
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్‌లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.
బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్‌లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.
ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు.

మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.
“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.