
అందంగా మెరిసిపోవడానికి నచ్చిన మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ మేకప్ వేసుకునే బ్రష్‌లను శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. నిజానికి మురికి మేకప్ బ్రష్‌లు బ్యాక్టీరియాకు నిలయంగా మారిపోతాయి. అలాంటి బ్రష్‌లు వాడితే చర్మ సమస్యలు తప్పవు. అంతేకాకుండా మేకప్ వేసుకునేటప్పుడు కూడా మనం ఎంచుకున్న కలర్ కాకుండా మరో కలర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్‌తో మేకప్ బ్రష్‌లను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
ఈ ఆటోమేటిక్ క్లీనర్ మేకప్ బ్రష్‌లను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది ఒక స్పిన్నర్, క్లీనింగ్ మ్యాట్‌తో వస్తుంది. బ్రష్‌ను సరైన అడాప్టర్‌కు కనెక్ట్ చేసి, క్లీనింగ్ బౌల్‌లో కొద్దిగా నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని ఆపై, బటన్‌ను నొక్కితే చాలు. బ్రష్‌ను నీటిలో తిప్పుతూ అదే క్లీన్ చేస్తుంది. మేకప్ బ్రష్ మీద పేరుకుపోయిన మొండి అవశేషాలను, ధూళిని ఈ డివైస్ ఇట్టే తొలగిస్తుంది.
చిత్రంలోని క్లీనర్‌తో వచ్చే క్లీనింగ్ మ్యాట్ వివిధ రకాల బ్రష్‌ల కోసం వేర్వేరు టెక్స్చర్‌లను కలిగి ఉంటుంది, ఇది మరింత లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ మహిళలకు, ముఖ్యంగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక చక్కటి బహుమతి. ఇక ఇది నీళ్లతో బ్రష్‌ని క్లీన్ చేయగానే, డివైస్ నుంచి నీళ్లు ఉన్న కప్‌ను వేరు చేసుకుని, ఆ నీటిని పారబొయ్యాలి.
ఆ తర్వాత ఆ కప్‌ను మరోసారి మంచి నీటితో క్లీన్ చేసుకుని మళ్లీ డివైస్‌కి అటాచ్ చేసి, బ్రష్‌ను దానిలో ఉంచి, బటన్ ఆన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు బ్రష్‌లను క్లీన్ చేసుకునేటట్లయితే మేకప్ బ్రష్‌లు ఎక్కువ మన్నికతో ఉంటాయి.
(చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!)