పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం | Lord Chitragupta Story, Significance, Importance And Hyderabad Temple History In Telugu | Sakshi
Sakshi News home page

పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం

May 15 2025 12:49 PM | Updated on May 15 2025 4:06 PM

Lord Chitragupta significane and importance temple in Hyderabad

పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన ΄ పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథనం మీ కోసం.

ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేక పోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు. కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం ( కలం), నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు.


ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏక కాలంలో కొన్ని కోట్ల రూ΄ాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు. వారిలో బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండాపాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియ జేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.

చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయంటే ఆశ్చర్యమే. మనదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ, తమిళనాడులోని కంచిలోనూ చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది.చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్‌ అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్‌ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు ΄ పొందదడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు. చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు కలం, కాగితం, సిరా, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం చెక్క. ఆవాలు, నువ్వులు, తమల పాకులు. హైదరాబాద్‌లోని చిత్రగుప్తుని ఆలయంలో దీపావళి రెండో రోజు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. మామూలు రోజుల్లో పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం ఇక్కడ అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. స్త్రీల వ్రతాలలో చిత్రగుప్తుడి నోము కూడా ఉంది.  (నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)

మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మనకు తెలిసిందే. యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించేది చిత్రగుప్తుడు. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకుపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేసేది చిత్రగుప్తుడేనని గరుడ పురాణం చెబుతుంది. (Gayatri Mantra : విశిష్టత ఏంటి? తెలుసుకుందాం!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement