
మహిళల హక్కుల గురించి అస్పష్టత ఉన్నచోట, అంతగా అవగాహన లేని చోట ఉపయోగపడే పుస్తకం లీగల్లీ యువర్స్: ఎవ్రీ ఉమెన్స్ గైడ్ టు హర్ లీగల్ రైట్స్. లాయర్, రైట్స్ అడ్వకేట్ మానసి చౌదురి రాసిన ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ప్రచురించింది. భారతీయ మహిళల న్యాయ హక్కులపై సమగ్రమైన స్పష్టతను అందించే పుస్తకం ఇది. మన దేశ న్యాయవ్యవస్థను అర్థమయ్యేలా చేస్తూ, సంక్లిష్ట చట్టాల గురించి సులువైన రీతిలో పరిచయం చేస్తుంది.
వారస్వత హక్కులు, ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు, రీప్రొడిక్టివ్ రైట్స్...మొదలైన వాటి గురించి వివరిస్తుంది.
‘జ్ఞానం అనేది ఎంపవర్‌మెంట్‌కు తొలి అడుగు’ అంటున్న మానసి చౌదురి ‘పింక్ లీగల్’ వ్యవస్థాపకురాలు.
‘ఈ పుస్తకం మహిళలకు మాత్రమే కాకుండా, మహిళల హక్కులను అర్థం చేసుకోవడంలో పురుషులకు కూడా ఉపకరిస్తుంది’ అంటుంది హార్పర్‌కాలిన్స్ ఇండియా ఎడిటర్ హిమాకుమార్.