
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్‌ను అనన్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.
2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్‌స్టైల్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్‌కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్‌గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్‌ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్‌తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్‌కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్‌బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి,
అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడి
అనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్‌ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.
వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే.