
ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.
భారత సంతతికి చెందిన క్వీర్ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు.
ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె.
నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్ష్లలకు పైగా లైక్‌లు వచ్చాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
(చదవండి: జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!)