ వంగడాలను రూపొందిస్తున్న పద్ధతులేమిటి? పర్యవసానాలేమిటి..?కూరగాయలు మనిషి తీసుకునే ΄పౌష్టికాహారంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అవశ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించటం (కలర్ బ్రీడింగ్) వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణుల్లో ఒకటి. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండటం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ‘కలర్ బ్రీడింగ్’పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగులోనే కాదు ఇతర రంగుల్లోనూ కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. చూపులకు ఆకర్షణీయంగా కనిపించడటం కోసం మాత్రమే కాదు ప్రత్యేక పోషకాల కోసం కూడా రంగుల కూరగాయ వంగడాలు రూపుదిద్దుకుంటున్నాయి.→ అటవీ జాతులే ఆధారంకొత్త వంగడాల రూపుకల్పనలో మన కూరగాయలకు సంబంధించిన అటవీ జాతుల పాత్రే అధికం. సాధారణ వంగడాల్లో లోపించే ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, బెటాలైన్స్ అటవీ జాతుల్లో ఉంటాయి. అందుకే వాటితో సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో సంకరపరచి రంగు రంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అధిక బీటా కరొటెన్ లేదా ఆంథోశ్యానిన్ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారట్ వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా, టొమాటోలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు, రెండు రంగులు కలిసిన రూపంలో లైకోపెన్ వంటి యాంటీఆక్సిడెంట్‌తో కూడిన కొత్త వంగడాలను రూపొందించడానికి వీలుందన్ని నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికం (కూరమిరప)లో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊదా రంగుల్లో విటమిన్ సి కలిగి ఉండేలా కొత్త వంగడాలు రూపొందుతున్నాయి. బీట్రూట్లు సహజంగానే ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగుల్లో ఉన్నాయి. డైటరీ ఫైబర్, బెటాలైన్స్ ఎక్కువ బీట్రూట్లలో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగుల్లో క్యాలీఫ్లవర్ వంగడాలను రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, గ్లుకోసినొలేట్లు పుష్కలంగా ఉంటాయి. ΄పౌష్టికాహారం, ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయల్లో రంగురంగుల వంగడాల అభివృద్ధికి అవకాశాలున్నాయి.→ జన్యుసవరణ కూడా..కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతులను ఉపయోగిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అడవి జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాలను ఎంచుకుని, వాటిని ఇతర రకాలతో సంకరం చేస్తారు. రేడియేషన్ పద్ధతిలో ఉత్పరివర్తన ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తారు. బంగారు రంగు క్యాలీఫ్లవర్ ఇలాంటిదే. వర్ణద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి, కొత్త రకాలను అభివృద్ధి చేయటంలో అత్యాధునిక మార్కర్–అసిస్టెడ్ సెలక్షన్ వంటి పద్ధతులు బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. క్రిస్పర్ కాస్9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ విధానాలు వర్ణద్రవ్య జన్యువుల ఖచ్చితమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యుమార్పిడి పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చిపెట్టుకునే వీలుకల్పిస్తాయి. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడాన్ని రూపొందించటంలో ఈ పద్ధతిని పాటించారు. → ఆదరణ ఉంటుందా?కలర్ బ్రీడింగ్‌లో కొత్త వంగడాలు రూపొందించటం మన దేశంలో ఆంథోశ్యానిన్లతో కూడిన ఊదారంగు క్యారట్ వంగడంతోప్రారంభమైంది. పోషకాలు అధికంగా ఉండే ఈ రకానికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. ఆంథోశ్యానిన్లు అధికంగా ఉండే నల్ల టొమాటోలు, బీటా కరొటెన్తో కూడిన నారింజ రంగు క్యాలీఫ్లవర్ యూరప్లోప్రాచుర్యం పొందాయి. అయితే, కొత్త రంగుల కూరగాయలను, జన్యుసవరణ కూరగాయలను సంప్రదాయక మార్కెట్లలో వినియోగదారులు ఎంత వరకు ఇష్టపడతారనే సందేహాలున్నాయి. రంగులప్రాధాన్యంప్రాంతానికో విధంగా ఉంటుంది. సాంస్కృతిక, సంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ఆలోచించుకోవాలి. రంగును బట్టి పోషకాలు!కూరగాయలు ఆయా రంగుల్లో ఉండటానికి మూల కారణం వాటిల్లోని ప్రత్యేక బయోయాక్టివ్ కాంపౌండ్లే. ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, క్లోరోఫిల్, బెటాలైన్స్ వంటి బయోయాక్టివ్ మూలకాలలో.. ఏ మూలకం ఉంటే ఆ కూరగాయకు ఆ రంగు వస్తుంది. → కూరగాయ వేరే రంగులో ఉంటే చూడముచ్చటగా ఉండటంతో పాటు దానిలో పోషకాల వల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. → ఆంథోశ్యానిన్ల వల్ల ఊదా, ఎరుపు రంగులు వస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించటంతో పాటు గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి. → కరొటెనాయిడ్ల వల్ల పసుపు, నారింజ రంగులు వస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. → క్లోరోఫిల్ వల్ల ఆకుపచ్చని రంగు వస్తుంది. శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపటానికి, పొట్ట సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపకరిస్తుంది. → ఎరుపు, పసుపు రంగు కూరగాయల్లో ఉండే బెటాలైన్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి.కలర్ బ్రీడింగ్‌తో ΄పౌష్టికాహార భద్రతఅధిక పోషకాలున్న రంగు రంగుల కూరగాయలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే ΄పౌష్టికాహార భద్రతకు దోహదమవుతుంది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులతో ఎం.ఎ.ఎస్, క్రిస్పర్ కాస్ 9 జన్యుసవరణ వంటి ఆధునిక పద్ధతులను మిళితం చేస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జెనిటిక్స్, బ్రీడింగ్ రంగంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులకు కలర్ బ్రీడింగ్ మంచి అవకాశాలను కల్పిస్తుంది.– డాక్టర్ రామన్ సెల్వకుమార్, సెంటర్ ఫర్ప్రొటెక్టెడ్ కల్టివేషన్ టెక్నాలజీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ), పూసా, న్యూఢిల్లీ -
ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్!
పెళ్లి వేడుకలు అనగానే...ఎంత ఖర్చు చేస్తే అంత గొప్ప అనే భావన చాలామందిలో ఉంది. అయితే కొందరు అందుకు భిన్నంగా ఉంటారు. చెన్నైకి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కమ్యూనిటీ బ్లాగర్ ఉమా రామ్ రెండో కోవకు చెందిన మహిళ. తన వివాహాన్ని ఎకో–ఫ్రెండ్లీ వెడ్డింగ్‌గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శుభలేఖల నుంచి పెళ్లి వేడుకల ముగింపు వరకు ప్రతి దశలోనూ పర్యావరణ దృష్టితో అడుగులు వేసింది.వివాహ వేడుకలో వ్యర్థాలను తగ్గించడానికి స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ టు భూమి’ సహాయం తీసుకొన్నారు. డైనింగ్ నుంచి డెకార్ వరకు వృథాను వెట్, డ్రై వేస్ట్‌గా వేరు చేశారు. వివాహ వేడుకల్లో ఉపయోగించిన పువ్వులు, పండ్లు, ఇతర కంపోస్టు చేయగల వ్యర్థాలను న్యూట్రీయెంట్–రిచ్ మాన్యూర్గా మార్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికలను సీడ్ పేపర్ నుంచి తయారుచేశారు. ‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అంటారు. ఈ మంచి సూత్రాన్ని వివాహ వేడుకలలో కూడా అనుసరిస్తే... పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు -
Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్‌గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్‌గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్‌కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్‌గా, స్టోర్ మేనేజర్‌గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్‌గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్‌గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్‌గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్‌కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్‌లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్‌ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్‌కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్‌కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే! -
ఐ డ్రాప్స్, ఇన్హేలర్లు ఎక్కువగా వాడుతున్నారా..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుతున్నా..డాక్టర్ని సంప్రదించకుండానే ఐడ్రాప్స్ తెచ్చుకుని వేసేసుకుంటాం. అలాగే కాస్త ముక్కుదిబ్బడగా ఉన్న వెంటనే నాసల్ ఇన్హేలర్లను వాడేస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణ రిలీఫ్ కోసం తరుచుగా వీటిని వాడేస్తుంటాం. ఇలా అస్సలు చేయొద్దని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ సమస్య తప్పదని చెబుతున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పదేళ్ల వయసున్న పిల్లలు గ్లాకోమా( Glaucoma)తో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఎందుకు జరగుతుందని వైద్యులు క్షణ్ణంగా పరిశీలించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిపాటి అలెర్జీలకైనా వెంటనే స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలను వాడుస్తుండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఎయిమ్స్‌లో నమోదైన దాదాపు చాలా కేసులు ఇలాంటి కోవకు చెందినవేనని వైద్యులు చెబుతున్నారు. ఇలా వైద్యుడిని సంప్రదించకుండా పదేపదే ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే గ్లాకోమా బారినపడి అంధత్వంతో బాధపడతారని చెబుతున్నారు. ఇలా స్టైరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, ఇన్హేలర్లు లేదా స్టెరాయిడ్లను మాత్రలు లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తే..అవి కంటిలోపల ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా కంటి లోపలి ఆప్టిక్ నరాలు దెబ్బతినడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కండ్లకలక కోసం ఈ ఐడ్రాప్స్ వినియోగించి గ్లాకోమా బారిన పడిన కేసులు రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు వైద్యులు. అదీగాక ఈ గ్లాకోమా లక్షణాలను ప్రారంభంలో గుర్తించకుండా చివరిదశలో రావడంతో చాలామంది పిల్లలు అంధత్వం బారినపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చాలామంది గ్లాకోమా రోగుల్లో ఇన్హేలర్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల్లో అంతగా కనబడని ఈవ్యాధి..స్టెరాయిడ్ ఆధారిత ఐడ్రాప్స్, ఇన్హేలర్లు వాడటం వల్లనే అని పరిశోధనలో తేలింది. సాధారణంగా వయోజన గ్లాకోమా 40 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుందట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధి బారినపడిన చరిత్ర, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, కంటి గాయం తదితరాల వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అథ్లెట్లు చర్మ సంబంధమైన స్టెరాయిడ్ క్రీమ్‌లు, కండరాల నిర్మాణానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వాడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇవి గ్లాకోమాకు దారితీస్తాయని అంటున్నారు. అంతేగాదు ముఖం మీద, కళ్ల చుట్టూ స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వినియోగిస్తే..గ్లాకోమాకు దారితీయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, క్రీమ్‌లు వినియోగిచొద్దని నొక్కి చెప్పారు. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుదల కూడా కంటిలోపలి ఒత్తిడిని పెంచుతుందని, ఇది కంటిలోపలి రక్తపోటుకు దారితీస్తుందని అన్నారు. ఏదైనా కారణం చేత ఆరు వారాలకు పైగా స్టెరాయిడ్లు తీసుకునే రోగులు తప్పనిసరిగా వైద్యులు చేత గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్లాకోమా అనేది లక్షణాలు లేకుండా మన కను దృష్టిని అదృశ్యం చేసే వ్యాధి. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గ్లాకోమా వ్యాది వచ్చిన చరిత్ర ఉన్న వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువని వెల్లడించారు. అంతేగాదు చాలామందికి తమకు గ్లాకోమా ఉందని తెలియదట. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించేలా.. కంటి స్క్రీనింగ్‌పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తేనే అంధత్వం బారినపడకుండా ఉండగలమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: 'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్ ) -
Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు
శరీరానికి ప్రాణం పోసేది శ్వాస. శ్వాస ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. అందుకే రోజువారీ దినచర్యలో శ్వాసను నియంత్రించడం చాలా అవసరమని యోగ చెబుతోంది. సంస్కృతంలో, "ప్రాణ" అంటే ప్రాణశక్తి లేదా శక్తి, " యమ" అంటే నియంత్రణ. యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆయువును పొడిగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణ, అనేక శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు, శరీర వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలని, యోగా ద్వారా శ్వాసను నియంత్రించడం సాధ్యమని యోగా నిపుణులు చెబుతారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి. ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస. ప్రాణాయామంతో మనస్సు, శరీరం రీఛార్జ్ యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి. శ్వాస మీద పని చేస్తున్నప్పుడు, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది. యోగా ఆసనాలతో కలిపి చేసే ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. సాధన చేయడానికి... ప్రాణాయామం చేయడానికి, ఒక ప్రశాంతమైన స్థానంలో కూర్చొని, వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు కళ్ళను మూసి, శ్వాసను లోపలికి పీల్చుకోవాలి. కొన్ని క్షణాలు ఆ శ్వాసను బిగించి, తర్వాత నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ఈ ప్రక్రియను పదే పదే పునరావృతం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి శక్తిమంతం అవుతాయి. శ్వాస సాధన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఐదు ప్రాణాయామాలు ఉన్నాయి. అనులోమ విలోమ ప్రాణాయామంకపాలభాతి ప్రాణాయామంభ్రమరి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం దిర్గ ప్రాణాయామం -
'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయించి విజయ ఢంకా మోగించి స్ఫూర్తిగా నిలుస్తారు కొందరు. అదికూడా యంగ్ ఏజ్‌లో కాకుండా వృద్ధాప్యంలో సాధించడం అంటే మాటలు కాదు. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలనుకున్న వారికే ఇదంతా సాధ్యం అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందింది ఈ అమ్మమ్మ. ఈ అమ్మమ్మ అందుకున్న గెలుపు వింటే..సూపర్ బామ్మ అని అనుకుండా ఉండలేరు. ఆ ఏజ్‌లో చదవాలనుకోవడమే గొప్ప..కానీ ఈ బామ్మ తనున్న వైకల్యానికి చదవాలనే నిర్ణయమే అత్యంత సవాలు. పైగా అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయం అందుకోవడం మరింత విశేషం. ఆ అమ్మమ్మ ఎవరు ఏంటా కథ సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలోని టేనస్స్ రాష్ట్రానికి చెందిన 47 ఏళ్ల అమండా జుయెట్టెన్కి ఉన్నత విద్యపూర్తి అయిన వెంటనే వివాహం అయిపోయింది. ఆ తర్వాత పిల్లల బాధ్యతలు, కుటుబ పోషణార్థం ఉద్యోగం చేయడం తదితరాలతో జీవితం గడిచిపోయింది. అమ్మమ్మగా మారే నాటికి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే పరిస్థితి కారణంగా కనుచూపు పోగొట్టుకుంది. కనీసం ఈ చరమాంకంలో అయినా ..ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామనుకుంటే..కంటి చూపే కరువైపోయింది అని విలవిలలాడింది. కనీకనబడకుండా ఉన్న ఆ కొద్దిపాటి కంటి చూపుతోనే ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడింది. ఆ క్రమంలోనే కొలరాడో సెంటర్ ఫర్ ది బ్లైండ్‌లో ఎనిమిది నెలల గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యింది. 30 ఏళ్లక్రితం వదిలేసిన చదువుని తిరిగి బుర్రకు ఎక్కించుకోవడం..పట్టు సాధించడం తదితరాలను తన ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా ఆమె ప్రగాఢమైన కోరిక ఆ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసింది. తన సంరక్షకుడు, గైడ్ అయిన తన పెంపుడు కుక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. తాను అందురాలిగా ఆ స్కిల్ నేర్చుకోకుండా మిగిలిపోకూడదనుకున్నా అని సగర్వంగా చెబుతోంది. అంతేగాదు అంధులకు స్వరం కావాలి. అందుకోసం మంచి ఉన్నత చదువులు చదవాలి..అప్పుడే వారు తమ గళాన్ని వినిపించగలరు అంటుందామె. వారిలో స్ఫూర్తి నింపేందుకే తన ఎడ్యుకేషన్ జర్నీని ఆపనంటోంది. డాక్టరేట్ కూడా సాధించాలనుకుంటోంది. మరీ ఆ అమ్మమ్మకి ఆల్ ద బెస్ట్ చెప్పి..విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..!.(చదవండి: భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు ) -
అశ్వినీ దేవతలు ఎవరు?
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరిసోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! ఈ క్షణమే సచ్చిదానందంనీవు ‘ఈ క్షణం’లో ఉన్నప్పుడు కాలం, ప్రదేశం అనేవే ఉండవు. అవి లేనప్పుడు దుఃఖం కూడా ఉండదు. ఈ క్షణంలో ఉన్నపుడు నీవే దైవం. అదే అత్మసాక్షాత్కార స్థితి. సచ్చిదానంద స్థితిలో ఉంటావు. నీవే దైవమైనప్పుడు నీ గురించి ఎవరేమి అనుకున్నా నీకు చెందదు కదా! అసలు వ్యక్తి అనేదే మనస్సు కల్పితం. ఈ క్షణంలో మనస్సు–శరీరం అనేవే ఉండవు. శరీరం–మనస్సు అనేవి కాలం–ప్రదేశము అనేవాటితో కలిసే ఉంటాయి. శరీరం ప్రదేశానికి సంబంధించినదైతే, మనస్సు కాలానికి సంబంధించినది. నీవు ఈ దేశకాలాలకు అతీతమైన స్థితిలో ఉండాలి ఎల్లప్పుడూ. అంటే అతి సూక్ష్మమైన ‘ఈ క్షణం’లో ఉండాలి. అంటే ఆత్మతో ఉండాలి. ఆ స్థితిలో నీవు అనంతుడివి. పుట్టుకలేదు, చావుకూడా లేదు. కేవలం ఒక శుద్ధ చైతన్యానివి. వ్యక్తివి కావు.ఈ స్థితిలో నీవు విశ్వచైతన్యంతో నేరుగా అనుసంధానమై ఉంటావు. పరమానందంలో ఉంటావు. ఈ క్షణంలో నీవు ఆత్మవు. ఈ క్షణం నుండి మళ్ళితే శరీరమే నేను, మనస్సు నేను అనే భ్రమలో ఉంటావు. అదే దుఃఖానికి మూలం. అందుకే దైవం ఆనందస్వరూపం అంటారు. నిర్గుణం, నిరాకారం, నశ్వరం, సర్వవ్యాపితం, ఆద్యంత రహితం అంటారే, దానికి కారణం ఇదే. మరి నీవు దైవం కావాలంటే ఈ క్షణంలో కదా ఉండాలి! ఆత్మస్థితిలో కదా ఉండాలి! నశించి΄ోయే భౌతిక ప్రపంచంలో దైవాన్ని వెదికితే దానికి అతీతమైన దైవత్వాన్ని ఎలా పొందగలవు? మనస్సుకు అతీతంగా ఎదుగు. దైవత్వాన్ని చేరకుండా అడ్డుపడుతున్నది ఈ మనస్సే. నీ శక్తులన్నింటినీ నీ మూలం వైపుకు మళ్ళించు.-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు. పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Life in India with Guru and Lila (@guru_laila) (చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. ) -
టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో
టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవరంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరిచేందుకు, వారికి భరోసా కల్పించేందు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ జరిగిందంటే..బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచి పోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ బుల్డోజర్లో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని జెసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశా,నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జెసిబిలను ఉపయోగిస్తున్నారు #Bengaluru continued to #experience #heavyrains, leading to #water entering homes in several parts and #flooding in #low-#lying #areas of the #city. As of 8 a.m., the #city received 105 mm of #rainfall in the past 24 hours, according to the (IMD). pic.twitter.com/iKYkdqk9xM— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 19, 2025మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, తుమకూరు, మండ్య, మైసూరు, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరె మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్ ,హోరామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్కర్ణాటక తీరప్రాంతంలో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది, ఉత్తర , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అతి భారీ వర్షాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, గడగ్, హవేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. -
దౌత్యవేత్త తలరాతనే మార్చేసిన ప్రేమ మైకం..! కట్‌చేస్తే..
ఎలా పుడుతుందో లేదా చిగురిస్తుందో తెలియని ఈ ప్రేమ..జీవితాలనే తలకిందులు చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కథా సుఖంతమవుతుంది. అయితే ఇది వలుపు వల లేదా ట్రాప్ అన్నది పసిగట్టగలిగితే సేఫ్‌గా ఉండొచ్చు. కానీ అసలు చిక్కు అంత అక్కడే ఉంటుంది. బహుశా దానికున్న శక్తి వల్లనో.. ఏమో..! ..ఎంతటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తినైనా దభాలున పడగొట్టేస్తుంది. తానేం చేస్తున్నది మర్చిపోయేలా దిగజార్చేస్తుంది. అచ్చం అలానే ఓ మహిళ గౌరవప్రదమైన హోదాలో ఉండి..కేవలం రెండక్షరాల ప్రేమ మాయలో పడి అపఖ్యాతీ పాలైంది. దేశ ప్రతిష్టనే దిగజార్చే పనులకు పూనుకుని కళంకితగా మిగిలింది. ఇటీవల అరెస్టు అయినా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ కథతో నాటి దౌత్యవేత్త మాధురి గుప్తా కథ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఎవరామె..? ఎలా పట్టుబడిందంటే..ఇటీవల జ్యోతి రాణిగా పిలిచే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టు అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టుతో భారత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఇలా ఎలా మన దాయాది దేశానికి గూఢచారులుగా మారుతున్నారని విచారణ చేస్తుంటే..ప్రేమ, డబ్బు తదితరాలే కారణాలుగా వెల్లడవుతున్నాయి. ఇదొక హనీట్రాప్ మాదిరిగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అచ్చం అలానే నాటి భారతీయ దౌత్యవేత్త అపఖ్యాతీ పాలై దోషిగా నిలబడిన ఘటన కళ్లముందు మెదులుతోంది. యావత్ దేశం తలదించుకునేలా దుశ్చర్యకు పాల్పడింది. అత్యున్నత హోదాలో ఉండి..అన్నేళ్లు అనుభవం అంతలా ఎలా దిగజారిపోయిందన్న అనుమానాలు లేవనెత్తాయి. ఇంతకీ ఎవరామె అంటే..ఆమె కథ ఓ బాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంటుంది. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి గుప్తా పాకిస్తానీ వ్యక్తిని ప్రేమలో పడి.. ఆ దేశం కోసం గుఢచారిగా మారిపోయింది. ఉర్దూలో నిష్ణాతురాలైన ఆమె సూఫీ కవిత్వంలో అతడికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2010లో ముంబై దాడుల అనంతరం 18 నెలలు తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో గుసగుసలు వినిపించాయి. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి పాక్‌కి గుఢాచారిగా పనిచేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో క్లోక్-అండ్-డాగర్ నిఘా ఆపరేషన్ చేపట్టి నిజనిజాలు వెలికితీసింది. ఆ ఆపరేషన్లోనే..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా పనిచేసిన ఆమె పాక్ అపరిచిత యువకుడితో ప్రేమలో పడటంతోనే..అమె అపార అనుభవం మంటగలిసిపోయిందని తేలింది. అస్సలు ఆమె అలా చేస్తుందని నమ్మబుద్ది కానీ విధంగా జాగ్రత్తపడిందని అన్నారు నిఘా అధికారుల. ఇక్కడ మాధురి గుప్తా పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ ప్రెస్ అండ్ ఐటీ విభాగంలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పాక్ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేయడం ప్రారంభించిందని తేలింది. అదీగాక ఆమెకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేసేలా బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె 30 ఏళ్ల జంషెడ్ అలియాస్ జిమ్‌ను కలిసింది. కొద్దికాలంలోనే అతడి ప్రేమలో పడింది. చెప్పాలంటే ఆమె హనీట్రాప్‌లో చిక్కుకుందని చెప్పారు అధికారులు. దేశ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆమెను వాడుకునేందుకు ఇలా ప్రేమ వలపును విసిరాడు జిమ్. అతడిపై ఉన్న గుడ్డిప్రేమతో ఆమె మన దేశ నిఘా కార్యకలాపాలను, రహస్య సమాచారాన్ని చేరవేయడం ప్రారభించిందని తెలిపారు. ఆమె మెయిల్ అకౌట్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఆ ఈమెయిల్లో వారి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణ బట్టి వారి మధ్య సాన్నిహిత్యం కాస్తా.. వివాహేతర బంధంగా మారిందని తేలింది. దీంతో నిఘా అధికారులు.. సార్క్ శిఖరాగ్ర సమావేశం నెపంతో ఆమెను ఏప్రిల్ 2010లో ఢిల్లీకి పిలిపించారు. అక్కడే భారత ఇంటిలిజెన్సీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడ ఆమె చేసిన నేరాలన్నింటిని అంగీకరించడం తోపాటు..ఇంత సమయం పట్టిందా నన్ను అదుపులోకి తీసుకోవడానికి అని అధికారులే అవాక్కయ్యేలా సమాధానమిచ్చింది మాధురి గుప్తా. ఆమెను అరెస్టు చేసి కోర్టుమందు హాజరుపరిచారు.అక్కడ ఆమె కేసు సంత్సరాల తరబడి కొనసాగింది. చివరికి వాదోపవాదనల అనంతరం మే 2018లో తీర్పు వెలువరించింది కోర్టు. ఆమె నేరపూరిత కుట్ర, గూఢచర్యం కేసులో దోషిగా నిర్థారిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఒకప్పుడూ గౌరవనీయమైన హోదాలో ఉండి దేశ ప్రతిష్టను దెబ్బతీసిలా పనులకు పూనుకోవడమే గాక మన దేశ భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొంటూ శిక్ష విధించింది. ఇలా చేయడానికి రీజన్.. కేవలం ఒంటరితనం, వృత్తిపరమైన సంఘటర్షణ లేదా వ్యవస్థపై ఉన్న కోపంతోనో ఇలా చేసి ఉండొచ్చనేది నిపుణులు అంచనా. కానీ ఈ స్టోరీలో దౌత్యవేత్తగా అత్యున్నత హోదాలో ఉన్న ఆమె పార అనుభవం, తెలివితేటలు 'ప్రేమ' అనే రెండు అక్షరాల ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందా అనేది మింగుడుపడని అంశంగా కనిపించింది అధికారులకి.(చదవండి: మెరిసిన చేనేత..మురిసిన భామలు) -
ఈ డ్రగ్‌తో జాగ్రత్త సుమీ! 2 గ్రాములు చాలు
ఈ మధ్య కాలంలో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్‌పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడులో స్వైరకల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోనూ అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు.అంతకుమించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు-బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ 5 గ్రాముల దాకా విడతలు, విడతలుగా తీసు కునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు... ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్‌ని ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసు కుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. కోకా ఆకులు నుంచి కొకైన్‌ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి, దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది.ఒక కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలో గ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్‌లో 70 శాతం పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. – మూర్తి కేవీవీఎస్ -
అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే. -
ఆ ఫుడ్..నాట్ గుడ్..!
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు. మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్లు ప్రమాదకరమే. చాకెట్లలో వాడే రోడ్మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు. పార్టీ కల్చర్.. ప్రమాదకరం కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది. నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్‌తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.నిబంధనలు బేఖాతర్ జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.నాసిరకం.. రంగుల మయం హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ∙నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటల్స్, ఐస్‌క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్‌ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్‌ను సేకరించగా 20 శాంపిల్స్‌లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్‌పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలుకల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! ) -
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! ) -
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్‌స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్‌లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట. చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి. లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు. వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి. -
శృంగేశ్వర్‌పూర్..గంగారామాయణ యాత్ర..
దక్షిణాది వాళ్లకు ఉత్తరాదికి యాత్రలంటే...కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి దర్శనాలు. అయోధ్య బాల రాముడు... సరయు నది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం...నైమిశారణ్యం పర్యటన... ఇవే ప్రధానం. రాముడు పడfనెక్కిన శృంగేశ్వర్‌పూర్..? గంగారామాయణ యాత్రలో ఇది ప్రత్యేకం!తొలి మూడు రోజులు..మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. బోన్గిర్, జనగాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కోయింజహార్ రోడ్, భద్రక్, బాలాసోర్‌ల మీదుగా మూడవ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బనారస్‌కు చేరుతుంది. హోటల్ గదికి చేరిన తర్వాత సాయంత్రం వీలును బట్టి స్వయంగా వారణాసిలో ప్రదేశాలను చూడవచ్చు లేదా విశ్రాంతి తీసుకోవచ్చు.నాల్గోరోజు..ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాశీ విశ్వనాథ కారిడార్‌లో విహారం, ఆలయ దర్శనం, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల సందర్శనం. సాయంత్రం గంగాహారతి వీక్షణం, ఆ తర్వాత రాత్రి బస.విశ్వానికి నాథుడుకాశీలో శివుడి పేరు విశ్వనాథుడు. ఇక్కడ శివలింగాన్ని భక్తులు తాకవచ్చు. తెల్లవారు ఝామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఐదు దాటిన తర్వాత గర్భగుడిలోకి అనుమతించరు. గది ఇవతల నుంచే దర్శనం చేసుకోవాలి. కొత్తగా నిర్మించిన ఆలయం గంగానది తీరం వరకు విస్తరించి చాలా చక్కగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పోలీసు గస్తీ కూడా బాగుంటుంది. ఇక్కడ దర్శనం క్యూలో ఉన్నంత సేపు పక్కనే ఉన్న జ్ఞాపవాపి ని చూడవచ్చు. అందులో ఉన్న నంది విశ్వనాథుడి ఆలయంలో ఉన్న శివలింగానిక అభిముఖంగా ఉంటుంది. కాశీ నగరం ప్రాచీనమైన నివాస ప్రదేశం కావడంతో ఆర్గనైజ్డ్గా ఉండదు. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగినంత ఇరుకు రోడ్లుంటాయి. విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, వారాహి ఆలయాలకు వెళ్లాలంటే ఇరుకు రోడ్ల మధ్య మనం ఊహించనన్ని మలుపులు తిరుగుతూ వెళ్లాలి. తెల్లవారు ఝామున విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఐదున్నరకు గంగానది తీరానికి చేరితే నది నీటిలో ప్రతిబింబించే సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రి బస కాశీలో కాబట్టి ముందురోజు సాయంత్రం గంగాహారతిని కూడా వీక్షించవచ్చు. కాశీలో టీ దుకాణాల్లో ఉదయం పూట మట్టి ప్రమిదలో తాజా మీగడలో చక్కెర వేసిస్తారు. చాలా రుచిగా ఉంటుంది. ఐదోరోజుఉదయం ఏడు గంటలకు రూమ్ చెక్ అవుట్ చేసి వారణాసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలోని అయోధ్యధామ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రామజన్మభూమి, హనుమాన్‌గరి చూసిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస.రాముడు పుట్టిన అయోధ్యరాముడు పుట్టిన ప్రదేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఆలయాన్ని ఆద్యంతం కనువిందు చేస్తుంది. కళ్లు వి΄్పార్చుకుని చూస్తే తప్ప తృప్తి కగలదు. ఆలయ ప్రాంగణం అంతా తిరిగి చూసిన తర్వాత క్యూలో వెళ్లి బాలరాముడిని దర్శించుకున్నప్పుడు భక్తులు తమ ఇంటి బిడ్డను చూసిన అనుభూతిని పొందుతారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత సరయు నదిని తప్పకుండా చూడాలి. సరయు నది గుప్త ఘాట్‌లో మునిగి రాముడు అంతర్థానమయ్యాడని చెబుతారు. ఇక్కడి కనకభవన్ భారీ నిర్మాణం కాదు కానీ ప్రాచీన కాలం నాటి నిర్మాణశైలి గొప్పగా ఉంటుంది. రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన త్రేతా కీ ఠాకూర్ ప్రదేశాన్ని, సీత వంటగది, దశరథ్ భవన్లను చూడడం మరువద్దు. హనుమాన్ గరి నుంచి చూస్తే అయోధ్య నగరం మొత్తం కనిపిస్తుంది. ఆరోరోజు..ఉదయం హోటల్ గది చెక్ అవుట్ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బాలామావ్ వైపు సాగి΄ోతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలామావ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆ రోజంతా నైమిశారణ్య సందర్శనం. చక్రతీర్థ, హనుమాన్ టెంపుల్, వ్యాసగద్ది చూసుకుని తిరిగి రైల్వేస్టేషన్‌కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదకొండు గంటలకు బాలామావ్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు సాగిపోతుంది.పురాణాల పుట్టిల్లునైమిశారణ్యం అంటే మన పురాణాల్లో కనిపిస్తుంటుంది. దాదాపు ప్రతి పురాణమూ శుక మహర్షి నైమిశారణ్యంలో సనకసనందాది మునులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అనే ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రదేశం నైమిశనాథ్ విష్ణు టెంపుల్. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఉంది. వైష్ణవ అళ్వారులు చెప్పిన 108 దివ్యదేశాలలో ఇదొకటి. ఈ ఆలయ నిర్మాణం దక్షిణాది ఆలయ నిర్మాణశైలిలో ఉంటుంది. లోపలి మందిరం, గర్భాలయం మాత్రం ఉత్తరాది నిర్మాణశైలిలో ఉంటుంది. మూడు గర్భాలయాలుంటాయి. అందులో ఒకటి విష్ణువు, ఒకటి లక్ష్మీదేవి కోసం ఉండగా మరొకటి రామానుజాచార్యుల గర్భాలయం. దేవీదేవతలతోపాటు సమాజానికి సమానత్వం, ఆధ్యాత్మికత మార్గదర్శనం చేసిన గురువుకి కూడా స్థానం లభించడం గుర్తించాల్సిన విషయం. ఆలయం ఆవరణలోని చక్రతీర్థాన్ని పుణ్యతీర్థంగా భావిస్తారు. గోమతి నది స్నానం చేయవచ్చు. ఆదిశంకరాచార్యుడు, మహర్షి సూరదాసు కూడా ఇక్కడ స్నానమాచరించి చక్రతీర్థాన్ని దర్శించుకున్నారని చెబుతారు. ఇక ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం వ్యాసగద్ది. వేదవ్యాసుడు ఇక్కడ నివసించిన సమయంలో ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చునేవాడని నమ్ముతారు. వ్యాసుని గౌరవార్థం ఆ ప్రదేశంలో చిన్న నిర్మాణం చేశారు. ఈ మర్రిచెట్టు ఐదువేల ఏళ్ల నాటిది.ఏడో రోజుఉదయం ఏడు గంటలకు ప్రయాగ సంగమం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం రిఫ్రెష్మెంట్ తర్వాత త్రివేణి సంగమానికి చేరాలి. నదిలో విహారం, స్నానమాచరించడం, నీటిని బాటిళ్లలో పట్టుకోవడం, ఇతర క్రతువులు పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ మందిర్, ఆదిశంకరాచార్య విమానమంటపాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తరవాత రోడ్డు మార్గాన శృంగ్వేర్పూర్కు వెళ్లాలి. ఇది ప్రయాగ్‌రాజ్ నుంచి 40 కి.మీ.ల దూరాన ఉంది. ఓ గంట ప్రయాణం. ఆ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి ప్రయాగ్‌రాజ్‌కి వచ్చి రైలెక్కాలి. రాత్రి ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.అరణ్యవాసానికి దారిశృంగ్వేర్పూర్ పెద్దగా ప్రచారం సంతరించుకోని యాత్రాస్థలం. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. రామలక్ష్మణులు సీతాదేవి అయోధ్య నుంచి అరణ్యవాసం వెళ్లేటప్పుడు గంగానదిని దాటింది ఇక్కడేనని చెబుతారు. ఈ ప్రదేశాన్ని పాలిస్తున్న నిషధరాజు మత్స్యకారుడు. అతడు రామలక్ష్మణసీతాదేవికి తన రాజ్యంలో ఆతిథ్యమిచ్చి మరుసటి రోజు పడవ ఎక్కించి సాగనంపాడు. ఇది ఇలా ఉంటే ఈ ప్రదేశానికి ఈ పేరు శృంగి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల వచ్చింది. ఇతిహాస కథనం ఇలా ఉంటే చారిత్రక ఆధారాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పురాతన శృంగ్వేర్పూర్ నిర్మాణాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ ప్రదేశం అయోధ్య నగరానికి 170 కిమీల దూరాన ఉంది.ప్యాకేజ్ వివరాలుగంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర (ఎస్‌సీజెడ్‌బీజీ44). భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్యాకేజ్‌లో ఇది (గంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర) తొమ్మిది రోజుల యాత్ర. ఈ టూర్లో వారణాసి, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌రాజ్, శృంగ్వేర్పూర్ క్షేత్రాలు కవర్ అవుతాయి. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో 26,500, ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్)లో 16,200 రూపాయలవుతుంది. ఈ ప్యాకేజ్‌లో ట్విన్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అవకాశం లేదు.కంఫర్ట్ కేటగిరీకి ఏసీ హోటల్ గది, లోకల్ జర్నీకి ఏసీ వాహనాలు. స్టాండర్ట్ కేటగిరీకి ఏసీ గదులు, నాన్ ఏసీ వాహనాలు. ఎకానమీకి నాన్ ఏసీ గదులు, నాన్ఏసీ వాహనాలలో ప్రయాణం. అన్ని రోజులూ ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి శాకాహార భోజనాలు ఉంటాయి.ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్, ట్రైన్లో సెక్యూరిటీ ఉంటుంది. పర్యాటకులకు అవసరమైన సర్వీసుల సహాయం ఏర్పాటు చేయడం కోసం టూర్ మేనేజర్ ఆద్యంతం ప్రయాణిస్తారు. పైన చెప్పుకున్నవన్నీ ప్యాకేజ్ ధరలో వర్తిస్తాయి. ఇక ఇప్పుడు చెప్పుకునేవి ఆ ధరలో వర్తించవు. బోటు విహారం, స్పోర్ట్స్, పర్యాటకప్రదేశాల ఎంట్రీ టికెట్లు, ప్యాకేజ్‌లో ఇచ్చిన భోజనం కాకుండా వేరే ఆర్డర్ చేసుకుంటే ఆ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర పానీయాలు తీసుకున్నా విడిగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం.https://www.irctctourism.com/pacakage_description?package– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే.. ) -
మండే ఎండలు: జర జ్యూస్ కోండి!
ఎండలు మండిపోతుండటంతో నగర వాసులు బెస్ట్ పానీయాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు కూల్‌డ్రింక్స్, సోడాలు ఆధిపత్యం చెలాయించినా.. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూసహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎండ వేడిలో శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతల సమతుల్యత కాపాడటం ప్రామాణికంగా మారుతున్న నేపథ్యంలో పోషక విలువలు కలిగిన పదార్థాల వినియోగానికే జై కొడుతున్నారు. ట్రైనర్లు సైతం వేసవిలో సహజ, పోషక పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుండటంతో ఇప్పుడిదే ట్రెండ్‌గా మారింది. – సాక్షి, సిటీబ్యూరో అలోవేరా, కీరా, బీట్రూట్ ఇలా ఎన్నెన్నో.. వేసవి తాపానికి ఉపశమనం అంటున్న నిపుణులు సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్టుల ప్రభావం ఫుట్‌పాత్ నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు లభ్యం ఇష్టంగా జ్యూస్‌లు తాగుతున్న ఈతరం యువత హెర్బల్ రింగ్స్ ఇందులో మరో ప్రత్యేకంసామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ఆరోగ్య పానీయాలపై ఆసక్తి పెరగడం ద్వారా, ఇది తాత్కాలిక ఫ్యాషన్ కాకుండా జీవనశైలిలో భాగంగా మారిన ఆరోగ్యకరమైన అలవాటు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేసవిలో చల్లదనం కోసం, ఆరోగ్యం కోసం ఈ తాజా పానీయాల ట్రెండ్‌ను మెచ్చుకోకుండా ఉండలేమంటున్నారు. ఈ మధ్య సినీనటి కీర్తిసురేష్‌తో పాటు పలువురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అందానికి, ఆరోగ్యానికి ఈ పానీయాలు కూడా ప్రధాన కారణమని చెబుతుండటంతో యువత వీటిపై మోజు పెంచుకుంటోంది. ఈ పానీయాల తయారీ కోసం ఫుడ్ బ్లాగర్స్ ప్రత్యేకంగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కూల్ కూల్ సబ్జా.. సబ్జా గింజలతో కూడిన పానీయాలకు మార్కెట్లో ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా ఇవి శరీర చల్లదనానికి దోహదపడతాయి. ముఖ్యంగా లెమన్ జ్యూస్, రోస్ షర్బత్, మిల్క్ బేస్డ్ డ్రింక్స్‌లో సబ్జా గింజల వినియోగం విస్తృతంగా పెరిగింది. శరీరానికి కూలింగ్ ఇచ్చే ఈ గింజలు, అధిక వేడిలో పొట్టకు ఉపశమనంగా పనిచేస్తాయి. సరికొత్తగా అలోవేరా.. ఆరోగ్యకరమైన అభిరుచులలో అలోవేరా జ్యూస్ ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలో అలోవేరా జ్యూస్ వైరల్‌గా మారడంతో.. దీనిని సైతం ఇష్టంగా సేవిస్తున్నారు. ఇది దాహాన్ని తీరుస్తూనే, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా లాభదాయకంగా ఉండటంతో మహిళలకు ఈ జ్యాస్ నచ్చేసింది. వేడిమి సమతుల్యం.. క్యారెట్, బీట్రూట్, కీరా వంటి కూరగాయల జ్యూస్‌లు ఆల్‌టైం ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో ఇబ్బంది లేకుండా తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందిస్తాయి. బీట్రూట్ జ్యూస్ రక్తహీనత నివారణకు, క్యారెట్ జ్యూస్ కంటికి మేలు చేసేందుకు, కీరా శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు ఉపయోగపడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులుగా.. సంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా ఎప్పటిలానే వాటి స్థానాన్ని నిలుపుకున్నాయి. వీటిలో సహజమైన తీపి, విటమిన్లు, మినరల్స్ ఉండటం వలన ఇవి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి నీళ్లు, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తే, చెరుకు రసం శక్తిని పెంచుతుంది.ఔషధ పానీయాలు సైతం.. ఇదే సమయంలో పుదీనా, తులసి వంటి ఔషధ గుణాలు కలిగిన పానీయాలు ఇప్పుడు మార్కెట్లో దొరకుతున్నాయి. వీటిలో పుదీనా శ్వాస సంబంధిత సమస్యలకు, తులసి ఇమ్యూనిటీ మెరుగు పరిచేందుకు సహాయపడతాయి. హెర్బల్ టీ, తులసి వాటర్ వివిధ రూపాల్లో లభిస్తున్నాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఫుట్పాత్ టు ఫైవ్ స్టార్.. ఈ పానీయాలు కేవలం ఫుట్‌పాత్ జ్యూస్ స్టాల్స్ వరకు మాత్రమే కాకుండా.. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూడా ప్రత్యేక మెనూలో చోటు దక్కించుకున్నాయి. హోటల్ లాబీలలో గ్రీన్ హెల్త్ షాట్స్, డిటాక్స్ జ్యూస్‌లు, స్పెషల్ డ్రింక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. రాత్రి సేదతీరే క్లబ్, పబ్‌లలో కూడా ఈ పానీయాలకు ఆదరణ పెరిగింది. ఇదొక మోడ్రన్ లివింగ్ స్టైల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. -
ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్‌ను అనన్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్స్టైల్తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్‌కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్‌గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్‌ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్‌తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్‌కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్‌బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి, View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడిఅనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్‌ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. -
సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..
చిన్నప్పుడే విద్యుత్ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్ జీవితంపై స్పెషల్ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్ వచ్చి షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్..నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్ జామ్ షోకు హాజరై అక్కడ మెగాస్టార్ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్లు ప్రభాస్, వెంకటేష్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్ గ్రామం, మునిపల్లి మండలం -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్‌కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా) -
గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే..
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్‌క్రీం డిజర్ట్‌లలో గోల్డ్‌తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్‌లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..ఇండోర్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్‌తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్‌కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్‌తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట. చివరగా ఈ సరఫా బజార్లో ది గోల్డ్‌మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్‌గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్‌ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!) -
హైబీపీని అదుపులో ఉంచుకుందాం ఇలా..!
హైబీపీ అనేది జీవనశైలికి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య. ఇది ఒకసారి కనిపించాక ఇక దాదాపు బాధితుల జీవితకాలమంతా హైబీపీ వాళ్ల జీవనాన్నీ, అలవాట్లను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నార్మల్‌గా 120 / 80 ఉండాల్సిన బీపీ కొలత అంతకంటే ఎక్కువగా ఉండటాన్ని హైబీపీ లేదా హైపర్‌టెన్షన్‌గా చెబుతారు.హైబీపీ ప్రధానంగా జన్యు కారణాల వల్లనే వస్తుంది. అయితే వాళ్ల జీవనశైలిలో భాగంగా వాళ్లు తీసుకునే ఆహారం, దేహానికి దొరికే వ్యాయామం అలాగే వాళ్లు అనుభవించే ఒత్తిడి... ఇవన్నీ హైబీపీ వచ్చేందుకు కారణమవుతుంటాయి. నివారణ ఇలా... ఆరోగ్యకరమైన జీవనశైలితో హైబీపీని చాలావరకు నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. ఆహార పరంగా: ఆహారంలో సోడియమ్ మోతాదులు ఎక్కువగా తీసుకోవడం నేరుగా బీపీని పెంచుతుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, క్యాన్డ్ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే శ్నాక్స్ వంటివి తగ్గించాలి. పొటాషియమ్ ఉండే ఆహారాలతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అందుకే పొటాషియమ్ మోతాదులు ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆహారంతో హైబీపీని నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’గా చెబుతారు. ఇందులోని మొదటి అక్షరాలను తీసుకుని సంక్షిప్తంగా ఈ పద్ధతిని ‘డ్యాష్’గా పేర్కొంటారు. డ్యాష్ ఆహారాల్లో భాగంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లతో హైబీపీని నియంత్రించవచ్చు. వ్యాయామం ఇలా... ప్రతివారం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం చేస్తుండటం మంచిది. మానసిక ఒత్తిడి... దీర్ఘకాలిక ఒత్తిడి హైబీపీకి కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని అదుపు చేసేందుకు యోగా, ధ్యానం, శ్వాసవ్యాయామాల వంటి ప్రక్రియలు అనుసరించడం మేలు. మద్యం, పొగతాగడానికి దూరంగా... మద్యం, పొగతాగే అలవాట్లు హైబీపీని మరింత ప్రేరేపిస్తాయి. అందుకే ఆ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు... పొగతాగని వారితో పోలిస్తే పొగతాగేవారిలో... రక్తనాళాల్ని పెళుసుగా మార్చే ‘అథెరో స్కిప్లోరోసిస్’ అనే సమస్య 10 ఏళ్ల ముందుగా వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. మరికొన్ని ఇతర సూచనలు...స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. దాంతో బీపీ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ∙రోజూ కనీసం 7 – 9 గంటలు కంటినిండా నిద్రపోవాలి. ఇక క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ ఉంటూ దాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ∙హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మోతాదులో మందులు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్‌కు చెప్పకుండా మానేయడం సరికాదు. చివరగా... బీపీ రీడింగ్‌ను క్రమం తప్పకుండా ఖచ్చితమైన రీతిలో చూసుకుంటూ, దాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా సుదీర్ఘకాలం పాటు మామూలుగానే జీవించడం సాధ్యమవుతుంది. డాక్టర్ అంజని ద్వారంపూడికన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ (చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! మై ప్లేట్ ఫర్ ది డే మెనూ..)∙ -
కొత్త 'అమ్మ'లూ.. కొన్ని సమస్యలు!
ఓ మహిళ తల్లి అయ్యాక ఆ మాతృమూర్తి ఎదుర్కొనే సమస్యలు ఎన్నెన్నో. ఓ తల్లి ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటికి సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ... ఇవి ఆ తల్లులకు ఉపయోగపడతాయని ఆశిస్తూ... ఓ తల్లి అమ్మగా మారాక బిడ్డ పాలు తాగకపోయినా లేదా పాలు తాగాక ఆ చిన్నారికి విరేచనాలవుతున్నా, బిడ్డకు కడుపునొప్పి వచ్చినా... ఇలా ఏం జరిగినా తల్లికి ఆందోళనే. తల్లులు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలనూ, సమాధానాల్నీ చూద్దాం. పాలు సరిగా పడుతున్నామా అనే సందేహమా? కొత్తగా తల్లిగా మారిన మహిళల్లో చాలామందికి తాము సరిగానే ΄ాలుపడుతున్నామా లేదా అనే సందేహం వస్తుంటుంది. ఒక రొమ్ము ఫీడ్ చేస్తున్నప్పుడు దానిలో ΄ాలు అయిపోయేవరకు బిడ్డ తాగుతున్నాడా అని డౌటొస్తుంటుంది. రొమ్ము మార్చడమెప్పుడో తెలియక కంగారొస్తుంటుంది. ఇలాంటి సందేహాలకు కొన్ని సూచనలివి... సాధారణంగా పిల్లలు పాలు తాగే ప్రక్రియ 10–15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు పాలుతాగడానికి అలవాటు పడటానికి కాస్త టైమ్ పట్టవచ్చు. చాలామంది పిల్లలు ఒక పక్క పాలు తాగి సంతృప్తిపడతారు. కానీ కొందరు ఒక పక్క తాగి మళ్లీ మరో పక్క కూడా తాగుతారు. పాలు పట్టేటప్పుడు చివరలో వచ్చేవాటిని హైండ్ మిల్క్ అంటారు. ఈ పాలలో ఎక్కువ క్యాలరీస్ ఉండి, బిడ్డ బరువును పెంచడానికి ఎక్కువగా సహాయపడతాయి. బిడ్డ మామూలుగా రోజుకు ఐదారుసార్లు మూత్ర విసర్జన చేస్తూ, బరువు పెరుగుతుంటే ఆ బిడ్డకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. తల్లిలో బిడ్డకు సరిపోయినన్ని పాలు పడాలంటే... బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే తల్లులు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పాలిచ్చే తల్లుల ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. రోజూ తాము తీసుకునే ఆహారంలో ఆకుకూరల్ని మార్చుతుండటం వల్ల పాల ఫ్లేవర్ మారుతూ బిడ్డ పాలు తాగడానికి ఉత్సాహం చూపుతుంది. తల్లులకు ఉండకూడనిది మానసిక ఆందోళన. బిడ్డకు పాలు సరిపోతాయా లేదా అని ఆందోళన చెందకుండా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండంటం వల్ల పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా బాగాస్రవించి పాలు పెరగడానికి అవకాశమెక్కువ. బిడ్డలకు వచ్చే కడుపునొప్పి... కొందరు చిన్నారి బిడ్డలు ఎప్పుడూ ఏడుస్తుంటారు. కారణం చెప్పడానికి నెలల చిన్నారికి మాటలురావు. బిడ్డ అలా ఏడుస్తుంటే తల్లికి ఏమీ పాలుపోదు. నెలల పిల్లలు అలా ఏడుస్తున్నారంటే కారణం వాళ్ల తొలి సమస్య కడుపునొప్పి. వైద్యపరిభాషలో దాన్ని ‘ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్’ అంటారు. అందుకే ఈ కంప్లెయింట్‌తో వెళ్లిన పిల్లలకు కడుపునొప్పి తగ్గే మందు ఇస్తుంటారు చిన్న పిల్లల వైద్యులు. పిల్లలు ఏడుస్తున్నప్పడు ఆందోళన పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు మందు తీసుకోవడం తల్లి చేయాల్సిన మొదటి పని. నెలల బిడ్డకు విరేచనాలవుతుంటే... కొన్నిసార్లు పాలు తాగగానే నెలల పిల్లలకు విరేచనాలు అవుతుంటాయి. తల్లికి పెద్ద సందేహం... తన పాలు సరిపడక పోవడం వల్లనే అలా జరుగుతుందేమోనని. నెలల వయసప్పుడు ఆలు తాగగానే విరేచనాలు కావడం పిల్లల్లో చాలా మామూలుగా జరిగేదే. పాలు సరిపడకసెవడం అన్నది చాలా తక్కువమంది పిల్లల్లోనే జరుగుతుంది. విరేచనాలు అవుతున్నప్పటికీ పిల్లలకు తల్లిపాలు పట్టిస్తూ ఉండాలి. కాకపోతే గమనించాల్సిందేమిటంటే... బిడ్డ బరువు ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. బరువు తగ్గనంతవరకు బిడ్డకు ఎలాంటి సమస్యా ఉండదు. విరేచనాలు అవుతున్నాయనే కారణంతో తల్లి΄ాలు ఇవ్వడాన్ని ఆపడం ఎంతమాత్రమూ మంచిది కాదు. అలా ఆపితే వాళ్లు మరింత డీ–హైడ్రేషన్‌కు లోనవుతారు. అది చిన్నారులకు మరింత ముప్పు తెచ్చిపెట్టవచ్చు. బిడ్డ తాలూకు ప్రతి అవయవం ఎదుగులకు, చిన్నారి వికాసానికి (మైల్‌స్టోన్స్‌కు) తల్లిపాలకు మించిన ఆహారం లేదు. దానికి మించిన ప్రత్యామ్నాయమూ లేదు. అందుకే బిడ్డకు తల్లిపాలు పట్టడమే చాలా ఉత్తమం. ఒకవేళ ఇలా ΄ాలుపడుతునప్పటికీ బరువు పెరగడం లేదని గమనిస్తే అప్పుడు వెంటనే పిల్లల వైద్యుని సంప్రదించాలి. అప్పుడు వాళ్లు విరేచనాలకు వేరే కారణాలైమైనా ఉన్నాయా అని చూసి, దానికి తగిన చికిత్స అందిస్తారు. బాబు / పాప సరిగా అన్నం తినడం లేదా? చిన్నారి పుట్టాక వాళ్లకు ఘనాహారం అలవాటు చేశాక... వాళ్లు పెరిగి పెద్దయ్యే వరకూ దాదాపుగా ప్రతి తల్లీ చేసే ఫిర్యాదు ఇదే. అన్నం పెడితే బిడ్డ సరిగా తినడం లేదంటూ ప్రతి తల్లీ తమ డాక్టర్‌ను ఏదో ఒక సందర్భంలో అడిగి తీరుతుంది. బిడ్డకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నప్పుడు వాళ్లు తిన్నంత తినిపించాలి. వాళ్లు వద్దన్న తర్వాత ఒకటి రెండుసార్లు తినిపించాక ఇక తినమంటూ మారాం చేస్తే ఆపేయాలి. అంతేతప్ప వాళ్లను బతిమాలి, బెదిరించి, బలవంతంగా తినిపించకూడదు. ఇలాంటి పిల్లల్లో చూడాల్సిందేమిటంటే వాళ్లేమైనా చురుగ్గా ఉండటంలేదా, బరువు తగ్గుతున్నారా అని గమనించాలి. ఇక వాళ్లు చురుగ్గా ఆడుకుంటూ, తమ వికాసానికి తగిన తెలివితేటలను చూపుతూ, మునపటి కంటే బరువు తగ్గకుండా క్రమంగా పెరుగుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వారు బరువు పెరగకపోయినా లేదా తగ్గుతున్నా వాళ్లకు లోపల ఏదైనా సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఈ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన అంశాల వల్ల లేదా వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు/ఆకృతిని బట్టి కూడా బరువు పెరగకపోవచ్చు. లేదా తినిపిస్తున్నప్పటికీ పౌష్టికాహార లోపం వల్ల కూడా బరువు పెరగకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించి, తగిన చికిత్స అందించాలి. (చదవండి: -
వారాంతంలో సరదా సరదాగా ఈ స్కిల్స్ నేర్చుకుందాం..!
వారం రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపేస్తున్న హైదరాబాద నగర ప్రజలు వారాంతంలో మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆకట్టుకోవడానికి వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీ, పెయింటింగ్స్, బేకింగ్, క్యాండిల్ తయారీ, రెసిన్ ఆర్ట్ తదితర రంగాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత సమయం కేటాయిస్తున్నారు. ప్రవేశ రుసుముగా కొంత నామమాత్రపు ఫీజు సైతం వసూలు చేస్తారు. కొన్ని చోట్ల నిర్వాహకులే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్‌షాప్‌లు నడుస్తాయి. మట్టి పాత్రల తయారీమట్టి పాతల్ర తయారీపై హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆదివారం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలి హార్ట్‌కప్ కాఫీ, లాస్ట్ హౌస్ కాఫీ, హౌస్ ఆఫ్ గౌర్మెట్, తదతర ప్రాంతాల్లో లైవ్ వర్క్‌షాప్‌లు ప్రారంభమవుతాయి. మట్టితో మమేకం కావడం, ప్రకృతితో కలిసిపోవడం, ప్రశాంమైన వాతావరణంలో మట్టితో పాత్రలు తయారు చేయడం అనేది ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక్కో వ్యక్తికి గంట నుంచి 3 గంటల పాటు పాత్రలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. తయారు చేసిన కుండలు, ఇతర పాత్రలు ఏవైనా మన వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఇవి తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మట్టి, యంత్రాలు, అన్నీ నిర్వాహకులే సమకూర్చుతారు.కొవ్వొత్తుల తయారీలో శిక్షణజూబ్లీహిల్స్లోని మకావు కిచెన్ అండ్ బార్లో హేండ్ మేడ్ కొవ్వుత్తుల తయారీపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనకు నచి్చన డిజైన్, మోడల్స్‌లో కొవ్వుత్తులు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌షాప్ ఉంటుంది. రెసిన్ ఆర్ట్రంగులు కలపడం, కొత్త డిజైన్లకు అంకురార్పన చేయడం, ఆర్ట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అద్భుతమైన, మెస్మరైజింగ్ రెసిన్ ఆర్ట్ వర్క్‌షాప్‌ను మాకోబ్రూ వరల్డ్ కాఫీ బార్, అమోరోసో హైదరాబాద్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాలు కొనసాగుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేక్ తయారీపై.. నార్సింగిలోని మైథూస్ బ్రేవ్ పబ్ అండ్ కిచెన్ ఆధ్వర్యంలో కేక్ తయారీపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. తయారీ విధానంలో మెలుకువల నేర్చుకోవచ్చు. తదుపరిఇంటోనే కొత్త రుచులను పర్ఫెక్ట్గా సిద్ధంచేసుకునే కాని్ఫడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. (చదవండి: -
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్ బైజాన్లపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లోనే భారీ ఎత్తున బుకింగ్స్ రద్దయినట్లు నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు తరలివెళ్తారు. ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు తుర్కియే, అజర్బైజాన్ల సందర్శనకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అంచనా. తుర్కియే, అజర్బైజాన్ దేశాల్లో అందమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది కుటుంబాలతో సహా టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగానే ఈ రెండు దేశాల పర్యటనలను రద్దు చేసుకోవడం విశేషం. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం తుర్కియే, అజర్బైజాన్ల బుకింగ్‌లను రద్దు చేయాలని అన్ని ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లకు సర్క్యూలర్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూర్ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చే బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు నగరానికి చెందిన వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. రెండు, మూడు రోజులుగా నగరం నుంచి సుమారు 10 వేల మందికిపైగా పర్యాటకులు తమ టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకే ఎందుకు.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, మలేíÙయా, శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొంతకాలంగా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్ టూర్లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆకట్టుకొనే అందమైన పార్కులు ఉన్నాయి. తుర్కియేలో కేవలం సినిమా షూటింగ్లకే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే చారిత్రక ఇస్తాంబుల్ నగరం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న బ్లూ రివర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. హగీష్ సోఫియా చారిత్రక మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. పురాతన కట్టడాలు, కోటలు, గొప్ప ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అజర్‌బైజాన్‌లోని పాతనగరం బాకు మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. వందల సంవత్సరాల నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలకు ఇది నిలయం. హైదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, జొరాస్ట్రియన్ల చారిత్రక ఫైర్ టెంపుల్ వంటివి ఆకట్టుకొనే ప్రదేశాలు.షాపింగ్ సెంటర్.. మినీ చైనాగా పేరొందిన తుర్కియో నుంచి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్బుల్స్, ఫర్నీచర్, యాపిల్స్ దిగుమతి ఎక్కువగా ఉంది. అలాగే ఈ దేశానికి వెళ్లిన పర్యాటకులు కూడా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇస్తాంబుల్‌లోని గ్రాండ్ బజార్ అతి పెద్ద స్ట్రీట్ మార్కెట్. సుమారు 4 వేలకుపైగా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. దుస్తులు, ఆభరణాలు, టర్కి, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ లభిస్తాయి. అలాగే అంకారాలోని అంకామాల్, కెనెరాలోని ఆస్కార్బజార్ వంటి మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.ఉందిగా.. ప్రత్యామ్నాయం.. తుర్కియే, అజర్బైజాన్ టూర్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్న పర్యాటకులు ప్రత్యామ్నాయంగా వియత్నాం, దుబాయ్, మలేసియా, బ్యాంకాక్, ఇండోనేషియా తదితర దేశాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ‘ఆ రెండు దేశాల బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.’ కూకట్‌పల్లికి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
ప్లీజ్..నో సప్లిమెంట్స్..!
మీకు విటమిన్ ఇ లోపం ఉంది.. మీకు ప్రోటీన్స్ సరిపోవడం లేదు.. ఈ సప్లిమెంట్స్ తీసుకోండి.. అంటూ సూచించే వైద్యులు, పోషకాహార నిపుణులతో పాటు వాటిని వినియోగించే నగరవాసులూ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో సప్లిమెంట్స్‌ను అతిగా వినియోగించవద్దని హైదరాబాద్ నగరానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ఫలితం ఆధారంగా సూచిస్తోంది. అధిక సప్లిమెంట్స్ వాడకం హానికరం అంటున్న ఎన్ఐఎన్.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది. బలవర్థకమైన ఆహారాల నుంచి దొరకని పోషకాలను సప్లిమెంట్లు/మాత్రలు/క్యాప్సూల్స్ అందిస్తాయి అనేది నిజమే అయినా కొన్ని పోషకాలను సప్లిమెంట్లుగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాల సహజ శోషణకు ఆటంకం కలుగుతుందని ఎన్ఐఎన్ హెచ్చరిస్తోంది. రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లపై అధికంగా ఆధారపడటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తోంది. తాము సూచించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’లో సూచించిన సమతుల ఆహారం ద్వారా అందేవి మరే ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు అందించలేవని స్పష్టం చేస్తోంది. ’మై ప్లేట్ ఫర్ ది డే’ మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని పోషకాలు మన శరీరానికి అందేందుకు మై ప్లేట్ ఫర్ ది డే అనే ఆసక్తికరమైన మెనూను ఎన్ఐఎన్ రూపొందించింది. ఇది మన ఆహారంలో అవసరమైన పోషకాహార స్పష్టతను అందిస్తుంది. రోజువారీ ఆహారం కోసం వివిధ ఆహార సమూహాల ఖచ్చితమైన నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి ‘భారతీయుల పోషక అవసరాలు’ ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. రోజుకు 2వేల కేలరీలు.. అదే ఆరోగ్యానికి మేలు వ్యక్తులు(చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా) తమ పోషక అవసరాలను తీర్చుకునేందుకు రోజుకి 2 వేల కిలో కేలరీలు/ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ‘మై ప్లేట్ ఫర్ ది డే’ చెబుతోంది. అయితే ఇది కేవలం కేలరీలు అందించే ఆహారం మాత్రమే కాకూడదని, దీనిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఇలా ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చడానికి సరైన నిష్పత్తిలో ఉండాలని సూచిస్తోంది. రోజుకి 2వేల కిలో కేలరీల ఆహారం కోసం.. కూరగాయలు ఆకు కూరలు: 400 గ్రాములు(ముడి బరువు), మిల్లెట్లతో సహా తృణధాన్యాలు: 260 గ్రాములు, పండ్లు: 100 గ్రాములు, పప్పులు/గుడ్లు/మాంసపు ఆహారాలు: 85 గ్రాములు, గింజలు విత్తనాలు: 30 గ్రాములు, కొవ్వులు నూనె: 27 గ్రాములు, పాలు/పెరుగు: 300 మి.లీ.శోషించే ఆహారమే.. మేలు ఆరోగ్యకరమైన సహజ ఆహారాలను శరీరం బాగా గ్రహిస్తుంది. అంతేకాకుండా అవి ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు ఖనిజాల తీవ్రమైన కొరతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం, అన్ని సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫంక్షనల్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని తగినంతగా తీసుకోవడం మంచిదని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’ ఎలా ఉండాలో డిజైన్ చేసి అందిస్తోంది. స్నాక్స్.. ఆరోగ్యకరంగా.. అవసరమైన కేలరీలకు మించకుండా స్నాక్స్ తినడం వల్ల నష్టం లేదు. కొన్ని రకాల స్నాక్స్ బరువు తగ్గడానికి సహకరిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్. స్నాక్స్‌గా ఆయన గుప్పెడు కాలిఫోరి్నయా ఆల్మండ్స్ సూచిస్తున్నారు. ఈ బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఇవి బెస్ట్, అలాగే నూనె లేకుండా వండిన మూంగ్ దాల్ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైనమరొక చిరుతిండి. మూంగ్ దాల్(పెసర పప్పు)లో పొటాషీయం, మెగ్నీషియం, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మంచిది. పెసర శనగల మొలకలతో తయారైన భేల్లో రుచికరమైన స్నాక్. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు, భేల్ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. (చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!) -
టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్‌క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. ఆ జ్యూస్‌ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్‌ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్‌లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్‌క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్‌క్రీమ్‌తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్‌లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్‌కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్‌షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్‌పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్‌గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్‌గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్‌లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్‌గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్‌గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
స్మార్ట్ అండ్ బెస్ట్ క్లీనర్..!
అందంగా మెరిసిపోవడానికి నచ్చిన మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ మేకప్ వేసుకునే బ్రష్‌లను శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. నిజానికి మురికి మేకప్ బ్రష్‌లు బ్యాక్టీరియాకు నిలయంగా మారిపోతాయి. అలాంటి బ్రష్‌లు వాడితే చర్మ సమస్యలు తప్పవు. అంతేకాకుండా మేకప్ వేసుకునేటప్పుడు కూడా మనం ఎంచుకున్న కలర్ కాకుండా మరో కలర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్‌తో మేకప్ బ్రష్‌లను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.ఈ ఆటోమేటిక్ క్లీనర్ మేకప్ బ్రష్‌లను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది ఒక స్పిన్నర్, క్లీనింగ్ మ్యాట్‌తో వస్తుంది. బ్రష్‌ను సరైన అడాప్టర్‌కు కనెక్ట్ చేసి, క్లీనింగ్ బౌల్లో కొద్దిగా నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని ఆపై, బటన్‌ను నొక్కితే చాలు. బ్రష్‌ను నీటిలో తిప్పుతూ అదే క్లీన్ చేస్తుంది. మేకప్ బ్రష్ మీద పేరుకుపోయిన మొండి అవశేషాలను, ధూళిని ఈ డివైస్ ఇట్టే తొలగిస్తుంది.చిత్రంలోని క్లీనర్‌తో వచ్చే క్లీనింగ్ మ్యాట్ వివిధ రకాల బ్రష్‌ల కోసం వేర్వేరు టెక్స్చర్లను కలిగి ఉంటుంది, ఇది మరింత లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ మహిళలకు, ముఖ్యంగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక చక్కటి బహుమతి. ఇక ఇది నీళ్లతో బ్రష్‌ని క్లీన్ చేయగానే, డివైస్ నుంచి నీళ్లు ఉన్న కప్‌ను వేరు చేసుకుని, ఆ నీటిని పారబొయ్యాలి. ఆ తర్వాత ఆ కప్‌ను మరోసారి మంచి నీటితో క్లీన్ చేసుకుని మళ్లీ డివైస్‌కి అటాచ్ చేసి, బ్రష్‌ను దానిలో ఉంచి, బటన్ ఆన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు బ్రష్‌లను క్లీన్ చేసుకునేటట్లయితే మేకప్ బ్రష్‌లు ఎక్కువ మన్నికతో ఉంటాయి. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
2000 హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పదమూడు నెలల వయసున్న సాకీ అనే రాయల్ బెంగాల్ జాతి ఆడపులిని కొందరు దుండగులు చంపేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటన 2000 అక్టోబర్ 5న జరిగింది. ఈ సంఘటనపై బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు సీఐడీ వరకు వెళ్లింది. తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చింది. దీనిపై అనేక రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో పోలీసులు సాకీ హంతకుల సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ప్రకటించారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు కప్పు కాఫీతో యాదృచ్ఛికంగా కొలిక్కి వచ్చింది.మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సలావుద్దీన్ హైదరాబాద్‌కు వలసవచ్చి, రియాసత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ, జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం చిన్న చిన్న చోరీలతో నేరజీవితం ప్రారంభించాడు. వీరప్పన్ స్టోరీలు విన్న ఇతడి కన్ను గంధపు చెక్కలపై పడింది. హైదరాబాద్‌లోని జూ పార్క్‌లో గంధపు చెట్లు ఉన్నట్లు తెలుసుకుని, వాటిని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వెన్నెల లేని చీకటి రాత్రుల్లో జూ పార్క్ ప్రహరీ గోడ దూకి లోపలకు వెళ్లేవాడు. అక్కడున్న గంధపు చెట్లను నరికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో అతడికి ‘హైదరాబాదీ వీరప్పన్’ అనే పేరు వచ్చింది. సలావుద్దీన్ ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్స్ కూడా చేసేవాడు. చోరీ సొత్తు పంపిణీ వివాదంలో ఒక సహచరుడిని హత్య చేసిన ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. గంధపు చెట్ల కోసం ఎప్పటిలాగే 2000 అక్టోబర్‌లో జూ పార్క్‌లోకి వెళ్లాలని భావించిన సలావుద్దీన్‌తో అతడి స్నేహితుడైన ఇస్మాయిల్ ఓ చాలెంజ్ చేశాడు. ‘జూలో ఉన్న పులిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆ పని చేసి చర్మం, గోళ్లు తేగలవా?’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో సలావుద్దీన్ అదే నెల 4 రాత్రి తన అనుచరులైన అహ్మద్, సమద్‌లతో కలసి జూపార్క్ వెనుక ఉన్న మీర్ఆలం ట్యాంక్ వైపు నుంచి లోపలకు ప్రవేశించాడు. సఫారీకి సమీపంలోని పులుల ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తొమ్మిది బోనుల్లో 14 పులులు ఉండగా, వాటిలో సాకీని ఎంపిక చేసుకున్నాడు. బోనులో ఉన్న దాని మెడకు ఉరి బిగించి చంపేసిన సలావుద్దీన్– తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించి దాని చర్మం, గోళ్లు ఒలిచేశాడు. ఈ ఘాతుకాన్ని చూసిన మిగిలిన పులులు తీవ్ర షాక్‌కు గురయ్యాయి. కొన్ని రోజుల పాటు అవి ఆహారం సైతం తీసుకోలేదు. సాకీ హత్యపై బహదూర్‌పుర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. జూ పార్క్‌లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఐడీ అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, చిన్న క్లూ కూడా లభించలేదు. సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించినా ఫలితం దక్కలేదు. ఈలోగా సాకీ హత్య రాజకీయ రంగు పులుముకుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత క్షుద్ర పూజల కోసం ఇక్కడి కొందరు పెద్దలే సాకీని చంపి, దాని చర్మం, గోళ్లు పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాకీని చంపిన తర్వాత సలావుద్దీన్ సైతం చోరీ, స్నాచింగ్ తదితర కేసుల్లో మూడుసార్లు పోలీసులకు చిక్కినా నోరు విప్పలేదు. 2005 నాటికి సాకీ కేసు కూడా కొలిక్కి చేరని కేసుల జాబితాలోకి చేరిపోయింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ మీద పోలీసుల కళ్లు ఉండేవి. 2005 ఫిబ్రవరిలో సలావుద్దీన్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అప్పట్లో రాజీవ్ త్రివేది హైదరాబాద్ నేర విభాగానికి అదనపు పోలీసు కమిషనర్‌గా ఉండేవారు. సాధారణంగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ప్రతి ఘరానా దొంగనూ ఆయన ఎదుట హాజరుపరచే వాళ్లు. అధికారులు సలావుద్దీన్‌ను అలానే హాజరుపరచారు. అతడి నేర చరిత్ర తెలుసుకున్న ఆయన ‘ఇంక మారవా?’ అంటూ కాస్సేపు ముచ్చటించారు. తాను కాఫీ తాగే సమయం కావడంతో సలావుద్దీన్‌ను కూర్చోబెట్టి, అతడికీ కాఫీ ఇచ్చారు. దీంతో రాజీవ్ త్రివేదీతో సలాదుద్దీన్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక ఇంకేమేం నేరాలు చేశావంటూ రాజీవ్ త్రివేదీ ప్రశ్నించగా, ఐదేళ్ల కిందట జూపార్క్‌లో సాకీని తానే చంపానని బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే షాక్‌కు లోనైన పోలీసులు సలావుద్దీన్ అరెస్టు ప్రక్రియను వాయిదా వేశారు. అతడు చెప్పే మాటలపై నమ్మకం కుదరకపోవడంతో పదేపదే ప్రశ్నించారు. దీంతో తన మాట మీద నమ్మకం లేకపోతే అనుచరులను పట్టుకుని ప్రశ్నించాలని, మహారాష్ట్రలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూస్తే సాకీ చర్మం, గోళ్లు లభిస్తాయని చెప్పాడు. మహారాష్ట్ర వెళ్లిన బృందం వాటిని రికవరీ చేశాక పోలీసులు సలావుద్దీన్‌ను, అతడి అనుచరులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల సమక్షంలోనే తాను జైలు నుంచి పారిపోతానని, మళ్లీ నేరాలు చేస్తానని సవాల్ చేశాడు. దీనికి స్పందించిన రాజీవ్ త్రివేది ‘నిన్ను చర్లపల్లి జైలులో పెడుతున్నాం. ఎస్కేప్ కాగలిగితే రూ.లక్ష ఇస్తా’ అని అన్నారు. ఈ మాటనూ సలావుద్దీన్ సీరియస్‌గా తీసుకున్నాడు. 2005 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్న అతడు పారిపోవడానికి అదను కోసం ఎదురు చూశాడు. చివరకు 2006 నవంబర్ 24న జైలు నుంచి తప్పించుకున్నాడు. దుప్పట్లను తాడుగా చేసుకుని, వాచ్‌టవర్ పైనుంచి దాని సాయంతో దిగుతూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి నడుము విరగడంతో ఎక్కువ దూరం వెళ్లలేక సమీపంలోని పొదల్లో దాగుండిపోయాడు. మర్నాడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జైలు సిబ్బందికే చిక్కాడు. జైలు అధికారులు సలావుద్దీన్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తనను కలసిన మీడియాతో ‘రాజీవ్ త్రివేది సాబ్ చేసిన సవాల్లో నేనే నెగ్గా. గాయం వల్ల ఆగిపోయినా, జైలు నుంచి అయితే ఎస్కేప్ అయ్యా. ఆయనకు ఈ విషయం చెప్పి రూ.లక్ష ఇప్పించండి. వైద్య ఖర్చులకైనా పనికొస్తాయి’ అని చెప్పి అవాక్కయ్యేలా చేశాడు. ఆ తర్వాత తన పాత పంథా కొనసాగిస్తూ చోరీలు, గంధపు చెట్ల నరికివేత చేసిన సలావుద్దీన్ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్నాడు. శ్రీరంగం కామేష్ (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసంవేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్‌ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్‌లా పనిచేస్తాయని జపాన్‌లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది. ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్‌ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.అలవాటుగా మార్చుకోవాలివేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్‌తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్‌షాప్‌లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది. బలపడే బంధాలువేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్‌గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు. పెరిగే సృజనాత్మకతవేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్‌తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్‌ఫుల్‌నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్‌కు కేటాయించండి. మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి. వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.ప్రతీ సీజన్లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి. ఒక కొత్త స్కిల్‌ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌కు డెడ్‌లైన్స్, గోల్స్ పెట్టుకోండి. సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్ను శక్తిమంతం చేయండి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?) -
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!) -
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..) -
వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
కళ్లు చెదిరే కాంతుల వేడుక..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్‌కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. హార్బర్లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. (చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!) -
డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!
వియత్నామ్లోని హాలాంగ్ అఖాతం ప్రకృతి అందాలకు ఆలవాలం అనే చెప్పుకోవాలి. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కలగలిసిన ఈ ప్రదేశం తప్పక చూడాల్సిందే అంటారు పర్యాటక ప్రియులు. ఇది వియత్నామ్‌కు, దక్షిణ–చైనాకు సముద్ర సరిహద్దు భాగం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో సుమారు రెండువేల సున్నపురాతి దీవులు ఉన్నాయి. ఇవి చూడటానికి వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఎత్తుగా, పచ్చదనం చుట్టిన పర్వతాల్లా, లోతైన నీళ్ల మధ్యలో కనిపిస్తూ, కనువిందు చేస్తాయి. ఆ పర్వతాలను, గుహలను, నీటిలో తేలియాడే గ్రామాలను చూడటానికి పడవ ప్రయాణాలు చేస్తూ వెళ్లాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత మనోహరంగా ఉంటుంది. అక్కడి పురాణాల ప్రకారం, ‘ఒకప్పుడు వియత్నామ్‌ను కాపాడటానికి దేవతలు డ్రాగన్ల కుటుంబాన్ని పంపారు. ఆ డ్రాగన్లు తమ నోటి నుంచి రత్నాలను ఉమ్మివేశాయి. అవి సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయి. అవే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాయి’ అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘డిసెండింగ్ డ్రాగన్’ అని పిలుస్తారు. (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
అజ్ఞాత ప్రేమికుడు..!
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి. మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కుపుటాలను తాకేలా చేసింది చిరుగాలి. మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒక దానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు. ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది. సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది.పూలు అమ్ముకొనే ఒక వృద్ధురాలు అదే బస్టాండ్‌లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది. ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుటపడ్డాను. ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు. వారి సంభాషణను బట్టి, వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది. ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను. వెంటనే అతను గుర్తొచ్చాడు. బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒక దాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి. నా జ్ఞాపకాలు గతంలోకి పరుగులు పెట్టాయి.సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకొనే సమయంలో వాన జల్లులు పడుతున్నాయి. అప్పుడే చూశాను అతన్ని పదునైన చూపులతో కోటేరులాంటి ముక్కుతో, సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది. చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చేయి అందుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాడు అతను. నేను హతాశురాలిని అయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే అతను ‘క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది. మీరు ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘పర్వాలేదండి’ అన్నాను నేను. అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు.ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను.తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే, అటుగా వెళ్లి చూశాను. ఎవరో ఎదురింట్లో కొత్తగా వచ్చినట్లున్నారు అనుకొని నా పనిలో నేను మునిగిపోయాను. అలా మూడు రోజులు గడిచాయి..యథావిధిగా ఒక రోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా, ఎదురింట్లోంచి అతను బయటకి వస్తూ ఎదురయ్యాడు. అతనెవరో తెలియనట్లు నా దారిన నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి ‘బాగున్నారా’ అని పలకరించాడు. నేను అతనెవరో తెలియనట్లు ‘ఎవరండీ మీరు?’ అని అడిగాను. దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ‘గుర్తొచ్చారండి’ అన్నాను నేను. ‘ఇక్కడేం చేస్తున్నారు?’ అని అడిగాను. ‘మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను’ అని చెప్పాడు. ‘ఔనా!’ అనేసి వెంటనే తేరుకొని, ‘మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు?’ అని అడిగాను. అతను తడబడుతూ, ‘అంటే.. అది.. మీరు ఈ ఇంట్లోకే వెళుతున్నారు కదా! ఇదే మీ ఇల్లు అని అనుకొని అలా చెప్పాను’ అన్నాడు. నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది. దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను.రోజులు గడుస్తున్నాయి. అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒకతను ఒకావిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు. అతని ముఖం కన్పించలేదు. అటు వైపు తిరిగి ఉన్నాడు. అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని వెనుతిరుగుతూ ఉండగా చిరిగిన అర్చన టికెట్ నాకంట పడింది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను.అందులో ఉన్నది నా పేరే, ‘మేఘన సుబ్రమణ్యం‘. వెంటనే పంతులుగారిని అడిగాను. అర్చన చేయించింది ఎవరని. ‘అతనెవరో నాకు తెలీదమ్మా! కాని మూడేళ్లుగా ఈ పేరుమీద ఇదేరోజున అర్చన చేయిస్తున్నాడు’ అని పంతులుగారు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు. కాని, ఒకటైతే అర్థమైంది. అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని. మరి అతను ఎవరు? నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను. కాని నా బుర్రకు ఏ ఆలోచనా తట్టలేదు. నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద. ఏంటా అది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో–‘‘సుందరి! ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ‘ఇదే ఎందుకు పెట్టుకున్నాడు?’ అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ‘సుందరీ నేనే నువ్వంటా, చూడని నీలో నన్నంటా’. అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం. ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను. ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ! నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని. గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టింది అని తెలియగానే పడే ఆనందపు తాలుకా అనుభూతిని నాలో నేను చూశాను. ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడు నాకు కలగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని, నిన్ను ఎప్పుడు విడువలేనని. కాని, ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, నేను నీ ముందుకు రాలేనని, నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది. అందుకే ఈ దాగుడుమూతలాట. తెలియకుండా ఉండాలని అనుకొని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు. కాని, నాలో అంతా ఇంతా కాదు, బోలెడంత ప్రేమ ఉంది నీ మీద. ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక, అందులో దాగక బయటకి వస్తా వస్తా అని మొర పెడుతోంది. అందుకే దాని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేమ నీ చెంతకు చేరిందని...’’ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు.ఎవరు ఈ అజ్ఞాత ప్రేమికుడు? ఇన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అంత ప్రేమను నామీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు? నన్ను కలవలేకపోతున్నాడు? ఇలా నా మైండ్, నా మనను ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాయి. ఎంతకూ అర్థంకాలేదు కాని, ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ఎలాగైనా కలవాలని, తన ప్రేమను కళ్ళారా చూసి, అనుభూతి పొందాలని. అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది.నేను ఆ ఆజ్ఞాత ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది. నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తునే ఉన్నాడా అబ్బాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్‌ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. అందుకేనేమో, ఇద్దరి బాధలు ఒకటై ఒకరిలో ఒకరం అమ్మనాన్నల ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం. అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమికుని వెతుకులాటను మరచిపోయేలా చేసింది. కాని, మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది. ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు. కాని, ఎందుకో అతను నాదగ్గరే ఉన్నట్లు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్లు, నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది. ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదురింటి అబ్బాయి నాకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను. అలా రోజులు కాదు, నెలలు కూడా అయ్యాయి. అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఏమై ఉంటాడు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది. కాని, ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత. పూజ పూర్తి చేసుకుని బయలుదేరుదాం అన్న సమయానికి నా పుట్టినరోజున మాట్లాడిన పంతులుగారు ఎదురుపడి, ‘ఆరోజు నువ్వు ఒక అబ్బాయిు గురించి అడిగావు కదా! ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డు గుళ్లో పడేసుకున్నాడు. అది నాకు దొరికిందమ్మా! దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు. అందుకే నీ కోసమే దాన్ని దాచి ఉంచాను’ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. ఎన్నో రోజుల నుండి వెతికినా, ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది. దాన్ని తీస్కోని చూశాను. అందులో ‘సూర్య జాగర్లముడి’ అని పేరు ఉంది. ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. వెంటనే అడ్రస్ చూశాను. చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్. నేను నమ్మలేకపోయాను. వెంటనే తేరుకుని పంతులుగారికి థాంక్స్ చెప్పేసి, పరుగుపరుగున ఆ ఇంటికి దారితీశాను. ఆ ఇల్లు ఉన్న అడ్రస్‌కు చేరుకున్నాను. తాళం వేసి ఉంది ఆ ఇంటికి. ఏం చేయాలో తోచలేదు. సమయానికి మా ఎదురింటి అబ్బాయి కూడా లేడు. నాకే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగులగొట్టాను. తలుపులు తీసుకొని గదిలోకి అడుగు పెట్టాను. అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. వెంటనే గోడ మీద స్విచ్‌బోర్డు వెతికి స్విచ్ వేశాను. అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతశురాలయ్యాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్. అంటే అతని పూర్తి పేరు ‘సూర్య కిరణా!’నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఒక కలలా తోచింది. ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటూ, నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు. నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి, నా మనసు అతలాకుతలమైంది.కాని, ఆ సంతోషం నీటి ఆవిరిలా క్షణకాలంలో మాయమైపోబోతోందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అప్పుడే నా కంట పడింది ఒక ఉత్తరం అది తీసి చదవడం మొదలుపెట్టాను. అందులో...‘సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు. కాని, నువ్వు వచ్చే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అవును క్యాన్సర్‌తో పోరాడుతున్న రోజులవి. అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను. చిన్న పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది. కాని, నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను. చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి, నీకు దూరంగా వెళ్ళిపోయి, తీరని బాధని నీకు మిగల్చకూడదు అనుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉంటూ, నిన్ను చూస్తూ, ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు. నన్ను చూస్తూ మైమరచిపోయిన ఆ రోజును నేను మరచిపోలేను. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను. ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని. అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను. నీతో స్నేహం చేశాను. నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను. కాని, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను. ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీకోసం రాశాను– ఎప్పటికైనా నీదగ్గరికి చేరుతుందని నమ్ముతూ...ఉత్తరం నా చేయి జారిపోయింది. ఎడతెరపి లేని వానలా, ఉప్పొంగే వరదలా, ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోదించింది. నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి. నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్‌ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. (చదవండి: యువ కథ: వసంత కోకిల) -
హలో వరల్డ్.. మిస్ కావొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ద్వారా తెలంగాణకు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తోంది. పోటీలకు వచ్చిన ప్రతినిధులు వివిధ మీడియా సంస్థలకు, మిస్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హైదరాబాద్, తెలంగాణ గురించి గొప్పగా వర్ణిస్తున్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక నగరమని, తెలంగాణ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆకట్టుకుంటోందని ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమవుతున్నాయి. ఒక్కో ప్రపంచ సుందరి పోటీదారుకు సోషల్‌మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరి వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అలా హైదరాబాద్, తెలంగాణకు మంచి ప్రచారం లభిస్తోంది.3,300 విదేశీ ఛానల్స్‌కు సమాచారం..మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారని, దాదాపు మూడున్నర వేల మంది విదేశీ జర్నలిస్టులు పోటీలయ్యేవరకు హైదరాబాద్‌లో ఉండి ఆయా దేశాలకు ఇక్కడి పరిస్థితులపై సానుకూల సంకేతాలను పంపుతారని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. కానీ, ఈ పోటీల కవరేజీకి వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు 20 మంది వరకు మాత్రమే. దీంతో ప్రభుత్వ అంచనా తప్పిందన్న భావన వ్యక్తమైంది.అయితే, మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీల ప్రచారం కోసం బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేసి, పోటీలకు సంబంధించి సమగ్ర వివరాలను 3,300 విదేశీ టీవీ ఛానల్స్‌కు అందిస్తున్నారు. పోటీలో ఉన్న 113 దేశాలకే కాకుండా, పోటీల్లో లేని దేశాలకు చెందిన టీవీ ఛానల్స్ కూడా ఆ జాబితాలో ఉన్నాయని మిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో తెలంగాణకు ప్రపంచం నలుమూలలా ప్రచారం లభిస్తోంది.భిన్న సంస్కృతుల కేంద్రం ఆశ్చర్యపరిచే భిన్న సంస్కృతులకు కేంద్రం తెలంగాణ. విద్య, వైద్య పరంగా ఇక్కడ గొప్ప వసతున్నాయి. మా దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ చదువుకునేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి వసతులను ప్రత్యక్షంగా చూస్తున్నాను –అయోమ్ టీటో మటీస్, సౌత్ సూడాన్.సొంత ప్రాంతంలో ఉన్నట్లుంది ఆఫ్రికా ఖండంలో సంస్కృతికి గొప్పగా ఉంటుంది. తెలంగాణను చూసిన తర్వాత మాలాగే ఇక్కడి ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ కొనసాగిస్తున్న తీరు అబ్బురపరిచింది. నాకు సొంత ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. –జైనబ్, సొమాలియాఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యకరం మా దేశంలో చాలా మందిలో ఇండియా అభివృద్ధి చెందని దేశం అన్న భావన ఉంది. కానీ, హైదరాబాద్‌ను చూసిన తర్వాత ఇక్కడి ఆధునిక పోకడలు, తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. – అతెన్నా క్రోస్బీ, అమెరికాఇదెంతో సురక్షిత ప్రాంతం ఇక్కడికి రావటం సురక్షితం కాదని, విదేశీ యువతులను రేప్ చేసి చంపేస్తారని నేను ఇక్కడికి వచ్చేముందు కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది.. ఈ ప్రాంతం చాలా సురక్షితమని. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో నా ధృక్కోణం పూర్తిగా మారింది. –నటాషా న్యోన్యోజీ, ఉగాండా. ఇక్కడ బౌద్ధానికిస్తున్న ప్రాధాన్యం ఆశ్చర్యపరిచింది భారతీయ సంప్రదాయాలంటే జపనీయులకు ఎంతో ఇష్టం. వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి పులకిస్తున్నాను. ఈ ప్రాంతంలో బౌద్ధానికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు ఇండియా సినిమాలంటే చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు మా దేశంలో యువత రీల్స్ రూపొందించారు. ఆ పాటలో నటించిన తెలుగు నటుల సొంత ప్రాంతంలో ఇప్పుడు నేనున్నానన్న అనుభూతి గొప్పగా ఉంది. –కియానా తుమీత, జపాన్. -
షుగర్ ఉంటే..ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా?
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?– రమ్య, హైదరాబాద్ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి. టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్‌తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ. దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్‌గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది. నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శారద, వరంగల్. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్లో ఉందో తెలుసుకోవచ్చు. దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్‌లో వెంటనే సంప్రదించి, హెచ్‌బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి. మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
మంచుకొండల్లో మహిళారాజ్యం..!
మంచుపర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో 12 జిల్లాలు ఉన్నాయి. ‘లాహౌల్ స్పితి’ జిల్లా వాటిల్లో ఒకటి. లాహౌల్ స్పితి జిల్లాలోని ప్రత్యేకతలన్నీ ఆ రాష్ట్రంలోని మిగతా జిల్లాలన్నిటికీ ఉన్నప్పటికీ, దేశంలోని దాదాపు 800 జిల్లాల్లో లేని ఒక ప్రత్యేకత ఇప్పుడు లాహౌల్ స్పితికి మాత్రమే ఉంది! ఆ జిల్లా పాలనాధికారులంతా మహిళలే కావటమే ఆ ప్రత్యేకత.ముఖ్యమంత్రి ఆకాంక్ష!కిరణ్ భదానా ఇటీవలే, ఏప్రిల్ 27న లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా వచ్చారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. (జిల్లా కలెక్టర్‌ను కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ కమిషనర్ అంటారు). హిమాచల్‌ప్రదేశ్‌లో 3 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయి. కిన్నర్, చంబా, మూడవది: లాహౌల్ స్పితి. పాలనా యంత్రాంగానికంతా మహిళలే అధికారులవటంతో లాహౌల్ స్పితి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గత అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం ఒక్క జిల్లాలోనైనా పాలన, రాజకీయ నాయకత్వం పూర్తిగా మహిళల చేతుల్లో ఉండాలన్న తన ఆకాంక్షను వెల్లడించటం విశేషం. తాజాగా కిరణ్ భదానా నియామకంతో ఆయన ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన ట్లైంది. మహిళా ఎంపీఅందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా ‘మండీ’ లోక్‌సభ నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండీ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటికి నెల ముందు మాత్రమే కంగనా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ తరఫున మండీలో పోటీకి దిగారు. 5 లక్షల, 37 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మహిళా ఎమ్మెల్యే2024 లోనే జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లాహౌల్ స్పితి శాసనసభ నియోజకర్గం నుంచి అనురాధా రాణా ఎన్నికవటం మరొక విశేషం. అనురాధ ఎం.ఎ. ఇంగ్లిష్, ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచారు. కలెక్టరు, ఎస్పీ, కమిషనర్..! లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా వచ్చిన కిరణ్ భదానా రాజస్థాన్‌కు చెందిన వారు. ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ చదివారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. మూడు ప్రయత్నాల తర్వాత యూపీఎస్సీ పరీక్షలలో 120 ర్యాంకు సాధించి ఐఏఎస్ అఫీసర్ అయ్యారు. ఇక బీనాదేవి 2024 జూన్ నుండి లాహౌల్ స్పితికి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. ఆమె ఎస్సీ వర్గానికి చెందిన వారు. జిల్లాలోని అట్టడుగు వర్గం వారికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ ఇల్మా అఫ్రోజ్. 2018–2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. 2025 మార్చిలోనే లాహౌల్ స్పితి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ఆకాంక్ష శర్మ కెలాంగ్ సబ్–డివిజినల్ మేజిస్ట్రేట్. 2023లో పదవీ బాధ్యతలు చేపట్టారు. కెలాంగ్ రెవిన్యూ డివిజన్‌కు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా ఆకాంక్ష పని చేశారు. శిఖా సిమ్టియా– కాజా డివిజన్‌కు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా. 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా పట్టణం ఆమె జన్మస్థలం. చౌరీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ‘‘మహిళలు అధికారులుగా ఉంటే, సాధారణ మహిళలు చొరవగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతారు. పురుష అధికారులంటే ఉండే సంకోచం ఉండదు. కీలక పదవులలో, రాజకీయాలలో మహిళలు ఉండటం వల్ల పాలన మెరుగ్గా ఉంటుంది, పరిష్కారాలు సాఫీగా జరిగిపోతాయి..’’ అని లాహౌల్ స్పితికి ఎమ్మెల్యే అనురాధా రాణా అంటారు. అది నిజమే కదా! నాలుగేళ్ల క్రితం ‘నల్బరి’ ఫస్ట్అస్సాంలోని గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంటుంది నల్బరి జిల్లా. నాలుగేళ్ల క్రితమే ఈ జిల్లా తొలి ‘మహిళా అధికారుల జిల్లా’గా వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో ఆ జిల్లాలోని అత్యున్నత స్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావటం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. జిల్లా కలెక్టర్ మహిళ, జిల్లా ఎస్పీ మహిళ, ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... అందరూ మహిళలే. జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్, ఇంకా... డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు... అంతా మహిళలే. ఇప్పుడు వీరిలో చాలామంది బదలీపై వెళ్లారు. దాంతో ‘నల్బరి’ జిల్లా ప్రత్యేకతలు ‘లాహౌల్ స్పితి’ జిల్లాకు వచ్చాయి. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!) -
చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్‌రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్‌రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్‌ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్‌లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్ టీఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్‌లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.చా యెన్ఇది థాయ్‌లాండ్‌లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్‌టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్‌కలర్స్‌ను కూడా జత చేస్తారు.చాయ్ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్‌కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్‌కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్‌లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్‌కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్‌లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్‌కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్‌లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు) -
పాడ్‌కాస్ట్ చేద్దామా?
పిల్లలూ... ఇంతకు ముందు రేడియోలో బాలానందం అనే ప్రోగ్రామ్ ఉండేది.పిల్లల చేత ఆ ప్రోగ్రామ్‌లో మాట్లాడించేవారు. ఇప్పుడు మనమే రేడియో ప్రోగ్రామ్లాంటిది చేయవచ్చు. దానినే ‘పాడ్‌కాస్ట్’ అంటారు. మనకు నచ్చిన విషయాలు మాట్లాడి, రికార్డు చేసి డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద అప్లోడ్ చేస్తే మీ పాడ్‌కాస్ట్‌ను విని అభిమానులయ్యేవారుంటారు. ఈ సమ్మర్లో మీ కాలనీలోని పిల్లలతో కలిసి పాడ్‌కాస్ట్‌లు చేయండి. అందుకు ఏం చేయాలంటే....పిల్లలూ... మీరు రేడియో వినే ఉంటారు. మామూలు రేడియో వినకపోయినా కారులోని రేడియో వినే ఉంటారు. రేడియోలో ఒకప్రోగ్రామ్ అయిపోయాక మరోసారి ఆప్రోగ్రామ్ వినాలంటే కుదరదు. అదే ఆ ప్రోగ్రామ్‌ను రికార్డు చేసి ఒక చోట పెట్టి కావాల్సినప్పుడల్లా కావాల్సినన్నిసార్లు వినే ఏర్పాటు చేస్తే? పాడ్‌కాస్ట్ అలాంటిదే. మీరు మీ సొంతప్రోగ్రామ్స్ రికార్డు చేసి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పెడతారు. వాటిని ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వింటారు. ఇప్పుడు పాడ్‌కాస్టింగ్ చాలా మంచి హాబీ. డబ్బులు కూడా వస్తాయి... వినేవాళ్లు పెరిగితే. పాడ్‌కాస్ట్ అంటే కేవలం ఆడియోప్రోగ్రామ్ మాత్రమే. ఒకరు/లేదా కొంతమంది మాట్లాడుకునే మాటలను రికార్డు చేసి ఇతరులకు వినిపించడమే పాడ్‌కాస్టింగ్ అంటే.దానికి ఏం కావాలి?కంప్యూటర్ కానీ ల్యాప్‌టాప్ కానీ ఉంటే సరిపోతుంది. రికార్డు చేయడానికి మైక్ ఉండాలి. రికార్డు చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది. రికార్డ్ అయిన కార్యక్రమాన్ని ‘ఎంపి3’ ఫార్మాట్లో మార్చి పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేయాలి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ను సబ్స్క్రయిబ్ చేసుకుని ఆ పని చేయవచ్చు. ఇదంతా చాలా సులువు పనే.పాడ్‌కాస్ట్‌లో ఏం మాట్లాడతారు?మనుషులకు మాటలు ఇష్టం. మీరు ఏం మాట్లాడినా వింటారు. ఉదాహరణకు ‘నేనూ... మా కుక్కపిల్ల’ అనే సిరీస్‌లో మీరు వరుసగా పాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఒక్కో ఎపిసోడ్లో మీ కుక్కపిల్లతో మీరు పడుతున్న తంటాలు, అదంటే మీకెంత ఇష్టమో, అది మీరు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఎలా ఎదురుచూస్తుందో, మీ ఫుడ్‌ను ఎలా లాక్కుంటుందో ఇవన్నీ మాట్లాడి రికార్డు చేసి పెడితే వినేవాళ్లు ఉంటారు.పాడ్‌కాస్ట్ చేసే విధంపాడ్కాస్ట్ అంటే చదవడం కాదు. నోట్స్ ముందు పెట్టుకుని చదివితే ఎవరూ వినరు. పాడ్‌కాస్ట్‌ను ఒక డైలాగ్‌లాగా మాట్లాడుతున్నట్టుగా చేయాలి. అఫ్కోర్స్... మీరు కొంత నోట్స్ రాసుకున్నా అది పాయింట్స్ గుర్తు రావడానికే తప్ప యథాతథంగా చదవకూడదు. ‘మా అమమ్మ’ అనే టాపిక్ మీద కబుర్లు చెబుతున్నట్టుగా మాట్లాడితే వింటారు.ఇంటర్వ్యూలుపాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు బాగుంటాయి. మీరు మీ అమ్మను, నాన్నను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేయొచ్చు. క్లయిమేట్ చేంజ్ గురించి మీ సైన్స్ టీచర్‌ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయొచ్చు. సెల్‌ఫోన్ అడిక్షన్ మీద ఒక డాక్టర్‌ను ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇలాంటి వాటికి మమ్మీ, డాడీ సపోర్ట్ తీసుకోవచ్చు. రాబోయే వానాకాలంలో వూళ్లో వాన నీరు వెళ్లాలంటే గవర్నమెంట్ ఏయే పనులు మొదలెట్టాలో చెప్పేలా ఒక పాడ్‌కాస్ట్ చేయొచ్చు. హ్యారీపోటర్ మీద, అవేంజర్స్ మీద మీ ఫ్రెండ్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు. పాడ్‌కాస్ట్ చేయడం వల్ల మీ ఆలోచనలు, మాట, సమయస్ఫూర్తి పెరుగుతాయి. రీసెర్చ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎక్స్‌పర్ట్‌లతో పరిచయాలు జరుగుతాయి. పేరు వస్తుంది. ఇన్ని మేళ్లు జరుగుతాయి కనుక ట్రై చేయండి. ఈ సెలవుల్లో పాడ్‌కాస్టర్‌గా మారండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏం మాట్లాడొచ్చు పాడ్‌కాస్ట్‌లో...→ తెలుగు పద్యం: వేమన, సుమతి, భాస్కర శతకాల్లో నుంచి ఒక్కో పద్యం తీసుకుని అది మీకు ఎందుకు ఇష్టమో అందులోని నీతి ఏమిటో మీ ఫ్రెండ్‌కు వివరిస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు.→ తెలుగువారి హిస్టరీ నుంచి మీకు నచ్చిన విషయాలను పాడ్‌కాస్ట్ చేయొచ్చు.→ సినిమాల మీద చేయొచ్చు.→ ఐ.పి.ఎల్ మేచెస్ మీద చేయొచ్చు.→ మై డ్రీమ్స్.. అని చేయొచ్చు. ఇవి మీ లక్ష్యాలే కాదు... మీ కలలు కూడా చెప్పచ్చు. -
వ్యోమయాత్రకు భారతీయుడు
పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ–11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్ఎస్కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్‌ఎస్‌ఓ’లకు ఈ మిషన్‌లో యురోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్ మిషన్–4 (ఏఎక్స్–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్–4 భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్ చేపట్టనున్న ‘గగన్‌యాన్’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్‌ఫామ్స్ గ్రూప్ హెడ్ తుషార్ ఫడ్నిస్ తెలిపారు.ఏఎక్స్–4 మిషన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్–4 మిషన్ భారత్‌తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్–ఎల్ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్–4 మిషన్‌లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్ స్పేస్’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్ ఎక్స్’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్–4 మిషన్ చేపడుతోంది. ఈ మిషన్‌కు అమెరికన్ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ దీనికి కమాండర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు.మిషన్ స్పెషలిస్టులుగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) తరఫున పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) తరఫున టైబర్ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్‌తో పెగ్గీ విట్సన్ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్ ఎక్స్ పాత్రఏక్సియమ్ మిషన్–4లో ఎలాన్ మస్క్ స్థాపించిన అమెరికన్ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్ ఎక్స్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్–4 మిషన్(AX-4 mission) కోసం స్పేస్ ఎక్స్ ‘ఫాల్కన్ 9 బ్లాక్ 5’ రాకెట్‌ను, క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఏఎక్స్–4 మిషన్ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్ 9 బ్లాక్5 రాకెట్ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్–4 మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్–4 మిషన్ ఏరి కోరి పైలట్‌గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్ రష్యా చేపట్టిన ‘సోయుజ్ టీ–11’ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్ టీ–11’ మిషన్‌కు సోవియట్ వ్యోమగామి యూరీ మాలెషెవ్ పైలట్‌గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్‌లో శుభాంశు శుక్లాకు పైలట్‌గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్ సిటీలోని యూరీ గాగరిన్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్ చేపట్టనున్న ‘గగన్‌యాన్’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్‌లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్ 17న ఐఏఎఫ్‌కు ఎంపికయ్యారు.ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఏఎఫ్‌లో అంచెలంచెలుగా, గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్ ‘గగన్‌యాన్’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్‌యాన్’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్‌యాన్’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్‌యాన్’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్–4’ మిషన్‌లో పైలట్‌గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్‌యాన్ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్‌యాన్’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్‌యాన్’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్‌యాన్’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు. ‘గగన్‌యాన్’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్‌యాన్’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్ క్యాప్సూల్స్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్‌యాన్’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్ వి.నారాయణన్‌తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్‌యాన్’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్‌యాన్’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్‌యాన్’ బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్‌యాన్’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్‌కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్‌యాన్’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్అమెరికన్ వ్యోమగామి. ఏక్స్–4 మిషన్‌కు కమాండర్. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్ఎస్కు తొలి మహిళా కమాండర్ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్’లో చేరారు. ‘ఏక్సియమ్’ చేపట్టిన ఏఎక్స్–2 మిషన్‌లో కమాండర్‌గా ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్‌లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్ ఉజ్నాన్స్కీయూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో (ఈఎస్ఏ) పనిచేస్తున్న పోలిష్ ఇంజినీర్. ఏఎక్స్–4 మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్ చేపట్టిన ‘సోయుజ్–30’ మిషన్‌లో పోలిష్ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్నాన్స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్ వ్యోమగామి కానున్నారు. పోలిష్ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్నాన్స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఉజ్నాన్స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్ కాపుసోవియట్ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్ వ్యోమగామి. మెకానికల్ ఇంజినీర్ అయిన టైబర్ కాపును హంగేరియన్ ప్రభుత్వం 2021లో ‘హనార్’– హంగేరియన్ టు ఆర్బిట్ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్ హయాంలో హంగేరియన్ వ్యోమగామి బెర్టాలన్ ఫర్కాస్ ‘సోయుజ్–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్ వ్యోమగామి టైబర్ కాపు కావడం విశేషం. ఏఎక్స్–4 మిషన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లనున్న టైబర్ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు. -
Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’
‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్‌పవర్‌తోనే సమాధానం చెప్పిన శీతల్ దేవి ఆర్చర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. స్కూల్ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్‌దేవి, అనన్య పాండేల గురించి...‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్‌లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్‌కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్‌ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్ మెడలిస్ట్గా చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్ దేవి.‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి.ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది జేమ్స్ ‘బ్రాండ్’‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్‌పిక్ లెగ్స్’ ‘ఫ్లాట్ స్క్రీన్’లాంటి నిక్‌నేమ్‌లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్ డాల్’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరే సరి.నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్ స్కూల్లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్‌గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్ బ్రాండ్లకు పాండే ఫేవరెట్ స్టార్ అయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ ‘చానల్’, నెట్‌ఫ్లిక్స్, మాస్ ఓరియెంటెడ్ ‘స్కెచర్’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. -
పిల్లిలా మారిన ఓ పులి కథ ఇది!
పులి మనతో మాట్లాడగలదా? తన బాధను మనతో చెప్పుకోగలదా? ఈ ఫొటో చెప్పగలదు.. ఆ పులి కథనే కాదు.. అందులోని అంతులేని వ్యథనూ మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదుఓ గదిలో బంధించి కొడితే.. పిల్లి అయినా పులిలా మారుతుందట.. కానీ అదే గదిలో ఓ పులి పిల్లిలా మారిన కథ ఇది... ఆ పులి పేరు... సలమాస్..సలమాస్.. ఓ ఇండో చైనీస్ ఆడ పులి.. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు బ్రీడింగ్ ఫార్మ్ దాని నివాసం. జీవిత ఖైదు వేసినా.. 14 ఏళ్ల తర్వాత విడుదలయ్యే చాన్స్ ఉంది.. సలమాస్ విషయంలో అది 20 ఏళ్లు.. చిన్నపాటి కాంక్రీట్ గదిలోనే అన్నేళ్లూ గడిపేసింది. తొలి సంధ్యను చూసింది లేదు.. తొలకరిలో తడిచింది లేదు.. జీవితాంతం పిల్లల్ని కనే యంత్రంగా పనిచేసింది. థాయ్‌లాండ్‌లోని టైగర్ టూరిజం, పులుల పళ్లు, గోర్లు, చర్మం, ఎముకలు, పంజా, మాంసం వంటి అక్రమ విక్రయాల వ్యాపారాల కోసం వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించింది. చిక్కిశల్యమైంది. ఎముకల గూడులా మారింది. కానీ నిర్వాహకుల మనసు కరగలేదు. మరణమే మేలు అనుకునేలా తన బతుకును మార్చారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం. అయితే, అదృష్టవశాత్తూ 2023 డిసెంబర్లో వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ సలమాస్తో పాటు ఆ ఫాంలో ఉన్న మరికొన్ని పులులను రక్షించింది. వాటిని తమ అభయారణ్యానికి తరలించింది. ఇక్కడే సలమాస్ తన జీవితపు మలి సంధ్యలో తొలి సంధ్యను చూసింది. తొలకరిలో తడిచింది. తొమ్మిది నెలల అనంతరం అక్కడే తుది శ్వాస విడిచింది. సలమా అంటే అరబిక్‌లో శాంతి అని అర్థం అట. రెస్ట్ ఇన్ పీస్ అంటే మరణానంతరం శాంతి లభించుగాక అని అర్థం అట.. జీవితాంతం అశాంతితో బతికిన సలమాస్.. రెస్ట్ ఇన్ పీస్!బ్రీడింగ్ ఫార్మ్‌లో సలమాస్ దయనీయ స్థితిని తన ఫొటోతో చిత్రిక పట్టిన ఆమీ జోన్స్‌కు ఇటీవలి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రఫీ పోటీల్లో హ్యూమానిటీ వెర్సస్ నేచర్ విభాగంలో తొలి బహుమతి దక్కింది.– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్ స్పెషల్ ఏంటో తెలిస్తే..!
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో (CannesFilmFestival-2025) నటి , వ్యవస్థాపకు రాలు పరుల్ గులాటి(Parul Gulati) బోల్డ్‌గా అరంగేట్రం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ దర్శకుడు అరి ఆస్టర్ తాజా చిత్రం ఎడింగ్టన్ ప్రపంచ ప్రీమియర్‌కు హాజరైన అందర్నీ ఆశ్చర్యపర్చింది. పరుల్ గులాటి తన సొంత హెయిర్ ఎక్స్టెన్షన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ మీద అందం, ధైర్యం, వ్యాపారాన్ని మిళితం చేసి జుట్టుతో ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులతో ఐకానిక్ అరంగేట్రం విశేషంగా నిలిచింది. పరుల్, అత్యంత ప్రత్యేకమైన, విచిత్రమైన దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించింది. కస్టమ్-మేడ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా జుట్టుతో తయారు చేసిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లో పరుల్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది. ఈ దుస్తులను రూపొందించడానికి నెల కంటే ఎక్కువ సమయం పట్టిందని, దీనికి 12 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించిఆరు. ఈ డ్రెస్‌తో పాటు, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు, బోల్డ్ చంకీ రింగ్, ఓపెన్-టో బ్లాక్ హీల్స్‌తో హుందాగా అడుగులు వేసింది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్‌కు రిద్ధి బన్సాల్ తో పాటు ప్రఖ్యాత స్టైలిష్ , డిజైనర్ మోహిత్ రాయ్ కూడా జీవం పోశారుతన లుక్ వెనుక ఉన్న భావోద్వేగ , సృజనాత్మక ఉద్దేశ్యాన్ని వివరించింది ఈ బ్యూటీ.- " పూర్తిగా మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులను ధరించడం అంటే ఫ్యాషన్ సరిహద్దులను దాటడం మాత్రమే కాదు. ఇది నేనే అని చాలా బిగ్గరగా మాట్లాడే దుస్తులు.. నేను ‘నిష్ హెయిర్’ వ్యవస్థాపకురాలిగా నా స్వంత బ్రాండ్ జుట్టును ధరిస్తున్నాను. నా దృష్టికి ప్రాణం పోసిన నా డిజైనర్ స్నేహితుడు మోహిత్ రాయ్ తో కలిసి..జడను జడగా అల్లిన కథ ఇది. కాన్స్ వంటి ఐకానిక్ వేదికపై నా సృజనాత్మక, వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం. రెడ్ కార్పెట్ తన కల’’ అని పేర్కొంది.ఈ ప్రత్యేకమైన హెయిర్-మేడ్ డ్రెస్‌తో పరుల్ ప్రత్యేకంగా నిలబడటం మాత్రమే కాదు, మహిళలు తమ అందాన్ని నమ్మకంగా స్వీకరించేలా, ఒక వ్యవస్థాపకురాలిగా పరుల్ ప్రయాణానికి సింబాలిక్‌గా ఉందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. -
నో డుమ్మా.. రోజంతా పనే : బెంగుళూరు పనిమనుషుల రూటే వేరు!
నగరాల్లో ప్రస్తుతం భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగులైన మధ్యతరగతి కుటుంబాలను, వేధించే ప్రధానమైన సమస్య ల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మెయిడ్/పనిమనిషి అని చెప్పొచ్చు. ఒక్కరోజు పనిమనిషి రాదు అని తెలిస్తే గృహిణుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే...బెంగళూరు వాసులు పనిమనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగుళూర్లోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం... ఆ నగరంలో పనిమనిషి స్థానం వేగంగా భర్తీ అవుతోంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా.. దాదాపుగా అన్ని పనుల్లోనూ పనిమనిషి అవసరాన్ని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి చెప్పుకుందాం...బెంగుళూర్లోని హెబ్బాళ్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ ఏడు నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్‌ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకూ సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్ వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్–వండిన పోహా, పావ్ భాజీ రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు. శుభ్రంగా తింటున్నారు. దశలవారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్‌ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్‌ను నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది. జోడిస్తుంది రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ – కోయడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానై చేసేస్తుంది. అంతేకాదు సదరు రోబోట్ ఆమె ఇతర పనులను చేసుకోవడాన్ని రకరకాలుగా సులభతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా, వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరసమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ, ఆదా అయే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువేనన్నారామె.అదేవిధంగా, నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పనిమనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీగా ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళ నుంచి బెంగుళూర్‌కు ఇటీవలే వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్వాషర్లు రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్లు వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నాడని మనీషా చెప్పడం గమనార్హం.తుషారా నయన్ వంటి గృహిణులు కూడా మారారు. పనిమనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు. కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ, గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్‌లు దృష్టి పెట్టాలనీ, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు. కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనాలను వేతన కాలిక్యులేటర్లు లేదా డిజిటల్ పేస్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు -
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే శరీర బరువు చాలా కీలకం. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామో లేదో తనిఖీ చేసుకోవాలి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. మరి మన శరీర బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీర బరువును తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. సమతుల్య ఆహారం తీసుకునే జాగ్రత్త పడాలి. మరి అధిక బరువును తగ్గించుకునే క్రమంలో శరీరంలో ఫైబర్, ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి. అందుకు మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన కొన్నిముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.సాధారణ శారీరక శ్రమతో పాటు కొన్ని రకాల ఆహారాలను మన మెనూ చేర్చుకోవడం వల్లన, ప్రొటీన్ ఫుడ్ అందడంతో పాటు, తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటూ, కడుపు నిండిన అనుభూతి నింపేవి... రోజువారీ ఆహారంలో చేర్చినప్పుడు బరువు తగ్గడానికి గణనీయంగా సహాయపడతాయి. అంతేకాదు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . జీవక్రియను పెంచుతాయి.ఇదీ చదవండి: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేంఆకుకూరలుఆకుకూరలు కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడానికి సహాయపడతాయి. వీటిల్లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఓట్స్ఓట్స్ అనేది కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అధికంగా ఉండే తృణధాన్యం. కడుపు నిండిన అనుభూతినిచ్చి, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.గ్రీకు యోగర్ట్ గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గే సమయంలో కండరాల నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే, మంటను తగ్గించే జీర్ణక్రియకు సహాయపడే ప్రోబయోటిక్లు పుష్కలంలా లభిస్తాయి. చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!గుడ్లుగుడ్లు పోషకాలతో నిండి ఉంటాయి . అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అవసరమైన విటమిన్లను అందిస్తాయి. అల్పాహారంగా గుడ్లు తినడం వల్ల కడుపు నిండి, కేలరీల ఇన్‌టేక్ తగ్గుతుంది. ఆకలి , కొవ్వు నిల్వలో పాల్గొనే హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.చియా గింజలు చియాగింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అవకాడోఅవకాడోలో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్‌తో సమృద్ధిగా లభిస్తాయి. పొటాషియం కూడా ఉంటుంది.ఇది నీటి నిలుపుదలని నిర్వహించడానికి మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. పరోక్షంగా కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.బెర్రీలుబెర్రీలు కేలరీలు తక్కువ, ఫైబర్, విటమిన్లు మ,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తీపిని వదులుకోకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించే ఎవరికైనా ఇవిచక్కగా ఉపయోగపడతాయి.నట్స్ నట్స్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , ఫైబర్‌ను అందిస్తాయి.. అవి కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, గింజలను మితంగా తీసుకుంటే, ఆకలిని అరికట్టి, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించే సామర్థ్యం కారణంగా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.చిక్కుళ్ళుచిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్ , కరిగే ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, దీర్ఘకాలిక సంతృప్తిని ప్రోత్సహిస్తాయి. ఆకలిని నియంత్రించి, రక్తంలో చక్కెర పెరుగుదల లేకుండా స్థిరమైన శక్తి వనరును అందిస్తాయి. ఇది కొవ్వు నిల్వలను కరిగేలా చేస్తాయి.నోట్: బరువుతగ్గడం అనేది నిబద్ధతతో చేయాల్సిన పని. ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యాయామం చేస్తూ , ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా తమబరువును తగ్గించుకోవాలి. ఇందుకు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాలి. -
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేం
మలయాళ టీవీ నటి, యాంకర్ బిగ్‌బాస్ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్ డిజైనర్ సిబిన్ బెంజమిన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్స్ట పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్మెంట్ వార్తను అభిమానులతో షేర్చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్‌కు ఫౌండర్ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్‌తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్‌కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు. -
World Hypertension Day : పట్టణ యువతలో పెరుగుతున్న ‘హైబీపీ’
మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం (World Hypertension Day) సందర్భంగా, అపోలో హాస్పిటల్స్ దేశంలో పెరుగుతున్న రక్తపోటుపై జాతీయ అవగాహన కోసం పిలుపునిస్తోంది.ఆరోగ్యవంతులైన భారతీయులలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి ముందస్తు గుండె జబ్బులు వస్తున్నాయి . దేశీయంగా యువకుల్లో దాదాపు 30శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం , అకాల మరణాలకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా మారింది. ప్రజారోగ్యంపై దీని గణనీయమైన ప్రభావం ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో అధిక రక్తపోటు నిర్ధారణ కావడంలేదు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అపోలో హాస్పిటల్స్ ప్రజలను కోరుతుంది. భారతదేశంలో పెరుగుతున్న ‘రక్తపోటు’రక్తపోటు సుమారు 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి వారికి బీపీ ఉన్నట్టు గుర్తించడం లేదు. 2024లో 45 ఏళ్లలోపు వారిలో 26శాతం మందికి మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది.అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశం అనేక ప్రజారోగ్య సంక్షోభాలను అధిగమించింది . ఇది అవగాహన సమిష్టి కృషి ద్వారానే సాధ్య ం. అపోలో హాస్పిటల్స్‌లో, నివారణ అనేది మొదటి ప్రిస్క్రిప్షన్ అని తాము నమ్ముతున్నామన్నారు. డిజిటల్ హైపర్‌టెన్షన్ పర్యవేక్షణను మెరుగుపరచడం, రొటీన్ స్క్రీనింగ్‌లకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత నివ్వడం ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడి ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షును తాము అభిలషిస్తున్నా మన్నారు.ముఖ్యంగా ప్రధాన నగరాల్లో, హైదరాబాద్ (68%), ఢిల్లీ (65%) , చెన్నై (63%) ఎక్కువ కేసులు నమోదు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి , కదలికలు లేని జీవితం లాంటి 'పట్టణ జీవనశైలి' గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతోంది.అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, “రక్తపోటు ఇకపై వయస్సు లేదా జన్యుశాస్త్రానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది యువ పట్టణ జనాభాలో నిశ్శబ్ద అంటువ్యాధిగా మారుతోంది. నిజమైన సవాలు రక్తపోటును లెక్కించడంతోపాటు, వ్యక్తి విస్తృత హృదయనాళ ప్రమాద ప్రొఫైల్‌ను అర్థం చేసుకోవడంలో ఉంది. బయోమార్కర్లపై సమగ్ర అవగాహనను స్వీకరించాలి, ఎందుకంటే తేలికపాటి అసమతుల్యతలు కూడా మరింత తీవ్రమైన అంతర్లీన పరిస్థితులకు ప్రారంభ సూచికలు కావచ్చు అని ఆమె తెలిపారు. అంతేకాకుండా, వేగవంతమైన పట్టణీకరణతో, నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు , నిరంతర ఒత్తిడి లాంటివన్నీ ప్రజారోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. నివారణ , ముందస్తు జోక్యం అనేది తప్పనిసరి. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతదేశంలోని పట్టణ జనాభాలో దాదాపు 30శాతం అధిక రక్తపోటు లేదా ప్రీ-హైపర్‌టెన్షన్ బారిన పడటం ఆందోళనకరమైంది. మన తోటి పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్య సంరక్షణ, విధానం ,సమాజ అవగాహనతోపాటు, త క్షణ సమిష్టి చర్య అవసరమని ఆమె చెప్పారు.నివారణ మార్గాలుఉప్పు తీసుకోవడం తగ్గించడం, శారీరక శ్రమను పెంచడం ,ఒత్తిడి నిర్వహణ వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు వల్ల కలిగే 80శాతం గుండెపోటులు, స్ట్రోక్‌లను నివారించవచ్చని ఆధారాలు చూపిస్తున్నాయి. అధిక రక్తపోటు వైద్య నిర్వహణ చాలా కీలకమైనప్పటికీ, అపోలో హాస్పిటల్స్ నివారణ ఆరోగ్య సంరక్షణ వైపు మార్పు కోసం వాదిస్తోంది. అధిక రక్తపోటు పెరుగుతున్న భారాన్ని తిప్పికొట్టడానికి కీలకం ఏమిటంటే, వ్యక్తులు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, సమస్య ముదరకముందే గుర్తించడం. అపోలో హాస్పిటల్స్ దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో సాంకేతికతను సమగ్రపరచడానికి రక్తపోటును గుర్తించడం , నిర్వహించడం మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ , టెలిమెడిసిన్‌లో పురోగతి ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.జాతీయ చర్యకు పిలుపు: సమిష్టి బాధ్యతహృదయ సంబంధ నివారణపై జాతీయ పునరాలోచన కోసం అపోలో పిలుపునిస్తోంది, భారతీయులు ముందుగానే స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని, ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారికి స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని కోరుతోంది. కరోనరీ కాల్షియం స్కోరింగ్ వంటి అధునాతన ఇమేజింగ్ పద్ధతులను చేర్చడం వల్ల పైకి కనిపించని కారణాలను బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది. ప్రారంభ గుర్తులను చూపించేవారికి నివారణ చికిత్సా వ్యూహాలను అవలంబించడం వల్ల, అవి లక్షణరహితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రారంభ దశలోనే అథెరోస్క్లెరోసిస్ ఉన్న వ్యక్తులు మార్గదర్శకాల ఆధారిత జోక్యాలను పొందినప్పుడు హృదయ సంబంధ సంఘటనలలో 45–50శాతం తగ్గింపు ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటును ముందుగా గుర్తిస్తే.. నియంత్రణ సాధ్యమే: ఆలివ్ ఆసుపత్రిబీపీ చెక్ చేసుకుంటున్నారా? పాణాలు హరించడంలో బీప సలెంట్ కిలర్ - వరల్ బీడీ డే సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ అవగాహనప్రాణాలను హరించడంలో రక్తపోటు సైలెంట్ కిల్లర్ అని హదరాబాద్ లోని ఆలివ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. . 17 అంతర్జాతీయ రక్తపోటు దినం సందర్భంగా గుండె సంబంధిత వ్యాదులపై ఆసుపత్రి నిర్వాహకులు అవగాహన కల్పించారు. రక్తపోటు గుర్తింపు, నియంత్రణ, నివారణ లాంటి అంశాలపై అవగాహనా కార్యక్రామాన్ని నిర్వహించారు. రక్తపోటు ద్వారా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహనా ఆవశ్యకతపై వివరించారు. ‘రక్తపోటును సరిగ్గా గుర్తించండి, నియంత్రించుకుంటూ ఎక్కువకాలం జీవించండి’ అనే థీమ్ దీనిపై చర్చించారు. రక్తపోటు దేశంలో తీవ్ర ప్రజారోగ్య సమస్యగా మారుతోందని, ముఖ్యంగా గుండె సంబంధిత, వ్యాధులు, మూత్ర పిండాల వైఫ్యలానికి కీలకమైన ప్రమాదకారంగా మారుతోందన్నారు నిపుణులు.ఇదొక అంటువ్యాధిలా ఉందనీ, దాదాపు 200 మిలియన మంద దీనితో బాధపడుతున్నారనీ, డియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గణాంకాలు చెబుతుండగా, ఇందులో కొంతమందిలో ఇది అదుపులో ఉంది. అలాగేఏ జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్‌టెన్షన్‌లో ఇటీవల పచురితమన ఒక అధ్యయనం పకారం, భారతీయ పెదలలో 22.6శాతం మంది అధిక రక్తపోటుతొ బాధపడుతున్నారు. అయితే ఇందులో 15 శాతం మందిచి నియంత్రణలో ఉంది.గుండెపోటు, లేదా గుండె వైఫల్యం చివరి దశలో, సమస్య తీవ్రమైనపుడుమాత్రమే రోగులు వైద్య కోసం వస్తున్నారని ఆలివ్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెనల్ కార్డియాలజిస్ట్ డా. జహెదుల్లా ఖాన్ విచారం వ్యక్తంచేశారు. ఈ సమస్యను ముందుగాగుర్తించినా, లేదా క్రమం తప్పకుండా చికిత్సతీసుకున్నా, ప్రమాదకరమైన, అత్యవసర పరిస్థితులు రావని సూచించారు. ఈ సందర్భంగా ఆలివ్ హాసి్పటల్ లోని కన్సలెంట్ ఇంటర్వననల్ కారయాలజిస్ డాకర్ జహెదులా ఖాన్ మాటాడుతూ, “క్రమం తప్పకుండా బీపీని చెక్ చేసుకుంటూ ఉంటే నియంత్రణ సాధ్యమన్నారు. లక్షణాల కోసం చూడకుండా అవగాహన పెంచుకొని, తీసుకునే నివారణ చర్యలే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయుధమన్నారు. జాగ్రత్తలుఅధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలు లేకుండా ముదిరిపోతుంది. అందుకే పతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసార బీపీ చెక్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి.సమతుల్య, తక్కువ సడియం ఆహారం, అధిక పటాషియం ఉండేలా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. శారీరకంగా చురుకుగా ఉండటంతోపాటు ఒత్తిడిని నియంతించుకోవాలి. సరైన చికిత్సతో అధిక రక్తపోటును కట్టడి చేయవచ్చు. -
వై-యాక్సిస్ యూఎస్ ఎంబసీతో ఎంఓయూ
సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలో చదువుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులకు సహకారం అందించ డానికి వై–యాక్సిస్ ఫౌండేషన్ యూఎస్ రాయబార కార్యాలయంతో అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా విద్యార్థులకు విశ్వసనీయమైన, నిస్పాక్షికమైన మార్గదర్శకత్వాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్ యూఎస్ఏ ప్రోవైడర్‌గా ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్తో యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబంధించిన ఎంఓయును కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలకు సేవలు అందించే ఏకైక ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రంగా హైదరాబాద్‌లో వై–యాక్సిస్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన సమాచారం కోసం ఎడ్యుకేషన్ యూఎస్ఏ వన్–స్టాప్ సెంటర్ వై–యాక్సిస్ ఫౌండేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై–యాక్సిస్ ఫౌండేషన్ డైరెక్టర్ సబీనా జేవియర్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: After Fifty యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు! -
వరి జన్యు సవరణలో మనమే ఫస్ట్
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఇంతకు ముందు నుంచే అనేక పంటల్లో జన్యుసవరణ (Genome Editing) సాంకేతికత ద్వారా సరికొత్త వంగడాల రూపకల్పన జరిగింది. అయితే, ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి వంగడాలను రూపొందించిన ఘనత భారత్‌కు దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసిన పూసా రైస్ డిఎస్టి1 (Pusa DST Rice 1) రకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇవి 20–30% అధిక దిగుబడినివ్వటం, 20% తక్కువ నీటిని వినియోగించటం, 20 రోజులు ముందుగానే పంట కోతకు రావటం వంటి ప్రయోజనాలను చేకూర్చుతాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రకటించింది. మన దేశంలో మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను అభివృద్ధి చేయటంతో జన్యు సవరణ సాంకేతికత మరోసారి చర్చలోకి వచ్చింది. పంట దిగుబడి అప్సింథటిక్ బయాలజీ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రసాయన ఎరువులను అధికంగా వాడటం ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను ఇంజనీరింగ్ చేయడం, మొక్కలకు పోషకాలను మరింత అందుబాటులోకి తేవటం, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తెగుళ్ళు, వ్యాధులు, కరువు లేదా విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ ఒత్తిళ్లకు ఎక్కువ నిరోధకత కలిగిన పంటలకు జన్యు సాంకేతికతతో రూపుకల్పన చేస్తున్నారు. ఇవి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. పురుగుమందులు, ఇతర రసాయనాల వాడకాన్ని తగ్గిస్తాయి.జంతు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంవ్యవసాయంలో సింథటిక్ బయాలజీ (Synthetic biology) మరొక ఉత్తేజకరమైన ప్రయోజనం ఏమిటంటే.. సాంప్రదాయ జంతు ఆధారిత ఉత్పత్తులకు మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం. మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర జంతు ఆధారిత ఉత్పత్తుల రుచిని, ఆకృతిని అనుకరించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి పరిశోధకులు మొక్కల జన్యు క్రమంలో సవరణలు/ చేర్పులు/ మార్పులు చేస్తున్నారు. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ పరిధి అపారమైనది.సింథటిక్ బయాలజీ సవాళ్లుఅయితే, దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ వల్ల జన్యు భద్రత, అనాలోచిత విపరిణామాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతల వలె సింథటిక్ బయాలజీకి సంబంధించి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఉపయోగాన్ని నిర్ధారించుకోవడానికి పూర్తిగా అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా నియంత్రించాలి.చదవండి: జన్యు సవరణ అంటే ఏంటి.. అదెలా చేస్తారు? -
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్‌ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్‌పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్‌లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
Wonder Kids ఏడేళ్లకే ఆపరేషన్ చేశాడు!
1993లో హిమాచల్ ప్రదేశ్‌లోని నూర్పూర్లో జన్మించిన ఆక్రిట్ ప్రణ్ జస్వాల్, చిన్న వయసులోనే అసాధారణ తెలివి చూపించాడు. 10 నెలలకే నడవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు; రెండేళ్లకు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులో షేక్స్పియర్, శాస్త్రీయ పుస్తకాలు చదివాడు. ఏడేళ్ల వయసున్నప్పుడు, అతను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక చేతిపై శస్త్రచికిత్స చేసి, కాలిన గాయం వల్ల అతుక్కుపోయిన వేళ్లను విడదీసాడు. ఒక గంటపాటు జరిగిన ఆపరేషన్ విజయవంతమై, అతన్ని ‘‘ప్రపంచంలోనే అతి చిన్న సర్జన్’’గా చేసింది. ఆ సర్జరీ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. 2007లో ఓ ప్రా విన్ ఫ్రే షోలో ‘‘లిటిల్ జీనియస్’’గా కనిపించాడు ఆక్రిట్. 12 ఏళ్లలో చండీగఢ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీ, 17 ఏళ్లలో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాడు. క్యాన్సర్ రోగుల బాధలు చూసి, చిన్నప్పటి నుండి క్యాన్సర్ నివారణ కనుగొనాలని కలలు కన్నాడు. ఓరల్ జీన్ థెరపీపై పరిశోధన చేస్తూ, ఆక్రిట్ సైన్స్ ద్వారా ప్రపంచాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇంతటి మేధోశక్తి కలిగిన ఆక్రిట్ ఐక్యూ 146. నాలుగేళ్ల వయసు.. రికార్డుల్లో అదుర్స్నాలుగేళ్ల పిల్లలు అల్లరితో, ఆటలతో కాలం గడుపుతారు. అయితే జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గంగ్యల్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల సిద్ధార్థ్ మాత్రం రికార్డులతో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. అంత చిన్న వయసులో అతను సాధించిన రికార్డులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు శివ్ జ్యోతి పాండే, శ్వేత పాండే వైద్యులు. చిన్నప్పటి నుంచి పిల్లాడికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పెంచారు. దీంతో రెండేళ్ల వయసుకే ఇంగ్లిష్ అక్షరాలన్నీ నేర్చేసుకున్న సిద్ధార్థ్ 12 సెకండ్లలో వాటిని అప్పజెప్పి ‘అతి చిన్న వయసులో, అత్యంత తొందరగా ఇంగ్లీషు అక్షరమాల అప్పజెప్పిన వ్యక్తి’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడేళ్ల వయసులో భారత జాతీయ చిహ్నాలు, వివిధ రకాల కరెన్సీ నోట్లను గుర్తించి మరోసారి రికార్డు సాధించాడు. ఆ వయసులోనే ఎన్నో పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇతర దేశాల పేర్లు, వాటి జెండాలు, కరెన్సీ వంటి అంశాలను సైతం మూడేళ్లకే గుర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నో మున్ముందు మరెన్నో రికార్డులు నెలకొల్పాలని సిద్ధార్థ్ ఉవ్విళ్లూరుతున్నాడు. -
యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు!
మీ వయసు యాభై దాటిందా? ఏమనుకోకండి...మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియక΄ోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం... నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరి΄ోతుంది. అయితే ఇక్కడ మరో విషయం... శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం.విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది.సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి.యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర ΄ోషణకు మాంసకృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా. చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.మరో ముఖ్య విటమిన్ – విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్ బి 12, శరీరఆరోగ్యాన్ని పరిక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం.ఇవీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్బి 12 పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైన వాటిలో లభిస్తుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్త΄ోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.50 సం. దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది. చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం. ఇవీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
Yoga కూర్చొని కూడా బరువు తగ్గొచ్చు
‘దండాసనం’ (Dandasana or Staff Pose) అని పిలువబడే స్టాఫ్ పోజ్ వెన్నెముక, కాళ్ళు, తుంటి భాగంలో బలాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం కూర్చున్న భంగిమలో ఉంటుంది. యోగా ప్రారంభకులకు అనుకూలమైన అభ్యాసంగా ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే.మ్యాట్ పైన కూర్చొన, కాళ్ళు ముందు చాపి కూర్చోవాలి. తొడ కండరాలను స్ట్రెచ్ చేయాలి. పాదాలను ముందుకు వంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాలను వెడల్పుగా చేస్తూ, నిటారుగా ఉంచాలి. ∙చేతులను హిప్ బాగానికి రెండు వైపులా నేల మీద నిటారుగా ఉంచాలి.ఈ భంగిమలో 5–15 శ్వాసలోపలకు తీసుకొని, వదలాలి, ఈ సమయంలో శ్వాసపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇదీ చదవండి : బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ప్రయోజనాలు.. ∙ఈ ఆసనం ద్వారా వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ∙చేతులు, తొడ కండరాలలో ఒత్తిడి రిలీజ్ అవుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల ఛాతీ భాగం స్ట్రెంథెన్ అవుతుంది. ఇతర యోగా భంగిమలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ భంగిమ రోజూ సాధన చేయడం ద్వారా శారీరక బరువు పట్ల అవగాహన పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారంవైపు దృష్టి మరలి, అధికబరువు సమస్య తగ్గుతుంది.ఈ భంగిమలో తొడ, మోకాలి భాగాలు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే యోగా పట్టీని ఉపయోగించవచ్చు. కూర్చోవడంలో ఇబ్బంది పడుతుంటే, సపోర్ట్ కోసం ఒక పలచటి దిండును ఉంచవచ్చు. మొదట్లో కాళ్ళను నిటారుగా ఉంచలేకపోతే ఆందోళన పడనక్కర్లేదు. మెల్లగా అభ్యాసనం ద్వారా కాళ్లు నిటారుగా వస్తాయి. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్‌కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్‌లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్‌లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్‌సైజ్‌లతో మొదలుపెట్టి వర్కవుట్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు. 在 Instagram 查看这篇帖子 Choudhary Ajay Sangwan (@weightliftermummy) 分享的 జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్బార్ డెడ్‌లిఫ్ట్‌లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్‌లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది. ‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్‌లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!డైట్ విషయానికి వస్తే...‘ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్‌లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్‌లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్‌గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్‌గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్‌లకు కోచ్‌గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
చెమట కంపు... వదిలించుకోండిలా...!
వేసవిలో చెమట వాసన అత్యంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ కాలేజీ అయినా, ఆఫీసు అయినా, పార్టీ అయినా, ఫంక్షన్ హౌస్ అయినా చెమట దుర్వాసన వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు అందరూ చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు వంటి వివిధ రకాల సువాసనలను ఉపయోగిస్తారు. కానీ కొంత మంది పెర్ఫ్యూమ్, డియోల నుంచి వచ్చే ఘాటైన వాసనను తట్టుకోలేరు. అలెర్జీ కూడా కలిగిస్తుంది.బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ యార్క్ పరిశోధన ప్రకారం.. చెమట వాసనకు గల కారణాలలో ముఖ్యమైనది ఎంజైమ్. ఇది ప్రధానంగా చంకలలో కనిపించే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. వీటి మూలాన్ని తొలగించడం వల్ల చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు.చెమట వాసన ఎంజైమ్‌లను తొలగించడానికి ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మ, టమోటా, కొబ్బరి నూనె వంటి కొన్ని గృహోపకరణాల ద్వారా చెమట దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు. రెండు నిమ్మకాయలను కట్ చేసి చెమట పట్టిన ప్రదేశంలో రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసం ఆరి΄ోయినట్లు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చెమట దుర్వాసన ఇట్టే పోతుంది.ప్రతిరోజూ స్నానానికి ముందు టొమాటోను కట్ చేసి.. దీని రసాన్ని శరీరంలోని చెమట ఉన్న భాగాలపై రాసుకోవాలి. కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే చెమట వాసన దూరం అవుతుంది.చెమట దుర్వాసనను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని లారిక్ యాసిడ్ చెమటలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని, ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన రానేరాదు. -
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట! -
స్వేచ్ఛగా .. రెక్కలు విప్పేలా...
అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్ టీటో మతీజ్‌కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్ అయింది.. మిస్ సౌత్ సుడాన్‌గా కిరీటం ధరించి మిస్ వరల్డ్‌కి పోటీపడ్డానికి హైదరాబాద్ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సౌత్ సుడాన్లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్ సుడాన్‌లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్‌గా ట్రైన్ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్ సుడాన్లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్ తర్వాత వచ్చేశాను. సర్వీస్ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్ సుడాన్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్ సౌత్ సుడాన్ పాజెంట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్‌కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్‌గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్ సుడాన్ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్ సుడాన్‌లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్ పేరెంట్‌గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్ సుడాన్‌లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్‌కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్‌గా ఉండి, తర్వాత తరాలను ఇన్స్పైర్ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్ సౌత్ సూడాన్.మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
జన్యు సవరణ.. నియంత్రణలు, నిబంధనలు
జన్యు సవరణకు సంబంధించిన ఆధునిక బ్రీడింగ్ ఆవిష్కరణ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎటువంటి నియంత్రణ చట్టాలు, నియమనిబంధనలు అమల్లో ఉన్నదీ ఈ ఇన్ఫోగ్రాఫిక్ తెలియజెప్తోంది. ఈ దేశాలు జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాలుగానే పరిగణిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇది సాధ్యమైంది.సైట్ డైరెక్టెడ్ న్యూక్లియాసెస్1 (ఎస్డిఎన్1) పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాల మాదిరిగానే పరిగణించాలనే అంశంపై విధాన రూపకల్పన దిశగా చెప్పుకోదగిన స్థాయిలో చర్చలు కొనసాగుతున్న దేశాలు. పాత చట్టాల ప్రకారం న్యాయస్థానాలు వ్యాఖ్యానాలకు అనుగుణంగా ఎస్డిఎన్1 పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను జన్యు మార్పిడి జీవులు(జిఎంఓల)గానే పరిగణిస్తున్న దేశాలు. ఉత్తర అమెరికాజన్యుసవరణ వంటి సరికొత్త బ్రీడింగ్ ఆవిష్కరణలను సాధారణ వంగడాలుగా పరిగణిస్తూ పటిష్ట చట్టాలు చేసిన తొలి వరుస దేశాల్లో అమెరికా, కెనడా ముందు భాగాన ఉన్నాయి. జన్యు సవరణ చేసిన అధిక ఓలిక్ సోయాబీన్స్ నుంచి తీసిన నూనెను ‘కాలినో’ పేరిట విక్రయిస్తున్నారు. ఇది అమెరికాలో 2019 నుంచి వాణిజ్యపరంగా సాగవుతున్న తొలి జన్యు సవరణ పంట.లాటిన్ అమెరికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 8 లాటిన్ అమెరికా దేశాలు చట్టాలు చేశాయి: బ్రెజిల్, చిలి, కొలంబో, ఈక్వడార్, గ్వాటెమల, హాండురస్, పరాగ్వే, అర్జెంటీనా. అర్జెంటీనా 2015లోనే తొలి చట్టం చేసింది. కోసిన తర్వాత రంగు మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన బంగాళదుంపను క్రిస్పర్ ద్వారా 2018లో అర్జెంటీనా రూపొందించింది.యూరప్జన్యు సవరణ వంటి న్యూ జినోమిక్ టెక్నిక్స్‌ను జన్యుమార్పిడి వంగడాలుగా కాకుండా సాధారణ కొత్త వంగడాలుగానే భావించాలని యూరోపియన్ యూనియన్ 2023 జూలైలో ప్రతిపాదించింది యునైటెడ్ కింగ్డమ్లో ప్రెసిషన్ బ్రీడింగ్ బిల్లును 2022 మేలో ప్రవేశపెట్టారు. 2023 మార్చిలో రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం సైన్స్ బేస్డ్ నియంత్రణ వ్యవస్థను నెలకొల్పటం ద్వారా పరిశోధనలకు దోహదం చేస్తోంది.చదవండి: జీనోమ్ ఎడిటింగ్.. ప్రయోజనాలు, ప్రతికూలతలుఆసియా పసిఫిక్జన్యు సవరణ వంగడాలు/ఉత్పత్తులను అనుమతిస్తూ ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్, భారత్ చట్టాలు చేశాయి. జపాన్‌లో జన్యు సవరణ చేసిన ‘హై గబ’ టొమాటోను 2021 నుంచి విక్రయిస్తున్నారు. బ్రౌన్‌గా మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన అరటి రకాన్ని నాన్–జిఎంఓ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఫిలిప్పీన్స్‌లో 2023లో చట్టం చేసింది. భారత ప్రభుత్వం జన్యు సవరణను జనుమార్పిడి నియంత్రణ జాబితా నుంచి 2023లో మినహాయించింది. తొలి రెండు జన్యుసవరణ అధిక దిగుబడి వరి వంగడాలను 2025 మేలో విడుదల చేసింది.ఆఫ్రికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 4 ఆఫ్రికా దేశాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి: నైజీరియా (ఫిబ్రవరి 2022), కెన్యా (మార్చి 2022), మలావి (ఆగస్టు 2022), ఘన (అక్టోబర్ 2023). ఇన్ఫోగ్రాఫిక్ సౌజన్యం: isaaa.org -
వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్‌నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. -
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
ఇటీవల కాలంలో సీజేరియన్ డెలివరీల కంటే..నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పలువురు మహిళలు, సెలబ్రిటీలు. ఆ దిశగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రసవిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది 'వాటర్ బర్త్'. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు దీని గురించే సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్. అంతేగాదు ఈ నీటి ప్రసవం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పొకొచ్చారామె. ఇంతకీ ఏంటా ప్రసవం.. ? అందరూ దీన్ని ఎంచుకోవచ్చా..? తదితర విషయాలు గురించి తెలుసుకుందామా..కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి. తన విలక్షణమైన నటనతో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటి. ఆమె పియానిస్ట్ గయ్‌ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె అందరిలాంటి నార్మల్ డెలివరీ కాకుండా..నీటి ప్రసవాన్ని ఎంచుకుంది. సంప్రదాయ నార్మల్ డెలివరీలలో ఇది కూడా ఒకటి. బిడ్డను స్వాగతించడానికి ఈ పద్ధతి అద్బుతమైనదని అంటోంది నటి కల్కి. శరీరానికి చాలా సులభమైన ప్రక్రియని చెబుతోందామె. కానీ భారతీయ మహిళలు దీన్ని ఎందుకు ఎంచుకురో తెలియడం లేదన్నారు. బహుశా ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియనే ఉద్దేశ్యంతో కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారామె. ఇటీవల అలీనా డిసెక్ట్స్తో జరిగిన సంభాషణలో నటి కల్కి ఈ విషయాలు వెల్లడించారు. ఇదేమి ఆశ్చర్యపోవాల్సిన ప్రవాస ప్రక్రియ కాదంటున్నారామె. శిశువు అల్రెడీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో ప్రసవిస్తే శిశువుకి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు కల్కి. ఆస్పత్రిలో కూడా అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది కల్కి. సహజ సిద్ధమైన కాన్పులలో ఇది ఒకటని..ఇటీవలే నెమ్మదిగా వెలుగులోకి వస్తోందని చెబుతున్నారామె. ముఖ్యంగా తనలాంటి సెలబ్రిటీల అనుభవాలతోనే ప్రజలకు తెలుస్తోందని చెబుతోంది. అసలేంటి ప్రసవం..వాటర్ బర్త్ అంటే ..సింపుల్‌గా చెప్పాలంటే..వాటర్ బర్త్ అంటే.. ఒక రకమైన ప్రసవం. దీనిలో కాబోయే తల్లి డెలివరీ టైంలో ప్రవహించే కొలను లేదా వెచ్చని నీటి తొట్టిలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడూ..డెలివరీ సంక్లిష్టంగా కాకుండా సులభంగా అయిపోతుంది. సాధారణ ప్రసవంతో పోలిస్తే..ఈ ప్రసవం చాలా సౌకర్యవంతగంగా, తేలికపాటి కష్టంతో కూడుకున్నదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఎందుకు ప్రజాదరణ పొందుతోందంటే..తల్లి శరీర బరువుని తగ్గించి స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తుంది. అలాగే సమర్ధవంతమైన గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. పైగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గర్భాశయ కండరాలు తక్కువ నొప్పితోనే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అలాగే శిశువుకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుందట. అంతేగాదు డెలివరీ టైంలో ఉండే ఆందోళన కూడా నీటిలో మునిగి ఉండటం వల్ల తగ్గుతుందట. ఒత్తిడికి సంబధించిన హార్మోన్లు తగ్గించి..నొప్పులు వచ్చేలా ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా వీలు కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నీటిలో తక్కువ పురిట నొప్పులతోనే ప్రసవం సులభంగా అయిపోతుందట.అందరూ ఈ ప్రక్రియ ఎంచుకోవచ్చా.?క్రిటికల్ కానీ గర్భణిలు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిండం 37 నుండి 41 వారాల మధ్య ఉంటేనే ఈ పద్ధతికి అనుమతిస్తారట. అలాగే తల్లిలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తగిన మోతాదులో ఉండాలని చెబుతున్నారు. అలాగే నెలలు నిండక ముందు అయ్యే కాన్పులకు ఈ పద్ధతి పనికిరాదని చెబుతున్నారు. అదీగాక గతంలో సీజేరియన్ అయ్యిన మహిళలు కూడా ఈ ప్రక్రియని ఎంచుకోకూడదని వెల్లడించారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్‌కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్‌లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్‌లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్‌కు దూరంగా కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్‌కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్‌గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్‌ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
'టీ బ్యాగులు' తినడం గురించి విన్నారా..?
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి. అది తినడం లేదా స్కిల్ పరంగా ఏదైనా.. ఆ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలానే ఇక్కడొక అమ్మాయికి ఉన్న విచిత్రమైన అలవాటు వింటే..ఇదేం అభిరుచి అనిపిస్తుంది.సైప్రస్‌లోని లిమాసోల్‌కు చెందిన లియుబోవ్ సిరిక్ అనే 20 ఏళ్ల అమ్మాయికి ఓ వింత ఆహారపు అలవాటు ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ అభిరుచి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 'టీ' అంటే ఇష్టపడే ఆహార ప్రియులు ఆమె అలవాటు వింటే..వామ్మో అని నోరెళ్లబెడతారు. మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ అయిన లియుబోవ్కి టీ బ్యాగులు తినడం అంటే ఇష్టమట. టీ తాగిన తర్వాతా ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా మొత్తంగా తినేస్తుందట. ఇలా ఆమె రోజుకు రెండుసార్లు తినేస్తానని చెబుతోందామె. వారానికి కనీసం మూడుసార్లు పేపర్ టీ బ్యాగ్‌లు ఫినిష్ చేస్తానని అంటోంది. ఈ అలవాటు 14 ఏళ్ల అప్పుడు ప్రారంభమైందట. వాళ్ల అమ్మమ్మ పుదీనా ఆకులు తినమని చెప్పినప్పుడూ ..ఈ టీ ఆకులు రుచి చూడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే టేస్ట్ నచ్చి..అది క్రమంగా అలవాటుగా మారిందని అంటోంది లియుబోవ్. ఆమె ఆర్గానిక్ టీ బ్యాగులను మాత్రమే తింటుందట. ప్లాస్టిక్ లేదా నైలాన్‌తో ఉన్న వాటిని టచ్ చేయనని చెబుతోంది. అయితే కొన్ని టీ బ్యాగుల్లో ఫాబ్రిక్ ఉంటుంది కాబట్టి తినడానికి కష్టంగా ఉంటుందని అంటోంది. అయితే ఆమె ఈ అలవాటుని వదిలేద్దాం అనుకుందట గానీ సాధ్యం కాలేదని చెబుతోంది. ఇది ప్రమాదకరమా..?అయితే ఇదిప్రమాదకరమా అంటే..ఒక్కోసారి ఆ టీ వేస్ట్ గొంతులో అడ్డుపడటం లాంటిది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల వాదన. కానీ ఈ అమ్మాయి లియుబోవ్ మాత్రం ఈ అలవాటు మంచిదేనా? కాదా? అని గూగుల్‌లో సర్చ్ చేసిందట. చివరికి ఇది హానికరం కాదని నిర్థారించుకున్నాకే ధీమాగా తింటున్నానని చెబుతోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నానంటోంది. ధూమపానం, మద్యం వంటి అలవాట్ల కంటే ప్రమాదకరమైనది కాకపోయినా..సాద్యమైనంత వరకు ఈ అలవాటుని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తానంటోంది. అయినా ఏ అలవాటుకైనా అడిక్ట్ అయ్యిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు ఊరికే అనలేదు కదా..! ఆరోగ్యానికి హానికరం కాకపోయినా..తగు జాగ్రత్తలో ఉండటమే మంచిది కదూ..!. View this post on Instagram A post shared by Newsflare (@newsflare) (చదవండి: 70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్‌నాథ్‌కు..! వీడియో వైరల్) -
70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్‌నాథ్‌కు..! వీడియో వైరల్
మనిషి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. అలాంటి ఉదంతాలు ఎన్నో కోకొల్లలుగా జరిగాయి. వాటన్నింటిని తలదన్నేలా అంతకు మించి..అనే అజేయమైన సాహాసానికి తెరతీశాడు ఈ 70 ఏళ్ల వృద్ధుడు. అతడి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే.. ఇదేలా సాధ్యం అనే ఆశ్చర్యం కలగకమానదు. కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌కు కాలినడకన వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి మరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారాయన. ఆ వృద్ధ భక్తుడు తన తోటి యాత్రికుల బృందంతో కలబురగి నుంచి ఈ యాత్ర చేసినట్లు తెలిపారు. తాము మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని అన్నారు. అంటే దాదాపు రెండు నెలల్లో వివిధ మైదానాలు, అడవులు, పర్వత మార్గాల గుండా సుమారు 2,200 కిలోమీటర్ల అసాధారణ యాత్రను చేశారు వారంతా. అంతేగాదు ఆ వృద్ధుడు ఇదంతా మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని అంటున్నారాయన. దైవం ఆశీస్సులు ఉంటే ఎంత కఠినతరమైన ప్రయాణమైనే చిటికెలో సాధ్యమైపోతుందని ధీమాగా చెబుతున్నాడు ఆ వృద్ధుడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల మనసును కదిలించింది. ధృడ సంకల్పం, అజేయమైన భక్తి..అనితరసాధ్యమైన ఓర్పుని అందిస్తాయనడానికి ఆ వృద్ధుడే ఉదహారణ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 12000 km Padyatra from Karnataka to KedarnathHindu Dharma is Sanatan because of the Bhakts like him Har Har Mahadev 🔥 pic.twitter.com/bNphehFL8t— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 15, 2025 (చదవండి: పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు..! పట్టరాని ఆనందంలో స్వలింగ జంట) -
మలబార్‌హిల్ ‘నైసర్గిక ఎలివేటెడ్’.. సూపర్! టూరిస్టుల రద్దీ
మలబార్ హిల్ ప్రాంతంలో నెల రోజుల కిందట ప్రారంభించిన ‘నైసర్గిక ఎలివేటెడ్ మార్గం’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం అనందాన్ని ఆస్వాదించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా లక్షకుపైనే చేరింది. పర్యాటకుల ఎంట్రీ టికెట్ల ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రూ.27 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. కొందరికి టెకెట్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లేదంటే ఈ ఆదాయం మరింత పెరిగేదనే బీఎంసీ వర్గాలు తెలిపాయి. రూ.30 కోట్ల వ్యయం శివసేన యువనేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే 2022లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ తరహాలో ‘ట్రీ టాప్ వాక్’ నిర్మించాలని సంకల్పించారు. ఆ మేరకు కమలా నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న మలబార్ హిల్‌లో నైసర్గిక ఎలివేటెడ్ మార్గం పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యాయి. అందు కు రూ.30 కోట్లు ఖర్చుచేసిన ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం గత నెల నుంచి వినియోగంలోకి వచి్చంది. ప్రారంభం నుంచి ఈ ఎలివేటెడ్ మార్గానికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించసాగింది. ట్రీ టాప్ వాక్ తరహాలో.. మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యానవనం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచ్చితంగా ఈ రెండు ఉద్యాన వనాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను మరింత ఉత్సాహపరిచాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో ఉన్న ‘ట్రీ టాప్ వాక్’ తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. ఇలాంటి ఎలివేటెడ్ మార్గాన్ని ముంబైలో నిర్మించడం ఇదే ప్రథమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మార్గానికి వందలాది చెట్లు అడ్డువచ్చినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనంలోని వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అలాగే కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చర్నిరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్‌క్లెస్ (మెరైన్ డ్రైవ్) తదితర విహంగం ద్వారా దృశ్యాలను తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.25 వసూలు చేస్తున్న నైసర్గిక ఎలివేటెడ్ మార్గానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శని, ఆదివారాలైతే కిక్కిర్సిన జనాలు, పర్యాటకులు ఉంటున్నారు. టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్ముడు పోవడంతో ఆఫ్‌లైన్‌లో లభించడం లేదు. దీంతో అనేక మంది పర్యాటకులు నైసర్గిక ఎలివేటెడ్ మార్గం ద్వారా ప్రకృతి అందాలను తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు. -
జన్యు సవరణ అంటే ఏంటి?
మన దేశ వ్యవసాయ రంగంలో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న అధునాతన సాంకేతికత ‘జీన్ ఎడిటింగ్ – జి.ఇ.’. జన్యు సవరణ అనేది శాస్త్రవేత్తలు మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాతో సహా సకల జీవుల లక్షణాలను మెరుగుపరచడానికి అనుమతించే సరికొత్త బ్రీడింగ్ పద్ధతుల్లో ఒకటి. జన్యు సవరణ కోసం ఉపయోగించే సాంకేతికతలు కత్తెర లాగా పనిచేస్తాయి. డి.ఎన్.ఎ. అంటే డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం. ముఖ్యంగా క్రోమోజోముల్లో ఉంటుంది. మైటోకాండ్రియాలలో చాలా కొద్దిగా కనిపిస్తుంది. జీవులన్నింటిలో డి.ఎన్.ఎ. ముఖ్యమైన జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. జీవుల్లో అనువంశికానికి డి.ఎన్.ఎ. మూలాధారం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో డి.ఎన్.ఎ.ను కత్తిరించడం, కత్తిరించిన లేదా తెలిసిన డి.ఎన్.ఎ. శ్రేణులను తొలగించడం, జోడించడం లేదా భర్తీ చేయడం వంటివి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల డిఎన్‌ఎలోని జన్యువుక్రమంలో ఆశించిన అవసరం మేరకు అందుకు సంబంధించిన జన్యువును కత్తిరించటం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టుకోవటమే జన్యు సవరణ ప్రక్రియ లక్ష్యం.జీన్ ఎడిటింగ్ సింథటిక్ బయాలజీలో ఒక భాగం. ఇది జీవశాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సూత్రాలను కలిపి కొత్త జీవ వ్యవస్థలను సృష్టించడానికి, ఉన్న వాటిని సవరించడానికి ఉపయోగపడుతుంది. సింథటిక్ బయాలజీ (Synthetic biology) అనేది సాపేక్షంగా కొత్త రంగం. ఈ సంకేతికతకు ఉన్న విస్తారమైన సామర్థ్యం కారణంగా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మొక్కలు, బ్యాక్టీరియా వంటి జీవుల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్ట విధులను నిర్వర్తించగల కొత్త జీవ వ్యవస్థలను సృష్టించవచ్చు. జీనోమ్ ఇంజనీరింగ్‌ను వ్యవసాయం, వైద్యం, బయోటెక్నాలజీ (Biotechnology) సహా వివిధ రంగాల్లో ఉపయోగించవచ్చు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన రంగంగా మార్చుకోవచ్చు. ఈ సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సింథటిక్ బయాలజీ పద్ధతుల్లో జన్యు సవరణ ఒకటిసింథటిక్ బయాలజీలో ఉపయోగించే పద్ధతులు అనేకం ఉన్నాయి. డిఎన్ఎ సంశ్లేషణ – అసెంబ్లీ, జీనోమ్ ఎడిటింగ్, ప్రోటీన్ ఇంజనీరింగ్, జీవక్రియ ఇంజనీరింగ్, సిస్టమ్స్ బయాలజీ వంటివి అందులో ముఖ్యమైనవి. జన్యు సవరణలో క్రిస్పర్ – కాస్9 వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇది నిర్దిష్ట డిఎన్ఎ శ్రేణులను కత్తిరించడానికి, సవరించడానికి డిఎన్ఎ గైడెడ్ న్యూక్లియస్‌లను ఉపయోగిస్తుంది. తెగుళ్లు, పర్యావరణ ఒత్తిడి, పంట దిగుబడితో సంబంధం ఉన్న జన్యువుల సవరణల ద్వారా వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) విప్లవాత్మక మార్పులను తేగలిగిన స్థితిలో ఉంది. జన్యు సవరణ ప్రయోజనాలు⇒ ఖచ్చితమైన నియంత్రణతో జీవ వ్యవస్థలను రూపొందించే, నిర్మించే సామర్థ్యం కలిగి ఉండటం జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికతల ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.⇒ వ్యవసాయం, వైద్య చికిత్సలు, పర్యావరణ కాలుష్య నివారణ, పారిశ్రామిక అప్లికేషన్లకు ఈ సాంకేతితక కొత్త మార్గాలను తెరుస్తుంది.⇒ ఉదాహరణకు, నిర్దిష్ట వ్యాధులను లక్ష్యంగా చేసుకోగల ప్రత్యేక ఔషధాలను రూపొందించడానికి లేదా పర్యావరణంలోని కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను రూపొందించడానికి సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఆహార భద్రత, ఇంధనం, వాతావరణ మార్పు వంటి విశ్వవ్యాప్త సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఉదాహరణకు, సింథటిక్ బయాలజీ వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే పంటలను అభివృద్ధి చేయవచ్చు. పురుగుమందులు, కలుపు మందుల వాడకాన్ని తగ్గించడానికి, పంటల దిగుబడిని పెంపొందించడానికి సహాయపడుతుంది.జన్యు సవరణ ప్రతికూలతలు⇒ జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానికి వుండే సమస్యలు దానికి ఉన్నాయి. జీవుల జన్యువుల్లో మార్పులు చేయటంలో భద్రత, నైతిక చిక్కులు ఇమిడి ఉన్నాయి.⇒ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవాలి. అందుకు జాగ్రత్తగా నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.చదవండి: జన్యు సవరణ వరి వంగడాలను ఆవిష్కరించిన ఐసీఏఆర్⇒ అధిక ధర, సంక్లిష్టత దీనికి ఉన్న పెద్ద ప్రతికూలత. ప్రత్యేకమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ఇందుకు భారీ పెట్టుబడి అవసరం, దీని వలన చిన్న తరహా ప్రాజెక్టులను చేపట్టటం కష్టంగా మారుతుంది.⇒ ఊహించని పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. జన్యు మార్పులకు లోనైన జీవులు సహజ వాతావరణంతో అనూహ్య విధాలుగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. -
కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
లాపతా లేడీస్ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని ఫూల్ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్‌లో తన లుక్స్‌తో వావ్ అనిపించింది. 17 ఏళ్ల యువతార బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్‌తో తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది. ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె డిజైనర్ దుస్తులు, స్టైల్, సీనియర్ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.నితాన్షి లుక్‌లో ప్రధాన ఆకర్షణ, ముత్యాల జడలో కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి బాలీవుడ్ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్‌లున్న (miniature photo frames) కస్టమ్-మేడ్ హెయిర్ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?ముత్యాల చీర,పూసలు, ముత్యాలు, సీక్విన్లతో తయారు చేసిన ప్రీ-డ్రేప్డ్ చీరలో అందంగా ముస్తామైంది. దానిపై మల్టీ లేయర్ల , 3D వర్క్ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్‌ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్‌లో ఉన్నప్పుడు అలియా భట్ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్ డిస్నీడాల్‌గా చాలా ముద్దుగా ఉంది.నితాన్షి రికార్డులాపతా లేడీస్ చిత్రంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్. లోరల్ పారిస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్‌లోకి అడుగుపెట్టింది, ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది. ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్‌తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్‌కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్‌కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
Life is short: కోపాన్ని జయించిన వాడే యోగి
ధృతరాష్ట్రుడు విదురుడితో మాట్లాడుతూ ‘మనుషుల ఆయువు వంద సంవత్సరాలైనా అతి తక్కువ మందే వందేళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది వందేళ్ళ లోపే మరణిస్తున్నారు. ఎందుకు? దీని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు’ అన్నాడు.అందుకు విదురుడు, ఆరు అంశాలే మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నా యన్నాడు. అవి – అహంకారం, అదే పనిగా వాగుతూ ఉండటం, త్యాగ గుణం లేకపోవడం, కోపావేశాలు, స్వార్థబుద్ధి, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం! ఏ విధంగా చూసినా ఈ ఆరూ ఎవరికీ మంచివి కావన్నాడు. ‘నేనే గట్టివాడిని, నేనే ధనవంతుడిని, నేనే దాతను, నేనే మంచివాడిని, ఇతరులు దుష్టులు’ అని అనుకోవడంతో గర్వం తలకె క్కుతుంది. గర్విష్టిని భగవంతుడు శీఘ్రమే అంతం చేసేస్తాడు. కనుక గర్వం లేకుండా ఉండటానికి తన లోని లోపాలను, తప్పులను చూసుకోవాలి. అదేపనిగా మాట్లాడేవాడు అనవసరమైన విషయాలను గురించి మాట్లాడి లేని పోని కయ్యాలకు కాలుదువ్వుతాడు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ‘పరుషమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది. నిజమైనది ఏదో, ప్రియమైనది ఏదో, మంచిది ఏదో తెలుసుకుని మాట్లాడాలి’ అన్నాడు.అన్నింటినీ మనమే అనుభవించాలనే ఆశ వల్ల మనలో త్యాగం చేయాలనే ఆలోచన పుట్టదు. ‘మనం ఈ ప్రపంచంలో పుట్టిందే మన కోసం కాదు, ఇతరులకు సాయం చేయడానికే’ అని తెలుసుకుంటే త్యాగ గుణం అలవడుతుంది. మనిషికి ప్రథమ శత్రువు కోపం. కోపాన్ని జయించిన వాడే యోగి. అతనే ప్రపంచంలో సుఖపడతాడు. ఎవరు చెడు చేసినా ఎవరు మనల్ని కోపగించుకున్నా వాటిని సహించడం అలవాటు చేసుకోవాలి. స్వార్థమే అన్ని చెడులకూ కారణం. దీని నుంచి ఇవతలకు రావాలంటే మనలో మానవత్వం రవ్వంతైనా ఉండాలి. ఇక చివరగా, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం ఏ విధంగానూ సబబు కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్లు అందరితోనూ మంచిగా ఉండాలి. ద్రోహచింతన తగదు. కరుణ ఉండాలి.– యామిజాల జగదీశ్ -
పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు.!
ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.భారత సంతతికి చెందిన క్వీర్ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె. నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్ష్లలకు పైగా లైక్‌లు వచ్చాయి.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!) -
గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు -
ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?
బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్ రైటర్’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు రాయాలి?ట్రావెలర్స్ ట్రావెల్ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్‌స్టైల్ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలుయాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్ప్రెషన్దీ లాంగ్వేజ్దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్‌డ్రైవర్ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్‌గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్‌ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్ అవుతారు.జ్ఞాపకశక్తి పెరుగుతుందిమీరు ట్రావెలింగ్‌లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.చారిత్రక, సాంస్కృతిక అవగాహనమీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గూగుల్ చేసి యూట్యూబ్ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది. నేరుగా తెలుస్తుందిఎప్పుడూ స్వీట్ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్‌బోట్‌లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్‌వాటర్స్‌లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్స్ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.– కె. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
మాయమైపోతున్న మనిషి కోసం.. శాలిని
కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.ఇదీ చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్! View this post on Instagram A post shared by Shalini (@shalini_robert_) బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన శాలిని ΄ార్ట్ టైమ్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.రోడ్డు ప్రమాదంలో తండ్రి... సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని... అలా ఎప్పుడూ చేయలేదుఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్ కాదు. ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని -
జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..
హైదరాబాద్ నగరంలో బ్లైండ్ ఫోల్డ్ వర్క్‌షాప్స్ ఊపందుకుంటున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని కుంచెకు పనిచెప్పే చిత్రకారులు సృష్టిస్తున్న చిత్రాలు కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో ఆ తరహా చిత్రకళా నైపుణ్యం అందించే వర్క్‌షాప్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్‌లో ఉన్న ట్రైలింగ్ ఐవీ కేఫ్ ఆధ్వర్యంలో ఒక వర్క్‌షాప్ జరగనుంది. ఔత్సాహికులకు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ మెళకువలను నేర్పేందుకు శనివారం మధ్యాహ్నం 12.గంటలకు ఈ వర్క్‌షాప్ ప్రారంభం కానుంది. దాదాపు 2గంటల పాటు కొనసాగే ఈ కళాశిక్షణపై ఆసక్తి కలిగినవారు బుక్ మై షో ద్వారా ఎంట్రీలు పొందవచ్చు. (చదవండి: Araku Aroma : హైదరాబాద్ టు యూఎస్..తొలి బ్రాండ్‌గా అరుకు అరోమా..!) -
అమెరికాలో అరకు రుచులు..
అరకు కాఫీ రుచిని యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్‌గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు. క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్లలో అరకు అరోమా గ్రీన్ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్ కాఫీ, అరబికా ప్రైమ్ ఉన్నాయన్నారు. యూఎస్ఏలో రిజిస్టర్డ్ బ్రాండ్ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు.. ) -
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్‌కు పసందు..
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్‌తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది. ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్బీర్ సింగ్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి.. అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్‌లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్‌తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్‌ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. ప్రత్యేక దినుసులు.. ఫెస్ట్‌లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్‌తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్‌లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్ను ఆస్వాదిస్తారు. (చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట) -
మిస్ వరల్డ్ మధురమైన పాట
అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్’ అనిపించుకున్నారు మిస్ వరల్డ్ అందాల తారలు...మిస్ వరల్డ్ (2019) టోని–అన్ సింగ్, వైట్నీ హ్యూస్టన్ పాట ‘ఐ హ్యావ్ నథింగ్’ను మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్లో అద్భుతంగా ఆలపించింది.మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.మిస్ వరల్డ్(1997) డయాన హేడెన్ ప్రొఫెషనల్ సింగర్. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసింది.మిస్ వరల్డ్ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ కూచిపూడి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ టెలివిజన్ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది. (చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..) -
Miss World Zimbabwe మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది. ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది. మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.అందుకే సోషల్ మెంటల్ హెల్త్‌ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను. అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్‌గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.– హనుమాద్రి శ్రీకాంత్ -
మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా!
కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్ బట్ నాట్ లీస్ట్ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేషన్ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్ ఉంది. స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్ పర్పస్మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం కూడా ఓ సెక్షన్ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్నెస్ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్ నీడ్ పిల్లల కోసం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే! అలాగే టాలెంట్ రౌండ్లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్ రౌండ్లో స్విమ్మింగ్. స్విమింగ్ ఈజ్ మై ఫేవరిట్ స్పోర్ట్.మర్యాద, మాట తీరు..రిచ్ కల్చర్, ట్రెడిషన్ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు బిగ్ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్ అయ్యాను. విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ -
పెళ్లి వేడుక ఆనందంగా వధూవరులు తప్ప..అందరూ
ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన కోర్ట్ సినిమాలో చివరి దాకా ఒక సస్పెన్స్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కొన్ని నిమిషాల సేపు గడిపి వస్తారు. అయితే అక్కడ ఏం చేశారు అనే సస్పెన్స్. దీన్ని చివరిదాకా కొనసాగిస్తారు. చివర్లో తెలుస్తుంది. వారిద్దరూ ఫేక్ పెళ్లి చేసుకున్నారని... ఇప్పుడు దాదాపుగా అలాంటి ఫేక్ పెళ్లిళ్లే మెట్రో నగరాలకు వచ్చేస్తున్నాయి. అయితే అవి ఇద్దరు టీనేజర్లు చేసుకునే అమాయకపు పెళ్లిళ్లు కాదండోయ్... బాగా డబ్బున్న సంపన్నులు చేసుకునే పార్టీ పెళ్లిళ్లు. అవేమిటి అంటారా?అయితే ఆ పార్టీ సారీ స్టోరీలోకి వెళ్లాల్సిందే... ఢిల్లీ పార్టీ సీన్లో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వచ్చేసింది. దాని పేరే నకిలీ పెళ్లి వేడుకలు, ఈ వేడుకల్లో నిజమైన వధూవరులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించిన హంగు, ఉత్సాహం మాత్రం ఉండాలి. అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి, పెళ్లి వేదికలా అలంకరించబడిన స్థలానికి వెళ్తారు. అక్కడ డీజే మ్యూజిక్, ఢోల్స్, పెళ్లి పాటలతో రాత్రంతా నృత్య విహారం సాగుతుంది. ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ప్రొఫెషనల్ అవంతిక జైన్ ఇన్‌స్ట్రాగామ్‌లో ‘‘ఫేక్ సంగీత్’ ప్రకటనను చూసి తన మిత్రులతో వెంటనే షేర్ చేసింది. ‘‘కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలాంటి పెళ్లి థీమ్ పార్టీ చేయాలని కలలు కంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది నిజం అయ్యే ఛాన్స్ లాగా అనిపించింది,’’ అని ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కరికి సుమారు రూ.550 చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించి ఈ ఈవెంట్‌కు జైన్ ఆమె మిత్రులతో కలిసి వెళ్లారు. , సుమారు వందమంది యువతతో పాటు, ఢిల్లీ మెహ్రౌలీ లేన్ లోని పాప్యులర్ క్లబ్ అయిన జైలో రూఫ్‌టాప్ రెస్టారెంట్లో జరిగిన ఈ నకిలీ సంగీత్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ‘‘దేశీ’’ డ్రస్ కోడ్ తప్పనిసరి. తన శరీరానికి బ్లాక్ బ్లౌజ్, ప్లమ్ కలర్ లెహంగా ధరించి అవంతిక హాజరయ్యారు. కానీ అక్కడ అంతా పెళ్లికి తగ్గ దుస్తులు ధరించి కనిపించారు. నిజమైన పెళ్లి వేడుకలే గుర్తుకొచ్చేలా కుర్తా–షెర్వానీలు, చున్నీలు, మెరిసే ఆభరణాలు ధరించారు. వేదికలో పసుపు–గులాబి రంగు డెకరేషన్లు, మారిగోల్డ్ పూల అలంకరణలు, ఫోటో బూత్‌లు, మెహందీ ఆర్టిస్ట్‌లతో పక్కా పెళ్లి మూడ్ క్రియేట్ చేశారు. పెళ్లి పాటలతో నృత్యం ఓ హైలైట్. ‘‘పంజాబీ, హిందీ బీట్స్పై మనసు పెట్టి డ్యాన్స్ చేశాం. మధ్యలో ఢోల్వాలాలు వచ్చి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు,’’ అని అవంతిక చెప్పారు. ఈ ఈవెంట్‌కి కేవలం యువతే కాదు, మధ్య వయస్కులు, పెద్దలు కూడా హాజరయ్యారు. అంతా కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. ‘‘ఈవెంట్ అయిపోయినా ఎవరికీ వెళ్లాలనిపించలేదు,’’ అని అవంతిక గుర్తు చేసుకున్నారు. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసనభారతీయ సమాజంలో పెళ్లిళ్లు అనేవి ఒక పెద్ద వేడుక. అలాంటి వేడుకల మూడ్‌ను ఎప్పుడైనా సరే అంటే ముహూర్తాలు లేని టైమ్‌లో కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఆహ్వానించదగ్గ ట్రెండ్ అని చెప్పాలి. నిజమైన పెళ్లి ఆహ్వానాన్ని అందుకోవాలని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే పెళ్లిళ్లకు వెళ్లవచ్చు. ఢిల్లీకి చెందిన‘‘జుమ్మీకీ రాత్’’ అనే ఈవెంట్ కంపెనీ ఇప్పటివరకు ఇలాంటి రెండు నకిలీ పెళ్లి ఈవెంట్లు నిర్వహించింది. అంతేకాదు గత 2024 అక్టోబరులో షంగ్రీలా గ్రూప్ ‘బంధన్’ పేరుతో వెడ్డింగ్ సర్వీసును లాంచ్ చేసినప్పుడు కూడా మాక్ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన పెళ్లి వస్త్రధారణలో మోడల్ జంట, లైవ్ సుఫీ మ్యూజిక్, గజ్రా స్టాళ్లు, భోజన విందుతో ఈ ఈవెంట్‌ను రక్తి కట్టించారు. చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!సాధారణంగా వెడ్డింగ్ కొరియోగ్రఫీ సంస్థలు కూడా వీడియో కంటెంట్ కోసం నకిలీ పెళ్లిళ్లు ప్లాన్ చేస్తుంటాయి. ఎందుకంటే... స్టూడియో కంటే, పెళ్లి వేదికలపై తీసిన వీడియోలకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అక్కడే ఈ తరహా మాక్ వెడ్డింగ్‌లు జరుపుకుంటూ కల్చరల్ కనెక్షన్‌ను కొనసాగిస్తారు. ఇప్పుడు ఇవి పార్టీ మార్గాలుగా కూడా మారిన నేపధ్యంలో ఈ ఫేక్ వెడ్డింగ్ పార్టీ కల్చర్ మన దాకా వచ్చేస్తుందేమో...చూడాలి. -
Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ సిటీ ప్యారిస్‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ రంగ నిపుణులతో ఇక్కడ సందడి నెలకొంది. అయితే భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్ఫ్లుయెన్సర్,ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ ఊహించని దెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివ్‌లో తన తొలి అనుభవం కోసం ఎదురు చూస్తున్న సాక్షి, తన లగేజీని పోగొట్టుకుంది. ఆమెకు సంబంధించిన నాలుగు బిజినెస్ క్లాస్ బ్యాక్‌లు మాయమై పోయాయి. దీంతో సాక్షి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగలాల్సిన కేన్స్ అనుభవం సంక్షోభంలో పడిపోయింది. ఈ విషయాన్ని సాక్షి ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. దయచేసి సాయం చేయండి అంటూ మొర పెట్టుకుంది. అలాగే ఈ సమస్యపై స్పందించని, సహకరించకపోవడం పట్ల లుఫ్తాన్స , స్విస్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ సాక్షికి సానుభూతి ప్రకటించారు .ఇదీ చదవండి: తీవ్ర నష్టాల్లోలగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన'స్టైల్‌మీఅప్ విత్ సాక్షి' అనే హ్యాండిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. నైస్ విమానాశ్రయం మీదుగా కేన్స్‌కు వెళ్లేటప్పుడు లుఫ్తాన్స మరియు స్విస్ ఎయిర్‌లైన్స్ ఆమె చెక్-ఇన్ బ్యాగులను ఒక్కొక్కటి పోగొట్టుకున్నాయని సాక్షి వెల్లడించింది. ఆమె ఇలా రాసింది."నమ్మశక్యం కాని భయంకరమైన సంఘటన జరిగింది. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను నా 4 బ్యాగులూ పోగొట్టుకున్నాను. ఇపుడు నా దగ్గర ఏ వస్తువులూ లేకుండా నేను కేన్స్‌లో ఉన్నాను. నా జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి ఈ మొత్తం ఉదంతంలో లుఫ్తాన్సా , స్విస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’’ అని ఆమె పేర్కొంది.కేన్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన కోసం నెలల తరబడి వేచి ఉన్నాననీ, తన లగేజీ సురక్షితంగా ఉండాలని, “హై ప్రియారిటీ” కింద బిజినెస్ క్లాస్‌లో చెక్ ఇన్ చేశానని తెలిపింది.విమానయాన అధికారుల నుండి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలుఎవరీ సాక్షి సింధ్వానీఢిల్లీకి చెందిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ సైజ్ ఫ్యాషన్ కంటెంట్‌కు పేరుగాంచింది, అంతర్జాతీయ అందాల దిగ్గజం లోరియల్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తూ, కేన్స్ 2025 లో చరిత్ర సృష్టించనున్న భారతీయ ప్రభావశీలురులలో సాక్షి సింద్వానీ ఒకరు. ధైర్యంగా ఫ్యాషన్ స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టి ప్లస్-సైజు ఇన్ఫ్లుయెన్సర్గా తకంటూ ఒక పేరు తెచ్చుకుంది. -
ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..
పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టి బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో ఉగ్రమూకల్ని, వారి స్థావరాల్ని, మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసింది. అంతేగాదు ఈ చర్యతో భారత్ ఉగ్రవాదాన్ని సహించేదే లేదని పాక్‌కి గట్టి సంకేతాలనే పంపించింది. ఇక ఆపరేషన్ అత్యంత కీలకపాత్ర పోషించింది భారత ఎయిర్‌ఫోర్స్. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా కలిసి మరీ వారిని అభినందించారు. అయితే ఈ వైమానిక దాడుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి. ఆయనే వైమానిక దాడుల గురించి మీడియాకు వివరించారు. ముఖ్యంగా ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తరుణంలో మరీంతగా హాట్‌టాపిక్‌గా మారారు ఎయిర్ మార్షల్ భారతీ. అలాగే ఆయన తల్లిదండ్రులు సైతం ప్రతిష్టాత్మకమన ఈ ఆపరేషన్‌లో తమ కొడుకు భాగం అయ్యినందు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎవరు..? ఆ ఆపరేషన్ ఆయన పాత్ర ఏంటి తదితరాలు గురించి సవివరంగా చూద్దాం.వైమానిక దాడుల విరమణ అనంతరం..వాటి గురించి మీడియాకు వివరిస్తూ వార్తల్లో నిలిచారు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అవదేష్ కుమార్ భారతి. ఆయన ఇతర సాయుధ సైనికులతో కలిసి నిర్వహించిన దాడుల గురించి సవివరంగా వివరించారు. ఈ ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడులలో కీలకపాత్ర పోషించారాయన. చిన్నప్పటి నుంచి భారతి తెలివైన విద్యార్థి అని చెబుతున్నారు తల్లిదండ్రులు.ఆయన తండ్రి నీటిపారుదల శాఖలో గుమస్తా కాగా, తల్లి గృహిణి. ఎయిర్ మార్షల్ భారతికి ఎడ్యుకేషన్ పరంగా మంచి రికార్డు ఉంది. ఆయన జార్ఖండ్‌లోని తిలైయాలోని సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించాడు. తల్లి ఊర్మిళ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి భారతి నిరాడంబరంగా ఉండేవాడని, ఇప్పటికీ అలానే ఉంటాడని అన్నారు. చిన్నతనంలో ఎక్కువగా సాయుధ దళాల్లో చేరాలని చెబుతూ ఉండేవాడని, చివరికి దాన్ని సాధించాడని అన్నారు.వరించిన పదొన్నతులు.. ఎయిర్ మార్షల్ భారతి 1987లో భారత వైమానిక దళం ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. 2008లో రాష్ట్రపతి వైమానిక దళ పతకాన్ని పొందారు. 2023లో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి పొందారు. ఆయన సుఖోయ్-30 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. దీనికంటే ముందు ప్రయాగ్‌రాజ్‌లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ (SASO)గా నియమించారు. అంతేగాదు ఇటీవలే ఆయనను రాష్ట్రపతి దౌప్రతి ముర్ము సత్కరించారు కూడా. పూర్ణిమ చంద్రుడిలా వెలుగులోకి.. తల్లిదండ్రులు మాట్లాడుతూ..ఈ ఆపరేషన్ సిందూర్ కారణంగా తమ కొడుకు పూర్ణిమ చంద్రుడి మాదిరిగా వెలుగులోకి వచ్చాడని అన్నారు. అతన ఉద్యోగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పిల్లలను కూడా అలానే ఉన్నతంగా తీర్చిదిద్దాడు. భారతి కశ్మీర్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమ కొడుకుని చూసి తామెంతో గర్వపడుతున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రపంచానికి తెలుస్తుందన్నారు.(చదవండి: 1971 Bhuj Airbase Story: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..! ఎలాంటి రక్షణ ఆయుధాలు, శిక్షణ లేకుండానే..) -
తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన
బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ బుర్బెర్రీ అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2027 నాటికి ఖర్చులను తగ్గించే ప్రణాళికలలో భాగంగా తన సిబ్బందిలో 1700 మందిని తొలగించే అవకాశం ఉందని ప్రకటించింది. 2025 మే 14 న తమ బడ్జెట్లో కాస్ట్ కటింగ్ వివరాలను వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం భారీ నష్టాలను చవిచూసిన తర్వాత బుర్బెర్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ కోతలు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను ఐదో వంతు తగ్గించుకోనుంది. ఇది వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఇంగ్లీష్ బ్రాండ్, కాజిల్ఫోర్డ్ ఫ్యాక్టరీలో సంభావ్య తొలగింపులకు కూడా కారణమవుతుంది. కోతలు ఎక్కువగా యూకేలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది.చదవండి: Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నదబుర్బెర్రీ అమ్మకాల విషయంలో ఎక్కువగా నష్టపోతోంది. చైనా, అమెరికాలో విలాసవంతమైన విభాగంలోని వస్తువులకు డిమాండ్ బాగా క్షీణించింది. మార్చి 29తో ముగిసిన సంవత్సరానికి పోల్చదగిన స్టోర్ అమ్మకాలలో 12శాతం తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది వార్షిక ఆదాయం 17 శాతం క్షీణించింది. ఖర్చు తగ్గించే చర్యల ఫలితంగా 2027 నాటికి నాటికి 100 మిలియన్ల పౌండ్ల ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది.ఇదీ చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలుకాగా లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బుర్బెర్రీని 1856లో థామస్ బుర్బెర్రీ స్థాపించారు. ఇది ట్రెంచ్ కోట్లు, లెదర్ ఉత్పత్తులు, వాచెస్, పాదరక్షలతో సహా వివిధ రకాల విలాసవంతైన ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తుంది. ఐకానిక్ డిజైన్, నాణ్యత , లగ్జరీ ఫ్యాషన్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. గబార్డిన్ అనే వస్త్రంతో రూపొందించే వాటర్‌ప్రూఫ్ దుస్తులు మరీ ప్రత్యేకం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
Covid-19 మళ్లీ వచ్చేసింది : కేసులు, మరణాలు, అధికారుల హెచ్చరికలు
ఆసియాలో కోవిడ్మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్ న్యూ వేవ్ ఆందోళన రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు క్రమానుగతంగా పెరుగుతున్నందున, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలని, ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు.అటు సింగపూర్‌లో మే 3 నుండి వారంలో గత ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200 కు చేరగా, రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. దీనికి సంబంధించి నగర-రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చు, అయితే, మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్లు వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే..హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివర్లో తైవాన్‌లోని కావోసియుంగ్‌లో తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనీస్ సోషల్ మీడియా వీబోలోని కచేరీ అధికారిక ఖాతా గురువారం తెలిపింది.ఇదీ చదవండి: పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!అటు చైనా కూడా కోవిడ్ కేసులను, వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా పయనిస్తోంది. మే 4 దాకా ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
'గారాబం చేస్తే ఇలా అవుతుందా'..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్ పాఠం
అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా..!1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్లు కూగా చెప్పేవారట వేలుమణి. తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్ చెప్పే అవకాశం లభించింది. ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి. అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి. సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీవితం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి. కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ..కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా. ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్కి సంకేతం. దాన్ని చాలా జాగురకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్ చేసిన ఈ పోస్ట్ ..ప్రతి నెటిజన్ మనసుని దోచుకుంది. సార్ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రుబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.This tweet and the pics reminded me my luck in early 80s. Thanks to @howto9to5 I had a BARC job, good salary but was not enough to support my big family back home. I wanted to send more money home and wanted to earn more by doing tuitions while working in BARC. A filthy rich… https://t.co/Mi5mkR6ocT pic.twitter.com/mkAgrqVXtz— Dr. A. Velumani.PhD. (@velumania) May 6, 2025(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం
పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన ΄ పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథనం మీ కోసం.ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేక పోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు. కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం ( కలం), నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు.ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏక కాలంలో కొన్ని కోట్ల రూ΄ాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు. వారిలో బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండాపాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియ జేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయంటే ఆశ్చర్యమే. మనదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ, తమిళనాడులోని కంచిలోనూ చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్ అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు ΄ పొందదడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు. చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు కలం, కాగితం, సిరా, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం చెక్క. ఆవాలు, నువ్వులు, తమల పాకులు. హైదరాబాద్‌లోని చిత్రగుప్తుని ఆలయంలో దీపావళి రెండో రోజు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. మామూలు రోజుల్లో పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం ఇక్కడ అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. స్త్రీల వ్రతాలలో చిత్రగుప్తుడి నోము కూడా ఉంది. (నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మనకు తెలిసిందే. యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించేది చిత్రగుప్తుడు. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకుపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేసేది చిత్రగుప్తుడేనని గరుడ పురాణం చెబుతుంది. (Gayatri Mantra : విశిష్టత ఏంటి? తెలుసుకుందాం!) -
Gayatri Mantra : విశిష్టత ఏంటి? అర్థం తెలుసుకుందాం!
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది.వేదాల ప్రకారం సవితా దేవి గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. గాయత్రీ మంత్రం ప్రాచీనమైనది. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు.ఈ గాయత్రీ మంత్రం సవితా దేవిని, సూర్యదేవుని కీర్తిస్తూ, సూర్య (పింగళా) నాడిని ముఖ్యంగా స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యపరచడానికి చదివే మంత్రం. సుమారు 5000 సం.క్రితం విశ్వామిత్రునిచే స్తుతింపబడిన ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. గాయత్రి మంత్ర పరమార్థం ఏమిటో, ఎప్పుడు ఆ మంత్ర పఠనం చేయాలో అనే అవగాహన వుండడం మంచిది. అతి సర్వత్రా వర్జయేత్ .. ఏది అతిగా చేయడం, ఆచరించడం శ్రేయస్కరం కాదు. దానివలన ఒక్కోసారి ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. గాయత్రి మంత్రం మన సూక్ష్మ నాడీవ్యవస్థలోని చక్రాలలో ఉన్న పంచ మహాభూతాల సారాన్ని మనకుబోధిస్తుంది. మంత్రాల గురించి చాలా పెద్ద శాస్త్రమే ఉందని చెప్పవచ్చు. మానవ అంతర్గత సూక్ష్మశరీర వ్యవస్థలో చక్రాలలోనూ, నాడులలోను దేవీదేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు. దేవీకవచంలో చెప్పినట్లు మన శరీరంలోని అంగప్రత్యంగాలన్నీ కూడా ఏదో ఒక దేవత అధీనంలో ఉండి వారి చేత రక్షింపబడుతుంటాయి. మన సమస్య ఏ అవయవంలో ఉంటే ఆయా అవయవానికి సంబంధించిన అదిష్టాన దేవతా మంత్రాన్ని పఠించుకుని ఆ దేవతని సంతృప్తిపరుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చును. అంటే మనకున్న సమస్య కాలికి అయితే, వైద్యం చేతికి చేసినట్లు కాకుండా మన ప్రార్థన కూడా ఏ ఏ చక్రాలలో, లేదా ఏ నాడిలో లోపం వుందో వాటికి సంబంధించిన అధిష్టాన దేవీ దేవతలను ప్రసన్నం చేసుకునేదిలా ఉండాలి. మన శరీరంలోని కుడి పార్శ్వపు నాడి (పింగళా నాడి)లో గాయత్రి దేవి నివాస స్థానం ఉంటుంది. నా అంతటి వాడు లేడనే అత్యహంకారం వలన ఈ పింగళా నాడి సమస్యకు లోనవుతుంది. దీనివలన ఈ నాడి అసమతుల్యతకు లోనై అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అలా కుడి పార్శ్వంలో సమస్యలు ఉన్నవారు అతిగా గాయత్రి మంత్ర పారాయణ చేయటం వలన వారు మరింత కోపిష్టిగా, అహంకారిగా మారి విజ్ఞతను కోల్పోయే అవకాశం ఉంది. పూర్వ కాలంలో ఎంతో కఠోర తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందిన మునీశ్వరులు, ఋషులలో కొందరు ఇటువంటి కారణం చేతనే భగవంతుని ఆగ్రహానికి గురయ్యారని మనకు తెలిసున్నదే. పంచ మహాభూతాలైన మూలకాలన్నీ మన కుడి పార్శ్వంలో ఉన్న పింగళనాడిలో నిక్షిప్తమై ఉంటాయి. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలు మన చక్రాలలోని పంచ భూత తత్వాలతో అనుసంధానిపబడి ఉంటాయి. ఇదే గాయత్రి మంత్ర విశిష్టత, పరమార్థం.కుండలినీ జాగృతి చెంది బ్రహ్మ రంధ్రం ఛేదించుకుని వచ్చి సహస్రారం మీద భగవంతుని పరమ చైతన్యశక్తితో ఏకీకృతమైనప్పుడు మనం ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందుతాం. అలా ఆత్మసాక్షాత్కారంపొంది సహజయోగ సాధన చేస్తున్న వారికి గాయత్రి మంత్రం ప్రాధాన్యత గాయత్రి మంత్రోచ్ఛారణ ఫలితం బాగా అవగతమవుతుంది. – డా. పి. రాకేశ్( శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.ఈ అవకాశం కోసం ఎదురు చూశాను!‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నా ఆకాంక్ష తీరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్యాచులర్స్ పూర్తయింది. మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా పూర్తయింది. క్లినికల్ సైకాలజిస్టుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను సందర్శిస్తూ పిల్లలకు, యువతకు మనోధైర్యాన్నిస్తున్నాను. అంతర్యుద్ధంతో అట్టుడిగిన దేశం మాది. అలాగే ఇరుగు పొరుగు యుద్ధాల తాకిడి కూడా దేశాన్ని కుదిపేసింది. అలాంటి దేశంలో మానసిక స్థైర్యం కల్పించడం చాలా అవసరం. ఇందుకోసం నేను ఐదు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాను.మహిళలు నలిగిపోతున్నారు!మా దేశంలో సగటు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోందీ అంటే ఆ పరిణామాలకు క్షేత్రస్థాయిలో నేరుగా బాధితులయ్యేది మహిళలే. విద్య, ఉద్యోగం, పిల్లలను చక్కబెట్టుకుంటూ, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తమ భుజాల మీద మోస్తున్నారు మా దేశంలో మహిళలు.ఎక్కడో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ప్రతి మహిళా వీటన్నింటినీ భరిస్తోంది. వీటికితోడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్‌లు మన తల మీద నుంచి వెళ్తున్నట్లే ఉంటాయి. రోజూ ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధవిమానాలు ఇళ్ల మీద నుంచి వెళ్తుంటే వచ్చే ‘ఉమ్మ్మ్’ అనే శబ్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడుతుంటారు. రాత్రిళ్లయితే టేబుల్ మీద నుంచి పుస్తకం కింద పడిన శబ్దం వచ్చినా సరే గుండె వేగం పెరిగిపోతుంటుంది. ఇంట్లో అందరినీ ఒకసారి కలయచూసుకుని ‘హమ్మయ్య ఏమీ కాలేదు, అందరూ క్షేమం’ అని ఊపిరి పీల్చుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో జీవించడం వల్ల వారిని మెంటల్ ట్రామా పీడిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో, ఒకటి-రెండు ప్రదేశాలదో కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి. వారిలో మానసికాందోళనలు పోగొట్టి ధైర్యం, మానసిక ప్రశాంతత నెలకొల్పడానికి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్టివ్ ట్రామాను తొలగించడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాను. ఇన్నింటి మధ్య కొనసాగుతూ కూడా బ్యూటీ పాజంట్ కావాలనే కోరికను మాత్రం పక్కన పెట్టలేదు. సమాజం కోసం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే బ్యూటీ కాంటెస్ట్ విజేతనయ్యాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ కోసం మీ ముందుకు వచ్చాను. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌లో భాగంగా... నా విజయంతో నా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. శాంతి కోసం పని చేయడానికి బ్యూటీ పాజంట్ గుర్తింపు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేనమస్తే నేర్చుకున్నాను!బ్యూటీ పాజంట్ పోటీల కోసం వచ్చేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకున్నాను. నమస్తే చెప్పడం నేర్చుకున్నాను. హైదరాబాద్ నగరం చాలా నచ్చింది. కలర్ఫుల్గా, వైబ్రెంట్‌గా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ ఒక అద్భుతం. నిర్మాణంలో సునిశితమైన క్రాఫ్ట్మన్షిప్కి ఫిదా అయ్యాను. ప్రతి అంగుళాన్ని వదలకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ కట్టడం గొప్ప చారిత్రక వారసత్వం, అలాగే హైదరాబాద్ మెహందీ కూడా’’ అంటూ మంగళవారం నాడు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో పెట్టించుకున్న మెహందీని చూపించారు నద కౌస్సా.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : ఎస్.ఎస్. ఠాకూర్ -
ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్..!
హైదరాబాద్ నగరంలో ఎన్ని కాంటినెంటల్ వంటకాలున్నా తెలుగు రుచులకున్న ప్రత్యేకతే వేరు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే అతిథులు ప్రత్యేకంగా ఆంధ్రా వంటకాలను రుచి చూసే వెళతారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నగరంలోని లీలా వేదికగా వివిధ సంస్కృతుల రుచులను నగరవాసులకు, అతిథులకు రుచి చూపిస్తు్తన్న ‘రీన్ – ది చెఫ్స్ స్టూడియో’ ఈ సారి ఆంధ్రా వంటకాలను ప్రదర్శిస్తోంది. ఎకోస్ ఆఫ్ ఆంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్ట్ ఈ నెల 18వ తేదీ వరకూ ఆంధ్రా పసందైన రుచులను చేరువచేస్తోంది. అంతేకాకుండా ప్రముఖ చెఫ్ ‘మీరా’ ఈ ఎకోస్ ఆఫ్ ఆంధ్ర ఫెస్ట్‌లో తన పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో తెలుగు రుచులతో విడదీయరాని అనుబంధమున్న మామిడి వంటకాలను సైతం ప్రత్యేకంగా వండివారుస్తున్నారు. ‘ఎకోస్ ఆఫ్ ఆంధ్ర అనేది నా చిన్ననాటి ఆహారానికి నా ప్రేమలేఖ’..!! ఇవి నన్ను పెంచిన, లాలించిన రుచులు, తరతరాలుగా వారసత్వంగా వచ్చిన వంటకాలు. ప్రస్తుత తరుణంలో విభిన్న, వినూత్న రుచులుగా మోడ్రన్ డైనింగ్ టేబుల్ పైకి రావడం మళ్లీ ఇంటికి వెళ్లిన అనుభూతిని తీసుకువస్తుంది. ఆంధ్రా గొప్ప పాక సంప్రదాయాలకు గుర్తుగా రూపొందించిన క్యూరేటెడ్ థాలీని ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన వారసత్వ వంటకాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ప్రాంతం ఆహార సంస్కృతిని ఇక్కడికి విచ్చేసే అతిథులకు చేరువ చేస్తూ ఆ ఘుమఘుమలను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ముఖ్యంగా మామిడి అంటే ఒక నోస్టాల్జిక్ అనుభూతి. ఈ వారసత్వ థాలీ కుటుంబాలు, పండుగలు భూమి లయల కథను చెబుతుంది. ఆనాటి పచ్చడి మొదలు నేటి కూరలు ఆధునిక రుచుల వరకూ సృషిస్తుంది ఈ వేదిక. ఈ పాప్–అప్ ద్వారా కాంటినెంటల్ వంటకాలను మైమరపించే రుచలను అందంచడమే లక్ష్యంగా రీన్ చెఫ్స్ స్టూడియో సిద్ధమైంది అని చెబుతున్నారు ప్రముఖ చెఫ్ మీరా (చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పొద్దంతా కష్టపడి పనిచేసి, రాత్రిపూట కడుపు నిండా భుజించి ప్రశాంతంగా నిద్రపోతే.. అర్ధరాత్రి ఎక్కడో గుర్ర్..గుర్ర్మంటూ వస్తోన్న శబ్దం చికాకు తెప్పిస్తుంది. గాఢనిద్రలో ఉన్నవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. పక్కన పడుకుంటే చెవుల్లో సప్తస్వరాలు మోగినట్లు వినిపించే గురక శబ్దం మంచి నిద్రను దూరం చేస్తుంది. గురకపెట్టేవారి పక్కన పడుకునే వారి కష్టాలు ఇవైతే.. గుర్ర్.. గుర్ర్మంటూ సోయిలేకుండా పడుకునేవారు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది రాత్రిపూట గురక పెట్టేవారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.నగరవాసుల్లో ఎక్కువగా..నగరవాసుల్లో చాలామందిని గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (వోఎస్ఏ) అనేది గురకకు కారణమవుతోంది. కండరాలతో నిర్మాణం అయిన ఊపిరి గొట్టంలో నిద్రపోయే సమయంలో కలిగే ఆటంకంతో ఆ శబ్దం వస్తుంది. ఇలా వచ్చే శబ్దాన్నే గురక అంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి గురక రాదు. గురక ఉన్నవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తరచూ నిద్రలోంచి మేల్కొంటారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి.. నిద్రలోనే హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.పాలిసొమ్నోగ్రఫీతో పరీక్షస్లీప్ అప్నీయాతో బాధపడే వారికి స్లీప్ స్టడీస్ (పాలిసొమ్నోగ్రఫీ) పరీక్ష అవసరమవుతుంది. గురకతో బాధపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని శరీర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. ఇందులో మెదడు పనితీరు తెలుసుకునేందుకు ఎలక్ట్రోఎన్సెపలోగ్రఫీ (ఈఈజీ), గుండె పనితీరు కోసం ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ఈసీజీ) కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అనుసంధానించి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో లేదో అని పరీక్షిస్తారు.జనాభాలో 10 శాతం మందికిగురక సమస్యతో ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీరోజు 150మందికి పైగా అంటే నెలకు సుమారు 5,000 మంది గురక సమస్యతో ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇందులో 200 మందికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పరీక్ష చేయించు కుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యగా బాధపడే వారు 2,000 మంది వరకు ఉంటారని వైద్యుల అంచనా.జీవనశైలిలో మార్పులతో..గురకను తగ్గించుకోవాలంటే చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మద్య, ధూమపానాల వాడకాన్ని తగ్గించుకోవడం. షుగర్, బీపీ, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల గురక సమస్యకు మెరుగైన ఫలితం ఉంటుంది. నిద్రతో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలో వచ్చే చిన్నచిన్న సమస్యలకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యం చేయించుకోవాలి. – వినయ్‌కుమార్, పల్మనాలజిస్టు లక్షణాలు ఇవీనిద్రలో ఐదుకన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడంనిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమి ఉన్నట్లు అనిపించడం రాత్రి పూట ఛాతీలో నొప్పి.. నిద్రలేవగానే గొంతులో నొప్పినిద్రలేవగానే తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారిని గురక బాధితులుగా గుర్తిస్తారు.జాగ్రత్తలుఊబకాయంతో బాధపడుతుండే వారి బరువును తగ్గించుకోవడం ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను మానుకోవడంబీపీ, షుగర్, థైరాయిండ్ నార్మల్‌గా ఉంచుకోవడంప్రతీరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. -
మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
మహిళల హక్కుల గురించి అస్పష్టత ఉన్నచోట, అంతగా అవగాహన లేని చోట ఉపయోగపడే పుస్తకం లీగల్లీ యువర్స్: ఎవ్రీ ఉమెన్స్ గైడ్ టు హర్ లీగల్ రైట్స్. లాయర్, రైట్స్ అడ్వకేట్ మానసి చౌదురి రాసిన ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ప్రచురించింది. భారతీయ మహిళల న్యాయ హక్కులపై సమగ్రమైన స్పష్టతను అందించే పుస్తకం ఇది. మన దేశ న్యాయవ్యవస్థను అర్థమయ్యేలా చేస్తూ, సంక్లిష్ట చట్టాల గురించి సులువైన రీతిలో పరిచయం చేస్తుంది.వారస్వత హక్కులు, ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు, రీప్రొడిక్టివ్ రైట్స్...మొదలైన వాటి గురించి వివరిస్తుంది.‘జ్ఞానం అనేది ఎంపవర్మెంట్కు తొలి అడుగు’ అంటున్న మానసి చౌదురి ‘పింక్ లీగల్’ వ్యవస్థాపకురాలు.‘ఈ పుస్తకం మహిళలకు మాత్రమే కాకుండా, మహిళల హక్కులను అర్థం చేసుకోవడంలో పురుషులకు కూడా ఉపకరిస్తుంది’ అంటుంది హార్పర్‌కాలిన్స్ ఇండియా ఎడిటర్ హిమాకుమార్.(చదవండి: Miss world 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్) -
పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
ఒళ్ళంతా పురుగులు పాకుతున్నాయంటుంది!
మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుని చర్మం డాక్టర్ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అంటారా?– పద్మావతి, బళ్ళారిమీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్‌గా ‘డెల్యూజనల్ పారా సైటోసిస్‘ లేదా ‘ఎక్బామ్ సిండ్రోమ్‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ. కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్లో పారా సైటోసిస్ లక్షణాలు కనపడే అవకాశముంది. తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు. యాంటీ సైకోటిక్ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి! (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com) (చదవండి: Miss worl 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్)