
వారం రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపేస్తున్న హైదరాబాద నగర ప్రజలు వారాంతంలో మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆకట్టుకోవడానికి వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీ, పెయింటింగ్స్, బేకింగ్, క్యాండిల్ తయారీ, రెసిన్ ఆర్ట్ తదితర రంగాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత సమయం కేటాయిస్తున్నారు. ప్రవేశ రుసుముగా కొంత నామమాత్రపు ఫీజు సైతం వసూలు చేస్తారు. కొన్ని చోట్ల నిర్వాహకులే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్‌షాప్‌లు నడుస్తాయి.
మట్టి పాత్రల తయారీ
మట్టి పాతల్ర తయారీపై హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆదివారం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలి హార్ట్‌కప్ కాఫీ, లాస్ట్ హౌస్ కాఫీ, హౌస్ ఆఫ్ గౌర్మెట్, తదతర ప్రాంతాల్లో లైవ్ వర్క్‌షాప్‌లు ప్రారంభమవుతాయి. మట్టితో మమేకం కావడం, ప్రకృతితో కలిసిపోవడం, ప్రశాంమైన వాతావరణంలో మట్టితో పాత్రలు తయారు చేయడం అనేది ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఒక్కో వ్యక్తికి గంట నుంచి 3 గంటల పాటు పాత్రలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. తయారు చేసిన కుండలు, ఇతర పాత్రలు ఏవైనా మన వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఇవి తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మట్టి, యంత్రాలు, అన్నీ నిర్వాహకులే సమకూర్చుతారు.
కొవ్వొత్తుల తయారీలో శిక్షణ
జూబ్లీహిల్స్‌లోని మకావు కిచెన్ అండ్ బార్‌లో హేండ్ మేడ్ కొవ్వుత్తుల తయారీపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనకు నచి్చన డిజైన్, మోడల్స్‌లో కొవ్వుత్తులు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌షాప్ ఉంటుంది.
రెసిన్ ఆర్ట్
రంగులు కలపడం, కొత్త డిజైన్లకు అంకురార్పన చేయడం, ఆర్ట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అద్భుతమైన, మెస్మరైజింగ్ రెసిన్ ఆర్ట్ వర్క్‌షాప్‌ను మాకోబ్రూ వరల్డ్ కాఫీ బార్, అమోరోసో హైదరాబాద్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాలు కొనసాగుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.
కేక్ తయారీపై..
నార్సింగిలోని మైథూస్ బ్రేవ్ పబ్ అండ్ కిచెన్ ఆధ్వర్యంలో కేక్ తయారీపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. తయారీ విధానంలో మెలుకువల నేర్చుకోవచ్చు. తదుపరిఇంటోనే కొత్త రుచులను పర్ఫెక్ట్‌గా సిద్ధంచేసుకునే కాని్ఫడెన్స్ లెవల్స్ పెరుగుతాయి.
(చదవండి: