చెమట కంపు... వదిలించుకోండిలా...! | Excessive Sweating check these amazing tips for remedy | Sakshi
Sakshi News home page

చెమట కంపు... వదిలించుకోండిలా...!

May 17 2025 10:16 AM | Updated on May 17 2025 10:16 AM

Excessive Sweating check these amazing tips for remedy


వేసవిలో చెమట వాసన అత్యంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ కాలేజీ అయినా, ఆఫీసు అయినా,  పార్టీ అయినా, ఫంక్షన్‌ హౌస్‌ అయినా చెమట దుర్వాసన వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు అందరూ చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు వంటి వివిధ రకాల సువాసనలను ఉపయోగిస్తారు. కానీ కొంత మంది పెర్ఫ్యూమ్, డియోల నుంచి వచ్చే ఘాటైన వాసనను తట్టుకోలేరు. అలెర్జీ కూడా కలిగిస్తుంది.

బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ యార్క్‌ పరిశోధన ప్రకారం.. చెమట వాసనకు గల కారణాలలో ముఖ్యమైనది ఎంజైమ్‌. ఇది ప్రధానంగా చంకలలో కనిపించే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. వీటి మూలాన్ని తొలగించడం వల్ల చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు.

చెమట వాసన ఎంజైమ్‌లను తొలగించడానికి ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మ, టమోటా, కొబ్బరి నూనె వంటి కొన్ని గృహోపకరణాల ద్వారా చెమట దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు. రెండు నిమ్మకాయలను కట్‌ చేసి చెమట పట్టిన ప్రదేశంలో రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసం ఆరి΄ోయినట్లు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చెమట దుర్వాసన ఇట్టే  పోతుంది.
ప్రతిరోజూ స్నానానికి ముందు టొమాటోను కట్‌ చేసి.. దీని రసాన్ని శరీరంలోని చెమట ఉన్న భాగాలపై రాసుకోవాలి. కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే చెమట వాసన దూరం అవుతుంది.

చెమట దుర్వాసనను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని లారిక్‌ యాసిడ్‌ చెమటలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని, ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన రానేరాదు.                   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement